NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

కనకదుర్గమ్మకు ఖరీదైన వజ్రాల కిరీటం.. ఈ నవరాత్రులలో ప్రత్యేకం..

అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి.. కనకదుర్గమ్మ భక్తులకు బాలాత్రిపురసుందరిగా దర్శనం ఇస్తున్నారు.. అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచి భక్తులు క్యూలైన్లలో వస్తున్నారు.. తెలంగాణ, ఏపీ నుంచి భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నారు.. ఈసారి ప్రభుత్వం అద్భుతంగా ఏర్పాట్లు చేసిందంటున్నారు భక్తులు.‌‌‌. మరోవైపు..ఇంద్రకీలాద్రి పై కొలువైన కనకదుర్గమ్మకు ఖరీదైన వజ్రాల కిరీటం అందజేశారు ముంబైకి చెందిన సౌరభ్.. అలాగే సీఎం రమేష్ అనే భక్తుడు సూర్యచంద్రులను, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భక్తురాలు హైమవతి సూర్యకుమారి బొట్టును అందజేశారు.. మొత్రం అభరణాలు వజ్రాలు పొదిగినవే.. 2 కోట్ల విలువైన కిరీటం దసరా నవరాత్రులలో ప్రత్యేకం కానుంది.. అమ్మవారి వజ్రాభరణాల అలంకరణ వైదిక విధానంలో హోమాదులు నిర్వహించి అలంకరిస్తామని ఆలయ పండితులు శంకరశాండిల్య వెల్లడించారు..

ఇక్కడే పడుకుంటాం.. జేసీబీ లను అడ్డుకుంటాం..

ఇక్కడే పడుకుంటాం.. జేసీబీ లను అడ్డుకుంటామని మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు. కేసీఆర్ హైదరాబాదులో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అన్నీ అనుమతులు తెచ్చారన్నారు. కానీ అక్కడ ఫోర్థ్ ఎస్టేట్ కట్టి రియల్ ఎస్టేట్ చేస్తాడు అంట అన్నారు. రేవంత్ రెడ్డి నీవు బ్రోకర్ వా…? రాష్ట్రానికి సీఎం వా…? అని కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు రేవంత్ రెడ్డిని ఫార్మా కంపెనీ ఉందా లేదా అని ప్రశ్నిస్తే ఉంది అని చెప్పాడు కానీ ఎంత భూమి ఉందో చెప్పటం లేదన్నారు. మూసీ సుందరీకరణ అంటూ ఇళ్ళు కూలగొడుతున్నారని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పే దల భూములు గుంజుకోవటం, ఇళ్లు కులగొట్టడంనా..? అని మండిపడ్డారు. వరంగల్ డిక్లరేషన్ లో ప్రభుత్వ భూములకు పట్టాలు ఇస్తామన్నారు. రాహుల్ గాంధీతో చెపించాడు.. ఇప్పుడు రాహుల్ రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తావా లేదా…? అని ప్రశ్నించారు.

రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గాయి, ఖర్చులు పెరిగాయి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార దుర్వినియోగం తీవ్రంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం చాలా ముఖ్యం.. కష్టం వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడగలిగాలి.. అప్పుడే ప్రజల ఆశీస్సుల ఉంటాయి.. రాజకీయాల్లో విశ్వసనీయత చాలా ముఖ్యం.. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటా నెరవేర్చాం అన్నారు. సాకులు వెతుక్కోకుండా మేనిఫెస్టోను అమలు చేశాం.. ఎప్పుడూ చూడని కోవిడ్ లాంటి సంక్షోభాన్ని రెండేళ్లపాటు ఎదుర్కున్నాం.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గాయి, ఖర్చులు పెరిగాయని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులు వచ్చినా ఎక్కడా వెనకడుగు వేయలేదు.. ఈ కారణాలు చెప్పి, మేనిఫెస్టో అమలును వాయిదా వేయొచ్చని చాలా మంది సలహా ఇచ్చారు అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

బీసీ కుల వృత్తుల్లో నైపుణ్యం పెంచి జీవనోపాధి పెంపొందించేలా ఆర్థిక చేయూత..

అమరావతిలో బీసీ సంక్షేమ శాఖలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీడ్ పథకం అమలు చేస్తున్నామన్నామని తెలిపారు. ఏపీలో ఇప్పటికే 6 జిల్లాలో సీడ్ పథకం అమలు చేస్తున్నాం.. త్వరలో మిగిలిన 20 జిల్లాలో అమలు చేస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. ఇక, సీడ్ పథకం కింద బీసీ- ఏలో ఉన్న సంచార జాతుల జీవన ప్రమాణాలు పెంచేలా నిర్ణయం తీసుకుంటాం.. అలాగే, 100 బీసీ హాస్టళ్లలో ఎస్ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని మంత్రి సవిత వెల్లడించారు.

ప్రతి పేదవాడికి రేషన్‌కార్డు ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నాం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సికింద్రాబాద్‌లోని హాకీ గ్రౌండ్స్‌లో “ఫ్యామిలీ డిజిటల్ కార్డ్‌ల” పైలట్‌ ప్రాజెక్ట్‌ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు పదేళ్లుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా గత కేసీఆర్ ప్రభుత్వం స్పందించలేదని.. కానీ ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు అందించాలని మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని.. వివిధ రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేశామన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్‌లను ప్రవేశపెట్టామన్నారు. “సంక్షేమ పథకాలకు సంబంధించిన వివిధ శాఖల సమాచారం ఈ ఒకే కార్డులో పొందుపరచబడుతుంది. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ద్వారా కేవలం ఒక క్లిక్‌తో 30 శాఖల సమాచారాన్ని పొందవచ్చని ప్రభుత్వం నిర్ధారిస్తోంది” అని ఆయన చెప్పారు.

కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ ఫైర్

కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. తొమ్మిది హామీలు అమలు చేస్తే పదో హామీ ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని మాపై పిచ్చి రాతలు రాయిస్తున్నారని, పదవి కాంక్షతో కేసీఆర్ ని కేటీఆర్ ఏదో చేశాడన్న ప్రచారం జరుగుతుందని ఆమె ధ్వజమెత్తారు. కేటీఆర్ సీఎం అనుకుని పనికిమాలిన నిర్ణయాలు తీసుకున్నారని, బీఆర్‌ఎస్‌ ఓడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అని ఆమె వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గరపెట్టుకో అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ రోజు వచ్చి మళ్ళీ కేసీఆర్ కనపడకుండా పోయాడు అని, ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఏం చేస్తున్నారో తెలియదన్నారు. గజ్వేల్ లో కేసీఆర్ కనపడటం లేదని పోలీస్ స్టేషన్2 లో ఫిర్యాదు చేస్తామని, ఎంపీ ఎన్నికల్లో సిద్దిపేట,గజ్వేల్ నియోజకవర్గాల్లో BJP, BRS మధ్య చీకటి ఒప్పందం జరిగిందన్నారు మంత్రి కొండా సురేఖ. కవిత బెయిల్ కోసం ప్రధానితో మాట్లాడి ఒప్పందం చేసుకుని BRS పార్టీ నుంచి BJPకి క్రాస్ ఓటింగ్ జరిగిందని, సిసోడియాకి ఇవ్వని బెయిలు ముందుగా కవిత బయటికీ వచ్చిందంటే అది చీకటి ఒప్పందమే అని ఆమె అన్నారు.


ప్రజల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలపై ఆయా శాఖలు దృష్టి పెట్టాలి..

ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిన పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ది సాధించాలని సీఎం చంద్రబాబు అన్నారు. 15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంతో ప్రభుత్వం పని చేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవల రంగంలో వృద్ది పై సచివాయలంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఆయా శాఖల అధికారులు గత 10 ఏళ్ల కాలంలో పరిస్థితులను వివరించారు. గత పభుత్వం విధ్వంసకర విధానాలతో అన్ని రంగాలు తిరోగమనంలోకి వెళ్లాయని.. దీంతో ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యిందని సీఎం అన్నారు.

కేటీఆర్‌ను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు

హైడ్రా విషయంలో హైకోర్టు హెచ్చరించినా సీఎం రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ తెచ్చారని బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ అన్నారు. బీజేపీ గవర్నర్ హైడ్రా ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపారని, రేవంత్ రెడ్డి పాలనలో కేటీఆర్ కాన్వాయ్ పై దాడి జరిగిందని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ ను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని, మైనంపల్లి కేటీఆర్,హరీష్ రావులపై దాడులు చేస్తామని అంటున్నారని, రేవంత్ రెడ్డి కొట్టండి,చంపండి అనే మాటలను కాంగ్రెస్ నేతలు అమలు చేస్తున్నారన్నారు దాసోజు శ్రవణ్. కొండా సురేఖ మాటలు రాజకీయాలు అంటే అసహ్యం వేస్తోందని, గతంలో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ కొడుకుని ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారన్నారు. కేటీఆర్ పదేళ్లు రాష్ట్ర మంత్రిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతున్నారని, కొండా సురేఖ రాజకీయం కోసం సినిమా పరిశ్రమ వాళ్ళను అవమానించారని ఆయన అన్నారు. సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళను తప్పుడు వ్యక్తులుగా మంత్రి కొండా సురేఖ చిత్రీకరించారన్నారు. కొండా సురేఖను రాహుల్ గాంధీ మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని, కొండా సురేఖ సమంత,నాగార్జున కాళ్ళు మొక్కి క్షమాపణ కోరాలన్నారు దాసోజు శ్రవణ్‌.

తిరుమల లడ్డూ కేసు విచారణ రేపటికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు..

తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ అక్టోబర్ 4వ తేదీకి వాయిదా పడింది. ఇవాళ మధ్యాహ్నం 3.30 విచారణ జరగాల్సి ఉండగా.. ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్‌ని కొనసాగించాలా లేక సీబీఐ తరహాలో దర్యాప్తు అవసరమా అనే అంశంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయం కోరింది. అయితే, తమ అభిప్రాయం చెప్పడానికి కొంత సమయం కావాలని కోరారు. దాంతో అక్టోబర్ 4వ తేదీన ఉదయం 10.30కి తిరిగి విచారణ కొనసాగిస్తామని సుప్రీం ధర్మాసనం పేర్కొనింది.

సెక్రటేరియట్ రండి.. కేటీఆర్, హరీష్ కు రేవంత్ రెడ్డి పిలుపు..

కేటీఆర్..హరీష్ రావు..సెక్రటేరియట్ రండి అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. గత ప్రభుత్వం చేసింది రెండే రెండు అన్నారు. ఒకటి తప్పులు..రెండోది అప్పులు అన్నారు. ఈ అప్పులు..తప్పులతో రాష్ట్రం నిండా మునిగిందన్నారు. కంటోన్మెంట్ నీ మున్సిపాలిటీ లో కలపల్ని కొట్లడింది నేను.. నువ్వు కాదు.. నీ తాత తెచ్చిందా? అని ప్రశ్నించారు. సబితా ఇంద్రారెడ్డి ఫాం హౌస్ కూలగొట్టాలా వద్దా..? అని ప్రశ్నించారు. కిరాయి మనుషులతో..బావ బామ్మర్ది లు ధర్నాలు చేయిస్తున్నారన్నారు. మూసి నీ అడ్డం పెట్టుకుని ఎన్ని రోజులు బతుకుతారని ప్రశ్నించారు. మూసి పేదలకు ఇండ్లు ఇవ్వాలా వద్దా? అని ప్రశ్నించారు. నమ్మి మోస పోయినా పేదలకు పరిహారం ఇద్దాం రండి అన్నారు. ఎంపీ గా గెలిచినవు కదా.. మోడీ నుండి ఎంత తెప్పిస్తావో తే.. నువ్వు కూడా బతకనీకి వచ్చినావు..
మోడీ సబర్మతి రివర్ అభివృద్ధి చేసుకోవచ్చు.. మేము మూసి అభివృద్ధి చేయొద్దంటే ఎలా? అని ప్రశ్నించారు.