Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

చంద్రబాబు హామీలను నమ్మే పరిస్థితి లేదు.. ఆయన మేనిఫెస్టోపై ఎవరికి నమ్మకం లేదు..

చంద్రబాబు నాయుడు హామీలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు.. ఆయన మేనిఫెస్టో పై ఎవరికి నమ్మకం ఉండదు అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన..మీడియాతో మాట్లాడుతూ.. తాజాగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోపై హాట్‌ కామెంట్లు చే శారు.. కూటమి తెచ్చిన మేనిఫెస్టోను కూటమిలో ఉన్న పార్టీలే నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు నాయుడు హామీలు నిలబెట్టుకోరు అని బీజేపీకి తెలుసన్న ఆయన.. అందుకే మేనిఫెస్టో ప్రకటన సమయంలో కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే వేసుకున్నారని దుయ్యబట్టారు. బీజేపీ నాయకులు ఆ మేనిఫెస్టోను తీసుకోవడానికే నిరాకరించారు.. మేనిఫెస్టో అంటే విలువ లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ మండిపడ్డారు.

రఘునందన్ రావు ఫేక్ వీడియోలు చేయిస్తున్నారు.. హరీష్ రావు ఆరోపణ

రఘునందన్ రావు ఫేక్ వీడియోలు చేయిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పై ఫేక్ వీడియోల ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ కు పోలీస్ స్టేషన్ లో తప్పుడు ప్రచారాలపై ఫిర్యాదు చేస్తామన్నారు. గతంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక ఉపఎన్నికల సమయంలో కూడా ఫేక్ న్యూస్ ప్రచారం చేశాడన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ లో చేరినట్టు ఫేక్ వీడియో క్రియేట్ చేశాడని మండిపడ్డారు. వెంకట్రామిరెడ్డి పైన రఘునందన్ రావు దుష్ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబల్ ప్రచారం చేసి గెలవడం రఘునందన్ రావుకు అలవాటు అని తెలిపారు.

ఐదేళ్లలో సిరిసిల్ల నేతన్నకు ఏం చేశావ్.. బండి సంజయ్ కు పొన్నం ప్రశ్న..

ఐదు ఏండ్లు ఎంపీగా అధికారంలో ఉండి.. సిరిసిల్ల నేతన్నలకు ఏం చేశారో చెప్పాలని బండి సంజయ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నేత కార్మికుల కు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన మంత్రి పదవికి కళంకం తెచ్చే విధంగా మోడీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మోడీ ప్రకటనల వల్ల బీజేపీ పడిపోతుందన్నారు. అబ్ కీ బార్ 400 సీట్లు అన్నారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు తొలగించ వచ్చని, నియంత లాగ ఉండాలని చూస్తున్నారన్నారు. ఏ ఒక్క బలహీన వర్గాలు బీజేపీకి ఓటు వేస్తలేరని తెలిపారు. మంగళ సూత్రాలు గుంజుకుంటుంది అంటున్నారని మండిపడ్డారు. కార్పొరేటర్ స్థాయికి దిగజారి పోయాడన్నారు. కోట్ల రూపాయల ఆస్తులు అదానీ, అంబానికి కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. నేను ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించలేదు..

నెల్లూరు లోక్‌సభ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. స్థానిక టీడీపీ నేతల నుంచి చంద్రబాబు నాయుడు వరకూ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.. విశాఖపట్నంలో భూములు ఆక్రమించారని నాపై అవాస్తవాలు మాట్లాడుతున్నారని తెలిపారు. అయితే, నేను శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడిని.. ఆ దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. నేను ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు.. నా చదువు పూర్తయిన తర్వాత నన్న ఆడిటర్ చేసిన వైఎస్ రాజారెడ్డి రుణం తీర్చుకోలేనిది అన్నారు.. వైఎస్ కుటుంబానికి నమ్మకస్తుడిగా ఉండాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను.. నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఇలాంటి అవకాశం రావడం నా అదృష్టంగా పేర్కొన్నారు.

ఆ వీడియోతో నాకు సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై..

అమిత్ షా ఫేక్‌ వీడియో షేర్‌కు తనకు సంబంధం లేదని ఢిల్లీ పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం పంపారు. ఐఎన్‌సీ తెలంగాణ ట్విట్టర్ (ఎక్స్‌) ఖాతాను తాను నిర్వహించడం లేదన్న రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనకు కేవలం రెండు ట్విట్టర్‌ ఖాతాలను (సీఎంవో తెలంగాణ, నా వ్యక్తిగత ఖాతా) మాత్రమే వినియోగిస్తున్నానని రేవంత్ రెడ్డి పోలీసులకు సమాధానం పంపారు. రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి సోషల్ మీడియాలో ఫేక్ వీడియో వైరల్ చేశారన్న ఆరోపణలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. తాజాగా ఆ నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి తరఫున న్యాయవాది సౌమ్య గుప్తా వివరణ ఇచ్చారు.

ప్రతి ఇంటా నాకు రక్షక భటులు ఉన్నారు.. నువ్వు అనుకుంటే సరిపోదు..!

వెన్నుపోటు పోడవటం, మోసం చేయడం ఇదే చంద్రబాబు రాజకీయం.. ఎన్టీఆర్ కుర్చినీ లాక్కొని సొంత మామను చంపిందెవరు..? వంగవీటి మోహన రంగారావును కట్రలతో చంపిందెవరు? ఐఏఎస్ రాఘవేంద్రరావును కుట్రలతో చంపింది ఎవరు? అని అడుగుతున్నాను అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. వియజనగరం జిల్లా బొబ్బిలి రోడ్‌లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పుడు జగన్‌ను చంపేస్తే అని అంటున్నది ఎవరు అని అడుగుతున్నా.. చంద్రబాబు నువ్వు అనుకుంటే సరిపోదు..! ప్రతి ఇంట లబ్ధిపొంది ప్రతి ఒక్కరూ రక్షక భటులుగా నాకు ఉన్నారని చెబుతున్నా అని హెచ్చరించారు. ఈ అక్క చెల్లెమ్మలే ఈ జగన్ కి శ్రీరామ రక్ష అన్నారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాయకరావుపేటలో సీఎం వైఎస్‌ జగన్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ మీద బాబు దుష్ప్రచారం చేస్తున్నారని.. ప్రతి ఒక్కరికీ కాల్ చేసి, మెసేజ్ పెట్టి జగన్ మీ భూములు కాజేస్తాడని చెబుతున్నాడని తీవ్రంగా మండిపడ్డారు. జగన్ ఎలాంటి వాడో బాబుకు తెలీదేమో రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకూ తెలుసన్నారు. జగన్ భూములు ఇచ్చేవాడు కానీ తీసుకునేవాడు కాదు అని అందరికీ తెలుసన్నారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి బాబుకు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. మీ భూముల మీద మీకు సర్వహక్కులూ కల్పించడమే ఈ యాక్ట్ ఉద్దేశమన్నారు. 100 సంవత్సరాల క్రితం బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగిందని.. ఆ తర్వాత సర్వే జరగలేదన్నారు. గ్రామ సచివాలయాల్లో 15 వేల సర్వేయర్లను పెట్టించి ఇలా సర్వే గతంలో ఎవ్వరూ చేయించలేదన్నారు.

తోట త్రిమూర్తులు జనసేనలోకి రావట్లేదు.. పవన్‌ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు ఇద్దరూ ఒకప్పుడు కొట్టుకున్నారని.. మళ్లీ రాజకీయం గురించి కలిసిపోయారని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు రావులపాలెం టు యానాం ఏటిగట్టు రోడ్డు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు. ఈరోజు ఇద్దరూ రాజకీయ అవసరాలకు గురించి కూర్చున్నారన్నారు. తోట త్రిమూర్తులు జనసేనలోకి రావటం లేదని.. అలాంటి సంకేతాలు ఏమీ తన దగ్గరికి రాలేదన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీ నాయకులు మీద వ్యక్తిగత దూషణ లేదని పవన్‌ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ యువతకు, రైతులకు, మహిళలకు, బీసీస ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు ఒక మాట చెప్పానంటే నిలబడతానన్నారు. ఉదాహరణకు ఇక్కడ నుంచి తోట త్రిమూర్తులు పోటీ చేస్తున్నాడు.. ద్రాక్షారామంలో భూమి వేలం పాట పెట్టినప్పుడు కాపు కళ్యాణమండపం కడతానని తీసుకుని రెండు దశాబ్దాలు అయిందన్నారు. కులాన్ని ఎలా వాడుకుంటారు అనేదానికి ఇదే ఉదాహరణ అని ఆయన విమర్శించారు. తనను దశాబ్దాల నుండి ఇబ్బందుల పాలు చేశారన్నారు. మండపేటలో సుమారు 50 రైస్ మిల్లులు ఉన్నాయి.. రైతుల్ని పట్టించుకునే నాథుడే లేడని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ గంజాయి పంట లాభాల్లో ఉందని విమర్శలు గుప్పించారు. సినిమా టిక్కెట్లు అమ్మడానికి అన్ని వ్యవస్థలు కలిసి వస్తాయి గాని రైతాంగానికి ఏ వ్యవస్థ కలిసి రాదన్నారు.

ఈరోజు నీ గ్లాస్ నీ దగ్గర లేదు.. జనసేనానిపై విమర్శలు

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాట్లాడుతూ.. జనసేన పార్టీ లేదు, గుర్తింపు లేదు జగన్ మోహన్ రెడ్డి మీద తొడ కొడతాడంట అని విమర్శించారు. ఈరోజు నీ గ్లాస్ నీ దగ్గర లేదని దుయ్యబట్టారు. ఎప్పుడైతే చంద్రబాబుకి బానిసలా బతుకుతున్నావో.. నీ జీవితం ఎలా అయిపోయిందో తెలుసని ఆరోపించారు. నిన్ను నమ్ముకొని 10 సంవత్సరాలు జనసేన జెండా పట్టుకున్నారు.. గ్లాస్ పట్టుకున్నారు.. గ్లాస్ ని అందరికీ ఇచ్చేశావ్.. జెండాను చంద్రబాబుకి తాకట్టు పెట్టావని పేర్కొన్నారు.

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది..

జగిత్యాల జిల్లా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో జన జాతర సభలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణకే అనేక సందర్భాల్లో రాజకీయ సలహాలతొ పాటు ప్రజా సమస్యల పై పోరాట మార్గాన్ని ఇచ్చిన పెద్దలు జీవన్ రెడ్డిని నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గా గెలిపించండన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆయన అన్నారు. 30 సంవత్సరాల తరువాత బీజేపీ ఎవరి సహకారం లేకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలొకి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కాని 10 సంవత్సరల్లో దేశ ఆస్తులను సంపదను అదానీ, అంబానీలకు అప్పగించాడని ఆయన మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఏక్ బార్ చార్ సౌ బార్ అంటున్నారని, 400 అనగానే చాలా మంది మేధావులు, చదువుకున్న వారు ఆలోచిస్తున్నారన్నారు.

హృదయం లేని మనిషి ప్రధాని మోడీ

తెలంగాణ భవన్‌లో కార్మికులను ఉద్దేశించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మన బ్రతుకు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో మర్చిపోయి కూడా లంగలకు, దొంగలకు ఓట్లు వేయొద్దని ఆయన కోరారు. హృదయం లేని మనిషి ప్రధాని మోడీ అని ఆయన విమర్శించారు. కార్పొరేట్లకు 14 లక్షలు కోట్లు మాఫీ చేశాడు. ఇది తప్పని బండి సంజయ్, కిషన్ రెడ్డి నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని, మోడీ కార్పొరేట్ దోస్త్ లకు ఖర్చు పెట్టే డబ్బు….. దేశ రైతాంగానికి ఖర్చు పెట్టొచ్చునన్నారు కేటీఆర్‌. శ్రీరాముడు అందరి వాడు. లంగలకు దొంగలకు ఓట్లు వెయ్యండని చెప్పలేదని, ఫ్రీ బస్సుతో మహిళలు సంతోషంగా ఉండాల్సింది పోయి జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారన్నారు.

Exit mobile version