Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

అసెంబ్లీ వద్ద సందడి.. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం

తెలంగాణ మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు తుంటికి ఆపరేషన్ నుంచి కోలుకుని ఈరోజు తెలంగాణ శాసనసభకు వచ్చారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్‌ ఛాంబర్‌లో శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌తో కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అసెంబ్లీ ఆవరణలోని ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి బీఆర్‌ఎల్పీ నేతగా బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు మంచిరోజు కావడంతో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా శాసనసభకు వచ్చారు. కాగా..ఇదే రోజు కేసీఆర్‌ను బీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ శాసనసభలో ప్రతిపక్షనేతగా కె.చంద్రశేఖర్ కొనసాగుతారని స్పష్టమైంది.

వందే భారత్‌ కోచ్‌ల తరహాలో కొత్తగా 40 వేల బోగీలు

మధ్యంతర బడ్జెట్‌ లో రైళ్లు, విమానయానరంగానికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన చేశారు. రైల్వేల బలోపేతానికి కేంద్ర సర్కార్ అనేక కీలక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రధాన మంత్రి గతిశక్తి పథకం కింద 3 కారిడార్లను నిర్మిస్తామని బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇంధనం, ఖనిజాలు, సిమెంట్ కోసం మూడు రైల్వే కారిడార్లను నిర్మించనున్నట్లు ప్రకటించారు. వందే భారత్‌ను అప్‌గ్రేడ్ తో పాటు రాబోయే రోజుల్లో ప్రభుత్వం దేశంలోని ఇతర నగరాలలో మెట్రో రైలు నమో భారత్‌ అనుసంధానిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

ఆర్బీఐ నిర్ణయంతో రూ.9700కోట్లు నష్టపోయిన పేటీఎం

Paytm మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్‌పై ఆర్బీఐ చర్య భారీ నష్టాన్ని తీసుకుంది. కంపెనీ షేర్లలో 20 శాతం లోయర్ సర్క్యూట్ ఉంది. దీని కారణంగా కంపెనీ వాల్యుయేషన్ దాదాపు రూ.9700 కోట్లు తగ్గింది. నిజానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ని ఫిబ్రవరి తర్వాత ఏదైనా కస్టమర్ ఖాతా, వాలెట్‌లో డిపాజిట్లు స్వీకరించకుండా లేదా Fastagలో టాప్ అప్ చేయకుండా నిషేధించిన తర్వాత Paytm స్టాక్‌లో భారీ పతనం నమోదైంది. One Communication అంటే Paytm షేర్ల కోసం ఎలాంటి గణాంకాలు కనిపిస్తున్నాయో తెలుసుకుందాం.

Paytm షేర్లు 20 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. దీని కారణంగా బిఎస్‌ఇలో కంపెనీ షేర్లు రూ.608.80కి చేరాయి. కాగా ఒక రోజు ముందు కంపెనీ షేర్లు రూ.761 వద్ద ముగిశాయి. కంపెనీ 52 వారాల గరిష్ట స్థాయి అక్టోబర్ 20న వచ్చింది. ఆ రోజు కంపెనీ షేర్లు రూ.998.30కి వచ్చాయి. అప్పటి నుండి దాదాపు 100 రోజులు గడిచాయి. ఈ కాలంలో కంపెనీ షేర్లు 39 శాతం పడిపోయాయి. రానున్న రోజుల్లో కంపెనీ షేర్లలో మరింత క్షీణత కనిపించవచ్చు.

డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం ఫ్యాన్‌కు వేయండి..

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఒక్క ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఇస్తామంటున్నారు.. బంగారంగా తీసుకోండి.. ఓటు మాంత్రం ఫ్యాన్‌కు వేయండి అని పిలుపునిచ్చారు.. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి.. నెల్లూరు జిల్లా విడవలూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైయస్సార్ ఆసరా కింద నాలుగో విడత చెక్కులను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలుగున్నర ఏళ్ల పాటు ప్రజలకు కనపడని ప్రతిపక్ష నేతలు నేడు పగటి వేషగాళ్లలా వ్యవహరిస్తూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలించాడు.. ఐదు సంవత్సరాలు కొత్త రాష్ట్రంలో పరిపాలించాడు.. వాగ్దానాలు చేయటం.. ఓట్లు వేయించుకోవడం అధికారంలో వచ్చిన తర్వాత మోసం చేయటం పరిపాటిగా మారిందంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో కుటుంబాలు బాగుపడ్డాయా..? వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లాగా సంక్షేమ పథకాలు ఇచ్చారా..? అని నిలదీశారు.

నేను.. రేవంత్ మిత్రులం.. కలిస్తే తప్పేంటి..!

సీఎం రేవంత్, నేను ఇద్దరం కలిస్తే తప్పేంటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీలో మల్లా రెడ్డి మాట్లాడుతూ.. మళ్ళీ పోటీ చేయనని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను.. రేవంత్ పాత మిత్రులమని, టీడీపీ వాళ్ళమని తెలిపారు. కీసర ఆలయం కార్యక్రమంకు పిలిచెందుకు సీఎం రేవంత్ ను కలుస్తాం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నీ కలిస్తే తప్పు ఎందుకు ? ఆయన రాష్ట్రానికి సీఎం కదా ? అన్నారు. త్వరలో గోవాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అని ప్రకటించారు. ఇప్పటికే గోవాలో హోటల్ కొన్నానని అన్నారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్లో అయ్యిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం వాళ్లకు షాక్.. మేము రాకపోవడం మాకు షాక్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

50 ఏళ్ల పాటు రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు..

మధ్యంతర బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేసింది. తన ప్రసంగంలో రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని 75000 కోట్ల రూపాయల రుణాన్ని అందజేస్తామని తెలిపింది. అయితే, అభివృద్ధి చెందిన దేశంగా లక్ష్యాన్ని సాధించేందుకు భారత్ రాష్ట్రాలలో సంస్కరణలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విజన్‌ను సాకారం చేసేందుకు రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అవసరం.. ఈ దిశగా తమ సర్కార్ ముందుకు సాగుతుందని పేర్కొన్నింది. రాష్ట్రాలను ఆదుకోవడానికి వడ్డీ రహిత రుణాన్ని ఈ సంవత్సరం ప్రతిపాదించాం.. ఇది రాష్ట్రాల పరిస్థితిని మెరుగుపరచడంలో కీలకంగా వ్యవహరిస్తుందని సీతారామన్ చెప్పుకొచ్చింది. ఈ ఏడాది కూడా రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న సహకారం కొనసాగుతుందని వెల్లడించారు.

తిట్టడం కాదు.. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి..

తిట్లు తిట్టడం కాదు మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యేలు పాడి కౌషిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కంటే దేశంలో ఎక్కడైన ఒక్క ఉద్యోగం ఇచ్చి ఉంటె నా ముక్కు నెలకు రాస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. క్రొత్త ఇన్నింగ్స్ మొదలు కాబోతోందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డీ సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల పై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. ఈ రోజు ఫిబ్రవరి 1 ..కాంగ్రెస్ జాబ్ కేలెండర్ ప్రకారం ఈ రోజు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వాలి ఏమైంది రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు.

తెలుగు రాష్ట్రాల్లో రైల్వే అభివృద్ధికి ప్రధానంగా భూమి సమస్య ఉంది

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024-25కు సంబంధించిన మధ్యంతర బడ్జె్ట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో 2024 – 25 మధ్యంతర బడ్జెట్ పై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. 2024 – 25 బడ్జెట్ లో ఆంధ్రపదేశ్ కు 9138 కోట్లు కేటాయింపు, 2024- 25 బడ్జెట్ లో తెలంగాణకు 5071 కోట్ల కేటాయింపు చేసినట్లు తెలిపారు. కాజీపెట్ రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ పనులు కొనసాగుతున్నాయని, ఎప్పుడు లేని విధంగా గత పదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో రైల్వే అభివృద్ధి జరిగిందన్నారు. రైల్వే బ్రిడ్జి లు, కొత్త రైల్వే ట్రాక్ ల నిర్మాణం, ఎలక్ట్రిఫికేషన్ , ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరిగిందని ఆయన వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో రైల్వే అభివృద్ధికి ప్రధానంగా భూమీ సమస్య ఉందని, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్త శుద్ది తో రైల్వే అభివృద్ధికి ముందుకు రావాలన్నారు అశ్విని వైష్ణవ్‌.

మైలవరం వైసీపీలో కీలక పరిణామాలు..

మైలవరం వైసీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎల్లుండి (శనివారం) ఏలూరులో జరిగే సిద్దం సభకు నియోజక వర్గం నుంచి కార్యకర్తలు, నేతలను పంపే పనికి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో.. మైలవరం నియోజకవర్గ ఎంపీటీసీ, జడ్పీటీసీలు, మండల కన్వీనర్లతో కేశినేని నాని మైలవరం పరిశీలకులు పడమట సురేష్ బాబు సమావేశమయ్యారు. కాగా.. ఎమ్మెల్యే వసంత హైదరాబాద్ లో ఉన్నారు. సిద్ధం కార్యక్రమానికి అందుబాటులో ఉండనని వసంత కృష్ణ పార్టీ పెద్దలకు ఇప్పటికే చెప్పినట్టు సమాచారం తెలుస్తోంది. ఈ క్రమంలో.. ఎమ్మెల్యే లేకపోవటంతో నియోజకవర్గ బాధ్యతలు కేశినేని నాని, పడమట సురేష్ బాబు తీసుకున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ వీడనున్నారు అనే సోషల్ మీడియా ప్రచారం నేపథ్యంలో తాజా ఘటనలతో మరోమారు ఎమ్మెల్యే వసంత వ్యవహారం చర్చగా మారింది.

మేడారం భక్తులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్‌

త్వరలో జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా జాతర ముగిసే వరకు అక్కడ అటవీశాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి 29 దాకా పర్యావరణ రుసుము (ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ ఫీజు) వసూలు నిలిపివేస్తున్నట్లు అటవీ శాఖ తెలిపింది. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జాతరకు వచ్చే వాహనాలు, రద్దీ నియంత్రణ కూడా కొంత మేరకు సులువు అయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ములుగు జిల్లా అటవీ అధికారి తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో తెలిపారు.

31 ఏళ్ల తర్వాత జ్ఞానవాపిలో మొదలైన పూజలు

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గల జ్ఞానవాపి మసీదులోని సెల్లార్‌లో గల విగ్రహాల ముందు పూజారి ప్రార్థనలు చేయవచ్చని వారణాసి జిల్లా కోర్టు బుధవారం తీర్పు ఇచ్చిన కొన్ని గంటల తర్వాత, అర్ధరాత్రి జ్ఞానవాపి ప్రాంగణంలో పూజలు ప్రారంభమయ్యాయి. వివరాల ప్రకారం, కోర్టు ఆదేశాలతో పూజకు సన్నాహాలు ప్రారంభించబడ్డాయి. ఆవరణలో భారీ బందోబస్తులో హారతి నిర్వహించారు. వ్యాస్‌ కా తెహఖానా సెల్లార్‌లో ఉదయం 3 గంటలకే విగ్రహాలకు తొలి పూజ ప్రారంభమైంది. 31 ఏళ్ల తర్వాత పూజలు జరగడం గమనార్హం.

దేశానికి మార్గదర్శనం చేసే విధంగా కేంద్ర బడ్జెట్..

దేశానికి మార్గదర్శనం చేసే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కేంద్ర బడ్జెట్టును స్వాగతిస్తున్నామన్నారు. యువతను ప్రోత్సహిస్తూ.. స్టార్టప్ కంపెనీలను ప్రొత్సహించేలా బడ్జెట్ రూపకల్పన చేశారని ఆయన అన్నారు.

మేం రూపొందించిన షణ్ముఖ వ్యూహంలో యువతకు ఉపాధి కల్పించే అంశానికి ఇది దగ్గరగా ఉందన్నారు. మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించేలా నిర్ణయాలు ఉన్నాయన్నారు. రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు వంటివి మధ్య తరగతి ప్రజలకు సీఎం జగన్ పెంచిన విద్యుత్ ఛార్జీల నుంచి ఊరటనిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకే టూరిజం అభివృద్ధికి నిధులిస్తామనడం హర్షించదగ్గ విషయమన్నారు. సువిశాల సాగరతీరం ఉన్న ఏపీకి కేంద్రం ప్రతిపాదించిన టూరిజం పాలసీ లాభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

 

Exit mobile version