ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూత
ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. గద్దర్ చనిపోయినట్లు కొడుకు సూర్యం తెలిపారు. ఇవాళ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గద్దర్ తుదిశ్వాస విడిచారు. గద్దర్ మెదక్ జిల్లా లోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో దళిత కుటుంబంలో జన్మించాడు. విద్యాభ్యాసం నిజామాబాదు జిల్లా మహబూబ్ నగర్ లో, ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్ లో జరిగింది. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేసారు. దీనికొరకు ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. ఆతర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చే వారు. 1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట “ఆపర రిక్షా” రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.
మల్లవల్లి రైతులకు పరిహారం అందేవరకు జనసేన పోరాటం చేస్తుంది
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అనంతరం వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మల్లవల్లి రైతుల్లో ప్రతి ఒక్కరికీ పరిహారం అందేవరకు జనసేన అండగా ఉండి పోరాటం చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా మల్లవల్లి రైతులకు టీడీపీ కూడా అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ ఇక్కడ రైతులకు అండగా నిలవాలని కోరుతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. రైతులకు కులాలు అంట గడితే టీడీపీ ఖండించాలని పవన్ అన్నారు.
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతోందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రావటం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. పరిశ్రమల కోసం గత ప్రభుత్వం రైతుల నుంచి 1,400 ఎకరాలు తీసుకుందని చెప్పారు. మల్లవల్లిలోని 125 మంది రైతులకు నేటికీ పరిహారం అందలేదని తెలిపారు. భూమి ఏ ఒక్కరిదీ కాదని అన్నారు.
రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలు రావాలి, యువతకు ఉద్యోగాలు రావాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పారు.
జయశంకర్ సార్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులు
తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా, స్వరాష్ట్ర సాధన కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్ సార్, తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా ఉంటారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. ప్రొ.జయశంకర్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఆయన చేసిన త్యాగం, సేవలను సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. సకల జనుల సంక్షేమం, సబ్బండ వర్గాల సమానత్వం కోసమే తెలంగాణ స్వరాష్ట్రమని తెలిపిన ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.
హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల నాలుగు 1000 పడకల టిమ్స్ ఆస్పతులు
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 10,000 హాస్పిటల్ పడకలను రూపొందించి, రానున్న కాలంలో 50,000 పడకలకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉందని వైద్యఆరోగ్య శాఖ మంత్రి టీ హరీష్‌రావు ఆదివారం శాసనమండలికి తెలిపారు. కౌన్సిల్‌లో ప్రవేశపెట్టిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) యాక్ట్ 2022 ముఖ్య లక్షణాలను వివరిస్తూ, ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల నాలుగు 1000 పడకల టిమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు.
ప్రజా కవి గద్దర్ మరణంపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి
ప్రజా గాయకుడు గద్దర్ కాసేపటి క్రితమే జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొన్ని రోజులుగా గద్దర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే గద్దర్ మరణంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా కవి – గాయకుడు, బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్ అని సీఎం జగన్ కొనియాడారు. గద్దర్ పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటే అని అన్నారు. ఆయన నిరంతరం సామాజిక న్యాయం కోసమే బతికారని సీఎం జగన్ అన్నారు. ఇప్పుడు ఆయన లేరన్న వార్త ఊహించనదని పేర్కొ్న్నారు.
శాసనమండలిలో ఐదు బిల్లులు ఆమోదం
రాష్ట్రంలో ప్రపంచ స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బిల్లు (టిమ్స్) 2023తో సహా ఐదు ముఖ్యమైన బిల్లులను శాసన మండలి ఆదివారం ఆమోదించింది. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బిల్లు (టిమ్స్), 2023, తెలంగాణ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు, 2023ని ఆరోగ్య, ఆర్థిక మంత్రి టి హరీష్ రావు ప్రవేశపెట్టారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిషన్ (సవరణ)ను ప్రవేశపెట్టారు.
ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి, 40 మందికి పైగా గాయాలు
పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హజారా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. దక్షిణ పాకిస్థాన్‌లో ఆదివారం రైలు పట్టాలు తప్పడంతో దాదాపు 15 మంది మరణించారని ఆ దేశ రైల్వే మంత్రి తెలిపారు. హజారా ఎక్స్‌ప్రెస్ కరాచీ నుంచి అబోటాబాద్‌కు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లోని నవాబ్షా నగరంలోని సహారా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ప్రమాదంలో ఓ కోచ్ పూర్తిగా బోల్తా పడింది. దీంతో 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
రెండ్రోజుల పాటు ముంపు మండలాల్లో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
రేపటి నుంచి సీఎం జగన్ వరద ప్రభావిత, ముంపు మండలాల్లో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు సీఎం పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. రేపు ఉదయం 9:30 నిమిషాలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరనున్నారు. 10:30 గం.కు అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట గ్రామానికి ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. 11 గంటలకు కోనవరం బస్టాండ్ సమీపంలో వేదిక దగ్గర వరద బాధిత కుటుంబాలను పరామర్శించునున్నారు. అక్కడ కూనవరం, వీఆర్ పురం మండలాల బాధితులతో ఇంటరాక్షన్ అవ్వనున్నారు ముఖ్యమంత్రి జగన్.
పంట పొలాలు మునిగిపోయి ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవాలి
భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు మునిగిపోయాయి… వారికి పరిహారం ఇవ్వాలని కోరుతున్నామన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇవాళ ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. పంట పొలాలు మునిగిపోయి ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నాలుగు సార్లు రైతులు భారీ వర్షాలతో పంట నష్టపోయారని, చెక్ డ్యాం పక్కల భూములు కోతకు గురికాకుండా చెక్ డ్యాంల డిజైన్ మార్చాలని కోరుతున్నామన్నారు ఈటల రాజేందర్. వరి పంటతో పాటు కూరగాయల పంటలను ప్రోత్సహించాలని కోరుతున్నామని, రుణ మాఫీ అమలు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో సిఎం సభలో చెప్పాలని అడుగుతున్నామన్నారు.
దారుణం.. అబ్బాయిలతో బలవంతంగా మూత్రం తాగించి.. ప్రైవేట్ పార్ట్‌లో మిరపకాయలు రుద్ది..
ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలో ఇద్దరు మైనర్ బాలురకు మూత్రం తాగించి, వారి మలద్వారంలో పచ్చిమిర్చి రుద్దారు. దొంగతనం చేశారనే అనుమానంతో బలవంతంగా కొన్ని గుర్తు తెలియని ఇంజెక్షన్లు ఇచ్చారు. బాధితులు 10, 15 సంవత్సరాల వయస్సు గల బాలురు కావడం గమనార్హం. దాడికి సంబంధించిన భయానక వీడియోల్లో ఆ అబ్బాయిలను పచ్చి మిరపకాయలు తినేలా చేసి, బాటిల్‌లో నింపిన మూత్రాన్ని తాగాలని బలవంతపెట్టారు. కొంతమంది వ్యక్తులు వారిని దుర్భాషలాడడం, దానిని దాటవేయకపోతే కొడతామని బెదిరించడం ఆ వీడియోలో కనిపించింది. డబ్బు దొంగిలించారని ఆరోపిస్తూ గూండాలు అబ్బాయిలను పట్టుకుని కట్టివేశారు.
రాయలసీమ ద్రోహి చంద్రబాబు
పుంగనూరులో పోలీసులపై టీడీపీ దాడులను నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టారు. నల్ల రిబ్బన్లతో చంద్రబాబు దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి దగ్ధం చేశారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఆ నిరసనల్లో మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ భాగ్యలక్ష్మి, ఎపీఐడీసీ చైర్మన్ పుణ్యశీల పాల్గొన్నారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని దుయ్యబట్టారు. హింసను ప్రోత్సహించి ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రూట్ మ్యాప్ ప్రకారం కాకుండా పుంగనూరు ఊరిలోకి వెళ్తానని చంద్రబాబు మొండికేయడంతో ఘర్షణ మొదలైందని వెల్లంపల్లి తెలిపారు.
