భారీ వర్ష సూచన.. ఏపీలో 9 జిల్లాలకు, తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ అప్రమత్తం చేసింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ).. తెలంగాణలోని 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తే.. ఏపీలోని 9 జిల్లాల్లో ఎల్లో వార్నింగ్ జారీ చేసింది ఐఎండీ.. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడింది.. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈ రోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని తూర్పు , పశ్చిమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈ రోజు నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది.. నేడు 8 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.. ఇక, ఆంధ్రప్రదేశ్లోని తొమ్మిది జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందంటూ ఎల్లో వార్నింగ్ ఇచ్చింది ఐఎండీ. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.. తమిళనాడు, ఉత్తరాంధ్రను అనుకుని ఉపరితల అవర్తనాలు కొనసాగుతుండగా.. ఈ నెల 29న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని సూచించింది.. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడే అవకాశం వుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేస్తోంది.. మొత్తంగా.. ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్‌కి కూడా భారీ వర్ష సూచన ఉందని చెబుతోంది వాతావరణశాఖ.
చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్.. ఏపీ రాజకీయాలతో మాకేంటి సంబంధం..?
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అయితే, చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఏపీతో పాటు హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లోనూ ఆందోళనలు జరిగాయి.. ఇక, దీనికి వ్యతిరేకంగా వైసీపీ ర్యాలీ కూడా జరిగింది.. అయితే ఏపీ రాజకీయాలతో తెలంగాణకు ఏం సంబంధం అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు.. అది రెండు రాజకీయ పార్టీల అంశంలా ఉందన్న ఆయన.. ఏపీ రాజకీయాలకు, తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు.. ఇక్కడ ర్యాలీలు ఎందుకు? ఏపీలో చేస్కోండి.. రాజమండ్రిలో భూమి బద్దలు కొట్టేలా ర్యాలీలు చేసుకోండి అంటూ సలహా ఇచ్చారు. అయితే, ఇక్కడ (హైదరాబాద్) ఎవరు చేసిన ఊరుకునేది లేదని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రెండు రాజకీయ పార్టీల అంశం లా ఉందన్న ఆయన.. దీనిపై చంద్రబాబు న్యాయపోరాటం చేస్తున్నారు.. ఎంత వరకు విజయం సాధిస్తారో చూడాలన్నారు. ఇక, వైఎస్ జగన్, పవన్ కల్యాణ్, నారా లోకేష్ నాకు మిత్రులే.. ఆంధ్రవాళ్లతో నాకు ఎలాంటి విభేదాలు లేవన్నారు.. చంద్రబాబు అంశం కోర్టులో ఉంది.. దీని గురించి మాకు అనవసరం అన్నారు. మరోవైపు.. లోకేష్ నాకు కాల్ చేసి ర్యాలీకి అనుమతి ఎందుకు ఇవ్వలేదు అని అడిగారు.. ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దు.. అందుకే ఎవరికి అనుమతి ఇవ్వం అని చెప్పానని గుర్తుచేసుకున్నారు.. ఇది రెండు రాజకీయ పార్టీల ఘర్షణ.. ప్రశాతంగా ఉన్న ఐటీ డిస్టర్బ్ కావొద్దు అన్నారు కేటీఆర్.. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఐటీ కారిడార్‌లో ఎలాంటి ఆందోళనలు జరగలేదన్నారు మంత్రి కేటీఆర్.
ఏపీ ఫైబర్ నెట్ స్కాం.. రూ.114 కోట్లు కొట్టేశారు
చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌లో రూ. 114 కోట్లు కొట్టేశారంటూ ఆరోపణలు గుప్పించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఫైబర్‌నెట్ స్కాంపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చంద్రబాబు తనకు తెలిసినవారికే ఫైబర్ నెట్ టెండర్లు కట్టబెట్టారు.. హెరిటేజ్‌లో పనిచేసేవారే టెరాసాఫ్ట్‌లో డైరెక్టర్లుగా పనిచేశారని విమర్శించారు. ఫైబర్ నెట్ స్కామ్ మొత్తం చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయన్నారు. రూ.330 కోట్ల కాంట్రాక్టు చేజిక్కించుకున్నారు. అందులో రూ.114 కోట్లను అప్పనంగా కొట్టేశారని ఆరోపించారు.. అయితే.. ఈ స్కామ్ ఎలా జరిగిందో.. అసెంబ్లీలో ఓ టేబుల్‌ను డిస్‌ప్లే చేశారు మంత్రి అమర్నాథ్. మరోవైపు.. స్కిల్ స్కామ్‌లో రూ. 331 కోట్లు అక్రమాలు జరిగాయన్నారు గుడివాడ అమర్నాథ్.. ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని సీమెన్స్ సంస్థ తెలిపిందన్న ఆయన.. సీమెన్స్ ఉచితంగా అందించే కోర్సులను ఒప్పించి తెచ్చామని చంద్రబాబు బిల్డప్ ఇచ్చారు.. సీమెన్స్ నుంచి ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి పెట్టుబడి రాలేదన్నారు.. చంద్రబాబు అనుకూల వ్యక్తులకే ఫైబర్‌నెట్ టెండర్ కట్టబెట్టారు.. షెల్ కంపెనీల ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు.. హెరిటేజ్‌లో పనిచేసేవారే టెరాసాఫ్ట్‌లో డైరెక్టర్‌లుగా పనిచేశారు అంటూ అసెంబ్లీ వేదికగా ఆరోపణలు గుప్పించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇక, అసెంబ్లీ వేదికగా మంత్రి గుడివాడ చేసిన వ్యాఖ్యల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
ఎన్నిసార్లు విఫలమవుతారంటూ టీఎస్పీఎస్సీపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై తెలంగాణ హైకోర్టు ఇవాళ(మంగళవారం) విచారణ చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష విషయంలో ఎన్నిసార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారంటూ తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు మీరే ఉల్లంఘిస్తే ఎలా అంటూ టీఎస్పీఎస్సీపై మండిపడింది. ఒకసారి పేపర్ లీక్, ఇప్పుడేమో బయోమెట్రిక్ సమస్య పేరుతో విద్యార్థుల జీవితాలో ఆడుకుంటున్నారంటూ హైకోర్టు విమర్శించింది. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలంగాణ హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. గ్రూప్-1 పరీక్షలో బయోమెట్రిక్ ఎందుకు పెట్టలేదని టీఎస్పీఎస్సీని హైకోర్టు ప్రశ్నించింది. పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ విఫలం అయ్యిందని, రెండోసారి కూడా నిబంధనలు పాటించకుండా ఎందుకు నిర్లక్ష్యం వహించిందని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై పూర్తి వివరాలు సమర్పించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కాగా, జూన్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను క్యాన్సిల్ చేస్తూ.. ఈనెల 23న హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు టీఎస్‌పీఎస్సీ వెళ్లింది.
“ఉగ్రవాదులకు స్వర్గధామంగా కెనడా”.. భారత్‌కి మద్దతుగా శ్రీలంక, బంగ్లాదేశ్
భారత్ పై కెనడా అనుసరిస్తున్న వైఖరిపై, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలపై భారత్ పొరగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్ స్పందించాయి. ఆధారాలు లేకుండా భారత్ పై ఆరోపణలు చేసిన జస్టిన్ ట్రూడో పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా పార్లమెంట్ లో మాట్లాడిన ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో, ఇందులో భారత ప్రమేయం ఉందంటూ ఆరోపించారు. శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ ఓ ఆంగ్ర పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడా ప్రధాని ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం దారుణమన్నారు. కొందరు ఉగ్రవాదులకు కెనడా సురక్షిత అడ్డాగా మారిందని విమర్శించారు. కెనడా ప్రధాని గతంలో ఇలాంటి ఆరోపణలనే శ్రీలంకపై కూడా చేశారు. మా దేశంలో ఎలాంటి హత్యాకండ జరగలేదని అందరికీ తెలుసు.. బలహీనమైన ఆరోపణలతో ట్రూడో ముందుకు రావడాన్ని చూసి నేనేమీ ఆశ్చర్యపోలేదు, నాజీలతో కలిసి పనిచేసిన వారికి ట్రూడో స్వాగతం పలకడం నిన్న చూశామని ఆయన అన్నారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అమెరికా రాయబారి పర్యటన.. చెలరేగిన వివాదం..
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో గత వారం అమెరికా రాయబారి పర్యటించారు. ఇప్పుడు ఇదే వివాదానికి కారణమైంది. పాకిస్తాన్ దేశంలో అమెరికా రాయబారిగా ఉన్న డోనాల్డ్ బ్లోమ్ పీఓకేలో పర్యటించారు. గిల్గిత్ బాల్టిస్తాన్ లో యూఎస్ బృందం పర్యటించడాన్ని భారత్ తప్పుపట్టింది. కాగా ఈ వివాదంపై భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి స్పందించారు. పాకిస్తాన్ లోని అమెరికా రాయబారి గురించి నేను స్పందించలేదు.. కానీ దీని కన్నా ముందు జీ20 సమయంలో జమ్మూ కాశ్మీర్ సందర్శించిన అమెరికా బృందంలో ఉన్నాడని అన్నారు. డొనాల్డ్ బ్లోమ్ ఆరు రోజులు గిల్గిత్ బాల్టిస్తాన్ లో పర్యటించారు. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలి, అమెరికాతో సమా మూడో పక్షం ఈ సమస్యలో కలుగజేసుకోదని గార్సెట్టి అన్నారు.
చరిత్ర సృష్టించిన భారత్.. 41 ఏళ్ల తర్వాత ఆ విభాగంలో స్వర్ణం
ఆసియా క్రీడల్లో భారత్ మరో బంగారు పతకాన్ని సాధించింది. ఈక్వస్ట్రియన్(గుర్రపు స్వారీ) విభాగంలో బంగారు పతకం సాధించిన భారత్.. 41 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో స్వర్ణం సాధించడం గమనార్హం. 1982 తర్వాత ఆసియా క్రీడల్లో భారత్ తొలిసారిగా ఈక్వెస్ట్రియన్‌లో బంగారు పతకం సాధించింది. టీమ్ డ్రస్సేజ్ ఈవెంట్‌లో భారత జట్టు మొత్తం 209.205 స్కోరుతో అగ్రస్థానంలో ఉండగా, చైనా 204.882తో రజతంతో ముగించగా, హాంకాంగ్ 204.852తో 3వ స్థానంలో నిలిచింది. సుదీప్తి హజెలా (చిన్స్కీ – గుర్రం పేరు), హృదయ్ విపుల్ ఛేడా (కెమ్‌క్స్‌ప్రో ఎమరాల్డ్), అనుష్ అగర్వాలా (ఎట్రో), దివ్యకృతి సింగ్ (అడ్రినాలిన్ ఫిర్‌ఫోడ్)లతో కూడిన భారత బృందం ఈక్వెస్ట్రియన్‌లో డ్రస్సేజ్ ఈవెంట్‌లో భారతదేశానికి మొదటి బంగారు పతకాన్ని సాధించి చరిత్రను లిఖించింది. డ్రెస్సేజ్ టీమ్ ఈవెంట్‌లో జట్టు మొత్తం స్కోర్ కోసం టాప్ 3 పెర్ఫార్మర్స్ స్కోర్ మాత్రమే పరిగణించబడుతుంది. అనూష్ అగర్వాలా స్కోరు 71.088 సంచలన ప్రదర్శన చేసి చివరిగా వెళ్లి భారత్ పతక ఆశలను పెంచాడు. ఆసియా క్రీడల్లో ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌కు ఇది నాల్గవ స్వర్ణం కాగా.. ఈవెంట్ వారీగా వారి 13వ పతకం. ఈక్వెస్ట్రియన్‌లో భారతదేశం సాధించిన 3 బంగారు పతకాలు 1982 ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో వచ్చాయి.
కపిల్ దేవ్ కిడ్నాప్.. అసలు కారణం ఇదే
స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్ కిడ్నాప్ అంటూ రెండు రోజులుగా ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారిన విషయం తెల్సిందే. ఇద్దరు వ్యక్తులు.. కపిల్ దేవ్ చేతులు, నోరు కట్టేసి.. ఆయనను లోపలి తీసుకెళ్తుండగా.. కపిల్ వెనక్కి తిరుగుతూ బయపడతు కనిపించాడు. ఇక ఈ వీడియోను మరో క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆ వీడియోను షేర్ చేస్తూ.. ఈ వీడియో మీ వరకు వచ్చిందా.. ? ఇందులో ఉన్నది కపిల్ దేవ్ కాకూడదు.. ఆయన బాగానే ఉన్నారని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో కపిల్ కు ఏమైందో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కపిల్ కిడ్నాప్ వెనుక ఉన్న అసలు కథ బయటపడింది. ఆ వీడియోలో ఉన్నది కపిల్ దేవ్ అని కన్ఫర్మ్ అయ్యింది. ఇదంతా ఒక యాడ్ షూట్ కోసం జరిగిన షూట్. అక్టోబరు 5 నుంచి భారత్ లో ఐసీసీ వరల్డ్ కప్ జరగనున్న విషయం తెల్సిందే. దానికోసమే కపిల్ ఒక యాడ్ చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఐసీసీ వరల్డ్ కప్ లైవ్ వస్తుంది అని చెప్పడానికి ఈ యాడ్ ను షూట్ చేశారు. క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యిందంటే కరెంట్ కోతలు .. అంతరాయాలు వలన క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. అలాంటి అడ్డంకులు ఏమి లేకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో హ్యాపీ గా చూడొచ్చు అని ఈ యాడ్ ద్వారా.తెలిపారు అసలు ఈ వీడియోలో ఏముందంటే.. కొంతమంది గ్రామస్థులు కపిల్ దేవ్ ను కిడ్నాప్ చేసి తీసుకొస్తారు. ఇక ఆ విషయం తెలియడంతో పోలీసులు ఒక ఇంటిని చుట్టూ ముడతారు. ఇక పోలీసులు ఒక మైక్ లో కపిల్ ను ఎందుకు కిడ్నాప్ చేశారు అని అడగ్గా.. వరల్డ్ కప్ వేళ కరెంటు కోతలు లేకుండా మ్యాచ్ లు ప్రసారం చేస్తామని హామీ ఇస్తే కపిల్ ను వదిలిపెడతామని కిడ్నాపర్లు బదులిస్తారు. ఇక పోలీస్ .. అవన్నీ ఇకనుంచి ఉండవు డిస్నీ ప్లస్ లో ఫ్రీగా క్రికెట్ మ్యాచ్ చూడొచ్చు.. డేటా సేవర్ మోడ్ లో పెట్టుకొని క్రికెట్ మ్యాచ్ పూర్తిగా చూడొచ్చు అని చెప్పడంతో కపిల్ ను రిలీజ్ చేస్తారు. దీంతో యాడ్ పూర్తవుతుంది. ఇక దీంతో కపిల్ కిడ్నాప్ వెనుక ఉన్న అసలు కథ ఇది అని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
స్టార్ హీరో నన్ను వేధించాడు.. ఆ ఇండస్ట్రీ వలన ఎన్నో ఇబ్బందులు పడ్డా
టాలెంటెడ్ నటి నిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా మొదలైంది సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది నిత్యా. మొదటి సినిమాతో భారీ హిట్ ను అందుకొని వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. గ్లామర్, అందాల ఆరబోత లేకుండా స్టార్లు అవలేరని అనుకుంటున్నా జనరేషన్ లో అవేమి లేకుండానే.. స్టార్ హీరోయిన్ గా ఎదిగి అందరి మన్ననలు పొందింది. ఇక తెలుగు లోనే కాకుండా తమిళ్ లో కూడా మంచి మంచి సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్న నిత్యా.. ప్రస్తుతం కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ లో నటించింది. గోమతేష్ ఉపాధ్యాయే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ సెప్టెంబర్ 28 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సిరీస్ ను స్వప్న సినిమాస్ బ్యానర్ పై స్వప్న దత్ నిర్మించడం విశేషం. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం.. వరుస ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిత్యామీనన్ .. కోలీవుడ్ హీరో తనను వేధించాడని చెప్పడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ” కోలీవుడ్ స్టార్ హీరో నన్ను వేధించాడు.. తమిళ్ ఇండస్ట్రీ వలన నేను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను” అని చెప్పింది. దీంతో నిత్యాను వేధించిన ఆ హీరో ఎవరు అంటూ అభిమానులు ఆరాలు తీసుకున్నారు. విజయ్, ధనుష్, సూర్య, రాఘవ లారెన్స్, విక్రమ్ తో నిత్యా నటించింది. మరి ఇందులో ఏ హీరో గురించి నిత్యా ఇలాంటి వ్యాఖ్యలు చేసిందో అనేది తెలియాల్సి ఉంది.
నా ప్రాపర్టీ అంటావా… మళ్లీ ప్రశాంత్ పై రెచ్చిపోయిన రతిక
బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పటికే మూడు వారాలు కంప్లీట్ చేసుకుని తాజాగా నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. గతవారం నామినేషన్ల ప్రక్రియ చప్పగా సాగగా నాగార్జున సైతం అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని క్లాస్ పీకారు. దీంతో ఈ వారం నామినేషన్ల ప్రక్రియ హీట్ ఎక్కించేలా ఉందని అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 కు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా ఇక ఆ ప్రోమో గమనిస్తే ముందుగా పల్లవి ప్రశాంత్… గౌతమ్ ను నామినేట్ చేస్తూ శోభా శెట్టితో గొడవ పడినప్పుడు గౌతమ్ షర్ట్ విప్పి తిరగడం నచ్చలేదని చెప్పుకొచ్చాడు. దానికి గౌతమ్ రతిక వన్ పీస్ డ్రెస్ వేసుకుని వచ్చినప్పుడు ఏంటి ఈ పొట్టి పొట్టి బట్టలు అన్నావా లేదా అని గుర్తు చేశాడు. నేను ఆమెకు దొస్తానాలో చెప్పినా… అంటూ పల్లవి ప్రశాంత్ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తే అసలు నేను ఎట్లా బట్టలు వేసుకుంటే నీకెందుకు అని రతిక అంటుంది. దానికి ప్రశాంత్ నా దగ్గరకు వచ్చి ఇట్లా ఇట్లా ఎందుకు అన్నావ్ అని అడిగితే దానికి రెచ్చిపోయిన రతిక… నోటికి ఏది వస్తే అది వాడకు అని అంటూనే నా ప్రాపర్టీ అనే వర్డ్ ఎట్లా యూజ్ చేస్తావ్ అని రతిక ఫైర్ అవుతున్నట్టు కనిపిస్తోంది. మజాక్ లో అన్న అని ఆయన ఆటే మజాక్ లో ఎట్లా అంటావ్ అని రతిక ప్రశాంత్ పై విరుచుకుపడుతున్నట్టు కనిపిస్తోంది. మొత్తం మీద ఈరోజు ఎపిసోడ్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండేలా కనిపిస్తోంది.
