పొత్తులపై క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఇలా స్పందించిన ఏపీ బీజేపీ
పవన్ కల్యాణ్ ప్రకటన తర్వాత.. టీడీపీ-జనసేనతో బీజేపీ కలిసి వస్తుందా? అనే చర్చ సాగుతోన్న తరుణంలో.. కీలక ప్రకటన చేసింది ఏపీ బీజేపీ. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీతో బీజేపీ పొత్తు కొనసాగుతోందని.. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని గతంలోనే పవన్ కల్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. కానీ, పొత్తుల అంశం బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని స్పష్టం చేసింది.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా? అనేదానిపై కేంద్ర నాయకత్వం స్పష్టత ఇస్తుందని పేర్కొంది ఏపీ బీజేపీ.. పొత్తులను ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నిర్ణయిస్తారని క్లారిటీ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ సమితి.
ప్యాకేజీ స్టార్ అనేది నిజమైంది.. కాపులను తలదించుకునేలా చేస్తుంది..!
టీడీపీ-జనసేన పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు.. ఇక, పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. చంద్రబాబుతో కలసి వెళ్తాననంటున్న పవన్‌కు దీని పర్యవసానం త్వరలోనే చూస్తారని హెచ్చరించారు. పవన్ ప్రకటనతో ప్యాకేజీ స్టార్ అని చెప్తున్న విషయం నిజమైందన్న ఆయన.. పవన్ కల్యాణ్‌ను ప్రజల్లో, సమాజంలో.. డబ్బు కోసం ప్యాకేజీ కోసం పనిచేసే వ్యక్తిగా ప్రచారం చేసింది చంద్రబాబు కాదా..? అని ప్రశ్నించారు. కాపు నాయకులు వంగవీటి రంగాను చంపింది చంద్రబాబు కాదా.. ముద్రగడ కుటుంబాన్ని అవమానించింది చంద్రబాబు కాదా..? చిరంజీవిని అవమానించింది చంద్రబాబు కాదా..? కాపులకు ఇంత ద్రోహం చేసిన వ్యక్తితో కలవడం ఏంటని కాపు సామాజిక వర్గం మొత్తం లబోదిబోమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం కాపులను తలదించుకునేలా చేస్తుందన్నారు మంత్రి కొట్టు.. కాపు వ్యతిరేకి చంద్రబాబు మద్దతు ఇవ్వడం, తగిన మూల్యం నువ్వు చెల్లించుకోవడమే అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు.. ఇక, పవన్ కల్యాణ్ ఉంటే షూటింగ్ లో.. లేకపోతే చంద్రబాబు కాళ్ల దగ్గర ఉంటాడు.. సంతోషంగా ఉన్న ప్రజలను కష్టాలు పడాలని పవన్ కల్యాణ్ చూస్తున్నారని ఆరోపించారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఆయన తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులే.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల దోపిడీలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు అంటూ ఆయన ఆరోపించారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు, మహిళలకు పెద్దపీట వేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి కుటుంబంలో ఇద్దరికీ పెన్షన్ ఇస్తాం.. కౌలు రైతులను ఆదుకుంటాం.. బూత్ స్థాయిలో కార్యకర్తలు సైనికుడిలా పని చేయాలి అని ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరు తప్పించుకునే పరిస్థితి లేదని ఈటెల రాజేందర్ అన్నారు. ఎంతటి వారైన శిక్ష అనుభవించక తప్పదని ఆయన చెప్పుకొచ్చారు. తాత్కాలికంగా కొందరు ఆఫీసర్లతో తప్పించుకునేందుకు ప్రయత్నిం చేస్తున్నారు అంటూ ఈటెల విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులకు ప్రభుత్వ సంస్థలే తగిన శిక్ష వేస్తాయని పేర్కొన్నారు.
హిందీ భారతదేశాన్ని ఏకం చేస్తుందని చెప్పడం అసంబద్ధం
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఉదయనిధిని టార్గెట్ చేస్తూ.. బీజేపీ విమర్శలు చేస్తోంది. అయితే తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హిందీ దివాస్ ప్రసంగంపై విమర్శలు గుప్పించారు. నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే భాష దేశాన్ని ఏకం చేయదని అన్నారు. గురువారం ‘హిందీ దివస్’ సందర్భంగా అమిత్ షా ఓ ప్రసంగంలో మాట్లాడుతూ.. హిందీ భారతదేశంలోని భాషల వైవిధ్యాన్ని ఏకం చేస్తుందని తెలిపారు. హిందీ ఎప్పుడూ ఏ ఇతర భారతీయ భాషతోనూ పోటీపడలేదని, అన్ని భాషలను బలోపేతం చేయడం ద్వారానే బలమైన దేశం ఆవిర్భవించదని అమిత్ షా అన్నారు. అమిత్ షా వ్యాఖ్యను విమర్శిస్తూ.. ఉదయనిధి స్టాలిన్ ‘X'(ట్విట్టర్) లో తమిళంలో ఒక పోస్ట్‌లో ఇలా రాశారు. ‘హిందీ దేశ ప్రజలను ఏకం చేస్తుంది – ప్రాంతీయ భాషలకు అధికారం ఇస్తుంది’ అని కేంద్ర మంత్రి అమిత్ షా ఎప్పటిలాగే.. హిందీ భాషపై తన ప్రేమను కురిపించారు. ఆలోచన అనేది హిందీ చదివితే పురోగమించవచ్చని అరవడానికి ప్రత్యామ్నాయ రూపం. అని రాసుకొచ్చారు. హిందీ మాత్రమే గొప్పదనే భావజాలం నుంచి బీజేపీ బయటపడాలని అన్నారు. హిందీ చదివితేనే అభివృద్ధి చెందొచ్చు అనే అర్థం వచ్చేలా మాట్లాడడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. తమిళనాడులో తమిళం, కేరళలో మలయాళం మాట్లాడుతారని.. హిందీ ఈ రెండు రాష్ట్రాలను ఎక్కడ కలుపుతుంది.. సాధికారత ఎక్కడ వస్తుందని ప్రశ్నించారు. నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే హిందీ.. యావత్ దేశాన్ని ఏకం చేస్తుందని అనడం విడ్డూరంగా ఉందని ఉదయనిధి అన్నారు. ‘అమిత్ షా హిందీ కాకుండా ఇతర భాషలను ప్రాంతీయ భాషలుగా కించపరచడం మానేయాలి’ అంటూ #StopHindiImpositionతో పోస్ట్ చేశారు.
భూమికి దగ్గరగా రానున్న తోకచుక్క..మళ్లీ 2455లో దర్శనం.. ఇండియాలో కనిపిస్తుందా..?
మరికొన్ని రోజుల్లో భూమికి దగ్గరగా తోకచుక్క రాబోతోంది. ప్రతీ 400 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ తోకచుక్క భూమికి దగ్గరగా వస్తుంది. నిషిమురా అనే తోచచుక్క ఈ ఏడాది కనిపిస్తే మళ్లీ 2455లో దర్శనమిస్తుంది. చివరిసారిగి ఇది జూలై 1588లో కనిపించింది. ఈ నిషిమురా అనే తోకచుక్క 432 ఏళ్ల కక్ష్య కాలాన్ని కలిగి ఉంది. ఇది సుదూరంగా ఉండే ఊర్ట్ క్లౌడ్ నుంచి ఉద్భవించింది. ఈ ఉర్ట్ క్లౌడ్ సౌర కుటుంబంలో అన్ని గ్రహాల తర్వాత ఉండే ప్రాంతం. ఈ తోకచుక్క భూమికి దాదాపుగా 126 మిలియన్ కిలోమీటర్ల నుంచి వెళ్తుంది. జపనీస్ ఖగోళ ఔత్సాహికుడు హిడియో నిషిమురా ఆగస్టు 12న దీన్ని కనుగొన్నాడు. అందుకే దీనికి నిషిమురా అనే పేరు పెట్టారు. దీన్ని C/2023 P1 అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఇది ఇన్నర్ సోలార్ సిస్టమ్ నుంచి వెళ్తోంది. సూర్యుడి చుట్టూ తిరుగుతూ, భూమికి దగ్గరగా వస్తోంది. సెప్టెంబర్ 12న ఈ తోకచుక్క భూమికి 126 మిలియన్ల దూరంలో ఉంది. సూర్యుడి కాంతికి 15 డిగ్రీల కోణంలో కనిపించింది. రాబోయే కొద్ది రోజుల్లో ఇది సూర్యుడికి మరింత దగ్గర వస్తూ.. సెప్టెంబర్ 12న దాని పెరిహెలియన్(సూర్యుడికి దగ్గరగా ఉండే స్థానం) పాయింటుకు చేరుకుంటుంది. అయితే సూర్యుడికి దగ్గర ఉండటం వల్ల ఇది రాత్రి సమయంలో కనిపించదు. నెమ్మదిగా సూర్యుడి నుంచి దూరం జరిగే కొద్ది సెప్టెంబర్ మూడవ వారం నుంచి రాత్రి ఆకాశంలో మళ్లీ కనిపిస్తుంది.
కొలంబోలో భారీ వర్షం.. శ్రీలంక-పాకిస్తాన్ మ్యాచ్ మరింత ఆలస్యం..!
శ్రీలంక రాజధాని కొలంబోలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో శ్రీలంక-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన కీలకమైన సూపర్-4 మ్యాచ్ మరింత ఆలస్యం కానుంది. ఆసియా కప్ 2023లో భాగంగా.. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగాల్సి ఉండగా.. ఇంకా టాస్ కూడా వేయలేదు. అయితే ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైతే.. శ్రీలంక ఫైనల్ కు చేరుకుని నవంబర్ 17న ఇదే స్టేడియంలో భారత్‌తో తలపడనుంది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ టీమ్ కు టెన్షన్ గా మారింది. శ్రీలంకలో ఇప్పటివరకు జరిగిన ఆసియా కప్ 2023 మ్యాచ్‌లలో.. ప్రతికూల వాతావరణం కారణంగా చాలా మ్యాచ్‌లకు అంతరాయం ఏర్పడింది. భారత్‌పై ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు ఈ మ్యాచ్ డూ ఆర్ డై అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు 5 మార్పులతో బరిలోకి దిగుతుందని కెప్టెన్ బాబర్ అజం చెప్పారు. మరోవైపు పాకిస్థాన్ నెట్ రన్ రేట్ శ్రీలంక కంటే తక్కువగా ఉంది. అందువల్ల ఈ మ్యాచ్ రద్దు అయితే పాకిస్తాన్ ఫైనల్ చేరుకోలేదు.
వీళ్ళందరూ బపూన్స్ .. ఆట ఆడడం చేతకాక ఈగో చూపిస్తున్న రతిక
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకు ఆసక్తిని పెంచేస్తుంది. ముందు ఉన్న ఆరు సీజన్లు ఒక ఎత్తు అయితే .. ఈ ఒక్క సీజన్ మరో ఎత్తు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నాగార్జున ముందు చెప్పినట్లుగానే ఈ సీజన్ అంతా ఉల్టా ఫుల్టా గా మారింది. మొదటి రోజు నుంచి కూడా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇక టాస్క్ ల విషయంలో కూడా ఒక్క్కొక్కరు ఒక్కో స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు. నిన్నటికి నిన్న మాయ అస్త్రాన్ని సంపాదించడానికి పెట్టిన గేమ్ లో రణధీర టీమ్ ఫిజికల్ గా ఫైట్ చేసి గెలిస్తే .. మహాబలి టీమ్ ఆడలేక , గెలవలేక .. అస్త్రాలను దొంగతనం చేసి అదొక స్ట్రాటజీగా చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా పర్మిషన్ లేని సంచాలకుడు అయిన సందీప్ రూమ్ లోకి వెళ్లి పవర్ అస్త్రను దొంగతనం చేయడమే కాకుండా .. తమకేమి తెలియదు అన్నట్లు మహాబలి టీమ్ నటించిన నటన మహానటులనే మించిపోయేలా చేసింది. ఇక మహాబలి టీమ్ లో ఉన్న రతిక తన ఈగోతో హౌస్ లో లేనిపోని గొడవలకు కారణమయ్యింది. పవర్ అస్త్ర కోసం జరిగిన గేమ్ లో మహాబలి టీమ్ లో ప్రతి ఒక్కరు.. రణధీర్ టీమ్ లో ఉన్న వారికి మాయ అస్త్ర మరొకరికి ఇవ్వాలంటూ.. దానికి కారణాలు చెప్పాలి అని బిగ్ బాస్ చెప్పగా .. రతిక చివర్లో వెళతాను అని చెప్పడం .. దానికి టీమ్ వద్దు అనడంతో ఆమె ఈగో హార్ట్ అయ్యింది. దీంతో ఫైర్ అయిన రతిక సొంత టీమ్ నే బపూన్స్ అని నోరు జారింది. ఈ టీమ్ చెండాలం గా ఉంది.. ఈ టీమ్ లో ఉన్నవారందరూ బపూన్స్ అని తిట్టిపోసింది.
కళ్యాణ్ బాబు.. ఎక్కడా తగ్గడం లేదుగా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాలను షేక్ చేస్తోంది. ముఖ్యంగా ఏపీలో పవన్ పేరు మారుమ్రోగిపోతుంది. ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ .. ఇప్పటివరకు జనసేన పార్టీతోనే ముందుకు కొనసాగుతున్నాడు. ఇక చాలా గ్యాప్ తరువాత ఎట్టకేలకు ఈరోజు పొత్తులపై ఓపెన్ అయ్యాడు. ఎప్పటినుంచో జనసేన- టీడీపీ పొత్తు ఉంటుందని వార్తలు వచ్చాయి .. జనసేన కలిస్తే టీడీపీ సంతోషంగా ఆహ్వానిస్తుందని చంద్రబాబు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటివరకు పవన్ పొత్తుల గురించి అధికారికంగా చెప్పింది లేదు. గత మూడు రోజుల క్రితం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యాడు. ఇక నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు బాలకృష్ణ, నారా లోకేష్ కలిసి.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును కలిశారు. ఇక అక్కడే ప్రెస్ మీట్ పెట్టి పవన్ పొత్తుల మీద క్లారిటీ ఇచ్చాడు.. ఏపీలో అరాచక పాలన సాగుతోందని, అందులో భాగమే చంద్రబాబు గారి అరెస్ట్ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి వెళ్తాయని, అందుకు ఈరోజే తాను నిర్ణయం తీసుకున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇక ప్రస్తుతం పవన్ నిర్ణయం కొంతమందికి నచ్చింది.. మరికొంతమందికి నచ్చలేదు. ఇవన్నీ పక్కన పెడితే .. రాజకీయాల వలన సినిమాలకు గ్యాప్ రావడం .. షూటింగ్ ఆగిపోవడం.. నిర్మాతలు నష్టాలపాలవ్వడం కూడా చూశారు. అయితే ఈసారి అలాంటివేమీ కాకుండా ఒకపక్క రాజకీయాలు చేస్తూనే.. ఇంకోపక్క సినిమాలు చేసేస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నిన్ననే కొత్త షెడ్యూల్ మొదలుపెట్టింది. దీన్నీ వెంటనే పూర్తిచేసి .. మిగతా సినిమాలను కూడా ఫినిష్ చేయాలనీ పవన్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తరువాత డైరెక్ట్ గా పవన్ సెట్ కు వెళ్లనున్నాడని సమాచారం. దీంతో పవన్ ను చూసిన వారందరు.. కళ్యాణ్ బాబు.. ఎక్కడా తగ్గడం లేదుగా అంటూ చెప్పుకొస్తున్నారు. మరి పవన్ సినిమాల్లో విజయాన్ని అందుకున్నట్లు.. రాజకీయాల్లో కూడా విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.
సినిమాలకు బ్రేక్ తీసుకున్న అలియా.. రోజూ ఏం చేస్తుందో చూశారా?
ప్రస్తుతం బాలివుడ్ బ్యూటీ అలియా భట్ తన భర్త రణబీర్ కపూర్ మరియు కుమార్తె రాహాతో కలిసి న్యూయార్క్‌లో ఉంది. కుటుంబ సమేతంగా అభిమానులు డిన్నర్ చేయడాన్ని గమనించారు.. ఈ జంట US ఓపెన్‌కు కూడా హాజరయ్యారు. ఇప్పుడు, ఆలియా తన షెడ్యూల్‌ను ఆఫ్ డేలో చూడటానికి సోషల్ మీడియాకు తీసుకువెళ్లింది… ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ తీసుకున్న రోజూ తాను ఎం చేస్తుందో వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ వీడియో వైరల్ అవుతుంది.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో అలియా స్విమ్మింగ్ పూల్ లో ఉంది.. ఆమె తన తలని తన చేతులపై ఉంచి, నేలపై ముడుచుకున్నట్లుగా, పూల్ దగ్గర ఉన్న తన వీడియోను పోస్ట్ చేసింది. వీడియోలోని టెక్స్ట్, ‘నా సెలవు రోజున నా షెడ్యూల్’ అని ఉంది. మరుసటి క్షణం, ఆమె తన వీపుపై నీటిలో తేలియాడుతూ కనిపించింది ‘అంతే. అదే నా షెడ్యూల్’ అనే వీడియో బయటకు వచ్చింది. ఆమె స్లీపింగ్ ఎమోజీతో ‘DND’ అని పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది. ఆలియా వీడియోలో ప్రకాశవంతమైన పింక్ స్విమ్‌సూట్‌ను ధరించి తన జుట్టును బన్‌లో కట్టుకుంది. మేకప్ లేకుండా కూడా అలియా చాలా అందంగా కనిపించింది.. అభిమానులు ఆమె నా సమయాన్ని జరుపుకుంటే, అర్జున్ కపూర్ తన జీవితంలో కూడా అదే కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశాడు.
