టీడీపీ-జనసేన జేఏసీ కీలక తీర్మానం.
టీడీపీ – జనసేన జేఏసీ సమావేశం ముగిసింది.. ఇక నుంచి ప్రతి 15 రోజులకోసారి జేఏసీ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.. వచ్చే జేఏసీ సమావేశం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు.. ఈ నెల 14, 15, 16 తేదీల్లో నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు ఉంటాయని.. ఉమ్మడి మేనిఫెస్టోను త్వరలోనే ఖరారు చేస్తాం.. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై రెండు పార్టీల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేస్తామని.. ఈ నెల 13వ తేదీన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ భేటీ కానుందని చెబుతున్నారు.. ఇక, టీడీపీ – జనసేన జేఏసీ సమావేశంలో కరవు, రైతుల ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు.. ఏపీలోని కరవు పరిస్థితులపై జేఏసీ సమావేశంలో తీర్మానం చేశారు.. కరవు పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నా దేవుడి దయతో అంతా బాగుందని రాష్ట్ర పాలకుడు చెప్పడం పచ్చి అబద్ధమే. ఖరీఫ్ సమయంలో 32.42 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోవడమనేది వాస్తవం. 25 లక్షల ఎకరాలలో సాగు కూడా చేయలేదు. ప్రకృతి వైపరీత్యం వల్ల నెలకొన్న కరవుతోపాటు పాలకపక్షం నిర్లక్ష్య ధోరణులతోనూ రైతాంగం నష్టపోయిందని తీర్మానంలో పేర్కొంది టీడీపీ-జనసేన జేఏసీ.. సకాలంలో సాగు నీరు కూడా ఇవ్వకపోవడంతో పశ్చిమ కృష్ణా డెల్టా ప్రాంతంలో పంటలు దెబ్బ తిన్నాయి. సాగు నీటి విడుదలలో, కాలువల నిర్వహణలో అధికార యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా ఉంది. ఈ దుర్భర పరిస్థితుల్లో కరవు మండలాలు గుర్తించి ప్రకటించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. నిబంధనల మేరకు కరవును లెక్కిస్తే 449 మండలాలను ప్రకటించాల్సి ఉంది. కేవలం 103 మండలాలనే కరవు మండలాలుగా గుర్తించడం రైతులను మోసగించడమే అని దుయ్యబట్టారు.
ఇండిపెండెంట్‌గా బరిలోకి మాజీ సీఎం కుమారుడు.. రేపు జలగం నామినేషన్
మరోసారి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధం అయ్యారు జలగం వెంకటరావు.. ఈ సారి ఇండిపెండెంట్‌గానే తన అదృష్ట్యాన్ని పరీక్షించుకోనున్నారు.. రేపు నామినేషన్ దాఖలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న జలగం వెంకటరావు.. ఆ దిశగా ఏర్పాట్లలో మునిగిపోయారు.. మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి జలగం వెంగళరావు చిన్న కుమారుడే ఈ జలగం వెంకటరావు.. రేపు నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్న ఆయన.. ఇప్పటికే హైదరాబాద్ నుంచి కొత్తగూడెం బయల్దేరినట్టు తెలుస్తోంది..
ఎన్నికల్లో పోటీపై మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు
సార్వత్రిక ఎన్నికలతో పాటు వచ్చే ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. అయితే, ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి.. ఓ వైపు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస కార్యక్రమాలు నిర్వహిస్తుండా.. మరోవైపు.. టీడీపీ-జనసేన ఏకమై కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి.. ఇక, బీజేపీ-జనసేన పొత్తు వ్యవహారం తేలాల్సి ఉంది. ఇదే సమయంలో.. సీట్ల విషయంలో ఎవరి అంచనాలు వాళ్లకు ఉన్నాయి.. కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలే కాకుండా.. ప్రత్యామ్నాయంగా ఉన్న నేతలు కూడా వర్క్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. వచ్చే ఎన్నికల్లో పోటీపై మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో పోటీపై స్పందిచిన మంత్రి జోగి రమేష్.. తాను ఎంపీగా కాదు.. వచ్చే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని ప్రకటించారు.. అది కూడా మళ్లీ పెడన అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తాను.. గెలుస్తాను అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, ఎన్నికల ముందు చాలా మంది వస్తారు.. ఏవేవో మాట్లాడుతుంటారు.. ఆ మాటలను ప్రజలు, మా నాయకులు పట్టించుకోరు అని స్పష్టం చేశారు మంత్రి జోగి రమేష్.
నామినేషన్లకు రేపే చివరి తేదీ అయిన సింబల్ ఇవ్వడం లేదు
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కలిశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. పార్టీ గుర్తు కేటాయించకుండా అధికారులు వేధిస్తున్నారన్నారు. సెప్టెంబర్ లోనే అన్ని డాక్యుమెంట్లు ఇచ్చిన ఇంతవరకు గుర్తు కేటాయించలేదని, పార్టీ యాక్టివ్ గా ఉన్న యాక్టివ్ గా లేదని చెప్తున్నారన్నారు. ఎన్నికల సంఘాన్ని కేసీఆర్ నడుపుతున్నారో, ఎన్నికల కమిషనర్ నడుపుతున్నాడో అర్థం కావడంలేదని ఆయన వ్యాఖ్యానించారు. పోటీ చేయని వైఎస్సార్ తెలంగాణ పార్టీ కి కూడా గుర్తు కేటాయించారు కానీ మాకు కేటాయించడం లేదన్నారు. తెలుగు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సర్వేలు స్పష్టంగా చెప్తున్నాయని, నామినేషన్లకు రేపే చివరి తేదీ అయిన సింబల్ ఇవ్వడం లేదన్నారు. మా పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వెళ్తే సింబల్ ఏంటి అని అడుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘నాకు ఎందుకు ఇంతలా నరకం చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. సింబల్ కోసం నిరాహారదీక్ష చెయ్యాలా? హెలికాప్టర్, రింగ్ గుర్తుల్లో ఏది కేటాయించారో చెప్పడం లేదు. ఆరు నెలలుగా ఇస్తున్నామని చెప్తున్నారు తప్ప కేటాయించడం లేదు. చట్టాలు మారాలంటే నాలాంటి వాడు ఎంపీ అవ్వాలి. నా పోరాటంతోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపేసాను. ప్రజా శాంతి పార్టీకి గుర్తు వెంటనే కేటాయించి, నామినేషన్లకు మరో రెండు రోజులు సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. ప్రజా శాంతి పార్టీ కి సింబల్ ఎందుకు ఇవ్వడం లేదో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. తెలంగాణ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు, ప్రచారం చేసేందుకు సమయం కేటాయించాలనే నేను పోటీకి దూరంగా ఉన్నా. గొర్రెలు కసాయి వారిని నమ్మినట్లే ప్రజలు అవినీతిపరులను ఎన్నుకుంటున్నారు.’ అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.
బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు..?
నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్ల పై ఐటీ దాడులు దేనికి సంకేతమని ప్రశ్నించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!? అని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ – కేడీ బెంబేలెత్తుతున్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇది. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయమన్నారు రేవంత్ రెడ్డి.. ఇవాళ పాలకుర్తి ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘పాలకుర్తి గడ్డకు ఒక చరిత్ర ఉంది.. పోరాట పటిమ ఉంది.. మిమ్మల్ని చూస్తుంటే దొరల గడీలను బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తోంది. ఒకనాడు డీలర్ గా ఉన్న దయాకర్ రావు ఇప్పుడు డాలర్ దయాకర్ రావు అయిండు. ఎర్రబెల్లి దయాకర్ రావు దందాలు చేస్తే… ఝాన్సీ రెడ్డి కుటుంబం పేదలకు సేవలు చేశారు. మీకు సేవచేసేందుకు కాలేజీలు, ఆసపత్రుల కోసం 80 ఎకరాల భూమి కొంటే దయాకర్ రావు లిటిగేషన్లు పెట్టి ఇబ్బందులు పెట్టిండు. ఝాన్సీ రెడ్డికి పౌరసత్వం రాకుండా అడ్డుకున్నాడు… దయాకర్ రావు నమ్మక ద్రోహి… మిత్ర ద్రోహి.. శత్రువులతో చేతులు కలిపి, కుట్రలు చేసి నన్ను జైలుకు పంపిండు… కాంగ్రెస్ కార్యకర్తలపై దయాకర్ రావు పెట్టిన అక్రమ కేసులను ఒక్క కలం పోటుతో తొలగిస్తాం. ఈ ఎన్నికల్లో పాలకుర్తిలో ఈ దొరను… తెలంగాణలో ఆ దొరను ప్రజలు ఈ బొంద పెట్టడం ఖాయం.
జాగింగ్ చేస్తుండగా గుండెపోటు.. సీఈఓ ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌వాచ్
టెక్నాలజీని సరైన విధంగా ఉపయోగిస్తే మానవాళికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. మరోవైపు సక్రమంగా వినియోగించకుంటే ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. అయితే టెక్నాలజీ ఓ వ్యక్తి ప్రాణాలను నిలబెట్టింది. గుండె పోటుతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని స్మార్ట్‌వాచ్ కాపాడిన ఘటన యూకేలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే యూకేకి చెందిన 42 ఏళ్ల వ్యక్తి జాగింగ్ వెళ్తున్న సమయంలో గుండె పోటుకు గురయ్యారు. హకీ వేల్స్ సీఈఓ అయిన పాల్ వామప్, స్వాన్సీలోని మోరిస్టన్ ప్రాంతంలో తన ఇంటి నుంచి ఉదయం జాగింగ్ కోసం వెళ్లారు. ఆ సమయంలో తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడ్డాడు. ప్రమాదకర పరిస్థితుల్లో తన చేతికి ఉన్న స్మార్ట్‌వాచ్ ద్వారా తన భార్యతో సంభాషించగలిగాడు. వెంటనే స్పందించడంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాణాలతో బయటపడ్డాడు. ‘‘ నేను మామూలుగా ఉదయం 7 గంటలకు జాగింగ్ కోసం బయటకు వెళ్లారు. ఐదు నిమిషాల తర్వాత ఛాతిలో విపరీతమైన నొప్పి వచ్చింది. నా ఛాతి పట్టేసినట్లు అయింది. విపరీతమైన నొప్పితో బాధపడుతూనే.. నా భార్య లారాకు ఫోన్ చేయడానికి స్మార్ట్‌వాచ్‌ని ఉపయోగించాను. అదృష్టవశాత్తు ఇంటికి 5 నిమిషాల దూరంలో ఉండటంతో, ఆమె నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగలిగింది. పారామెడిక్స్ వచ్చి ట్రీట్మెంట్ చేశారు’’ అని ఆయన వెల్లడించారు.
50 నుంచి 65 శాతానికి రిజర్వేషన్లు.. బిల్లును ఆమోదించిన అసెంబ్లీ..
సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ సర్కార్ కీలక రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బీహార్‌లోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుదల కోరుతూ రూపొందించిన ‘రిజర్వేషన్ సవరణ బిల్లు’ను ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్రంలోని ఇతర వెనకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోటాను పెంచే బిల్లుకు మంగళవారం బీహార్ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ రోజు సీఎం నితీష్ కుమార్ హాజరు కాకుండానే రాష్ట్ర అసెంబ్లీ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటాను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతుంది. ఆర్థికంగా వెనబడిన వర్గాల కోటా(ఈడబ్ల్యూఎస్) కోసం కేంద్రం 10 శాతం కోటాను కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి పెరుగుతాయి. ఈ బిల్లు ప్రకారం చూసుకుంటే.. ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 2 శాతం, ఓబీసీ, బీసీలకు కలిపి 43 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం బీహార్ రాష్ట్ర ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో ఈబీసీలకు 18, ఓబీసీలకు 12 శాతం, ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 1 శాతం, వెనకబడిన తరగతుల మహిళలకు 3 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే రిజర్వేషన్ల విభజన బిల్లులో ఈడబ్ల్యూఎస్‌ని ప్రస్తావించకపోవడంపై బీజేపీ విమర్శిస్తోంది.
ఈ వరల్డ్ కప్లో ఓటమెరుగని టీమిండియా.. అన్నింటిలోనూ నెంబర్ 1
ప్రపంచకప్ 2023లో టీమిండియా అద్భుత ప్రదర్శన చూపిస్తోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ ల్లోనూ అన్నింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానంలో ఉంది. లీగ్ దశలో కేవలం నెదర్లాండ్స్‌తో మ్యాచ్ మిగిలి ఉంది. ఆ తర్వాత ముంబైలోని వాంఖడే స్టేడియంలో నెంబర్ 4 జట్టుతో భారత్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ వరల్డ్ కప్లో టీమిండియా గెలవడమే కాదు.. అన్ని విభాగాల్లోనూ మంచి ప్రదర్శనను చూపిస్తుంది. దీంతో ప్రత్యర్థి జట్లను ఓడించి ఏకపక్షంగా చాలా మ్యాచ్‌లను గెలుచుకుంది. టీమిండియా ఈ అద్భుతమైన ప్రదర్శనకు కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. ఆ కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నంబర్-1 జాబితాలో క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో టీమిండియా నెంబర్ 1 జట్టుగా ఉంది. ఇక ఈ వరల్డ్ కప్ లో ఆడే టీమిండియాలో ఐదుగురు ఆటగాళ్లు ఉన్నారు. వన్డే ఫార్మాట్‌లో ప్రపంచ నెంబర్ 1 బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, ప్రపంచ నెంబర్ 1 బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఈ వరల్డ్ కప్ లో ఆడుతున్నారు. ఇక ఫీల్డింగ్ లో రవీంద్ర జడేజా ప్రపంచంలోనే నెంబర్ 1 ఫీల్డర్ గా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ను ఓడించి టైటిల్ గెలుచుకోవడం ఏ జట్టుకైనా కష్టమైన పని. చూడాలి మరీ ఈ వరల్డ్ కప్ లో ఫైనల్ లో ఏ జట్టు గెలుస్తుందో…..
యువతకు రోల్ మోడల్గా నిలుస్తున్న 103 ఏళ్ల బామ్మ.. సూపర్ ఫిట్నెస్
వారణాసిలోని పరమానందపూర్‌కు చెందిన కళావతి దేవి అనే 103 ఏళ్ల వృద్ధురాలు యువతకు ఆదర్శంగా నిలుస్తుంది. అందుకు కారణం తన ఫిట్‌నెస్. 103 ఏళ్ల వయసులో కూడా ట్రాక్‌పై పరుగెత్తుతూ ఫిట్‌గా ఉండాలనే సందేశాన్ని యువతకు తెలుపుతుంది. ఇదిలా ఉంటే.. కాశీలో జరిగిన ఎంపీ క్రీడా పోటీల్లో 100 మీటర్ల పరుగు పందెంలో ఆమే పేరును నమోదు చేసుకుని.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమే ఆరోగ్యంగా ఉండటానికి గల కారణాలను వివరించింది. సమతుల్య దినచర్య, ఆహారపు అలవాట్లే ఇంత ఆరోగ్యంగా ఉండటానికి ప్రధాన కారణమని తెలిపింది. బనారస్‌లోని పర్మానంద్‌పూర్‌లో నివసిస్తున్న కళావతి దేవికి చిన్నతనంలోనే వివాహం జరిగింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె భర్త మరణించాడు. దీంతో ఆమె తన తండ్రి ఇంట్లోనే నివసించింది. అప్పటి నుండి నేటి వరకు సాదాసీదా జీవితం గడపడం, మితంగా ఆహారం తీసుకోవడం, రోజూ ఉదయం 5:00 గంటలకు నిద్రలేచి వాకింగ్ చేయడం ఆమే దినచర్యలో భాగమయ్యాయి. ఇదిలా ఉంటే.. 103 ఏటా కూడా ఆమే ఇంత ఫిట్నెస్ గా ఉండటంపై సోషల్ మీడియాలో అందరూ చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా చాలామంది నెటిజన్లు తనను ప్రశంసిస్తున్నారు. ఇంతకు ముందు కూడా చాలాసార్లు పెద్దలకు, యువతకు ఫిట్‌నెస్ మంత్రాలు ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇంకా ‘జై భీమ్’ ను మర్చిపోని నాని.. అక్కడ కూడా మాట్లాడాడే
న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మారాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన నాని.. తనకు నచ్చిన విషయాన్నీ నిర్మొహమాటంగా మాట్లాడతాడు. ఎవరు ఏమనుకుంటారు అనేది లేకుండా తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఉంటాడు. దీనివలన ఎన్నో వివాదాలలో కూడా నాని ఇరుక్కున్నాడు. ఇక ఈ ఏడాది నేషనల్ అవార్డులు గురించి నాని చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారిన విషయం తెల్సిందే. టాలీవుడ్ అంతా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. జై భీమ్ సినిమాకు అవార్డు రాలేదని నాని బాధపడ్డాడు. తాజాగా నాని ఆ సినిమా గురించి మరోసారి మాట్లాడాడు. నిన్న నాని ఇండియా టుడే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాడు. ఇక ఆ సమావేశంలో నానికి ఈ ప్రశ్న ఎదురైంది. దాని గురించి నాని మాట్లాడుతూ.. ” నేషనల్ అవార్డ్స్ మా వాళ్లకు వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆర్ఆర్ఆర్, పుష్ప, మా బ్రదర్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్నాడు.. దేవి శ్రీప్రసాద్ అందుకోవడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఇంకా చెప్పాలంటే ఈసారి.. చాలామంది మాలో నేషనల్ అవార్డులు అందుకున్నారు. వారందరికీ కంగ్రాట్స్ చెప్తూ పోస్ట్ చేశాను. దాంతో పాటు జై భీమ్ కు అవార్డు రాలేదని కూడా పోస్ట్ చేసాను. నాకు చాలా బాధగా అనిపించింది. జై భీమ్ లాంటి మంచి సినిమాకు అవార్డు రాకపోవడం.. ఏ కేటగిరిలో కూడా ఒక్క అవార్డు రాలేదు. అసలు నేషనల్ ఫిల్మ్ ప్యానెల్ ఆ సినిమా చూసారా లేదా..? అలాంటి సినిమాకు ఒక్క అవార్డు కూడా రాకపోవడమా.. ? చాలా బాధగా అనిపించింది. ఇది వేరేలా అనుకోవద్దు. మా ఇంట్లో మా అక్కకు మంచి మార్కులు వస్తే ఎంత ఆనందపడతానో.. మా పక్కింటి లో ఉండే కజిన్ కు మార్కులు రాకపోతే ఆమెను కూడా ఓదారుస్తాను. అలానే ఆ సినిమా ఎంతో మంచి సినిమా.. దానికి అవార్డు రాకపోవడంతో ఫీల్ అయ్యాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
