NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

బాధ్యతగా మాట్లాడాలి.. రండి బహిరంగ చర్చకు..
మా మేనిఫెస్టోలో ఇచ్చిందే మేం అమలు చేస్తున్నాం.. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలు ఇక్కడకు వచ్చి మైకులు పట్టుకుని డబ్బాలు కొడుతున్నారు అని మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏవీ అమలు కాలేదని ఆ నాయకులు చెబుతున్నారు.. మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రమ్మనండి.. అంటూ సవాల్‌ చేశారు.. ఆ పెద్ద నాయకులను మేనిఫెస్టో పట్టుకొని డిబెట్‌కు రమ్మనండి అంటూ చాలెంజ్‌ చేశారు మంత్రి బొత్స.. ఇక, 2014-19లో మీరు ఏం చేశారో.. ఇప్పుడు మేం ఏం చేశామో ప్రజలు చూస్తారని హితవుపలికారు.. బాధ్యతగా మాట్లాడాలి.. ఆదర్శంగా ఉండాలని సలహా ఇచ్చారు.. వ్యక్తిగతంగా మేం మాట్లాడం.. వ్యవస్థాపరంగానే మాట్లాడుతామని.. బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.

ఫొటోలు మార్ఫింగ్ చేసి పెళ్లి సంబంధాలు చెడగొట్టాడు.. ఇలా చిక్కాడు..!
అన్నమయ్య జిల్లా బి. కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట లో నివాసం వుండే ముజామిల్, బాధిత యువతి గతంలో ప్రేమించుకున్నారు. యువకుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన యువతి దూరం పెట్టింది.. ఇంట్లో పెద్దలు చూపించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని యువతి స్పష్టం చేసింది. విషయం తెలిసిన ముజామిల్ ఎలాగైనా యువతిని ఇబ్బందులకు గురి చేయాలని ప్లాన్ చేసాడు. గతంలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేసి యువతిని బ్లాక్ మెయిల్ చేసాడు. అంతేకాకుండా పెళ్లి సంబందానికి వచ్చే వారికి కూడా మార్ఫింగ్ ఫోటో లను పంపించాడు. దీంతో యువతి దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. ఇక, బాధిత యువతి ఇంటికి చేరుకున్న దిశ టీం వివరాలను సేకరించారు. ఫోటోలను మార్ఫింగ్ చేసి యువతిని ఇబ్బందులకు గురిచేసిన ముజామిల్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆవేశంలో తెలియక తప్పు చేశాను, మరొకసారి యువతిని ఇబ్బంది పెట్టను అని ముజామిల్ హామీ ఇచ్చాడు. దీంతో యువతి కుటుంబసభ్యుల సూచన మేరకు ముజామిల్ కు కొత్తకోట పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

ఓడించడానికి ఇది మీ అడ్డా కాదురా బిడ్డా.. ఏపీ జగనన్న అడ్డా..
విపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల లేని వాళ్ళు, ఎమ్మెల్యేగా గెలవలేని వాళ్ళు కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఓడిస్తామని సవాల్ చేయడం కామెడీగా ఉందన్నారు.. ఓడిస్తాం.. ఓడిస్తాం.. అని చెప్పడానికి మీ అడ్డా కాదురా బిడ్డా.. ఏపీ జగన్ అన్న అడ్డా.. ఓడించడం మీ తరం కాదన్నారు.. ఇచ్చిన హామీలను, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. సంక్షేమ సామ్రాట్ అంటూ అభివర్ణించారు.. ప్రజల ఇంటికి వెళ్లి మరి సంక్షేమం అందిస్తున్న ఘనత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇక, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్లో కొలువైన దేవుడు దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని పేర్కొన్నారు మంత్రి ఆర్కే రోజా.

కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడినందుకే బండి సంజయ్ ను తప్పించారు..
బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీజేపీకి బీ-టీమ్ అని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అని ఆయన తెలిపారు. కేసీఆర్ కు వ్యతిరేఖంగా మాట్లాడుతున్నడనే బీసీ బిడ్డ అయిన బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా నుంచి తప్పించారు అని హనుమంతరావు అన్నారు. అబ్కీ బార్ కాంగ్రెస్ సర్కార్ అంటూ ఆయన తెలిపారు.. తెలంగాణలో ఘర్ వాపసి తో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుంది అని హనుమంతరావు అన్నారు. పార్టీలో చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి.. వాటిని మేము ఇంటర్నల్ గా పరిష్కరించుకుంటాము అని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో బీసీలు.. మైనారిటీ వర్గాలు కాంగ్రెస్ పక్షాన నిలిచారని.. అందుకే అక్కడ విజయం సాధించడం జరిగిందని వి. హనుమంతరావు తెలిపారు.

మీరించ్చిదేమి లేదు.. మాకు వచ్చే డబ్బుల్నే ఆపారు
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి పథకం పేరు మార్చి మోడీ ప్రభుత్వం కాపీ కొట్టిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మేం పని మంచిగా చేయకపోతే ఎందుకు మా పథకాలను కాపీ కొట్టారు.. ఎందుకు ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయి అని ప్రధాని మోడీ అంటున్నారు.. పెట్టుబడులు వస్తున్నాయి అంటే కేసీఆర్ గొప్పతనం అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణకి చాలా నిధులు ఇచ్చామని ప్రధాని అంటున్నారు.. మీరు డబ్బులు ఇవ్వలేదు.. మాకు రావాల్సిన నిధులు ఆపారు అంటూ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వండంటూ అడిగారు. నీతి అయోగ్ చెప్పినా డబ్బులు ఇవ్వలేదు.. బావుల కాడా మీటర్లు పెట్టాలేదనీ రూ. 21 వేల కోట్లు ఆపింది మీరు అని హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని మోడీ ప్రభుత్వం అడ్డుకుంటుంది.. తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే కళ్ళలో వాళ్లకు మంటలు వస్తున్నాయి.

సీఎం షిండేను రాజీనామా చేయమని అడిగారు.. ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు
ఏక్‌నాథ్ షిండే- దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు అజిత్ పవార్ చేరిక తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య థాకరే శుక్రవారం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను రాజీనామా చేయాలని కోరినట్లు కూడా ఆయన పేర్కొన్నారు. “ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను రాజీనామా చేయమని కోరినట్లు నేను విన్నాను. ప్రభుత్వంలో కొన్ని మార్పులు ఉండవచ్చు” అని ఆదిత్య ఠాక్రే అన్నారు. మహారాష్ట్రలో నీచ రాజకీయాలు జరుగుతున్నాయని ఆదిత్య ఠాక్రే అన్నారు. ‘అత్యాశతో ఏడాది క్రితం మంత్రి పదవులు వదులుకున్న ఆ ద్రోహుల పరిస్థితి ఏంటి? ముఖ్యమంత్రి కుర్చీ ప్రమాదంలో పడింది. వరుసగా నాలుగు రోజులుగా శాఖల కేటాయింపులో జాప్యం జరుగుతోంది. ముఖ్యమంత్రిని కూడా తొలగించే విషయమై చర్చలు జరుగుతున్నాయని విన్నాను.’ అని ఆదిత్య ఠాకే చెప్పారు. మహావికాస్ అఘాడీ సమావేశంలో ప్రజలకు న్యాయం కోసం చట్టవిరుద్ధమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించారన్నారు. ప్రభుత్వంలో కూర్చున్న వారు తమ స్వప్రయోజనాలలో మునిగిపోయారని.. వారు పార్టీని విచ్ఛిన్నం చేయడానికి మాత్రమే పని చేస్తున్నారని ఠాక్రే అన్నారు.

నాలో ఫైర్‌ ఇంకా అలాగే ఉంది.. అజిత్‌కు శరద్‌ పవార్‌ వార్నింగ్
అజిత్ పవార్ తనపై చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్యకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ శనివారం బదులిచ్చారు. సోదరుడి కుమారుడైన అజిత్‌ పవార్‌పై విరుచుకుపడ్డారు. ‘రిటైర్’ అవ్వాలని అజిత్ పవార్ చేసిన సూచన మేరకు.. తాను అలసిపోనని, రిటైర్మెంట్ తీసుకోనని, తనలో ఇంకా ఫైర్‌ అలాగే మిగిలి ఉందని అన్నారు. పార్టీ కార్యకర్తలు తనను కొనసాగించాలని కోరినట్లుగానే తాను పని చేస్తూనే ఉంటానని ఎన్సీపీ అధినేత చెప్పారు. అజిత్‌పై మాటల దాడి చేసిన శరద్ పవార్.. “అతను(అజిత్ పవార్‌) నాకు ఏమి చెబుతున్నా నాకు పట్టింపు లేదు. నేను అలసిపోలేదు, పదవీ విరమణ చేయలేదు, నాలో ఫైర్‌ ఇంకా ఉంది. త్వరలో తిరుగుబాటుదారులందరూ ఎన్సీపీ నుంచి అనర్హులు అవుతారు.” అని శరద్‌ పవార్ అన్నారు. ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అజిత్ పవార్‌ గురించి అడిగిన ప్రశ్నలన్నింటికీ శరద్ పవార్‌ ఏమాత్రం తడుముకోకుండా సమాధానమిచ్చారు. “మొరార్జీ దేశాయ్ ఏ వయసులో ప్రధాని అయ్యారో తెలుసా? నాకు ప్రధానమంత్రి కావాలన్నా, మంత్రి కావాలన్నా కోరిక లేదు, ప్రజలకు సేవ చేయడమే నా కోరిక. నాకు ఇంకా వయసు రాలేదు.” అని అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చెప్పిన మాటలను పవార్ రిపీట్ చేస్తూ.. నేను అలసిపోను, రిటైర్‌ కూడా కాను. నన్ను రిటైర్ అవ్వమని అడగడానికి అతను(అజిత్ పవార్‌) ఎవరు? నేను ఇంకా పని చేయగలనన్నారు.

ఎంఎల్‌సీ నుంచి తప్పుకున్న అంబటి రాయుడు.. కారణమదేనా..?
చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు ఇటీవలే భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మరోవైపు ఈ నెల నుంచి అమెరికా వేదికగా జరుగబోయే మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) నుంచి తప్పుకుంటున్నాడు. ఈ విషయాన్ని టెక్సాస్ సూపర్ కింగ్స్ ట్విటర్లో తెలిపింది. రాయుడు లీగ్ నుంచి తప్పుకుంటున్న విషయమై.. టీఎస్కే ట్వీట్ లో వివరణ ఇచ్చింది. ‘ఎంఎల్‌సీ ఫస్ట్ సీజన్ లో అంబటి రాయుడు అందుబాటులో ఉండటం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఈ సీజన్ కు దూరంగా ఉంటున్నాడు. కానీ ఇండియా నుంచి అతడు మా టీమ్ కు మద్దతుగా ఉంటాడు’ అని తెలిపింది. ఎంఎల్‌సీ ఫస్ట్ సీజన్ నుంచి రాయుడు తప్పుకోవడం వెనుక ఏపీ రాజకీయాలే కారణమన్న వాదన వినిపిస్తోంది. రాయుడు రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రెండుసార్లు కలిశాడు. ఇటీవల తన సొంత జిల్లా గుంటూరులో విస్తృత పర్యటనలు చేస్తూ వివిధ వర్గాలను కలుస్తుండటం రాజకీయాల్లోకి వెళ్లడం కోసమనే గుసగుసలు వినపడుతున్నాయి. సో చూడాలి మరీ.. ఈ విషయమై జట్టు నుంచి తప్పుకున్నాడా.. లేదంటే వ్యక్తిగతంగా ఏమైనా ఉన్నాయా అని తెలియాల్సి ఉంది.

మై డియర్ మార్కండేయ… రికార్డ్స్ ని రఫ్ఫాడిద్దాం పద
మెగా హీరోస్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ కోసం మెగా ఫాన్స్ గత 24 గంటలుగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. థమన్ మ్యూజిక్ ఈ మధ్య రచ్చ లేపుతుంది పైగా వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలకి థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ఆ మ్యాజిక్ ‘బ్రో’ సినిమాకి కూడా వర్కౌట్ అయ్యి థమన్ నుంచి మరో ఆల్బమ్ వస్తుందని ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. వారి వైటింగ్ కార్డ్ వేస్తూ ‘బ్రో’ మూవీ నుంచి ‘మై డియర్ మార్కండేయ’ అనే సాంగ్ బయటకి వచ్చింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ సాంగ్ హుక్ లైన్స్ చాలా క్యాచీగా ఉండడంతో, అందరికీ వెంటనే కనెక్ట్ అవ్వడం గ్యారెంటీ. సాంగ్ మొత్తంలో మై డియర్ మార్కండేయ, మంచి మాట చెప్తా రాసుకో అంటూ వచ్చే లైన్ కి రిపీట్ వేల్యూ ఉంది. పైగా ఈ సాంగ్ ఎక్కువగా వింటేజ్ పవన్ కళ్యాణ్ సాంగ్స్ స్టైల్ లో ఉండడం అభిమానులకి కిక్ ఇచ్చే విషయం. పవన్ కళ్యాణ్ సినిమాల్లో సాంగ్ కి అండర్ కరెంట్ ఒక మంచి మెసేజ్ ఉంటుంది, అదే ఈ మై డియర్ మార్కండేయ సాంగ్ లో కూడా ఉంది. సాయి ధరమ్ తేజ్ డాన్స్ వేస్తున్నాడు కానీ యాక్సిడెంట్ తాలూకు శారీరిక ఇబ్బంది ఇంకా తగ్గినట్లు లేదు. ఒకప్పటి సాయి ధరమ్ తేజ్ గ్రేస్ కనిపించడానికి ఆ యాక్సిడెంట్ కారణం అయి ఉండొచ్చు. ఈ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కూడా కనిపించి యూత్ ని కవ్వించింది. ఇక ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి అంటే… ఈ సాంగ్ లో వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపించాడు. ఆ స్టైల్ అండ్ స్వాగ్ ఇప్పటికీ అలానే ఉన్నాయి. లిరికల్ సాంగ్ లో ఎడిట్ చేసిన పవన్ ఫొటోస్ సూపర్బ్ ఉన్నాయి. మొత్తానికి ఫస్ట్ సాంగ్ కి మెగా హీరోలు సాలిడ్ కిక్ ఇచ్చారు.

నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి.. ఆదిపురుష్ రైటర్
తమ జీవితంలో ప్రతిఒక్కరూ తప్పు చేస్తారు కానీ, దాన్ని ఒప్పుకొనే సాహసం మాత్రం ఎవ్వరూ చేయరు. ఎలాగోలా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలే చేస్తారే తప్ప.. తాము చేసిన తప్పుని ఒప్పుకోరు, పశ్చాత్తాపమూ చెందరు. కానీ.. కొందరు మాత్రం తాము చేసిన ఒప్పుకునే సాహసాన్ని కలిగి ఉంటారు. అఫ్‌కోర్స్.. మొదట్లో ఆ తప్పుని గ్రహించకపోయినా, ఆ తర్వాత జరిగిన నష్టాన్ని అర్థం చేసుకొని, తప్పు ఒప్పేసుకుంటారు. ఇప్పుడు ఆదిపురుష్ రైటర్ మనోజ్ ముంతశిర్ కూడా అదే పని చేశాడు. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రకు తాను రాసిన అభ్యంతకరమైన డైలాగ్స్ విషయంలో తన తప్పు ఒప్పుకొని, క్షమాపణలు కోరాడు. ‘‘ఆదిపురుష్ సినిమా వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. అందుకు నేను నా రెండు చేతులు జోడించి, మీ అందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్తున్నాను. ప్రభు బజరంగ్‌బలి మమ్మల్ని ఐక్యంగా ఉంచి.. మన పవిత్రమైన సనాతన, గొప్ప దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదించుగాక’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.