గృహనిర్మాణాశాఖపై సీఎం సమీక్ష.. పేదలకు ఇళ్లు రాకూడదని కుట్ర చేస్తున్నారు..!
గృహనిర్మాణాశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణం ప్రగతిపై వివరాలు అందించారు. ఇప్పటి వరకు 4,24,220 ఇళ్లు పూర్తయ్యాయని, ఆగస్టు 1 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తవుతాయని వెల్లడించారు అధికారులు. రూఫ్ లెవల్, ఆ పైస్థాయిలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 5,68,517 కాగా, వివిధ స్థాయిల్లో 9,56,369 ఇళ్లు ఉన్నాయని తెలిపారు.. ఈ అర్థిక సంవత్సరంలో హౌసింగ్ కోసం రూ.2201 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు అధికారులు. అయితే, కాలనీలు పూర్తవుతున్నకొద్దీ అన్నిరకాలుగా కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు సీఎం జగన్.. ఇళ్ల నిర్మాణవేగాన్ని ఇదే రీతిలో ముందుకు తీసుకెళ్లాలన్న ఆయన.. కోర్టు కేసులు కారణంగా ఇళ్లస్థలాలు పంపిణీ నిలిచిపోయిన చోట ప్రత్యామ్నాయ భూముల సేకరణపై దృష్టి పెట్టాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. విశాఖలో ఇళ్ల నిర్మాణం నిర్దేశిత సమయంలోగా పూర్తికావాలని, ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు సీఎం జగన్.. వీలైనంత త్వరగా అక్కడ పేదలకు నివాసం కల్పించడానికి ∙చర్యలు వేగవంతం చేయాలన్న సీఎం. డిసెంబర్‌లోగా విశాఖలో ఇళ్లు పూర్తిచేయడానికి తగిన కార్యచరణ రూపొందించాలని, ఏం కావాలన్నా వెంటనే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. కొత్తగా ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్నవారికి పట్టాలు ఇచ్చేందుకు భూములను సేకరించాలని ఆదేశించిన సీఎం. దీనిపై కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. వీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
ఉపాధ్యాయుడంటే ఆయనే.. బదిలీపై వెళ్తుంటే బోరున ఏడ్చేసిన విద్యార్థులు
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు అదనపు ఉపాధ్యాయుల బదిలీలు కొనసాగుతున్నాయి.. అందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గౌడనహల్లి పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు శివన్న కూడా బదిలీ అయ్యారు.. పిల్లలకు కేవలం చదువు చెప్పడమే కాదు వారి ఆప్యాయత అనురాగాలను చూరగొన్న శివన్న.. బదిలీ కావడంతో కన్నీటి పర్యంతమయ్యారు విద్యార్థినులు.. ఇక, విద్యార్థుల కంటతడి చూసి తాను కూడా బోరున ఏడ్చేశాడు శివన్న.. బదిలీపై వెళ్తున్న శివన్నకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు.. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.. ఇక, ఆ తర్వాత విద్యార్థులంతా ఆ ఉపాధ్యాయుడిని పట్టుకుని కన్నీరు మున్నీరుగా విలిపించారు. విద్యార్థులు ఉపాధ్యాయుడి చుట్టు చేరి విలిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.. విద్యార్థులు కన్నీరుమున్నీరవుతుంటూ.. వారిని సముదాయించే ప్రయత్నం చేస్తూనే.. తాను కూడా వెక్కివెక్కి ఏడ్చేశారు శివన్న.. విద్యార్థులు.. నన్ను ఓ తండ్రిగా భావించేవాళ్లు.. ఉపాధ్యాయుడిగా పాఠలతో పాటు.. మన సంస్కృతి, సంప్రదాయాలు, పండగల గురించి కూడా వారికి చెప్పేవాడిని.. వాళ్లను వదిలి వెళ్లడం నాకు కూడా బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు టీచర్ శివన్న.
థీమ్ పార్క్‌గా రూపాంతరం చెందిన డంప్ యార్డ్
రాష్ట్రంలో గ్రీన్ కవర్‌ను పెంచడం, పౌరులకు ఏకకాలంలో మరిన్ని వినోద ప్రదేశాలను అందించాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంతో GHMC నగరంలోని వివిధ ప్రాంతాల్లో థీమ్ పార్కులను అభివృద్ధి చేస్తోంది. అయితే.. ఈ క్రమంలోనే.. ఒకప్పుడు చుట్టూ మురికి, చెత్తాచెదారంతో ఉండే ఈ చిన్నపాటి డంప్ యార్డ్ ఇప్పుడు పూర్తిగా కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఓల్డ్ MIG కాలనీ, శేరిలింగంపల్లి నివాసితులకు అసౌకర్య ప్రదేశంగా మారిన స్థలం ఇప్పుడు పిల్లలు విశ్రాంతి తీసుకోవడానికి, చుట్టూ ఆడుకోవడానికి శుభ్రంగా, చక్కని పార్కుగా రూపాంతరం చెందింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) కాలనీ ఫేజ్-IIలో స్థలాన్ని పార్కుగా మార్చడమే కాకుండా అనేక సౌకర్యాలతో సన్నద్ధం చేసి ఆహ్లాదకరమైన ప్రదేశంగా మార్చారు. ఈ కొత్తగా చెక్కబడిన ఊపిరితిత్తుల స్థలం 2.5 ఎకరాలలో విస్తరించి ఉంది. పిల్లల కోసం ఆట స్థలంతో పాటు, అన్ని వయసుల వారికి వినోద సౌకర్యాలను కలిగి ఉంది. లాన్‌లు, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, రోజ్ గార్డెన్, మేజ్ గార్డెన్, సీటింగ్ ఏరియా, గెజిబోలు పరికరాలతో కూడిన పిల్లల ఆట స్థలం వంటివి థీమ్ పార్క్‌లోని కొన్ని ప్రత్యేకతలు. పార్క్ ఆవరణలో అభివృద్ధి చేయబడిన పచ్చదనం, కూర్చునే ప్రదేశంలో ఫ్లోరింగ్, చెక్క పైకప్పులతో కూడిన గెజిబోలు ఈ స్థలాన్ని మరింత ఆకర్షణ పెంచాయి. కాంపౌండ్ గోడల దగ్గర, పార్క్ లోపల ల్యాండ్‌స్కేపింగ్‌కు సంబంధించిన పనులు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ ప్రదేశంలో పెరిగిన చెట్లు సందర్శకులకు నీడని అందిస్తున్నాయి.
అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ తీసేస్తామంటే ఏడుస్తున్నారు..
గాంధీ భవన్ లో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భూమి డిక్లరేషన్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ వెనక పెద్ద గూడు పుటాని జరిగింది.. రోజుకోకటి బయట పెడతామని ఆయన అన్నారు. ధరణి పోర్టల్ టేరసీసీ కంపనీ వెనుక.. ఫిలిప్పీన్.. దాని వెనక అమెరికా కంపెనీలు వచ్చాయన్నారు. విదేశీయులు ధరణి పోర్టల్ నడుపుతున్నారు అని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. ఆ కంపనీ వివరాలు ఇవ్వండి అని అమెరికాని అడిగినా ఇవ్వడం లేదు.. దేశంలో ఏ సంస్థ వ్యాపారం చేసినా లబ్ధిదారులు ఎవరు అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పాలి.. ఒక్క శాతం మాత్రమే.. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న కంపనీ చేతిలో ఉంది. ఇది మంత్రి కేటీఆర్ మిత్రుడు శ్రీధర్ గాదె దగ్గర ధరణికి ఉంది.. అర్ధరాత్రి పూటా… యజమానులను సృష్టించి భూమి కొల్లగొడుతున్నాడు అని రేవంత్ రెడ్డి అన్నారు. ధరణిని నడిపే వాడు.. ఎవడో తెలియదు.. ప్రభుత్వ భూములు.. మన భూముల వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇది అత్యంత తీవ్రమైన నేరం అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గజ్వెల్ లో 1500 ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుంది.. దాన్ని ఆముల్ డైరీకి ఇచ్చాడు.. గంగుల కమలాకర్ కంపనీకి కూడా భూములు ఇచ్చారంటూ మండిపడ్డారు.
రాజస్థాన్ సీఎంకు ఢిల్లీ కోర్టు సమన్లు.. ఎందుకో తెలుసా..?
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 7వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆ నోటిసుల్లో పేర్కొనింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఆశోక్ గెహ్లాట్‌పై వేసిన పరువు నష్టం దావా ఆధారంగా ఈ నోటీసులను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జారీ చేసింది. సుమారు 900 కోట్ల రూపాయలకు సంబంధించి ఆశోక్ గెహ్లాట్ చేసిన ఆరోపణలకు గానూ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ పిటిషన్ వేశారు. సంజీవని స్కామ్‌పై చేసిన వ్యాఖ్యలతో రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ తన పరువు తీశారంటూ కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కోర్టుకెక్కారు. అయితే.. నేరపూరిత పరువు నష్టం కేసులో ముఖ్యమంత్రికి నోటీసులు పంపాలా? వద్దా? అని తర్జనభర్జనలు చేసి.. ఆ ఉత్తర్వులను ఇదివరకే కోర్టు రిజర్వ్ చేసింది. ఇక ఇవాళ ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ హజ్రీత్ సింగ్ జస్పాల్ ఇవాళ సీఎం ఆశోక్ గెహ్లాట్‌కు నోటీసులను జారీ చేశారు.
మనవడితో హాలిడేకు చెక్కేసిన బాలయ్య..
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే బాలయ్య, అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే భగవంత్ కేసరి షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో షూటింగ్స్ కు గ్యాప్ ఇచ్చిన బాలయ్య.. కుటుంబంతో కలిసి వెకేషన్ కు బయల్దేరాడు. బాలకృష్ణ, భార్య వసుంధర, మనవడితో బాలయ్య అమెరికాకు పయనమయ్యాడు. నేడు ఎయిర్ పోర్టులో మనవడితో బాలయ్య సందడి చేశాడు. చిన్న కూతురు తేజస్విని కొడుకు చెయ్యి పట్టుకొని సరదగా నడిపించుకుంటూ తీసుకెళ్తున్న బాలయ్య వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక దాదాపు ఒక వారం రోజులు వెకేషన్ లోనే ఉండనున్నాడట బాలయ్య. ఇక ఈ ఏడాది వీరసింహారెడ్డి సినిమాతో హిట్ కొట్టిన బాలకృష్ణ.. ఈసారి భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటివరకు అనిల్ రావిపూడి కామెడీ సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొట్టమొదటి సారి బాలయ్యతో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ నటిస్తుండగా.. శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాపై బాలయ్య అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో బాలకృష్ణ మరో హిట్ ను అందుకుంటాడా.. ? లేదా.. ? అనేది తెలియాలి.
పాపం… ఏ డేట్ అనౌన్స్ చేసినా వాళ్లు వదలడం లేదుగా!
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆ సినిమాకి అప్పట్లోనే సీక్వెల్ చేస్తామని ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టడమే కాదు సిద్దు జొన్నలగడ్డకి మంచి యూత్ ఫాలోయింగ్ కూడా తెచ్చి పెట్టింది. ఇక ఈ క్రమంలోనే టిల్లు స్క్వేర్ పేరుతో ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. అయితే మొదటి భాగంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా రెండో భాగంలో మాత్రం అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని ముందు ఆగస్టు 11వ తేదీ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే అదే రోజు మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా, రజినీకాంత్ జైలర్ సినిమాతో పాటు యానిమల్ సినిమాలు కూడా డేట్ లాక్ చేసుకున్నాయి. అయితే వీటిలో యానిమల్ సినిమా వాయిదా పడి డిసెంబర్ నెలకు వెళ్ళింది కానీ భోళా శంకర్, జైలర్ సినిమాలకు మాత్రం అలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టిల్లు స్క్వేర్ సినిమాని సెప్టెంబర్ 15వ తేదీ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు కానీ ఇప్పుడు ఆ 15వ తేదీ కూడా బోయపాటి రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కిన చంద్రముఖి 2 సినిమాలతో పాటు విశాల్ హీరోగా ఎస్ జె సూర్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మార్క్ ఆంటోనీ సినిమా కూడా డేట్ లాక్ చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి టిల్లు స్క్వేర్ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉందనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే అందులో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయనేది వేచి చూడాల్సి ఉంది.
‘సలార్’ టీజర్లో ఇంట్రెడక్షన్ ఇచ్చిన నటుడు ఎవరో తెలుసా?
పాన్ వరల్డ్ స్టార్ హీరో ప్రభాస్‌తో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ టీజర్ ఈరోజు ఉదయం 5.12 నిమిషాలకు విడుదల అయ్యింది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.. వ్యూస్ తో దూసుకుపోతుంది.. ప్రభాస్ మాస్ లుక్ లో అదరగోట్టారు.. కే.జీ.ఎఫ్ మించిన యాక్షన్ ఇందులో ఉన్నట్లు టీజర్ లో చూపించారు.. టీజర్ లో డార్లింగ్ దుమ్ము దూళిపాడు.. ఇక టీజర్ లో.. KGF ని మించి మాస్, యాక్షన్ సీన్స్ ఉండబోతున్నట్టు చూపించారు.. ఆ సినిమాలో యష్ కు ఇంట్రడక్షన్ ఇచ్చినట్లే ఈ టీజర్ లో కూడా ప్రభాస్ కు ఒకరు ఇంట్రడక్షన్ ఇచ్చారు.. అతను ఎవరు అని ప్రభాస్ ఫ్యాన్స్ తెగ గూగుల్ సెర్చ్ చేస్తున్నారు.. అతను మరెవ్వరో కాదు..టీనూ ఆనంద్.. గతంలో తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు. నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఆదిత్య 369 చిత్రంతో పాటు, మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి లో భాటియా పాత్రలో కనిపించారు టీనూ ఆనంద్.. ఈయన ఫ్యామిలి మొత్తం సినీ ఇండస్ట్రీకి చెందిన వారే.. ఆయన మేనల్లుడు సిద్ధార్థ్ ఆనంద్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. పఠాన్, వార్, బ్యాంగ్ బ్యాంగ్ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ఇక టీనూ ఆనంద్ తెలుగులో ఆదిత్య 369 తొలి కాగా.. పుష్పక విమానం, అంజి, ఘటోత్కచుడు, సాహో, సీతారామమ్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు సలార్ చిత్రంలో కనిపించనున్నారు. టీనూ ఆనంద్ కేవలం నటుడు మాత్రమే కాదు.. రచయిత, దర్శకుడు కూడాను.. ఇక ఈ సినిమా అతనికి హిట్ ఇస్తుందని ఫ్యాన్స్అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..