పవన్ పనికిమాలినోడు.. లాగి కొట్టాలనిపిస్తోంది..
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి ఆర్కే రోజా.. కృష్ణా జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆమె.. పవన్ కల్యాణ్ పనికిమాలినోడు అంటూ ఫైర్ అయ్యారు.. ఇక, పవన్‌ను లాగి కొట్టాలనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి పవన్ గౌరవం ఇవ్వాలని సూచించారు. పవన్ ప్రజల్లోకి వచ్చి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడని.. కానీ, పవన్ ను ప్రజలే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఇక, సీఎం వైఎస్ జగన్‌కు సంస్కారం నేర్పాలని పవన్ అంటున్నారు.. ఈ మాటలు వింటుంటే సన్నీ లియోన్ వేదాలు చెప్పినట్టు ఉందని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీలు పెట్టి అర్హులైన వారికి కులం, మతం, పార్టీ చూసి బెనిఫిట్స్ ఇవ్వకుండా మోసం చేసినప్పుడు.. పవన్ నోరు ఎందుకు లెగలేదని ప్రశ్నించారు రోజా.. అప్పుడు నీ నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా? అని నిలదీశారు.. సచివాలయ వ్యవస్థ గురించి పవన్ కల్యాణ్‌కు తెలియదు.. అది చట్టం ద్వారా వచ్చింది.. పవన్ శాసనసభకు వచ్చి ఉంటే తెలిసి ఉండేది అని వ్యాఖ్యానించారు. కానీ, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం మాత్రమే పవన్ కి వచ్చు.. ఆ మట్టి బుర్రకు పిచ్చి అరుపులు.. పిచ్చిగంతులు తప్ప ఏమీ తెలియదు అంటూ ఎద్దేవా చేశారు. ఇక, లోకేష్ ను చూసి చంద్రబాబు బాధపడుతుంటాడు.. ఇలాంటి కొడుకును కన్నాను ఏంటి అని ? అని పేర్కొన్నారు మంత్రి ఆర్కే రోజా. మరోవైపు.. మున్సిపల్ శాఖ అధికారులపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.. మంత్రి రోజా నిర్వహించిన సమీక్షా సమావేశానికి డ్రైనేజీ విభాగం అధికారులు హాజరుకాలేదు.. దీంతో.. విచారణ చేసి సమీక్షకు రాని అధికారులపై శాఖ పరిమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు మంత్రి ఆర్కే రోజా.
మహిళా కమిషన్ అంటే పవన్‌కు గౌరవం లేదు.. నోటీసులు కూడా లైట్..!
మహిళా కమిషన్‌ను పవన్ కల్యాణ్ గౌరవించడం లేదు.. మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులను కూడా లైట్‌గా తీసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మా.. సచివాలయంలో మహిళా కమిషన్ నేతృత్వంలో మహిళల ఆత్మగౌరవ దినోత్సవం నిర్వహించారు.. మహిళలపై సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులపై చర్చించారు.. మహిళల ఆత్మగౌరవ దినోత్సవానికి మద్దతుగా సచివాలయ మహిళా ఉద్యోగులు సంతకాలు చేవారు.. మహిళా ఆత్మగౌరవ దినాన్ని ప్రతి శుక్రవారం జరుపుకుందాం అనే నిర్ణయానికి వచ్చారు. ఇక, ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. అభివృద్ధి సాధించినా నేటికీ మహిళ పట్ల మధ్యయుగ మనస్తత్వం పోలేదన్నారు. మహిళలను కించ పరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులు మొదలుకొని అందరిపై అసభ్య పోస్టింగ్ లు పెడుతున్నారని మండిపడ్డారు. ఎవరి పైన అయినా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టడం తప్పేనన్న ఆమె.. పవన్ కల్యాణ్.. మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులను కూడా లైట్ గా తీసుకున్నారని ఫైర్ అయ్యారు.. ఆరోపణలపై ఆధారాలు అడిగాం.. కానీ, మహిళా కమిషన్ ను పవన్ కల్యాణ్ గౌరవించడం లేదని విమర్శించారు. మా మీద కూడా జనసేన కార్యకర్తలు ట్రోల్ చేశారు.. అందుకు జనసేన పార్టీని రద్దు చేస్తారా?.. ఇందుకు పవన్ కల్యాణ్ బాధ్యులు అంటే ఒప్పుకుంటారా ? అని నిలదీశారు ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మా.
చంద్రబాబు మళ్లీ సీఎం అనేది కల.. మర్చిపొండి ఇక..
చంద్రబాబు అటు ఇటు తిప్పినా ముఖ్యమంత్రి కాలేడు.. 160 రోజుల్లోనే కాదు 664 రోజులైనా కూడా మళ్లీ సీఎం కాడు.. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడన్నది కల, మర్చిపొండి ఇక అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడువి పనికిమాలిన మాటలు అని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు చెప్పమనండి..? అంటూ నిలదీశారు. చంద్రబాబు ఏం చేసారో చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. నా కార్యక్రమం ఇది, నాపేటెంట్ అని ఏ కార్యక్రమం గురంచైనా చెప్పగలరా? అంటూ సవాల్ చేశారు. లేనిపోని మాటలు , అబద్దాలు చెబుతున్నారు.. కానీ, ప్రజలు అమాయకులు కాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దోపిడీ చేసి, దోచుకుతిన్నారు అంటూ ఆరోపణలు చేశారు. ఇక, కొన్ని నిధులను మళ్లిస్తున్నారన్న విమర్శలపై స్పందించిన మంత్రి బొత్స.. ఏ డబ్బులు ఎక్కడా డైవర్ట్ చేయలేదు. ప్రజల కోసం, వారి జీవనప్రమాణాలు పెంచేందుకు నిధులు ఒక పథకం నుంచి మరో పథకానికి డైవర్ట్ చేస్తాం తప్ప.. అందులో వేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.
సుఖేష్ ఆరోపణలపై స్పందించిన మంత్రి కేటీఆర్
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై పలు ఆరోపణలు చేశారు. అయితే.. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ‘మోసగాడు, నేరస్థుడు సుఖేష్ నాపై కొన్ని హాస్యాస్పదమైన ఆరోపణలు చేశాడని మీడియా ద్వారా తెలుసుకున్నాను. నేను ఈ పోకిరీ గురించి ఎన్నడూ వినలేదు … అతని అర్ధంలేని మాటలపై చట్టపరమైన చర్య తీసుకోవాలనుకుంటున్నాను. ఇటువంటి కామెంట్స్ విషయంలో మీడియా జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థన’ అని ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్‌కు లేఖ రాశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌పై సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ రాశారు. ‘‘నా వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్ తరపు సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారు. కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్లలోని ఎవిడెన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఆధారాలు ఇస్తే రూ.100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీట్ ఇస్తామని ఆశపెడుతున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. కవితకు నాకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ అంతా రికార్డింగ్ ఉంది.
రేవంత్ రెడ్డి అనుచరుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వల్లే తన ప్రాణాలకు ముప్పు ఉందని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ శుక్రవారం అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుచరులమని చెప్పుకునే కొందరు వ్యక్తులు గురువారం రాత్రి 12.15 గంటల నుంచి తన మొబైల్‌కు పదే పదే కాల్‌లు చేశారని, దూషించారని, విమర్శలు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారని ఆయన వివరించారు. రేవంత్ రెడ్డి, మరియు అతను మాట్లాడటం కొనసాగించినట్లయితే వారు అతనిని తొలగిస్తారని కూడా పేర్కొన్నారు. “సైబర్ క్రైమ్స్ డిపార్ట్‌మెంట్ మరియు సంబంధిత పోలీసు అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను. ఈ బెదిరింపు కాల్స్‌పై విచారణ జరిపి దోషులను గుర్తించి చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిందిగా కోరతాను’’ అని డిమాండ్ చేశారు.తెలంగాణలో రేవంత్‌రెడ్డి బెదిరింపు సంస్కృతిని, రౌడీ రాజకీయాలను ప్రోత్సహించడం దురదృష్టకరమని అన్నారు. తాను ఇలాంటి వ్యూహాలు ప్రయోగించడం ఇదే మొదటిసారి కాదు, గతంలో తన అనుచరుల ద్వారా వి హనుమంతరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గా రెడ్డి వంటి సీనియర్లతో సహా తన సొంత పార్టీ సభ్యులపై ఇలాంటి బెదిరింపులను ప్రయోగించారని ఆయన గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు RO, AROలను నియమించిన సీఈవో
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల నియామకాన్ని ఖరారు చేసింది. వివిధ జిల్లాల్లోని పరిస్థితిని అంచనా వేయడానికి, కొనసాగుతున్న ప్రచారంలో ఓటర్ల జాబితాలో ఏవైనా లోపాలను సరిదిద్దడానికి ఎన్నికల సంఘం ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు (ఆర్‌ఓలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్‌ఓ)ల జాబితాను తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) వికాస్ రాజ్ విడుదల చేశారు. తెలంగాణ సీఈవో సమర్పించిన జాబితా ఆధారంగా రిటర్నింగ్ అధికారుల నియామకాన్ని పరిశీలించి ఖరారు చేసిన అనంతరం భారత ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. భారత ఎన్నికల సంఘం నుంచి అందిన ఆదేశాల మేరకు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారుల నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి మెమో జారీ చేశారు. ఈ ఉత్తర్వులు గెజిట్‌లో ప్రచురించబడతాయి.
సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు నోటీసులు.. మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తుపై 28న విచారణ
ఢిల్లీ రాష్ట్ర మద్యం కుంభకోణం కేసులో స్పందించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మనీశ్ సిసోడియా తాత్కాలిక బెయిలు పిటిషన్‌పై ఈ నెల 28న విచారణ జరిపేందుకు న్యాయస్థానం అంగీకరించింది. ఢిల్లీ రాష్ట్ర మద్యం కుంభకోణం కేసులో నిందితుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తుపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. దీనిపై స్పందించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)లకు నోటీసులు జారీ చేసింది. ఆయన సతీమణి అనారోగ్యంతో బాధపడుతుండటంతో, తనను చూసేందుకు అత్యవసరంగా తాత్కాలిక బెయిలు మంజూరు చేయాలని దాఖలైన పిటిషన్‌పై జూలై 28న విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది.
విదేశాల్లో రెచ్చిపోతున్న ఖలిస్థాన్ మద్దతుదారులు
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఉన్న ఖలిస్థానీ మద్దతుదారులు హింసాత్మక ఘటనలకు దిగుతున్నారు. భారతీయ ఆఫీసులు, భారతీయ పౌరులే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగిస్తున్నారు. అమెరికా, కెనడా, బ్రిటన్ సహా వివిధ దేశాల్లో గతకొన్ని రోజులుగా జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆయా ఘటనలతో భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయా దేశాల రాయబారులు, ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని కోరుతుంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో ఓ ఇండియన్ స్టూడెంట్ పై ఖలిస్థానీ మద్దతుదారులు తీవ్రంగా కొట్టారు. సిడ్నీ నగరంలో మంగళవారం తనపై ఖలిస్థానీ వేర్పాటు వాదులు దాడి చేసినట్లు భారత్‌కు చెందిన ఓ విద్యార్థి తెలిపాడు. వెస్టర్న్ సిడ్నీలోని వెస్ట్‌మేడ్ ఏరియాలో దాదాపు 7, 8 మంది ఖలిస్థానీ మద్దతుదారులు తనను విచక్షణా రహితంగా కొట్టారని అతడు పేర్కొన్నాడు. తనపై దాడి చేస్తున్న.. సమయంలో ఆ మూక ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిందని చెప్పుకొచ్చాడు. ఇనుప రాడ్లతో తనను ఇష్టం వచ్చినట్లు కొట్టారని.. బాధితుడు వెల్లడించాడు.
ఈ దేవాలయానికి ఒక్కసారి వెళితే వెంటనే పెళ్లి జరుగుతుందట..
జీవితంలో బాగా సెటిల్ అయ్యి మంచి భాగస్వామిని చూసి పెళ్లి చేసుకోవాలని అందరు అనుకుంటారు.. అలా అనుకుంటే సరిపోదు.. మన జాతకం ప్రకారం అన్నీ అనుకూలించాలి.. కొన్ని గ్రహాలు అనుగ్రహించాలి ఇంకా చెప్పాలంటే వివాహం అవ్వకపోవడం, లేదంటే సంతానం కలగకపోవడం ఇటువంటి బాధలతో ఇబ్బంది పడుతూ చాలా మంది ఉంటారు.అలానే కొంత మంది శని దోషం తో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే జీవితంలో ఒక్కసారి ఈ దేవాలయానికి వెళ్తే సరిపోతుంది అని పండితులు చెబుతున్నారు… ఆ దేవాలయం గురించి మరిన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఆ దేవాలయం అంత శక్తీవంతమైనదట.. ఈ దేవయానికి వెళ్తే అనుకున్న కోరికలు తీరుతాయి. అలాగే త్వరగా వివాహం అవుతుంది. అలాగే సంతానం కూడా కలుగుతుంది. అదే మోపిదేవి దేవాలయం. ఈ దేవాలయం అత్యంత శక్తివంతమైనది. ఈ మోపిదేవి దేవాలయానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు.. నిజానికి అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తారు. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ దేవాలయానికి వచ్చి పరిష్కరించుకోవచ్చని స్థానిక ప్రజలు చెబుతున్నారు.ఈ దేవాలయానికి వస్తే ఏమైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా చెప్పాలంటే సంతానం లేని వాళ్ళు ఒక్క రాత్రి ఇక్కడ నిద్ర చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని ప్రజల నమ్మకం..
బావ ఎన్టీఆర్ సపోర్ట్ అవసరం లేదంటున్న బామ్మర్ది.. ?
ఒక స్టార్ కుటుంబం నుంచి కొత్త హీరో వస్తున్నాడు అంటే.. ఎన్నో అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా హీరో అయితే.. కథ కుటుంబానికి నచ్చాలి. డైరెక్టర్ నచ్చాలి అని చెప్పుకురావడం చాలాసార్లు వింటూనే వచ్చాం. ఇక తమ కుటుంబం నుంచి హీరోను పరిచయం చేయడానికి స్టార్లు సైతం తమవంతు కృషి చేస్తారు. అయితే.. ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ విషయంలో ఇవేమి జరగకపోవడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు అభిమానులు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతికి స్వయానా తమ్మడు నార్నే నితిన్. గతేడాది శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడని చెప్పుకొచ్చారు. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటివరకు ఆజాపజా లేకుండా పోయింది. ఇక ఈ సినిమా గురించి పక్కన పెడితే .. ఈ మధ్యనే నితిన్ .. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తన రెండవ సినిమాను ప్రాకటించాడు. పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ నేపథ్యంలోనే నితిన్ కు సంబంధించిన ఒక విషయం నెట్టింట వైరల్ గా మారింది. నితిన్..బావ ఎన్టీఆర్ సపోర్ట్ లేకుండానే హీరోగా సెటిల్ అవుదామనుకుంటున్నాడట.. ఇప్పటివరకు నితిన్ చేస్తున్న సినిమాలకు సంబంధించిన ఏ వివరాలు ఎన్టీఆర్ కు తెలియదని టాక్.. బావ పేరును వాడకుండా గీతా ఆర్ట్స్ లో జరిగే ఆడిషన్స్ కు వెళ్లి.. అల్లు అరవింద్ ను మెప్పించి ఛాన్స్ పట్టేసాడట నితిన్. ఒకరకంగా నితిన్ చేస్తుంది కూడా మంచి పనే చెప్పాలి. ఎన్టీఆర్ పేరును కానీ, అతని రేంజ్ ను కానీ, వాడి ఉంటే ఈపాటికి మనోడు స్టార్ హీరో రేంజ్ లో వరుస అవకాశాలు అందుకొనేవాడు. అలా కాకుండా తన ట్యాలెంట్ తోనే పైకి రావాలని కోరుకుంటున్నాడట. ఇక నితిన్ ఇలా చేయడం మంచి విషయమే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాలతో నార్నే నితిన్ హిట్ అందుకుంటాడా..? లేదా.. ? అనేది చూడాలి.