టీడీపీకి అభ్యర్థులు దొరక్క కష్టపడి జాబితా విడుదల..! 150కి పైగా స్థానాల్లో వైసీపీ విజయం
సీఎం వైఎస్ జగన్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం కూడా మొదలు పెట్టారు.. కానీ, టీడీపీకి ఇంకా పొత్తులు విషయంలో కూడా క్లారిటీ లేదు అంటూ ఎద్దేవా చేశారు మంత్రి పెద్దిరెడ్డి.. నేడు టీడీపీ విడుదల చేసిన జాబితా చూస్తే.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి అని అర్థమవుతుందన్నారు. అభ్యర్థులు దొరక్క కష్టపడి టీడీపీ జాబితా విడుదల చేసినట్టు కనిపిస్తుందంటూ సెటైర్లు వేశారు. ఇక, చిత్తూరు జిల్లాలో కుప్పంతో సహా అన్ని సీట్లు గెలుస్తాం.. రాయలసీమలో దాదాపుగా అన్ని సీట్లు గెలుస్తాం అనే ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
మళ్లీ వైసీపీనే ప్రజలు గెలిపిస్తారు..
వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి తమకు ఓటు వేయాలన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ సందర్భంగా టీడీపీ-జనసేన పొత్తులపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీ, జనసేన తమ పొత్తు చూసి ఓటు వేయాలని చెబుతున్నారని విమర్శించారు. కాగా.. రాష్ట్రంలో ప్రజలు వైసీపీని రెండోసారి అధికారంలోకి తీసుకొస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాతో జనసేన, టీడీపీ బలహీనతలు బయటపడ్డాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. తుప్పు పట్టిన సైకిల్, పగిలిపోయిన గ్లాస్ కు గోల్డ్ కోటింగ్ వేసుకుని జనం ముందుకు వచ్చారని దుయ్యబట్టారు. టీడీపీ-జనసేనది సోషల్ ఇంజనీరింగ్ కాదు, ప్యాకేజీ ఇంజనీరింగ్ అని విమర్శించారు. వారి ప్రకటనలో సామాజిక న్యాయం ఎక్కడా కనిపించలేదని మంత్రి తెలిపారు. ఎంత మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చారో జస్టిఫై చేసుకోవాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ సూచించారు. పొత్తు మాత్రమే మా బలం అని చెప్పుకునే పరిస్థితుల్లో జనసేన, టీడీపీ ఉన్నాయని అన్నారు. 24 సీట్లకే పరిమితం అయినందుకు జన సైనికులకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత కాపులను కమ్మవాళ్లు.. కమ్మవాళ్లను కాపులను నమ్మడం లేదని అర్థం అయిందని చెప్పారు. పొత్తుల వల్ల ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదని తెలిపారు. కాపుల ఓట్ల కోసం చంద్రబాబు పెట్టుకున్న పొత్తు చిత్తవ్వ డం ఖాయమని మంత్రి ఆరోపించారు.
బీఆర్ఎస్‌కు GHMC డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతుల రాజీనామా
గ్రేటర్‌లో బీఆర్‌ఎస్‌కు పెద్ద దెబ్బ తగిలింది. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్మిక విభాగం అధినేత శోభన్‌రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపారు. పార్టీ విధానం వల్ల తమకు నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు బతకడం కష్టమని, కష్టకాలంలో మీ వెంట ఉన్న కార్యకర్తలు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో బాధపడ్డారన్నారు. తాను 24 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నానన్నారు. పార్టీలో ఉద్యమకారులకు మనుగడలేదంటూ రాజీనామా లేఖలో మోతే దంపతుల ఆవేదన వ్యక్తం చేశారు. మోతె దంపతులు శ్రీలతా శోభన్ రెడ్డి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్‌ను ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే.. రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్‌లో డిప్యూటీ మేయర్ చేరనున్నారు. డిప్యూటీ మేయర్ శ్రీలత తో పాటు ఆరుగురు బీఅర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరనున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ దళిత నాయకుడు డీ రాజేశ్వర్‌రావు కాంగ్రెస్ గూటికి చేరారు. శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. చాలకాలం పాటు ఆయనకు ఎమ్మెల్సీగా కొనసాగిన అనుభవం ఉంది.
ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష రద్దు..
ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షను రద్దు చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. పరీక్షను రద్దు చేసినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఆరు నెలల్లో తిరిగి మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని సీఎం తెలిపారు. పేపర్ లీక్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షల పవిత్రతలో రాజీపడే ప్రసక్తే లేదు.. యువత కష్టార్జితంతో ఆడుకున్న వారిని వదిలిపెట్టబోం. ఇలాంటి వికృత శక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. కాగా.. ఈ నెల 17, 18 తేదీల్లో ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో మొత్తం 48 లక్షల మంది అభ్యర్థులు 60 వేల పోస్టులకు దరఖాస్తు చేసుకుని పరీక్షకు హాజరయ్యారు. రోజుకు రెండు షిఫ్టుల్లో జరిగిన ఈ పరీక్షకు సంబంధించి పేపర్ లీక్ అయ్యినట్లు ఆరోపణలు వచ్చాయి. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లకుండా నిషేధం విధించారు. బ్లూటూత్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అంతరాయం కలిగించడానికి వారు జామర్‌లను కూడా అమర్చారు. అయినప్పటికీ పేపర్ లీకైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు యూపీ ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.
పెళ్లి చేసుకుంటానని 13 ఏళ్లుగా అత్యాచారం.. ప్రముఖ నటుడి అరెస్ట్..
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాతగా పేరున్న మనోజ్ రాజ్‌పుత్‌పై అత్యాచార అభియోగాలు నమోదయ్యాయి. తనను పెళ్లి చేసుకుంటానని 13 ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. 29 ఏళ్ల బాధితురాలు మనోజ్ రాజ్‌పుత్‌కి బంధువు. శుక్రవారం దుర్గ్ జిల్లాలోని అతని కార్యాలయం నుంచి అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి సాకుతో 2011 నుంచి రాజ్‌పుత్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధిత మహిళ ఓల్డ్ భిలాయ్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిబ్రవరి 22న ఫిర్యాదు చేసింది. మనోజ్ పెళ్లిని దాటివేస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింందని స్టేషన్ హౌజ్ ఆఫీసర్ రాజ్ కుమార్ బోర్జా తెలిపారు. అత్యాచారం, అసహజ సెక్స్, క్రిమినల్ బెదిరింపు మరియు ఇతర నేరాలకు సంబంధించి ఐపీసీ సెక్షన్ల కింద రాజ్‌పుత్‌పై అభియోగాలు మోపారు. బాధితురాలిపై లైంగిక దాడి ప్రారంభమైనప్పుడు మైనర్ కావడంతో పోక్సో చట్టాన్ని కూడా నిందితుడిపై నమోదు చేశారు. అయితే, రాజ్‌పుత్ నేరానికి పాల్పడిన 2011లో పోక్సో చట్టం లేదని, స్థానిక కోర్టు పోక్స్ నిబంధనలను రద్దు చేసింది.
బురదలో ఇరుక్కున్న మహీంద్రా థార్ 5- డోర్.. వీడియో వైరల్..
మహీంద్రా థార్.. ఈ కార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్ లోనే నెంబర్ వన్ ఆఫ్ రోడర్‌గా ఉంది. యువత దీని స్టైలిష్ లుక్స్‌కి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం 3-డోర్‌గా ఉన్న థార్, మరికొన్ని రోజుల్లో 5-డోర్ వెర్షన్‌లో రాబోతోంది. ఈ ఏడాది మధ్యలో మార్కెట్‌లోకి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మహీంద్రా థార్ 5- డోర్ వెర్షన్ టెస్ట్ రన్ జరుగుతోంది. చాలా సందర్భాల్లో ఈ కార్ టెస్టింగ్ ఫేజ్‌కి సంబంధించిన ఫోటోలు కనిపించాయి. కొత్తగా రాబోతున్న మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్ ఫీచర్ల గురించి ఇప్పటికే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ కారుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. థార్-5 డోర్ బురదలో ఇరుక్కుపోయి, కష్టపడుతున్నట్లు ఈ వీడియో చూపిస్తోంది. దీనిపై ప్రస్తుతం తెగ చర్చ నడుస్తోంది. థార్ ఆఫ్ రోడర్ కార్‌గా ప్రసిద్ధి చెందింది. అయితే, బురదలో ఇరుక్కుపోవడం చాలా అరుదు, అలాంటి కారు బురద నుంచి బయటకు రావడానికి ఎందుకు కష్టపడుతుందనే అనుమానం కలుగుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న థార్ 3-డోర్ 4 వీల్ డ్రైవ్(4×4), రియర్ వీల్ డ్రైవ్(4×2)లో లభ్యమవుతోంది. 4వీల్ డ్రైవ్ ఇలాంటి బురద, ఇసుక వంటి ఆఫ్ రోడ్ పరిస్థితుల్లో కూడా ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోను చూస్తే థార్-5 డోర్ 4×2 వేరియంట్‌గా కనిపిస్తుంది. బురద నుంచి బయటకు వచ్చే క్రమంలో థార్ వెనక చక్రాలు మాత్రమే తిరగడం వీడియోలో చూడొచ్చు.
ప్రగ్యా వేసుకున్న ఈ డ్రెస్స్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే..
ప్రగ్యా జైస్వాల్.. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయిన సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫొటోలతో కుర్ర కారు మతి పోగొడుతుంది.. గ్లామర్ పరంగా కరెక్ట్ ఫిగర్ అయిన ఈ అమ్మడుకు సినీ అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి.. దాంతో సోషల్ మీడియాలో క్రేజ్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తుంది.. బికినీ ఫొటోలతో బోల్డ్ ఫోటో షూట్ చేస్తుంది..అవి ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఆమె వేసుకున్న డ్రెస్స్ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా ఫేట్ మారలేదు. చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేని ప్రగ్యా మేకర్స్ వైపు ఆశగా చూస్తుంది. ప్రగ్యా జైస్వాల్ బాలయ్య-బోయపాటి శ్రీను మూవీలో ఛాన్స్ వచ్చింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో అమ్మడుకు వరుస ఆఫర్స్ వస్తాయని అందరు అనుకున్నారు. కానీ అలా జరగలేదు.. ఇక అందాన్ని వేస్ట్ చెయ్యకుండా సోషల్ మీడియాలో హీటేక్కించే ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.. తాజాగా రాయల్ లుక్ లో మెరిసింది. ఈ సందర్భంగా తను ధరించిన డ్రెస్ ధర నెట్టింట హాట్ టాపిక్ గా మారింది..
తొలిసారిగా చెప్పులేసుకుని షాకిచ్చిన అనుదీప్.. ఇదేందయ్యా ఇది
జాతి రత్నాలు అనే సినిమా చేసి ఓవర్ నైట్ గుర్తింపు తెచ్చుకున్నాడు అనుదీప్. అప్పటివరకు అనుదీప్ అనే వ్యక్తి ఎవరో కూడా జనానికి తెలియదు కానీ ఎప్పుడైతే నవీన్ పోలిశెట్టి హీరోగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో జాతి రత్నాలు సినిమా చేశాడో అప్పటినుంచి అనుదీప్ బాగా ఫేమస్ అయిపోయాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ కి అనుబంధంగా ఏర్పాటు అయిన స్వప్న సినిమాస్ నిర్మించిన ఈ జాతి రత్నాల సినిమా భారీ హిట్ కావడమే కాక అనేక లాభాలు కూడా తెచ్చిపెట్టింది. దానికి తోడు అనుదీప్ వ్యక్తిత్వం కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చర్చనీయాంశమవుతూ ఉంటుంది . ఎందుకంటే ఆయనని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ ప్రశ్న అడిగినా సరైన సమాధానం చెప్పకుండా దాటవేసే పద్ధతిలో సమాధానం చెబుతూ ఉంటాడు. అంతేకాదు ఏ ప్రశ్నకు ఆయన సరైన సమాధానం చెప్పడం లేదేమో అని అనుమానం కలిగించేలా ఆయన సమాధానాలు ఉంటాయి. అయితే ఆయన కాలికి చెప్పులు లేకుండా జాతి రత్నాలు సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కనిపిస్తూ ఉండేవాడు. ఎందుకు చెప్పులు వేసుకోవడం లేదు అని కొంతమంది ఇంటర్వ్యూస్ లో అడిగితే భూమికి మనకి కనెక్టివిటీ బాగా తగ్గిపోయింది. కాబట్టి వీలైనంతగా తాను చెప్పులు లేకుండానే నడుస్తానని చెప్పుకొచ్చాడు. అయితే అలాంటి అనుదీప్ ఆశ్చర్యకరంగా చెప్పులేసుకుని కనిపించాడు. అసలు విషయం ఏమిటంటే తాజాగా దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి రిసెప్షన్ హైదరాబాద్ ఎన్కన్వెన్షన్ లో జరిగింది ఈ కార్యక్రమానికి దిల్ రాజు స్వగ్రామం నుంచి అనేక మంది హాజరయ్యారు. తెలుగు సినీ పరిశ్రమలో నుంచి అగ్ర హీరోలు, దర్శక నిర్మాతలు కూడా హాజరయ్యారు ఈ వేడుకకు హాజరైన అనుదీప్ చెప్పులేసుకుని కెమెరాల కంట పడ్డాడు. ఆయన ఎందుకు చెప్పులేసుకొచ్చాడు అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
