రెబల్ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ సీరియస్.. అనర్హతపై కీలక నిర్ణయం..!
తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కాకపోవడంపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు.. రెబల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై న్యాయ నిపుణుల సలహా తీసుకోనున్నారు స్పీకర్.. రెబల్ ఎమ్మెల్యేల కోసం తన ఛాంబర్‌లో చాలా సేపు ఎదురుచూసిన ఆయన.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.. న్యాయనిపుణుల సలహా తర్వాత అర్హత వేటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.. నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌ను ఆశ్రయించింది వైసీపీ.. దీనిపై విచారణకు రావాలంటూ స్పీకర్ నోటీసులు పంపినా.. రెబల్ ఎమ్మెల్యేలు హాజరుకావడం లేదు.. మరోవైపు.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, మద్దాల గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్‌పై ఫిర్యాదు చేసింది తెలుగుదేశం పార్టీ.. ఈ రోజు తన చాంబర్‌లో వేచిచూసి.. ఇవాళ టీడీపీ, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ ల పై విచారణను ముగించారు స్పీకర్.. అయితే, ఇవాళ విచారణకు హాజరు కావడం లేదని స్పీకర్ కు లేఖ రాశారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు .. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కూడా అదే బాట పట్టారు.. దీంతో.. రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు.. న్యాయనిపుణుల సలహా తర్వాత రెబల్స్‌పై వేటు తప్పదా? అనేది ఆసక్తికరంగా మారింది.
పవన్ కల్యాణ్‌పై అక్రమ కేసులు..! ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతారా..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అక్రమ కేసులు పెడుతున్నారు.. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతారా..? అని నిలదీశారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వాలంటీర్ వ్యవస్థ లో ఉన్న లోపాలు ఎత్తి చూపిస్తే బెదిరింపులకు దిగుతున్నారు.. వాలంటీర్ ల వ్యవస్థకు బాధ్యులు ఎవరు..? అని మండిపడ్డారు. ప్రజల వ్యక్తి గత సమాచారం తీసుకుని ఎక్కడ స్టోర్ చేస్తున్నారు.. అలా వ్యక్తిగత సమాచారం తీసుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు..? ఇవే ప్రశ్నలు పవన్ కల్యాణ్ అడిగారు.. ఇలా ప్రశ్నిస్తే వాలంటీర్ ల వ్యవస్థను దూషించినట్లా? అని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ తన సైన్యం అని చెప్పుకునే, 2,55,461 మంది వాలంటీర్లలో 1,02,836 వాలంటీర్ల డేటా అసలు రికార్డులలోనే లేదు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.. అసలు వీళ్లంతా ఎక్కడ ఉన్నారు తెలియదు..? అన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తాం అని ప్రకటించారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.
భయంతోనే పొత్తులు..! సింహం సింగిల్‌గానే వస్తుంది..
టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, లోకేష్ సభలకు, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సభలకు ఉన్న ప్రజా స్పందన గమనించండి అని సూచించారు. మాట ఇచ్చిన తరువాత వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకే చెల్లిందని దుయ్యబట్టిన ఆయన.. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచేసే పరిస్థితి ఉండేది.. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో అలంటి పరిస్థితి లేదన్నారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో సంక్షేమ – అభివృద్ధి పాలన అందిస్తున్నాం అని వెల్లడించారు. ఇక, గతంలో పాఠశాలలు పెచ్చులు ఊడిపోయేవి, నేడు గ్రానైట్ పలకలతో గదులు సిద్ధం చేశామని తెలిపారు ముత్యాల నాయుడు.. టీడీపీ వ్యతిరేకించినా విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం నేర్పిస్తున్నాం అన్నారు. కానీ, సొంత కూతురుని ఇస్తే.. మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. అసలు, చంద్రబాబు అంత బలంగా ఉంటే ఎందుకు జనసేన పార్టీలో, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.. మరోవైపు.. చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చోవడానికి బాలయ్య, ఆయన కటుంబ సభ్యులు ఏవిధంగా సహకరించారో అందరికీ తెలుసని దుయ్యబట్టారు. నైతికవిలువలు లేని వ్యక్తి చంద్రబాబు.. బాబుకి ఇప్పుడు భయం పట్టుకుంది.. అందుకే పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.. పందులు గుంపుగా వస్తే.. సింహం (సీఎం వైఎస్ జగన్) సింగిల్‌గా వస్తాడు అని వ్యాఖ్యానించారు.. సింహంలా జగన్ జూలువిదిల్చితే.. ఇతర పార్టీలు అన్నీ బంగాళాఖాతంలో కలిసిపోతాయని హెచ్చరించారు ఏపీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు.
పార్టీ నిధికి రూ.10 కోట్లు విరాళం ప్రకటన.. జనసేనాని కీలక వ్యాఖ్యలు
జనసేన పార్టీ నిధి కోసం 10 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నేతలతో సమావేశమైన పవన్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. మన కూటమి అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది అని స్పష్టం చేశారు.. రాష్ట్రంలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని తెలిపారు పవన్.. మన కూటమి అధికారంలోకి వస్తోందని స్పష్టం చేసిన ఆయన.. క్షేత్రస్థాయి నుంచి మన బలాన్ని సద్వినియోగపరుకొంటూ కూటమిని గెలుపు దిశగా తీసుకెళ్లేందుకు ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని సూచించారు. వ్యక్తిగతంగా నా గెలుపు గురించి కాదు.. సమిష్టిగా గెలుపు కోసమే తొలి నుంచి నా వ్యూహం, అడుగులు ఉంటున్నాయని తెలిపారు.. జనసేన కోసం తపించి పని చేసిన ప్రతీ ఒక్కరికీ సముచిత గౌరవం కల్పించే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు పవన్ కల్యాణ్.. 2019 తర్వాత పార్టీ బలంగా నిలిచేందుకు దోహదపడ్డ నాయకులకు అండగా ఉంటామని చెప్పారు. ప్రజారాజ్యం సమయంలో ఉన్న ఒక చిన్న పరిచయంతో ఒక నాయకుడికి 2014 తర్వాత టీటీడీ సభ్యుడిగా రెండు పర్యాయాలు పదవి ఇప్పించగలిగాను.. అప్పటికీ ఆయన మన పార్టీలోకి రాలేదని ఉదహరిస్తూ.. జనసేన కోసం నిలిచిన ఎవ్వరినీ విస్మరించేది లేదు అన్నారు. ఇప్పటి ఎన్నికల్లో స్థానాలు మాత్రమే కాకుండా కూటిమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చే అవకాశాలూ దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో కావచ్చు.. పీఏసీఎస్‌ల్లో, ఇతర కీలక నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానాలు మనకు దక్కుతాయి.. తద్వారా అందరినీ బలోపేతం చేసి ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. మూడింట ఒక వంతు పదువులు దక్కించుకుందాం అన్నారు. ఏపీకి సుస్థిర పాలన అవసరమని, అప్పుడే అభివృద్ధి సాధ్యమని, అలాంటి సుస్థిర పాలన మన కూటిమి అందించగలదని ఆర్థిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు స్పష్టంగా చెబుతున్నారని తెలిపారు.. ఇక, పార్టీ పక్షాన ఎన్నికల నిర్వహణ కోసం రూ.10 కోట్లు తన స్వార్థితాన్ని నిధిగా ఇవ్వనున్నట్టు ఈ సమావేశంలో ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్
విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం.. ఇద్దరు డీఈలపై వేటు
విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో ఇద్దరు డీఈలపై వేటు పడింది. హైదరాబాద్ గచ్చిబౌలి డీఈ గోపాలకృష్ణ, మిర్యాలగూడ డీఈ వెంకటేశ్వర్లు సస్పెన్షన్ అయ్యారు. కాగా.. ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర విద్యుత్ సరఫరాలో గోపాలకృష్ణ నిర్లక్ష్యం బయటపడంతో అతన్ని సస్పెండ్ చేశారు. ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి డీఈగా గోపాలకృష్ణ దీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. అయితే ఆయనపై ఇంతకుముందు కూడా ఫిర్యాదులు చేసినప్పటికీ.. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన అలానే కొనసాగాడు. కానీ ఈసారి మాత్రం ఆయన చర్యలను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మరోవైపు మిర్యాలగూడ డీఈ వెంకటేశ్వర్లు.. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్య పాత్ర వహించడంతో ఆయనకు వేటు తప్పలేదు. చేసిన నిర్లక్ష్యానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు. మరోవైపు.. సైబర్ సిటీ, నల్లగొండ ఎస్ఈలకు కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు అధికారులు. దక్షిణ డిస్కం సీఎండి మూష్రాఫ్ అలీపై కఠిన చర్యలు తీసుకోనుంది.
ప్రాణం తీసిన పంటి వైద్యం..!
హైదరాబాద్ లో పంటి చికిత్సకు వెళ్లి ఓ వ్యక్తి బలయ్యాడు. వింజం లక్ష్మీనారాయణ అనే వ్యక్తి జూబ్లీహిల్స్ రోడ్ నెం.37లో ఎఫ్‌ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్‌లో దంత చికిత్స పొందుతూ మరణించాడు. అయితే.. దంత వైద్యుడి నిర్లక్ష్యంగా కారణంగా మృతి చెందాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అనస్థీషియా ఎక్కువ మోతాదులో ఇవ్వడమే లక్ష్మీనారాయణ మరణానికి కారణమైందని అంటున్నారు. లక్ష్మి నారాయణ స్మైల్-డిజైనింగ్ అనే ప్రక్రియ కోసం ఈ క్లినిక్‌కు వెళ్లాడు. అయితే చికిత్స సమయంలో అతనికి అనస్థీషియా ఇచ్చారు. దీంతో అతను స్పృహ కోల్పోగా.. బాధితుడిని వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితుడిని పరిశీలించిన వైద్యులు మరణించినట్లు తెలిపారు. దీంతో.. తన కుమారుడి మృతికి దంతవైద్యుడే కారణమంటూ బాధితుడి తండ్రి వింజం రాములు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అధికంగా అనస్థీషియా ఇవ్వడంతోనే తన కొడుకు మరణించాడని ఫిర్యాదులో తెలిపాడు. దంత వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని తండ్రి రాములు పోలీసులను కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
భారత్ అభివృద్ధి గురించి విదేశాలు చర్చించుకుంటున్నాయి
భారత్‌లో జరుగుతున్న అభివృద్ధి గురించి విదేశాల్లో చర్చించుకుంటున్నారని ప్రధాని మోడీ (PM Modi) తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లోని (Uttar Pradesh) లక్నోలో (Lucknow) పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు.. పలు ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మోడీ మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. ఒకప్పుడు యూపీ అంటే ఘర్షణలు.. కర్ఫ్యూలే ఉండేవన్నారు. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ కారణంగా యూపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని.. యూపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తనకు ఇంతకు మంచి సంతోషం ఏముంటుంది..?, భారత్‌లో జరుగుతున్న అభివృద్ధిపై విదేశాల్లో కూడా చర్చ జరుగుతోందని మోడీ చెప్పుకొచ్చారు. తాను 4-5 రోజుల క్రితం యూఏఈ, ఖతార్‌ను సందర్శించి తిరిగి వచ్చానని.. భారతదేశ అభివృద్ధి గురించి ప్రతి దేశం నమ్మకంగా ఉందన్నారు. ప్రపంచం మొత్తం భారతదేశం మెరుగైన రాబడికి హామీగా ఉందని తెలిపారు.
రాహుల్‌కి అఖిలేష్ కండీషన్.. దేనికి సంకేతం..!
రాహుల్ గాంధీ (Rahul Gandhis Yatra) చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈనెల 16న వారణాసిలో యాత్ర ప్రవేశించింది. ఈనెల 21 వరకు రాహుల్ యాత్ర యూపీలో కొనసాగుతుంది. ఈరోజు అమేథీ నియోజకవర్గంలోకి రాహుల్ యాత్ర ప్రవేశించనుంది. ఇదిలా ఉంటే సమాజ్‌వాదీ పార్టీ.. ఇండియా కూటమిలో మిత్రపక్షం. ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఇండియా కూటమి సమావేశాల్లో అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం రాహుల్ యాత్ర యూపీలో కొనసాగుతున్నా.. అఖిలేష్ మాత్రం ఎక్కడా పాల్గొనలేదు. దీంతో కూటమిలో ఏదో జరుగుతుందన్న లుకలుకలు వినపడుతున్నాయి. ఇప్పటికే జేడీయూ అధ్యక్షుడు నితీష్‌కుమార్ ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లిపోయారు. అఖిలేష్‌పై కూడా అలాంటి అనుమానాలే రేకెత్తుతున్నాయి. ఈ అంశంపై తాజాగా అఖిలేష్ క్లారిటీ ఇచ్చారు.
అయోధ్యలో ఒక్క దళితుడైనా కనిపించారా?.. రాహుల్ విమర్శలు
ప్రధాని మోడీపై (PM Modi) కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి విమర్శలు గుప్పించారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ సమయంలో ఒక్క దళితుడైనా కనిపించారా? అని రాహుల్ ప్రశ్నించారు. దళితులే కాదు.. ఆదివాసి అయినా రాష్ట్రపతి ముర్మును కూడా కేంద్రం ఆహ్వానించలేదన్నారు. కానీ అంబానీ, అదానీ, అమితాబ్ బచ్చన్ కుటుంబం (Amitabh Bachchan) మాత్రం కనిపించిందని రాహుల్ వ్యాఖ్యానించారు. దీని బట్టి రామమందిరంలో దళితులకు, ఆదివాసీలకు చోటు లేదని అర్థమవుతుందని రాహుల్ చెప్పుకొచ్చారు. గత నెల 22న అయోధ్య రామమందిరాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులను కేంద్రం ఆహ్వానించింది. ఈ సందర్భాన్ని ఉద్దేశించి రాహుల్.. తన ప్రసంగంలో బచ్చన్ పేర్లను లేవనెత్తారు. రామమందిర ప్రారంభోత్సవంలో ఓబీసీలకు చోటు లేదా? అంటూ మోడీని రాహుల్ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఈ ప్రోగ్రామ్‌కి ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai Bachchan) హాజరుకాలేదు.. కానీ వారి పేర్లను రాహుల్ ప్రస్తావించారు.
12.5 కోట్ల బడ్జెట్.. 10 రోజుల్లోనే 50 కోట్ల కలెక్షన్లు.. బ్లాక్ బస్టర్ ‘ప్రేమలు’
యాభై కోట్ల క్లబ్‌లో మలయాళ మూవీ ‘ప్రేమలు’ చోటు దక్కించుకుంది. పది రోజుల్లోనే ఈ సినిమా గ్లోబల్ కలెక్షన్స్ 42 కోట్లు దాటేసి 50కి చేరువ అయినట్టు సినిమా యూనిట్ ప్రకటించింది. గిరీష్ ఏడీ డైరెక్ట్ చేసిన ఈ ప్రేమలు సినిమా కేరళలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, సహా తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ హిట్ అయ్యింది. ‘ప్రేమలు’ సినిమా షూటింగ్ ఎక్కువగా హైదరాబాద్ లో జరుపుకుంది. ఇక ఈ సినిమా మలయాళం మాత్రమే రిలీజ్ అయినా సబ్ టైటిల్స్ తో సినిమాను చూసేందుకు యూత్ ఆసక్తి చూపిస్తోంది. ఆదివారం ఒక్క కేరళ నుంచే ఈ సినిమాకి రూ.3 కోట్లు వచ్చాయి. ఇక ఈ సినిమా మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా 26 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించడం కూడా మలయాళ సినిమాల్లో ఒక రికార్డు అని తెలుస్తోంది. మొదటి రోజు 90 లక్షలు కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండో రోజు రెండింతల కలెక్షన్స్ అందుకుంది. తర్వాత సినిమా వేరే లేవల్లోకి వెళ్ళింది. మల్టీప్లెక్స్‌లతోపాటు సింగిల్ థియేటర్స్ లో సైతం హౌస్‌ఫుల్‌గా సినిమా ప్రదర్శితమవుతోందని తెలుస్తోంది. ఆస్ట్రేలియా తదితర దేశాల్లోనూ ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. రెండో వారంలో కూడా ఈ చిత్రం కేరళ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్లలోకి ప్రవేశించింది. ఇది పూర్తి స్థాయి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్. ‘ప్రేమలు’ చిత్రాన్ని దిలీష్ పోతన్, ఫహద్ ఫాజిల్, శ్యామ్ పుష్కరన్ నిర్మించారు. బడ్జెట్ విషయానికొస్తే, దాదాపు 12.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా పెట్టుబడిని రికవరీ చేస్తూ దూసుకుపోతోంది. ఇటీవల విడుదలైన మలయాళ చిత్రాలలో బ్లాక్ బస్టర్ వైపు ప్రేమలు విజయ ప్రయాణం సాగుతోంది. హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాసల్, మమితా బైజు, శ్యామ్ మోహన్, అఖిలా భార్గవన్, సంగీత్ ప్రతాప్, అల్తాఫ్ సలీం, మీనాక్షి రవీంద్రన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను గిరీష్ ఎడి, కిరణ్ జోషి అందించారు.
ఆ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయనున్న బాలయ్య..?
నట సింహం నందమూరి బాలకృష్ణ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నారు.కథ నచ్చితే చాలు కొత్త దర్శకులతో అయిన సినిమా చేయడానికి ఆయన సిద్ధం గా ఉంటారు.ఇటీవలే యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన భగవంత్ కేసరి మూవీతో బాలయ్య మరో సూపర్ హిట్ అందుకున్నారు. అలాగే తన తరువాత సినిమాను మరో యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. ఇదిలా ఉంటే బాలయ్య మరో యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.కేవలం మూడు సినిమాలు మాత్రమే చేసిన అనుభవం ఉన్న దర్శకుడితో ఆయన సినిమా చేయనున్నారని సమాచారం. నాని హీరోగా నటించిన పీరియాడిక్ సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రానికి దర్శకత్వం వహించిన రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో బాలయ్య నటించనున్నట్లు తెలుస్తుంది.ఇటీవల బాలకృష్ణను కలిసి రాహుల్ సాంకృత్యాన్ ఓ స్టోరీ ని చెప్పారట.బాలయ్య కోసం ఈ దర్శకుడు ఓ పీరియడ్ డ్రామా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం… ప్రస్తుతానికి ఈ సినిమా చర్చల దశలో ఉంది. కథ నచ్చితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.బాబీ సినిమా తర్వాత బాలకృష్ణ మరో సినిమాకు అయితే కమిట్ కాలేదు. బహుశా రాహుల్ సాంకృత్యాన్ సినిమా ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి.అలాగే తనకు ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి విజయాలు అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలోనూ బాలకృష్ణ ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఆ సినిమా కోసం నందమూరి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.మరి వీరి కాంబోలో మరో సినిమా వస్తుందో లేదో చూడాలి.
సితార ఎంటర్టైన్మెంట్స్ సమర్పించు ‘భ్రమయుగం’.. తెలుగులో ఆరోజే రిలీజ్
లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ చిత్రంగా బ్లాక్ అండ్ వైట్ లో రూపొందించబడిన మలయాళ బ్లాక్‌బస్టర్ ‘భ్రమయుగం’ తెలుగులో ప్రతిష్టాత్మక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా ఫిబ్రవరి 23న విడుదల కానుంది. కొందరు నటులు తమ నటనా నైపుణ్యంతో భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అటువంటి లెజెండరీ నటుడు. ఆయన నటించిన సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. మమ్ముట్టి తాజా చిత్రం ‘భ్రమ యుగం’ కూడా అలాగే అందరి దృష్టిని ఆకర్షించింది. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ పతాకాలపై చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సినిమా యొక్క వైవిధ్యమైన కథాంశానికి, ఇందులోని మమ్ముట్టి అద్భుతమైన నటనను ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు కురిశాయి. మమ్ముట్టితో పాటు అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ వంటి నటీనటులు కూడా అద్భుతంగా నటించి మెప్పించిన ఈ చిత్రం.. ప్రేక్షకులకు వెండితెరపై ఓ కొత్త అనుభూతిని అందిస్తోంది. రచయిత-దర్శకుడు రాహుల్ సదాశివన్, సినిమాటోగ్రాఫర్ షెహనాద్ జలాల్, ఆర్ట్ డైరెక్టర్ జోతిష్ శంకర్, సంగీత దర్శకుడు క్రిస్టో జేవియర్, ఎడిటర్ షఫీక్ మహమ్మద్ అలీ, సౌండ్ డిజైనర్ జయదేవన్ చక్కాడత్, ఫైనల్ మిక్స్ ఇంజనీర్ ఎం.ఆర్. రాజాకృష్ణన్.. ఇలా చిత్ర బృందమంతా మనసుపెట్టి పనిచేసి, సమిష్టి కృషితో అద్భుతమైన అవుట్ పుట్ ని అందించారు. మలయాళం భాషలో ఇప్పటికే ‘భ్రమయుగం’ చిత్రాన్ని వీక్షించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు.. ఇది ప్రతి సినీ ప్రియుడు తప్పక చూసి అనుభూతి చెందాల్సిన సినిమా అని చెబుతున్నారు. విభిన్నమైన, ఆసక్తికరమైన చిత్రాలను నిర్మిస్తున్న సూర్యదేవర నాగ వంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ అద్భుతమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ‘లియో’ అనే బ్లాక్ బస్టర్ సినిమాను రిలీజ్ చేసిన సితార సంస్థ.. ఇప్పుడు ‘భ్రమయుగం’ తెలుగు వెర్షన్ ను ఫిబ్రవరి 23న విడుదల చేస్తోంది.
ఘనంగా బిగ్ బాస్ బ్యూటీ పెళ్లి వేడుక..వైరల్ అవుతున్న ఫోటోలు..
తెలుగు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ వాసంతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. టాలీవుడ్ హీరోయిన్ వాసంతి పెళ్లి పీటలెక్కనున్నారు. గత ఏడాదిలో డిసెంబర్ లో నిశ్చితార్థం తాను ప్రేమించిన పవన్ కళ్యాణ్ తో జరిగింది.. ఏపీ తిరుపతిలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన వీరి ఎంగెజ్మెంట్ వేడుకకు ఇరు కుటుంబసభ్యులతో పాటు.. బుల్లితెర నటీనటులు హజరయ్యారు.. వధూ వరులను అభినందించారు.. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.. ఇప్పుడు హల్దీ ఫంక్షన్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తిరుపతికి చెందిన అమ్మాయి. మోడల్ గా కెరీర్ ఆరంభించి.. సంపూర్ణేష్ బాబు నటించిన క్యాలీఫ్లవర్ లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత వాంటెడ్ పండుగాడు లో నటించింది. అదే సమయంలో బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి.. తక్కువ సమయంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాసంతికి సినిమా అవకాశాలు అంతగా రాలేదు. కానీ ఆ తర్వాత బుల్లితెరపై పలు సీరియల్లలో నటించి అలరించింది..