Site icon NTV Telugu

Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

*అధికారులకు సీఎం వార్నింగ్..! రోజుకు 18 గంటలు పని చేయాలి..
జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో సమావేశం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. ప్రతి అధికారి పూర్తి స్థాయిలో తమ విధులను నిర్వహించాలని, చేయలేని వారు తమ బాధ్యతల నుంచి తప్పుకోవచ్చని పేర్కొన్నారు. రోజుకు 18 గంటలు పని చేయాలని, పని చేయడం ఇష్టం లేని వాళ్ళు cs.. డీజీపీ కి చెప్పి తప్పుకోవచ్చన్నారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి గ్రామ సభల పై సమీక్షలు ఉంటాయన్నారు. ‘ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్‌తో ఉంది. అధికారులు ఇచ్చే సలహాలు సూచనలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎస్ ఆర్ శంకర్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క అధికారి విధులను నిర్వర్తించాలి. మాది ఫ్రెండ్లీ గవర్నమెంట్.. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉన్నంతవరకే ఫ్రెండ్లీ గవర్నమెంట్. అధికారులు సంక్షేమం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.అధికారులు ప్రజల మనసును గెలిచి మంచి పేరు తెచ్చుకోవాలి. అధికారులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎక్కడైనా పని చేయగలను అన్న ఆలోచనలో ఉండాలి.తెలంగాణ డిఎన్ఏ స్వేచ్ఛను హరిస్తే సహించదు. అరు గ్యారంటీలు అమలుకు మీరే మా సారథులు. పనిచేయడానికి ఇబ్బందికరమైన అధికారులు ఎవరైనా ఉంటే సిఎస్ డీజీపీకి చెప్పి తమ బాధ్యతల నుంచి తప్పుకోవచ్చు. అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. కబ్జాదారులు, రక్ష సరఫరాదారుల పై కటినంగా వ్యవహరించాలి. భూ కబ్జా అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదు. బుక్ మై షో సన్ బర్న్ నిర్వహణపైన పోలీసులు నిగా పెట్టి అసలు విషయం తేల్చాలి. గంజాయి పై కఠినంగా పోలీసులు వ్యవహరించాలి సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలి. గంజాయి విస్తరణ కాలేజీలో చేరింది. పోలీసులు వీటిపై చర్యలు తీసుకోవాలి. నకిలీ విత్తనాలు సరఫరా నిగా పెట్టాలి నిబంధనలో అతిక్రమిస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలి. నకిలీ విత్తనాలను కొన్ని కార్పొరేట్ వ్యవస్థలే అమ్ముతున్నాయి ఇలాంటి వాళ్లను లిస్టు తయారుచేసి ఉక్కు పాదం పెట్టాలి’ అని ఆదేశించారు.

 

*ఆరు గ్యారంటీల అమలుకు మీరే మా సారథులు.. అధికారులతో సీఎం
జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సమావేశమాయ్యారు. రాష్ట్ర పరిపాలన, శాంతి భద్రతలతో అధికారులకు దిశనిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే ప్రజా ప్రతినిధులు అధికారులు జోడెద్దుల్లాగా పని చేయాలని పిలుపునిచ్చారు. ‘అధికారులకు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు సమన్వయం లేకపోతే టార్గెట్ రీచ్ కాలేము. సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్న క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రజాప్రతినిధులు కలెక్టర్లదే. ప్రజా పాలన పేరుతో గ్రామసభను నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేయాలి. నిస్సహాయులకు ప్రభుత్వం అండగా ఉండి సహాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. అభివృద్ధి అంటే అద్దాలమేడలు రంగుల గోడలు కాదు. కుల గోడలు చూపించి అభివృద్ధి అని చూపించే ప్రజలను మభ్యపెట్టకూడదు. అట్టడుగు వర్గంలో ఉన్న పేదవాడికి చివరి వరసలో ఉన్న పేదవాడికి సంక్షేమం అందించే బాధ్యత అధికారులది’ అని పేర్కొన్నారు. అక్రమార్కులకు అవినీతి పరులను భూ కబ్జా దారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని అధికారులకు పిలుపినిచ్చారు. ‘అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. కబ్జాదారులు, రక్ష సరఫరాదారులపై కటినంగా వ్యవహరించాలి. భూ కబ్జా అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదు. బుక్ మై షో సన్ బర్న్ నిర్వహణపైన పోలీసులు నిగా పెట్టి అసలు విషయం తేల్చాలి.కొన్ని ఈవెంట్స్ భవిష్యత్తు తరాలకు ఇబ్బంది కలిగేలాగా నిర్వహిస్తున్నాయి.. వాటిపైన చర్యలు తీసుకోవాలి. సన్ బర్న్ ఈవెంట్స్ ను మహారాష్ట్ర కర్ణాటక ప్రభుత్వాలు నిషేధించాలి. వీటి వెనకాల ఎవ్వరు ఉన్న వదిలిపెట్టకండి. గంజాయి పై కఠినంగా పోలీసులు వ్యవహరించాలి సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలి. గంజాయి విస్తరణ కాలేజీలో చేరింది. పోలీసులు వీటిపై చర్యలు తీసుకోవాలి. నకిలీ విత్తనాలు సరఫరా నిగా పెట్టాలి నిబంధనలో అతిక్రమిస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలి. నకిలీ విత్తనాలను కొన్ని కార్పొరేట్ వ్యవస్థలే అమ్ముతున్నాయి ఇలాంటి వాళ్లను లిస్టు తయారుచేసి ఉక్కు పాదం పెట్టాలి. గ్రామ సభల్లో ప్రభుత్వ సందేశాన్ని ప్రజలకు అర్థం అయ్యేలాగ వినిపించాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే మా లక్ష్యం. పనిచేయడానికి ఇబ్బందికరమైన అధికారులు ఎవరైనా ఉంటే సిఎస్ డీజీపీకి చెప్పి తమ బాధ్యతలనుంచి తప్పుకోవచ్చు. బాధ్యత తీసుకున్న ప్రతి అధికారి పూర్తిస్థాయిలో తమ బాధ్యతను నిర్వర్తించాల్సిందే’ అని అన్నారు.

 

*పులివెందుల నేతలతో సీఎం జగన్‌ భేటీ
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు. వైసీపీ పార్టీ కేడర్‌ను కూడా రెడీ చేస్తున్నారు. ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. మళ్లీ వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పలు నియోజకవర్గాలకు ఇంఛార్జిలను కూడా మార్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ప్రాంతాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక నేతలతో సమావేశమై.. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి తెలుసుకుంటున్నారు. గెలుపు ఆవశ్యకతపై వివరిస్తున్నారు. ఎట్టి పరిస్థితిల్లోనూ వచ్చే ఎన్నికల గెలవాలంటూ ముఖ్యమంత్రి జగన్‌ దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్‌ కడప జిల్లాలోని ఇడుపులపాయలో పులివెందుల నేతలతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. స్థానిక సమస్యలు, క్షేత్ర స్థాయి అంశాలపై అభిప్రాయాల గురించి నేతలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలిచేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ స్థానికంగా పర్యటించాలని, ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

 

 

*కరోనా అలర్ట్‌.. కొత్త వేరియంట్‌తో అధికారులు అప్రమత్తం
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 656 కొత్త కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందారు. కేరళ, కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోనూ కరోనా మహమ్మారి కేసులు పెరుగుతుండడంతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కొత్త కరోనా వేరియంట్ కట్టడికి వైద్యులు చర్యలు చేపడుతున్నారు. పలు జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రిల్లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం జీజీహెచ్‌లో వెంటిలేటర్స్‌తో కూడి 30 పడకల ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ప్రత్యేకంగా కరోనా క్వారంటైన్‌ వార్డును ఏర్పాటు చేశారు. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్‌లో యుద్ధ ప్రాతిపదికన కరోనా సహాయక సన్నాహాలు ప్రారంభించారు. జేఎన్‌-1 కరోనా కొత్త వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి జిల్లాలో కేసులు నమోదు కాకపోయినా అనధికారికంగా కొన్ని కరోనా కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఎవరికి వారు హోం ఐసోలేషన్, సొంత వైద్యంతోనే కరోనాకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు డాక్టర్లు గుర్తించారు. కరోనా వస్తే ఎదుర్కోవడానికి ప్రభుత్వ హాస్పిటల్లో 1500 ఆక్సిజన్ పడకలు సిద్ధంగా ఉన్నాయి. జీజీహెచ్‌లో ఆరు ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌తో పోల్చుకుంటే జేఎన్‌-1 ప్రభావం తక్కువగానే ఉంటుందని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ అశ్రద్ధ చేయొద్దని, కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.

 

*ఏపీలో రాజకీయాలపై సినీ నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీలో రాజకీయాలపై సినీ నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహావిష్కరణకు విచ్చేసిన సినీ నటుడు పృథ్వీరాజ్ ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుందని పృథ్వీరాజ్ జోస్యం చెప్పారు. రానున్న 100 రోజుల తర్వాత రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందనుందన్నారు. యువగళం ముగింపు సభ… కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార సభలా ఉందని ఆయన అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి మాట ప్రజలకు చేరువైందన్నారు. వైసీపీ నాయకుల నోర్లు ఫినాయిల్‌తో కడిగినా మారవు.. మంచి మాట్లాడినా చెడుగా అర్థం చేసుకుంటారన్నారు. నిజంగా 175 కు 175 సీట్లు వైసీపీకి వచ్చే పరిస్థితి ఉంటే 92 స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల మార్పు ఎందుకోసం అంటూ ఆయన ప్రశ్నించారు. జనసేన, టీడీపీ పాలనతోనే రాష్ట్ర ప్రజలకు శాంతి, సంక్షేమం, అభివృద్ధి ఫలాలు లభిస్తాయన్నారు. సినీ నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. “వచ్చే ఎన్నికలతో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. బలిజల ఐక్యత ఎలా ఉంటుందో రానున్న ఎన్నికల ఫలితాల్లో తెలుస్తుంది అధికార పార్టీ నాయకులు ఎన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన కవ్వింపులకు దిగినా ఆవేశాలకులోను కావద్దు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా నేను పోటీకి సిద్ధంగానే ఉన్నా. అనకాపల్లి నుంచి పోటీ చేసేందుకు కూడా నేను రెడీ. అంబటి రాంబాబు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే జబర్దస్త్ షోలకు పనికి వస్తాడు. రోజాకు అహంకారం ఎక్కువ. అందుకే ఆమెపై ఎవరైనా విమర్శలు చేసినా…సొంత పార్టీలో మహిళా మంత్రులుగాని, ప్రజా ప్రతినిధులు ఎవరు రోజాకు మద్దతు తెలపలేదు. ఎన్నికల నోటిఫికేషన్ రావడమే ఆలస్యం… అధికార పార్టీ నుంచి జంపింగ్ జపాంగ్‌లు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు. వందల ఎకరాలు ఉన్న వారికి కూడా రైతుబంధు ఇవ్వడం బీఆర్ఎస్‌కు నష్టం కలిగించింది. ఫెవికాల్ వేసుకుని సీఎం కుర్చీకి నేనే అతుక్కుని ఉంటా… నేనే దోచుకోవాలి. రాష్ట్రంలో మరో నాయకుడు ఎదగకూడదు… అనుకుంటే ఎవరైనా భూస్థాపితం కావాల్సిందే.” అని పృథ్వీరాజ్‌ అన్నారు.

 

*చంద్రబాబు-పీకే భేటీపై కొడాలి ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు విషయం ఇదే..!
టీడీపీ అధినేత చంద్రబాబు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు.. కృష్ణా జిల్లా గుడివాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా.. సీఎం వైఎస్‌ జగన్‌ను పీకేదేం ఉండదన్నారు. చంద్రబాబు అవుట్‌డేటెడ్‌ పొలిటీషియన్‌ అని సీఎం జగన్, మేం రోజు చెబుతూనే ఉన్నాం.. ఇప్పుడు ప్రశాంతి కిషోర్ ను కలిస్తే భూమి బద్దలై పోతుందా..? అని ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ ను మేం పూర్తిగా వాడేశాం.. ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయిందని వ్యాఖ్యానించారు. మా వ్యూహకర్తగా ఉన్నప్పుడు బీహార్ నుండి వచ్చిన ప్రశాంత్ ఏం పికుతాడు తమ్ముళ్లు అన్న చంద్రబాబు.. ఇప్పుడు ఏం పికడానికి భేటీ అయ్యాడో పసుపు తమ్ముళ్లకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రశాంత్ కిషోర్‌ సూచనలతో బాబాయ్ ని చంపి, జగన్ కోడి కత్తి డ్రామాలు అడారని గగ్గోలు పెట్టారు.. మరి ఇప్పుడు చంద్రబాబు పీక కోయించుకోవడానికి.. లోకేష్ తండ్రిని చంపడానికి ప్లాన్ వేస్తున్నారా? అంటూ ఎద్దేవా చేశారు కొడాలి నాని.. ఇక, ప్రశాంతి కిషోర్ కు, ఐప్యాక్ కు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో చేరమని సీఎం మమతా బెనర్జీ పంపితే ప్రశాంత్ కిషోర్ ఏపీకి వచ్చారని చెప్పుకొచ్చారు.. పాట్నర్ పీకే (పవన్‌ కల్యాణ్‌) బీజేపీతో చర్చలు జరుపుతుంటే.. మరో పీకే (ప్రశాంత్‌ కిషోర్‌) ఇండియ కూటమి, మమతా బెనర్జీ, కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నాడు అని దుయ్యబట్టారు. మరోసారి చంద్రబాబు తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాన

 

*”హిందీ మాట్లాడేవాళ్లు టాయిలెట్లు క్లీన్ చేస్తారు”.. డీఎంకే ఎంపీ వ్యాఖ్యలపై బీహార్ డిప్యూటీ సీఎం ఫైర్..
ఉత్తరాది వాళ్ల గురించి మరోసారి డీఎంకే పార్టీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది. ఉత్తర్ ప్రదేశ్, బీహార్ నుంచి వచ్చే హిందీ మాట్లాడే వాళ్లు తమిళనాడులో టాయిలెట్లు క్లీన్ చేస్తున్నారంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీతో పాటు ఆర్జేడీ నేత, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఫైర్ అవుతున్నారు. డీఎంకే ఎంపీ దయానిధి వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాల స్పందించారు. యూపీ, బీహార్ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు డీఎంకే పార్టీతో పాటు ఇండియా కూటమి నేతలను దుయ్యబట్టారు. డీఎంకే నేతలు బీహార్ ప్రజలను అవమానపరచడం మానేయాలని బీజేపీ నేత, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఇండియా కూటమిలోని నేత, సీఎం నితీష్ కుమార్ వల్లే.. బీహార్ ప్రజలు తమిళనాడు వెళ్లాల్సి వస్తోందని ఆయన ఆరోపించారు. ఇండియా కూటమి నేతలు ప్రజల్ని కులం, భాష, మతాల వారీగా విభజించేందుకు ప్రయత్నిస్తోందని పూనావాల ఆరోపించారు. డీఎంకే వ్యాఖ్యలపై ఇండియా కూటమి నేతలు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారని ప్రశ్నించారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ మాట్లాడుతూ.. ఇంగ్లీష్ నేర్చుకున్న వారితో హిందీ మాట్లాడే వారిని పోల్చుతూ.. ఇంగ్లీష్ మాట్లాడేవారు పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ, లక్షలు సంపాదిస్తున్నారని, హిందీ మాట్లాడే బీహార్, యూపీ వాళ్ల తమిళనాడులో చిన్న ఉద్యోగాలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇండియా కూటమి నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేసినా కూడా తప్పుపట్టాల్సిందే అని అన్నారు. ఈ దేశమంతా ఒక్కటే అని ఇతర రాష్ట్రాలను గౌరవించాలని అన్నారు. అంతకుముందు 5 రాష్ట్రాల ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన తర్వాత డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గోమూత్ర రాష్ట్రాల్లో గెలుస్తుందంటూ ఎద్దేవా చేశారు. దీనిపై ఆ తర్వాత అతను క్షమాపణలు చెప్పారు. అంతకుముందు డీఎంకే కీలక నేత, తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాలతో పోలుస్తూ, దాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించడం కూడా వివాదాస్పదం అయింది.

 

*రెజ్లింగ్ ఫెడరేషన్ కొత్త పాలక వర్గం సస్పెండ్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం..
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) కొత్త పాలక వర్గాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. డబ్ల్యూఎఫ్ఐ బాడీ ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను, నియమాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు మంత్రిత్వ శాఖ గుర్తించిందని ఆదివారం ప్రకటించింది. జాతీయ పోటీలకు సంబంధించి చేసిన ప్రకటన తొందరపాటుతో కూడుకున్నదని, సరైన ప్రక్రియను పాటించలేదని క్రీడా మంత్రిత్వ శాఖ అధికార ప్రకటనలో తెలిపింది. డబ్ల్యూఎఫ్ఐ కొత్త చీఫ్ గా ఇటీవల సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన, లైంగిక ఆరోపణ ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కి సంజయ్ సింగ్ అత్యంత సన్నిహితుడు. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ సంజయ్ సింగ్ డిసెంబర్ 21న జూనియర్ జాతీయ పోటీలు ఈ ఏడాది చివరిలోపు ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, రెజ్లర్ల సిద్ధం కావాలంటే కనీసం 15 రోజుల నోటీస్ అవసరమని మంత్రిత్వశాఖ పేర్కొంది. ‘‘అటువంటి నిర్ణయాలను కార్యనిర్వాహఖ కమిటీ తీసుకోవాల్సి ఉంటుంది, దీనికి ముందు అజెండాను పరిశీలనలో ఉంచాలి. డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంలోని ఆర్టికల్ 11 ప్రకారం.. ‘నోటీసులు, సమావేశాల కోరం’ కోసం 15 రోజుల ముందు తెలియజేయాలని, 1/3 మంది ప్రతినిధులు హాజరు కావాలి. అత్యవసర సమావేశానికి కూడా 7రోజుల వ్యవధితో నోటీసులు, 1/3 వంతు ప్రతినిధుల కోసం అవసరం’’ అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ఈ వ్యవహారంపై సంజయ్ సింగ్ చట్టపరమైన పోరాటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సస్పెన్షన్ వ్యవహారాన్ని కోర్టులో సవాల్ చేయనున్నారు. ఇదే కాకుండా కేంద్ర మంత్రిత్వ శాఖ సంచలన ఆరోపణలు చేసింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న పాత పాలక వర్గం చేతిలో కొత్తగా ఎన్నికైన బాడీ ఉన్నట్లు తెలుస్తోందని చెప్పింది. డబ్ల్యూఎఫ్ఐ వ్యవహారం వివాదాలకు కారణమవుతోంది. గతంలో మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయన సన్నిహితుడే మరోసారి అధ్యక్షుడు కావడాన్ని రెజ్లర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే రెజ్లర్ సాక్షి మాలిక్ రెజ్లింగ్‌కి గుడ్ బై చెప్పారు. బజరంగ్ పూనియాతో పాటు వీరేందర్ సింగ్ వంటి రెజ్లర్లు పద్మశ్రీని వాపస్ ఇస్తున్నట్లు ప్రకటించారు.

Exit mobile version