నాయకుడి మాట మాకు వేదం.. గంగలో దూకమంటే దూకుతాం..
మా నాయకుడి మాట మాకు వేదం.. గంగలో దూకమంటే దూకుతాం అని ప్రకటించారు మంత్రి మేరుగు నాగార్జున.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మేం స్కీములు తీసామని అంటున్నారు.. బహిరంగ చర్చకు రండి అంటూ సవాల్ చే శారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కార్యక్రమంపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోందన్న ఆయన.. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిని గత ప్రభుత్వం పట్టించుకోలేదు.. దానిలో అవకతవకలు జరిగాయన విమర్శించారు. మా నాయకుడిని చూసి మాకు ఓట్లేస్తారు.. నాయకుడి మాట మాకు వేదం.. గంగలో దూకమంటే దూకుతాం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక, మా నియోజకవర్గ ప్రజలను సరి చేసుకొని సంతనూతలపాడు ప్రజలను గెలిపించమని అర్ధిస్తాం అన్నారు మంత్రి నాగార్జున.. తన నియోజకవర్గ మార్పుపై ఆయన మాట్లాడుతూ.. నారా లోకేష్ ఎర్రబుక్కు అంటూ పదే పదే అంటున్నారు.. లోకేష్.. ఎర్రబుక్కు మీ నాన్నకు ఇవ్వు.. ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటారు అంటూ ఎద్దేవా చేశారు. ఇంఛార్జ్‌ల మార్పులు చేర్పులు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పార్టీ మంచి కోసమే చేస్తున్నారని తెలిపారు.. మేం మార్చుకుంటే మీకేంటి అని ప్రతిపక్ష నేతను అడుగుతున్నా..? అని నిలదీశారు. చంద్రబాబు బీసీల దగ్గర పోటీ చేస్తున్నారు.. లోకేష్ ఎక్కడ పుట్టారు.. మంగళగిరిలో ఎలా పోటీ చేస్తారు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రి మేరుగు నాగార్జున.
సీఎంవోకు వెల్లంపల్లి శ్రీనివాస్.. సీటు మార్పు వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో.. సీట్ల మార్పుపై తీవ్ర చర్చ సాగుతోంది.. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కాల్ వచ్చిందంటే చాలు.. సీటు మార్పు ఖాయమనే చర్చ సాగుతోంది.. అంతే కాదు.. కొందరికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొద్దు అని చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. దీంతో, మంత్రులు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. ఇలా చాలా మందినిలో టెన్షన్ నెలకొంది.. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సీఎంవోకు వచ్చారు.. వెల్లంపల్లికి టిక్కెట్ ఉండదని ప్రచారం జరుగుతోన్న సమయంలో.. ఆయన సీఎంవోకు రావడం చర్చగా మారింది.. ఇక, ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన సీటు మార్పు వ్యవహారంపై స్పందించారు. నాకు సీటు లేదని, సీటు మారుస్తున్నారని రకరకాల ప్రచారం చేస్తున్నారు.. నా సీటు మార్పుపై అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి క్యాంప్ ఆఫీసుకి నేను, మేయర్ రెండు రోజులు క్రితం వెళ్లాం.. సీటు మార్పు గురించి.. నా దగ్గర ఇప్పటివరకు అధిష్టానం ప్రస్తావించలేదన్నారు. అయితే, నేను విజయవాడ వెస్ట్ నియోజకవర్గ నుండి మళ్లీ పోటీ చేస్తా.. విజయవాడ సెంట్రల్ స్థానానికి వెళ్లమన్నారనేది ప్రచారం మాత్రమే నంటూ కొట్టిపారేశారు. నేను పార్టీకి రాజీనామా చేశానని ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నేను సీఎం వైఎస్ జగన్‌ను నమ్ముకున్న వ్యక్తిని.. జగన్ ఏం చెప్పినా.. చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు. అంతేకాదు.. విజయవాడ మూడు నియోజకవర్గాలతో పాటు, ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక నిర్ణయం.. రంగంలోకి వైసీపీ అధిష్టానం
అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒకే చర్చ.. సీటు ఉంటుందా? మారుతుందా? ఇంకా ఎవరైనా కొత్త ఇంఛార్జ్ వస్తాడా? మంత్రులు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. ఇలా అందరిలోనూ ఒకటే టెన్షన్.. అయితే, ఈ నేపథ్యంలో.. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.. ఇప్పటికే పలుమార్లు పార్టీ నేతలతో బుజ్జగించే ప్రయత్నాలు చేసింది వైసీపీ అధిష్టానం.. నిన్న, ఇవాళ కూడా సీఎంవోకి రావాలని వసంత కృష్ణప్రసాద్‌కు సమాచారం పంపింది అధిష్టానం.. కానీ, ఆయన అధిష్టానం పిలుపుపై అంత ఆసక్తిగా లేనట్టు స్పష్టమైంది.. ఎందుకంటే.. ఆయన హైదరాబాద్‌లోనే ఉండిపోయారు..
విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో పిటిషన్.. విచారణ వాయిదా
విశాఖపట్నంకు ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ సాగింది.. అయితే, ప్రభుత్వం కేవలం ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం మాత్రమే విశాఖలో ఏర్పాట్లు చేస్తున్నట్టు హైకోర్టుకు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.. కానీ, అమరావతిలో ఉన్న కార్యాలయాల కంటే భారీ స్థాయిలో శాశ్వత నిర్మాణాలు విశాఖలో చేస్తున్నట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. దీంతో, ప్రజాధనం వృథా అవుతుందని.. అందుకే ప్రభుత్వ కార్యాలయాలు విశాఖకు తరలింపుపై స్టే ఇవ్వాలని హైకోర్టును కోరారు పిటిషనర్.. అయితే, కేసును ఫైల్ బెంచ్ కు బదిలీ చేస్తానని, అప్పటి వరకు స్టేటస్ కో ఇస్తామని హైకోర్టు చెప్పింది.. ఇదే సమయంలో సమయం కావాలని హైకోర్టును కోరింది ప్రభుత్వం.. దీంతో, విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.. ఈ లోపు ప్రజాధనం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, గతంలో R5 జోన్ విషయంలో ఇలానే ఒకరోజుకి సీఎం కార్యక్రమ పేరిట 3 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని కోర్టుకు తెలిపారు పిటిషనర్..
ప్రాజెక్టుల అవినీతిపై విచారణ చేస్తాం.. బాధ్యులను శిక్షిస్తాం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రాజెక్టులపై హరీష్ రావు విచారణ చేయండి అని అంటున్నారు.. ఖచ్చితంగా విచారణ చేస్తామని తెలిపారు. బాధ్యులను శిక్షిస్తామని చెప్పారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరం అయినా సాగు అదనంగా వచ్చిందా అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుకి ఎందుకు నిధులు విడుదల చేయలేదని ఆయన ప్రశ్నించారు. పాలమూరుకి రూ.25 వేల కోట్లు ఖర్చు పెడితే.. కొత్త ఆయకట్టు లేదని అన్నారు. సీతారాం ప్రాజెక్టుకి ఆయకట్టు సున్నా.. కొత్త ఆయకట్టు లేకుండా, లక్షల కోట్లు పెడితే వృధా కాదా అని మంత్రి ఉత్తమ్ అన్నారు. మేడిగడ్డపై ఆనాటి సీఎం ఒక్క మాట మాట్లాడలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎల్అండ్టీ మాకు ఏం సంబంధం అని అంటోంది. డిసైన్ ఇచ్చారు.. మేము కట్టాం అంతే అంటున్నారని తెలిపారు. అధికారులను అడిగితే.. ఇంకెవరు సర్.. డిజైన్ చేసేది వాళ్లే కదా అన్నారని మంత్రి ఉత్తమ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుపుతాం.. బాధ్యులపై చర్యలు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.
డీహెచ్గా శ్రీనివాసరావు రిలీవ్.. హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్లు
ఈరోజు (బుధవారం) డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్గా డాక్టర్ శ్రీనివాసరావు రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ రవీంద్ర నాయక్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో.. శ్రీనివాసరావు కార్యాలయం నుండి వెళ్తుండగా కొందరు డాక్టర్లు కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయనను హత్తుకుని డైరెక్టర్ కార్యాలయంలో పని చేసిన ఉద్యోగులు, సిబ్బంది ఏడ్చారు. కోవిడ్ కట్టడిలో సమర్థవంతంగా పని చేశారు అంటూ శ్రీనివాసరావుతో కన్నీటి పర్యంతమయ్యారు. కాగా.. ఆయన గుర్తుగా డాక్టర్ శ్రీనివాసరావుతో ఫొటోలు దిగేందుకు ఉద్యోగులు, డాక్టర్లు ఎగబడ్డారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీగా ఐపీఎస్, ఐఏఎస్ లకు పదోన్నతులు, బదిలీలు, స్థానచలనం చేస్తున్నారు. ఈ క్రమంలో.. శ్రీనివాసరావు స్థానంలో డాక్టర్ రవీంద్ర నాయక్ ను హెల్త్ డైరెక్టర్ గా నియమించింది. కాగా.. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌గా డాక్టర్ రమేశ్ రెడ్డి స్థానంలో త్రివేణిని నియమించింది.
“హిందీ తెలిసి ఉండాలి”.. ఇండియా కూటమి సమావేశంలో డీఎంకే నేతపై ఆగ్రహం..
ఇటీవల కాలంలో హిందీ భాష వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా తమిళనాడు నాయకులు ఈ వివాదాన్ని రేకెత్తిస్తున్నారు. అధికార డీఎంకే పార్టీ నాయకులు హిందీ భాషను తమపై రుద్దొద్దంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల గోవాల ఎయిర్ పోర్టులో ఓ తమిళ మహిళకి హిందీ రాకపోవడంపై అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అవహేనగా మాట్లాడారంటూ.. ఏకంగా సీఎం స్టాలిన్ తప్పుబట్టారు. కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే మంగళవారం ఇండియా కూటమి సమావేశంలో హిందీపై వివాదం చెలరేగింది. జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి సీఎం నితీష్ కుమార్ సమావేశంలో గంట పాటు మాట్లాడారు. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న డీఎంకే నాయకుడు టీఆర్ బాలు, హిందీలో చేసిన ప్రసంగాన్ని అనువాదం చేయాలని కోరడంతో అంతా నిశ్చేష్టులయ్యారు. ఈ సమావేశంలో డీఎంకే తరుపున తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు టీఆర్ బాలు పాల్గొన్నారు. సమావేశంలో నేతలను ఉద్దేశించి సీఎం నితీష్ కుమార్ మాట్లాడారు. అయితే అతను ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోలేక, టీఆర్ బాలు ప్రసంగాన్ని అనువదించాలని ఎదురుగా కూర్చున్న ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ కే. ఝాకు కోరారు.
అంబానీ, అదానీలను వెనక్కి నెట్టిన 73 ఏళ్ల మహిళ.. ఈ ఏడాది ఈమె టాప్
భారత కుబేరులు అనగానే టక్కున అంబానీ, అదానీ పేర్లు చెప్పేస్తారు. దేశ సంపన్నుల జాబితాలో అంబానీ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఆ తర్వాత అదానీ. మొత్తం సంపాదనలో వారు టాప్‌లో ఉండగా.. ఈ ఏడాది మాత్రం వారిని వెనక్కి నెట్టారు సావిత్ర జిందాల్. ‘బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్’ నివేదిక ప్రకారం.. 2023 ఏడాదిలో అత్యధిక సంపద ఆర్జించిన జాబితాలో 73 ఏళ్ల మహిళ సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో నిలిచారు. మొత్తం సంపద రూ.2.1 లక్షల కోట్లతో దేశ సంపన్నుల జాబితాలో ఆమె 5వ స్థానంలో ఉన్నారు. ఆ అయితే ఈ ఒక్క ఏడాదిలోనే ఆమె సంపద రూ.80 వేలకోట్లు పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది. దాంతో అంబానీ, అదానీ, బిర్లా.. వంటి ప్రముఖుల సంపదను సావిత్రి జిందాల్ మించిపోయారు. జిందాల్ గ్రూప్‌ను స్థాపించిన ఓం ప్రకాశ్ జిందాల్ సతీమణే సావిత్రి జిందాల్. ఆయన మరణానంతరం ఆమె ఓపీ జిందాల్ గ్రూప్ ఛైర్‌పర్సన్‌గా భాద్యతలు చేపట్టారు. ఈ గ్రూప్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ అండ్ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జిందాల్ స్టెయిన్‌లెస్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు కంపెనీల షేర్లు దేశీయ మార్కెట్లో లాభాల్లో దూసుకెళ్లడంతో ఈ ఏడాదికి సావిత్రి జిందాల్ సంపద భారీగా పెరిగింది.
శేష్ EX శృతి.. లవ్ స్టోరీలా లేదు.. రివెంజ్ స్టోరీలా ఉంది
యంగ్ హీరో అడివి శేష్, శృతి హాసన్ జంటగా షానీల్ డియో దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోందని తెల్సిందే. ఈ మధ్యనే అడివి శేష్ అధికారికంగా ప్రకటించాడు. శేష్ EX శృతి అంటూ టైటిల్ పెట్టి.. ఆసక్తిని పెంచాడు. S.S.క్రియేషన్స్ మరియు సునీల్ నారంగ్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. ముందు నుంచి సోషల్ మీడియాలో వార్తలు వచ్చినట్లే.. ఈ సినిమాకు డెకాయిట్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఒక ప్రేమ కథ అనేది ట్యాగ్ లైన్. ఇక టైటిల్ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు హీరో.. విలన్స్ మీద రివెంజ్ తీర్చుకోవడం చూసాం. కనై, ఈ టైటిల్ టీజర్ లో శృతి, శేష్ ల మధ్య రివెంజ్ స్టోరీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. యుద్దభూమిలో ఒకపక్క శేష్, ఇంకోపక్క గన్ పాంట్టుకొని శృతి హాసన్ మాయ జరిగిన సంభాషణను ఈ టీజర్ లో చూపించారు. జూలియట్ ఎన్నేళ్లు అయ్యింది మనం కలిసి అని శేష్ అనగా.. కలిసి కాదు విడిపోయి అని శృతి చెప్పుకొచ్చింది. ఇలా వీరిద్దరి మధ్య ప్రేమ, మోసం, పగ అని చూపించారు. ఇక ఒకరికి ఒకరు ఎదురయ్యినప్పుడు.. నేను నీకు ఏమవుతాను.. ఎక్స్ నా.. ? అంటే అది ఒకప్పుడు అని శృతి చెప్పుకొస్తుంది. అయితే ఇప్పుడేంటి.. వెధవనా.. ? దొంగనా.. ? విలన్ నా అంటూ ప్రశ్నిస్తాడు. ఇక చివర్లో ఒకరికి ఒకరు గన్ ను గురిపెట్టుకొని కాల్చుకున్నట్లు చూపించారు. ఇక ఆ షాట్ తో టైటిల్ ను రివీల్ చేశారు. ఇలాంటి కథ ఇప్పటివరకు ఎక్కడా చూసినట్లు అనిపించడం లేదు. అసలు శేష్, శృతి మధ్య ప్రేమ.. పగలా ఎలా మారింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది. మరి ఈ సినిమాతో శేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
కోతి ప్రాణాలను కాపాడబోయి 13 మందిని రిస్క్ లో పెట్టిన డ్రైవర్.. ఇద్దరు మృతి..
కరీంనగర్ జిల్లాలోని వేములవాడ శివారులోని చింతల్ ఠాణాకు చెందిన మహిళా కూలీలు వరినాట్ల కోసం చందుర్తి మండలం మర్రిగడ్డకు వెళ్లారు. వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి బయలుదేరారు. ఇలా 13మందితో ఆటో వేగంగా వెళుతుండగా ఊహించని ప్రమాదం జరిగింది.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ అడ్డంగా వచ్చింది.. ఆ కోతిని తప్పించబోయి ఆటో బోల్తా పడింది. పల్టీలు కొడుతూ ఆటో బోల్తాపడటంతో అందులోని ప్రమాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికుల ఆర్థనాదాలు, రక్తపు గాయాలు, చెల్లాచెదురుగా పడ్డ వస్తువులు, తుక్కుతుక్కయిన ఆటోతో ఆ ప్రాంతం అంత భయంకరంగా మారింది.. ఈ ప్రమాదంలో ఇద్దరు వృద్ధ మహిళలు ప్రాణాలను కోల్పోయారు.. నలుగురి పరిస్థితి విషమంగా వుందని… మిగతావారు కూడా గాయాలతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ప్రమాదానికి గురయినవారంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.. కోతి వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్దారించారు.. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
వాళ్ళు సినీ నిరక్షరాస్యులు.. డబ్బివ్వలేదనే ఇలా.. క్రిటిక్స్ పై యానిమల్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
డిసెంబర్ మొదటి తేదీన విడుదలైన ‘యానిమల్’ టాప్ సూపర్ స్టార్స్ లిస్ట్ లో రణబీర్ కపూర్ ను చేర్చింది. ఈ సినిమాలో విలన్‌గా నటించిన బాబీ డియోల్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ సినిమా దెబ్బకి తృప్తి డిమ్రీ ఇప్పుడు మంచి క్రేజ్ తెచ్చుకుంది, అభిమానులు సోషల్ మీడియాలో ‘నేషనల్ క్రష్’ అని పిలవడం ప్రారంభించారు. అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే ‘యానిమల్’ బాలీవుడ్ లో నిరంతర విమర్శలను ఎదుర్కొంటోంది. సినిమాలోని చాలా సన్నివేశాలు సినీ విమర్శకులకు జీర్ణించుకోలేనివి అనిపించడంతో పలు విమర్శలు వచ్చాయి. ఈ సినిమా కంటెంట్ సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. ‘యానిమల్’ అనేది మహిళలకు వ్యతిరేకమని, విషపూరితమైన పురుషాధిక్యతను ప్రచారం చేస్తుందని అంటూ కొందరు ఫెమినిస్టులు సైతం కామెంట్ చేశారు. ఇన్ని విమర్శల మధ్య ఇప్పుడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా క్రిటిక్స్ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సందీప్ రెడ్డి వంగా కనెక్ట్ ఎఫ్ఎమ్ కెనడాతో మాట్లాడుతూ, ఈ సినిమా మీద వారు విమర్శలు చేయడం వింతగా ఉందని అన్నారు.
