Site icon NTV Telugu

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

సుమారు 1200 మంది వాలంటీర్ల రాజీనామా

అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో సుమారు 1200 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా వారు నిర్వహిస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా వాలంటీర్లను విధుల నుండి తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వాలంటీర్లంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెయ్యాలంటే వారు స్వయంగా రంగం లోకి దిగాల్సిందేనని తీర్మానించుకుని ఈ రాజీనామా అస్త్రాలు సంధిస్తున్నారు. రాజీనామాలు అనంతరం వీరంతా పార్టీ కార్యకర్తల్లా మారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను వాటి ఫలాలను ప్రజలకు వివరించి తద్వారా వారి ఓట్ల ను జగన్మోహన్ రెడ్డికి వేసేలా వీరు కృషి చేయనున్నారు.

బాబు.. మీ అమోగమైన పాలన ప్రత్యక్షంగా చూశారు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మా పలాస బహిరంగ సభ పెట్టారన్నారు మంత్రి సీదిరి అప్పల రాజు. ఇవాళ ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. బాబు.. మీ అమోగమైన పాలన ప్రత్యక్షంగా చూశారన్నారు. రాష్ర్టాన్ని పద్నాలుగెండ్లు ఎలా దోచుకున్నారో ప్రజలు చూశారని ఆయన విమర్శించారు. పెత్తందారులు రాష్ర్టాన్ని ఎలా సంకనాకించారో చుసామని, బాబు స్కిల్ డవలప్ మెంట్ స్కాంలో పైనాన్స్ సెక్రటరీ పీవీ రమేష్ అన్నారు. రూల్స్ అతిక్రమించి ఒరల్ ఇనస్ట్రక్షన్ సిఎం ఇచ్చారని రాసిందెవరని ఆయన ప్రశ్నించారు. పివి రమేష్ నొట్ పైల్ లో స్వదస్తూరితో రాసారు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఓ దళిత , ఆర్థిక మేధావిగా మీకు తెలియదా, అదే బడ్జెట్‌లో ఏం చేశామో అని ఆయన మంత్రి సీదిరి అప్పాలరాజు అన్నారు.


ఆడాళ్లు మీకు జోహార్లు.. కాటేసిన పాముతో హాస్పిటల్ కి వచ్చిన మహిళ

పాము కరిస్తే ఏం చేస్తారు ? సాధారణంగా అయితే అందరూ వెంటనే అందుబాటులో ఉన్న హాస్పిటల్ కు వెళ్తారు. తమను పాము కాటేసిందని వైద్యం అందించాలని అభ్యర్థిస్తారు. అక్కడున్న డాక్టర్లు చికిత్స అందిస్తారు. అయితే ములుగు జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పాము కాటేసిందని ఓ మహిళ ఏకంగా పాముతో సహా ఆసుపత్రికి వచ్చింది. దీంతో డాక్టర్లు అందరూ షాక్ అయ్యారు. ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం ముకునూరుపాలెం గ్రామానికి చెందిన శాంతమ్మ అనే మహిళ కూలీ పని చేసుకుంటూ జీవనంసాగిస్తుంది. రోజులాగా సోమవారం కూడా కూలిపని కోసం వెళ్లింది. అయితే అక్కడ అందరితో కలిసి ఉపాధి పనులు చేస్తుండగా ఒక్కసారిగా ఆమెచేతికి ఏదో తాకినట్లు అనిపించింది. అయితే తరువాత ఆమె చేతి వేలికి నొప్పి ఎక్కవ కావడంతో ఏమైందంటూ చేతిని చూడగా పాముకాటు వేసి అక్కడి నుంచి వెళుతుంది. వెంటనే ఆ పామును గమనించిన శాంతమ్మ దానిని పట్టుకుంది. అక్కడ వున్న వారంత శాంతమ్మను చూసి షాక్ అయ్యారు. ఏం జరిగింది అని అడుతుండగానే వైద్యుల దగ్గరకు తీసుకుని వెళ్లాలని శాంతమ్మ సూచించింది. స్థానికులు శాంతమ్మను వెంటనే వైద్యుల దగ్గరకు తీసుకుని వెళ్లారు.

సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడి అరెస్ట్‌

గత శనివారం సీఎం వైఎస్‌ జగన్‎పై రాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే.. సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడి గుర్తించారు పోలీసులు. దాడి చేసింది సతీష్‌ కుమార్‌ అలియాస్‌ సత్తిగా పోలీసులు గుర్తించారు. ఈ రోజు ఉదయం సతీష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఫుట్‌పాత్‌ కోసం వేసే టైల్‌ రాయితో దాడి చేసినట్లు తెలుసుకున్నారు. రాయిని జేబులో వేసుకొని వచ్చి దాడిచేశాడని పోలీసులు దర్యాప్తులో తేలింది. దాడి చేసిన సమయంలో సతీష్‌తో పాటు ఉన్న ఆకాష్‌, దుర్గారావు, చిన్నా, సంతోష్‌లను కూడా సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు బృందాలు నిందితుడి కాల్ డేటాను ట్రాక్ చేసి అతడిని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నాయి. ఈ కేసులో మరికొందరు కూడా ప్రమేయం ఉన్నారా అనే విషయాన్ని గుర్తించేందుకు తదుపరి విచారణ కొనసాగుతోంది. విజయవాడ సీసీఎస్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు వీరిని ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు.

బీజేపీ లోక్ సభ అభ్యర్థుల 12వ జాబితా విడుదల

బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల 12వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ లోక్‌సభ స్థానం నుంచి అభిజిత్ దాస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఆయన సవాలు విసిరారు. దీంతో పాటు యూపీలోని రెండు స్థానాల నుంచి అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఫిరోజాబాద్ నుంచి ఠాకూర్ విశ్వజిత్ సింగ్ బరిలోకి దిగనున్నారు. ఇది కాకుండా శశాంక్ మణి త్రిపాఠికి డియోరియా స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు.

వరంగల్‌ పార్లమెంటుకు సమన్వయకర్తలను నియమించిన కేటీఆర్‌

బీఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ప్రచారంలో ముందుకు దూసుకుపోతుంది. లోక్ సభ నియోజకవర్గ సమావేశాలతో నేతలు, శ్రేణులు కార్యాచరణలో నిమగ్నమయ్యారు. పెద్ద ఎత్తున సమావేశాలు, ఎండిన పంటల పరిశీలనతో ప్రజల్లోకి వెళ్తున్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న గులాబీ నేతలు.. గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని.. లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలని కార్యకర్తలు, అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అత్యధిక స్థానాలు గెలవాలని భావిస్తున్న పార్టీ సెగ్మెంట్ల వారీగా పార్లమెంటరీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించేందుకు రంగం సిద్దం చేస్తుంది. ఈ నేపథ్యంలో వరంగల్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఏడుగురు సమన్వయకర్తలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు.

అహంకారపూరితులే అలా అంటారు.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం దేశవ్యాప్తంగా ఐదు ర్యాలీలు నిర్వహించారు. మూడోసారి బీహార్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు బీహార్‌లోని గయా చేరుకున్నారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ప్రధాని మాట్లాడుతూ.. మీ ఉత్సాహం మరోసారి మన ప్రభుత్వాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని అన్నారు. సనాతన దురహంకార కూటమిని డెంగ్యూ, మలేరియా అంటారని ప్రధాని మోడీ ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు. గయా చేరుకున్న తర్వాత ప్రధాని మోడీ ముందుగా గయాజీకి సెల్యూట్ చేస్తున్నామని చెప్పారు. అప్పుడు ప్రధాని విష్ణువు, బుద్ధ భగవానునికి నమస్కరించారు. శ్రీమహావిష్ణువుకు, బుద్ధునికి పాదాభివందనం చేస్తున్నామని తెలిపారు. గయ గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ, బీహార్ వైభవాన్ని చూసిన ప్ర‌దేశమిది అని అన్నారు.

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఎల్లుండి దర్శన టికెట్లు విడుదల..!

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎల్లుండి నుంచి ఆన్ లైన్ లో జూలై నెలకు సంబంధించిన టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఎల్లుండి ఉదయం 10 గంటలకు లక్కీ డిప్‌ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కేట్లను టీటీడీ విడుదల చేయనుంది. 22వ తేది ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కేట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కేట్లు విడుదల చేయనున్నట్లు, 23వ తేది ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకేన్లు విడుదల చేయనున్నట్లు పేర్కొంది టీటీడీ. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. 24వ తేది ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటా విడుదల చేయనున్న టీటీడీ. 27వ తేది ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవా కోటా విడుదల చేయనుంది.

కాంగ్రెస్ పార్టీ ఏమైనా వాయిదాల పార్టీ నా.?

కాంగ్రెస్ పార్టీ ఏమైనా వాయిదాల పార్టీ నా.? అంటూ రాజ్యసభ ఎంపీ డా. కె లక్ష్మణ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మళ్ళీ మోసం చేయడానికి పూనుకుంటున్నారని తెలిపారు. ఆగస్టు 15 వరకు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం అంటూ రేవంత్ మాట్లాడుతున్నాడని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టడానికి ఐదో ఎత్తుగడ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడు సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9 రోజు ఏక కాలంలో రుణ మాఫీ చేస్తా అన్నారు. వంద రోజుల పాలన అన్నారు.. విఫలం అయ్యారు. వరి పంటకు మద్దతు ధర తో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు.

ఆర్టీసీ బస్సుల పై సమ్మర్ ఎఫెక్ట్.. మధ్యాహ్నం సర్వీసుల తగ్గింపు..

తెలంగాణలో ఎండలు మాడు పగిలేలా మండుతున్నాయి. బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఎండప్రభావంతో ప్రయాణాలను కూడా వాయిదా వేసుకుంటున్నారు. మార్చి రెండో వారం నుంచి భానుడి కనిపించింది. ఇక ఏప్రిల్‌ లో ఈ ఎండలు నిప్పుల కొలిమిలా ఉన్నాయి. గత 15 రోజులుగా తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు..కానీ బయటకు వెళ్లకుండా పనులు జరగడం లేదు. ఏదైనా పని ఉన్నా ఉదయం..సాయంత్రం చూసుకుంటున్నారు.

 

Exit mobile version