ప్రణీత్ రావు కేసులో ట్విస్ట్.. బయటపడ్డ ఫోన్ ఛాటింగ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రణీత్ రావ్ ఫోన్ చాటింగ్ చిత్రాలు ఎన్ టివి చేతికి చిక్కాయి. ఎన్నికల ముందు ప్రణీతరావు కొంతమంది వ్యక్తుల ఫోన్లు టాప్ చేసినట్లు చాటింగ్ లో వెలుగులోకి వచ్చాయి. బీఆర్ఎస్ కు చెందిన ముఖ్య నేత ఇచ్చిన ఆదేశాలతో ప్రణీత్ రావు టాపింగ్ కు పాల్పడ్డాడు. బీఆర్ఎస్ నేత వంద మంది ఫోన్ నెంబర్లు ఇచ్చి టాప్ చేయాలని ఆదేశాలు జారీ చేసారని తెలిపాడు. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డిని ఎవరెవరు కలుస్తున్నారు అనే దానిపై దృష్టి పెట్టినట్లు గుర్తించారు. బీఆర్ఎస్ నేత రాత్రికి రాత్రి 100 నెంబర్లు పంపి టైపింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్ నేత ఆదేశాలతో ప్రణీతరావు టైపింగ్ చేసి సమాచారాన్ని చేరవేసినట్లు వెల్లడించారు.
ప్రభుత్వం సంచలనం.. గవర్నమెంట్ బ్యాంకుల్లో వాటాల విక్రయానికి సిద్ధం
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సిస్ బ్యాంగ్ (IOB), యూకో బ్యాంక్ సహా ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులు పబ్లిక్ షేర్‌హోల్డింగ్ (MPS) నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ వాటాను 75 శాతం కంటే తక్కువకు తగ్గించాలని యోచిస్తున్నట్లు ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBలు), మార్చి 31, 2023 నాటికి నాలుగు MPS నిబంధనలను పాటిస్తున్నాయి. “ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో మూడు PSBలు కనీసం 25 శాతం పబ్లిక్ ఫ్లోట్‌కు కట్టుబడి ఉన్నాయి. మిగిలిన ఐదు PSBలు MPS అవసరాలను తీర్చడానికి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాం” అని ఆయన మీడియాకు తెలిపారు.
మణిపూర్ లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
దేశంలో మరోసారి భూమి కంపించింది. మణిపూర్‌లో ఈరోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.9గా నమోదైంది. మణిపూర్‌లోని ఉఖ్రుల్‌లో ఉదయం 6.56 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ శుక్రవారం తెలిపింది. ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ముందుగా మంగళవారం పశ్చిమ మేఘాలయలో తేలికపాటి తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. పశ్చిమ గారో హిల్స్ జిల్లాలో మధ్యాహ్నం 2:27 గంటలకు 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కేంద్రం ఐదు కిలోమీటర్ల లోతులో ఉందని ప్రాంతీయ భూకంప కేంద్రం అధికారి ఒకరు తెలిపారు.
రేపే వైసీపీ అభ్యర్థుల ప్రకటన.. సీఎం జగన్ ఎన్నికల రూట్ మ్యాప్ సిద్ధం
ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే దాదాపు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. రేపే వైసీపీ ఫైనల్ అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించనుంది. అంతేకాకుండా.. సీఎం జగన్ ఎన్నికల రూట్ మ్యాప్ సిద్ధమైంది. రేపు ఇడుపులపాయకు సీఎం జగన్ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే.. అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులను జగన్ ప్రకటించనున్నారు. తర్వాత ఎన్నికల ప్రచారాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఈ నెల 18న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు జగన్. అదే రోజు విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్లో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు సీఎం జగన్. ఇలా 2 లేక 3 బహిరంగ సభలు లేదా రోడ్ షోలు ఉండేలా షెడ్యూల్ రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 77 అసెంబ్లీ 23 పార్లమెంట్ ఇంచార్జి లను మార్చిన సీఎం జగన్… ఈ పర్యటనల లోనే ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయనున్నారు.
నేడు నితీష్ మంత్రివర్గ విస్తరణ.. జేడీయూ పూర్తి జాబితా ఇదే
బీహార్ మంత్రిమండలి విస్తరణ ఈరోజు(శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య జరగవచ్చని తెలుస్తోంది. బీహార్ కేబినెట్ విస్తరణలో బీజేపీకి చెందిన మంగళ్ పాండే, నితిన్ నవీన్, హరి సాహ్ని, దిలీప్ జైస్వాల్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయవచ్చని సమాచారం. అయితే పూర్తి జాబితా ఇంకా వెల్లడి కాలేదు. అయితే ప్రమాణ స్వీకారం చేయాల్సిన నేతలకు పిలుపులు రావడం మొదలయ్యాయి. బీజేపీ కోటాలో సంభావ్య మంత్రులు దిలీప్ జైస్వాల్, సంతోష్ సింగ్ ప్రమాణ స్వీకారానికి పిలుపునిచ్చారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మంత్రి మండలి దాదాపు ఒకటిన్నర నెలల తర్వాత విస్తరించబోతున్నారు. జేడీయూ ఎమ్మెల్యేలను పాట్నాలోనే ఉండాలని ఆదేశించడంతో ఇప్పుడు బీజేపీ నేతలకు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయాలని పిలుపు వచ్చింది. 243 మంది సభ్యుల బీహార్ అసెంబ్లీలో, ముఖ్యమంత్రితో సహా మొత్తం 36 మంది మంత్రులు ప్రభుత్వంలో ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతం బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో సహా మొత్తం 9 మంది మంత్రులు ఉండగా, వీరిలో బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు.
నేడు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తనపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించారని కోరుతూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లను కవిత గతంలో సుప్రీంకోర్టులో సవాలు చేశారు. కవిత పిటిషన్‌ను జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ, సీబీఐ నుంచి నోటీసులు అందాయి. అయితే సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున విచారణకు హాజరు కాలేనని కవిత సీబీఐ, ఈడీకి లేఖలు రాశారు.
హైదరాబాద్ లో కిషన్ రెడ్డి పర్యటన.. ప్రారంభోత్సవం వివరాలు ఇవే
హైదరాబాద్ లో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. తెలంగాణలో బీజేపీ గెలుపుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నగరంలో పర్యటన చేస్తూ కేంద్రం అభివృద్ధిపై ఇంటింటికి తెలిజేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజలకు కేంద్ర పథకాలు అందుతున్నాయా? లేదా? వివరంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఇవాళ ఉదయం నగరంలోని పలు డివిజన్లలో పలు ప్రారంబోత్సవాల్లో పాల్గొని కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఉదయం సనత్ నగర్ అసెంబ్లీలో పవర్ బోర్ వెల్ ప్రారంభం అనంతరం మైసమ్మ దేవాలయం, సనత్ నగర్ డివిజన్ లో ఆర్ వో ప్లాంట్ ప్రారంభించారు. అనంతరం బాపూనగర్, అమీర్ పేట్ డివిజన్ ఓపెన్ జిమ్ ల ప్రారంభించారు. బేగంపేట-అమీర్ పేట డివిజన్లో ఎస్ఆర్ నగర్ వాటర్ ట్యాంకు పార్కు, దివ్యశక్తి అపార్ట్ మెంట్స్, శాంతి బాగ్ అపార్ట్ మెంట్స్, ప్రభుత్వ మహిళా కాలేజీ, మోండా డివిజన్ గాస్ మండి స్పోర్ట్స్ గ్రౌండ్, న్యూ బోయిగూడా – బన్సీలాల్ పేట్ డివిజన్ లో జీహెచ్ ఎంసీ గ్రౌండ్, ప్రారంభించారు.
వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు ఇప్పుడు 24 వారాలు
మోడీ ప్రధాని అయ్యాక 12 వారల్యూటర్నిటి సెలవులు సరిపోవని భావించారు.. అందుకే మెటర్నిటీ సెలవులు 24 వారాలుతో పాటు పూర్తి జీతం అందేలా ఆదేశాలు ఇచ్చారని రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్ అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగుడా పల్లె దవాఖానా వద్ద కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన బేబీ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లల తల్లులకు న్యూట్రిషన్ కిట్స్ అందజేశారు.. అనంతరం పల్లె దవాఖానాను సందర్శించి అక్కడ అవసరమైన ఏర్పాట్లపై డాక్టర్స్ తో మాట్లాడి తెలుసుకున్నారు.. కిడ్నీ సంబంధిత వ్యాధి గ్రస్తుల కోసం డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.
ఏ క్షణమైనా లోక్సభ ఎన్నికల కోడ్..
ఏ క్షణమైనా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం రెడీగా ఉంది. ఎన్నికల కమినషన్ కు నిన్న ( బుధవారం ) ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ (శుక్రవారం) ఉదయం వాళ్లు తమ బాధ్యతలు స్వీకరించారు. అయితే, ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ సమక్షంలో జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్ బీర్ సింగ్ సంధు ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలను తీసుకున్నారు. ఈ సందర్భంగా.. సీఈసీ రాజీవ్ కుమార్ వాళ్లకు అభినందనలు తెలిపారు. ఇక, బాధ్యతలు తీసుకున్న తర్వాత వారు ఎన్నికల కమిషన్ చీఫ్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కీలక భేటీలో పాల్గొన్నారు. ఈ ముగ్గురు భేటీలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటనపైనా ఓ క్లారిటీ రావొచ్చని సమాచారం. ఆ వెంటనే.. ఏ క్షణమైనా షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.
సీఎం జగన్ సమక్షంలో వైసీపీ లోకి అడుగుపెట్టిన ముద్రగడ పద్మనాభం..!
నేడు సీనియర్ రాజకీయ నేత, మాజీ రాష్ట్ర మంత్రి, కాపు ఉద్యమ నేతైన ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ లో చేరారు. నేటి ఉదయం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షాన పార్టీ కండువా కప్పుకున్నారు. ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ.. వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈయన గత కొద్దీ రోజులుగా ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ ఆంధ్ర రాజకీయాలలో తీవ్రంగా నడిచింది.
కాంగ్రెస్ వల్ల కరువు వచ్చిందా..? పొన్నం ఆగ్రహం..
కాంగ్రెస్ వస్తే..కరువు వస్తుందని అనడం దారుణమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. వ్యవసాయ డిగ్రీ కళశాల భవనానికి మంత్రి పొన్నం శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ.. గత శాసన సభ్యుడు మంజూరు చేసిన వ్యవసాయ కళశాల భవనానికి భూమి పూజ చేశామని,రాజకీయాలకు అతీతంగా చేస్తున్నామన్నారు. దేశంలో వ్యవస్థ బ్రతకాలన్న.. రైతన్నల కు సాంకేతిక అవసరమన్నారు. మెడిగడ్డలో ఏదో రెండు పిల్లర్లు కుంగినవి అనడం సరి అయినది కాదు కేసీఆర్ కు అవగాహన రాహిత్యం అన్నారు. కాంగ్రెస్ వల్ల కరువు వచ్చింది అనడం పద్దతి కాదనిచ రైతులకు భరోసాగా ఉంటామన్నారు.
పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన మల్లాది విష్ణు..
ఏపీలో రాజకీయం రోజుకో ములుపు తీసుకుంటోంది. టీడీపీ జనసేతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్తుంటే.. బీజేపీ సైతం కలవడంతో కూటమిగా బలపడింది. అయితే.. ఈ నేపథ్యంలోనే సీట్ల పంపకాల్లో ఆయా పార్టీల ఆశావహులు భంగపడి మరో పార్టీలోకి పయనమవుతున్నారు. ఇప్పటికే టీడీపీ రెండో అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో పలువురు టీడీపీ రాజీనామా చేశారు. అంతేకాకుండా కొందరు అధికార వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. వైసీపీలోనూ అసంతృప్తితో రగులుతున్న నేతలు లేకపోలేదు. అయితే.. ఇప్పటికే కొందరు వైసీపీనీ వీడుతుంటే.. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సైతం పార్టీ వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు కొనసాగుతున్నారు.
వచ్చే వారం భూటాన్ పర్యటనకు ప్రధాని నరేంద్రమోడీ..
వచ్చే వారం ప్రధాని నరేంద్రమోడీ భూటాన్ దేశ పర్యటకు వెళ్లనున్నారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ చేసిన ఆహ్వానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. గురువారం న్యూఢిల్లీలో భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్‌గేతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఇరు దేశాల సంబంధాలు, భాగస్వామ్యంపై ఇరువురు మాట్లాడుకున్నారు. ఆ సమయంలో రాజు వాంగ్‌చుక్ తరపున అధికారిక ఆహ్వానాన్ని భూటాన్ ప్రధాని టోబ్‌గే, ప్రధాని మోడీకి అందించారు. దీనికి మోడీ ఓకే చెప్పారు. అయితే, పర్యటన అధికారిక తేదీలను విదేశాంగ శాఖ తర్వలో విడుదల చేసే అవకాశం ఉంది.
