NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

పారిశ్రామిక కేంద్రంగా వైజాగ్.. ప్రభుత్వం కట్టుబడి ఉంది
విశాఖపట్నం నగరాన్ని రాష్ట్ర పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీలో ప్రకటించారు రాష్ట్ర గవన్నర్‌ అబ్దుల్‌ నజీర్‌.. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. విశాఖపట్నం కేంద్రంగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు (జీఐఎస్‌)లో మొత్తం రూ.13.42 లక్షల కోట్ల పెట్టుబడులకు 378 ఎంవోయూలు కుదుర్చుకున్నట్టు వెల్లడించారు.. 16 కీలక రంగాలలో 6 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఇంధన రంగంలో గణనీయమైన పెట్టుబడి రాబోతోంది.. రూ.9,57,112 కోట్ల పెట్టుబడులతో 1.80 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. ఇక, బలమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత, 974 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఏపీ సొంతం అని వెల్లడించారు.. సమృద్ధిగా ఉన్న ఖనిజ వనరులు మొదలైన స్వాభావిక ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ కలిగి ఉందన్న ఆయన.. ప్రభావవంతమైన జోక్యాలు, మా ప్రభుత్వం ద్వారా అమలవుతున్న సుపరిపాలన పద్దతులు ప్రశంసనీయ ఫలితాలను ఇస్తున్నాయంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర సమ్మిళిత, సుస్థిర ప్రగతి వైసీపీ ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యతలుగా కొనసాగుతాయని తెలిపారు గవన్నర్‌.. రాష్ట్రాన్ని మరింత పటిష్టంగా, శక్తివంతంగా చేయడానికి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మేం నిరంతరం కృషి చేస్తాం అన్నారు. ఇక, వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఋణాల పథకం ద్వారా లక్ష వరకు పంట ఋణాలకు సంబంధించి వడ్డీ సబ్సిడీని నేరుగా సకాలంలో ఋణ చెల్లింపు చేసిన రైతుల ఖాతాల్లో నేరుగా బదిలీ చేశామన్నారు.. ఇప్పటివరకు, గత బకాయిలతో సహా రూ.1,834.55 కోట్ల వడ్డీ సబ్సిడీని 73.88 లక్షల మంది రైతులకు విస్తరించబడ్డాయి.. వైఎస్ఆర్ జలకళ క్రింద, 18 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. రూ.2,340 కోట్ల ఆర్థిక వ్యయంతో నాలుగు సంవత్సరాల వ్యవధిలో రెండు లక్షల ఉచిత బోరు బావులను వేయడానికి ప్రణాళిక రూపొందించబడిందని ప్రకటించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.188.84 కోట్ల వ్యయంతో ఇప్పటి వరకు 6,931 బోరు బావులను తవ్వడం జరిగింది.. దీని ద్వారా 9,629 మంది లబ్ధిదారుల ప్రయోజనం పొందారని వివరించారు. పోలవరం, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులు, రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని అసెంబ్లీ ప్రకటించిన గవర్నర్‌.. 54 జలయజ్ఞం నీటిపారుదల ప్రాజెక్టులలో 14 ప్రాజెక్టులు పూర్తి కాగా, 2 పాక్షికంగా పూర్తయ్యాయన్నారు.. రాబోయే 4 సంవత్సరాలలో దశల వారీగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని.. కాలువ పనులతో పాటుగా ప్రధాన డ్యామ్ లో 79.07 శాతం వరకు పనుల పూర్తి చేశామని తెలిపారు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌.

సర్వర్‌ డౌన్‌.. ఏపీలో డిజిటల్‌ సేవలకు బ్రేక్‌..
ఇప్పుడంతా డిజిటల్‌ మయం.. కొద్దిసేపు డిజిటల్‌ సేవలను నిలిచిపోయినా పని నడవని పరిస్థితి.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు డిజిటల్‌ సేవలకు బ్రేక్‌ పడింది.. ఏపీలో స్టేట్ డేటా సెంటర్ సర్వర్ డౌన్‌ అయ్యింది.. ఎస్డీసీ సర్వర్ డౌన్ వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ సేవలు నిలిచిపోయాయి.. దీంతో.. ఉద్యోగుల అటెండెన్స్ యాప్, ఇతర వెబ్ సర్వీసులకు కూడా బ్రేక్‌ పడింది.. డేటా సెంటర్‌లో అంతరాయం ఏర్పడడం వల్ల డిజిటల్ సేవలకు అంతరాయం ఏర్పడింది.. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు నడుస్తోన్న సమయంలో.. సర్వర్‌లో ఈ సమస్య తలెత్తింది.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల అటెండెన్స్‌తో పాటు.. ఇతర సర్వీలకు తీవ్ర అంతరాయం కలిగింది.. ఇక, రంగంలోకి దిగిన సాంకేతిక నిపులు.. సమస్యను పరష్కరించేందుకు కృషి చేస్తున్నారు.. అంతా డిజిటల్‌ సేవలపై ఆధారపడి ఉద్యోగులు పనిచేస్తున్నందున వీలైనంత తొందరగా సమస్యకు చెక్‌ పెట్టే విధంగా చర్యలు చేపట్టారు.

24వ తేదీ వరకు అసెంబ్లీ.. బడ్జెట్‌ప్రవేశపెట్టేది ఎప్పుడంటే..?
ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్‌ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి.. తొలి రోజు అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించిన తర్వాత సభ వాయిదా పడింది.. ఇక, అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత.. శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం నిర్వహించారు.. మొత్తంగా 9 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది బీఏసీ.. అంటే ఈ నెల 24వ తేదీ వరకు బడ్జెట్‌ సమావేశాలు కొనసాగించనున్నారు.. ఇక, ఈ నెల 16వ తేదీన అంటే గురువారం రోజు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. మరోవైపు.. ఆదివారం కావడంతో ఈ నెల 19వ తేదీన.. ఉగాది సందర్భంగా ఈ నెల 22వ తేదీన అసెంబ్లీకి సెలవు ప్రకటించారు.. స్పీకర్‌ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, మంత్రులు బుగ్గన, పెద్దిరెడ్డి, జోగి రమేష్, ప్రసాద్ రాజు, శ్రీకాంత్ రెడ్డి, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హాజరయ్యారు.. ఈ సమావేశాల్లో 20 అంశాలపై చర్చించాలని అడిగినట్టు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇక, గవర్నర్‌ ప్రసంగాన్ని మధ్యలోనే తెలుగుదేశం పార్టీ సభ్యులు వాకౌట్‌ చేసిన విషయం విదితమే.. ప్రసంగంలోని అన్ని అబద్ధాలు చెబుతున్నారంటూ నిరసన వ్యక్తం చేసిన టీడీపీ.. ముఖ్యంగా ప్రాజెక్టుల అంశంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.. ఈ అబద్ధాలు వినలేమంటూ అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు.

సచివాలయానికి 3డి ఎఫెక్ట్.. ఈనెల 30న ప్రారంభానికి సన్నాహాలు
సచివాలయం తెలంగాణాకు తలమానికంగా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నూతన సచివాలయాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో తెలంగాణ సచివాలయం రూపుదిద్దుకుంటోంది. త్వరగా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో రాత్రి పగలు తేడా లేకుండా పనులు కొనసాగుతున్నాయి. మంత్రుల ఛాంబర్లు, సమావేశ మందిరాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు త్వరగా నిర్మాణాలు పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నెల 30 వ తేదీన సమీకృత కొత్త సచివాలయం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పై నుంచి వెళ్లే వాహనదారులు తెలంగాణ నూతన సచివాలయాన్ని ఆసక్తిగా చూస్తున్నారు.

షాకింగ్.. ప్రవీణ్ మొబైల్ ఫోన్ లో మహిళల న్యూడ్ ఫోటోలు..!
ప్రవీణ్ మొబైల్ ఫోన్ లో ఎక్కువ సంఖ్యలో మహిళల నెంబర్లు గుర్తించిన పోలీసులు. వాట్సప్ చాటింగ్ లోనూ మహిళల నగ్న ఫోటోలు దృశ్యాలను పోలీసులు గుర్తించి షాక్‌ కు గురయ్యారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నిందితులను మరికొద్ది సేపట్లో బేగం బజార్ పోలీస్ స్టేషన్ నుండి రిమాండ్ తరలించనున్నారు పోలీసులు.రిమాండ్ అనంతరం కస్టడీలోకి తీసుకోవాలని పోలీసుల నిర్ణయించారు. కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు ప్రవీణ్ మహిళలపై మక్కువ కలిగిన వ్యక్తిగా పోలీసులు తేల్చారు. 2017లో టీఎస్పీఎస్సీ లో జూనియర్ అసిస్టెంట్గా ప్రవీణ్ చేరాడు. నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్ సెక్షన్ లో ప్రవీణ్ పనిచేశాడు. వెరిఫికేషన్ సెక్షన్ కు వచ్చే మహిళల ఫోన్ నెంబర్లు తీసుకున్న ప్రవీణ్.. దరఖాస్తు సందర్భంలో తలెత్తే సాంకేతిక సమస్యలను పరిష్కరించి మహిళలతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ప్రవీణ్ మొబైల్ ఫోన్ లో ఎక్కువ సంఖ్యలో మహిళల నెంబర్లు ఉండమేకాకుండా.. వాట్సప్ చాటింగ్ లోనూ మహిళల నగ్న ఫోటోలు దృశ్యాలను పోలీసులు గుర్తించారు. ఏఈ పరీక్ష పత్రం కూడా రేణుక కారణంగానే లీక్ అయిందని పోలీసులు తేల్చారు. కాగా.. ఏడాది క్రితం పదోన్నతి లభించి టిఎస్పిఎస్సి కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడిగా వెళ్లిన ప్రవీణ్.. ఉన్నతాధికారుల వద్ద ఎంతో క్రమశిక్షణతో మెలిగి బురిటీ కొట్టించాడు ప్రవీణ్‌. ఆతరువాత గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ప్రవీణ్ రాసాడు. ఆన్సర్ షీట్ లో రాంగ్ బబులింగ్ తో డిస్ క్వాలిఫై అయినట్టు గుర్తించారు. అయితే.. ఆన్సర్ కీ తో చెక్ చేసుకుంటే 103 మార్క్స్ వచ్చాయని కమిషన్ వర్గాలు అంటున్నారు. కాగా.. గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపర్ కూడా లీక్ అయిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఫోరెన్సిక్ విచారణ లో అంత బయట పడుతుందంటున్న పోలీస్ లు తెలిపారు. ప్రవీణ్ రేణుక ఫోన్ లను ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడినప్పటి నుండి జరిగిన చాటింగ్ రికవరీ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. రేణుక చెప్పినందుకే పేపర్ లీక్ చేసినట్టు పోలీసులు తేల్చారు. ఇది వరకు ఏమైనా పేపర్ లు లీక్ అయ్యాయ అనే పనిలో పోలీసులు అరా తీస్తున్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు.. ఇప్పుడు ఎంతో తెలుసా?
ఢిల్లీలోని ఎమ్మెల్యేల జీతం, భత్యాలను 66 శాతం పెంచాలన్న అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఢిల్లీలో ఒక ఎమ్మెల్యేకు గతంలో రూ.54,000 బదులుగా ఇప్పుడు నెలకు రూ.90,000 అందుతుంది. ఇప్పటి వరకు వారి మూల వేతనం రూ.12,000 కాగా ఇప్పుడు రూ.30,000కు చేరుకుంది. రోజువారీ భృతిని రూ.1000 నుంచి రూ.1500కు పెంచారు. ఢిల్లీ ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్, ప్రతిపక్ష నేత జీతం, అలవెన్సులు కలిపి నెలకు రూ.1.70 లక్షలు అందజేయనున్నారు. ఇప్పటి వరకు నెలకు రూ.72వేలు ఉండేది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను ఢిల్లీ శాసనసభ ఆమోదించింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA)కి పంపబడింది. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (NCT) పూర్తి రాష్ట్రం కానందున, అటువంటి విషయాలపై భారత రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. అందుకే అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలపై కేంద్ర ఏజెన్సీలు అరెస్టు చేసిన ఢిల్లీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌ల రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. 12 ఏళ్ల తర్వాత ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు పెరిగాయి. కొత్త వేతన విధానం ఫిబ్రవరి 14, 2023 నుండి అమలులోకి వస్తుంది. ఢిల్లీ ఎమ్మెల్యేలకు జీత భత్యాల పెంపు కోసం అసలు ప్రతిపాదన కేంద్రం నుంచి వచ్చింది. పెంపు తర్వాత కూడా ఢిల్లీ ఎమ్మెల్యేలు దేశంలోనే అత్యల్ప జీతం పొందే శాసనసభ్యుల జాబితాలో ఉంటారని ఆప్ ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీ ఎమ్మెల్యేల జీతం, భత్యాలు ఇతర రాష్ట్రాల వారితో సమానంగా ఉండాలని కేజ్రీవాల్ ప్రభుత్వం కేంద్ర హోంశాఖను అభ్యర్థించింది. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు 1.5 నుంచి 2 రెట్లు ఎక్కువ జీతాలు, అలవెన్సులు చెల్లిస్తున్నాయని ఆప్ ప్రభుత్వం పేర్కొంది. అనేక రాష్ట్రాలు తమ ఎమ్మెల్యేలకు ఇంటి అద్దె, కార్యాలయ అద్దె, సిబ్బంది ఖర్చులు, కార్యాలయ సామగ్రి, వాహనాలు కొనుగోలు కోసం భత్యం, డ్రైవర్ భత్యం వంటి ఇతర ప్రోత్సాహకాలను అందిస్తాయి. ఢిల్లీలో అలా జరగదని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. కానీ పూర్తి స్థాయిలో డిమాండ్ నెరవేరలేదు. జులై 2022లో ఢిల్లీ అసెంబ్లీ ఎమ్మెల్యేలు, మంత్రుల జీతాలను పెంచుతూ ఢిల్లీ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది.

కిమ్‌ను గూగుల్ చేసినందుకే.. గూఢచారికి మరణశిక్ష
ఉత్తర కొరియాలో ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ నియంత పాలనను సాగిస్తున్నాడు. ఎంతలా అంటే.. ఆ దేశ ప్రజలు కనీసం ప్రపంచంలో జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకోలేనంత. ఆ నియంత గురించి చదవడానికి ధైర్యం చేసిన ఓ గూఢచారి ప్రాణాలు కోల్పోయాడు. అంటే దీనిని బట్టి ఉత్తర కొరియాలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉత్తర కొరియాలో ఇంటర్నెట్‌ సదుపాయం నియంత్రించపడుతోంది. ప్రభుత్వ టాప్ సీక్రెట్ బ్యూరో 10 బాడీకి చెందిన పలువురు ఏజెంట్లు సెన్సార్ చేయని ఇంటర్నెట్ కంటెంట్‌ను అక్రమంగా యాక్సెస్ చేస్తూ పట్టుబడ్డారు. ఇందులో ఓ వ్యక్తికి మరణ శిక్ష విధించగా.. మిగతా అధికారులను తమ పదవుల నుంచి తొలగించినట్లు సమాచారం. కౌంటీలోని 26 మిలియన్ల పౌరుల కమ్యూనికేషన్‌లను ట్రాక్ చేయడం ఈ సంస్థ బాధ్యత వహిస్తుంది. బ్యూరో 10 అధికారి కిమ్ గురించి శోధించిన అనంతరం.. వెంటనే వారి ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వారి ఆన్‌లైన్‌ కార్యాచరణను పరిశోధించారు. బ్యూరో 10 సంస్థ కౌంటీలోని 26 మిలియన్ల పౌరుల కమ్యూనికేషన్‌లను ట్రాక్ చేయడంలో బాధ్యత వహిస్తుంది. బ్యూరో 10 డిపార్ట్‌మెంట్‌కు ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వబడింది. ఏజెంట్‌లు వారి సెర్చ్ వర్డ్ రికార్డింగ్ పరికరాలను ఆపివేయడానికి, సమస్య లేకుండా వెబ్‌లో తమకు నచ్చిన విధంగా శోధించడానికి అనుమతించింది. కాన కొత్త బ్యూరో చీఫ్‌ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ సాధారణ సమస్యలు కూడా పెద్ద సంఘటనలుగా మారాయి. కిమ్‌ జోంగ్‌ ఉన్ గురించి గూగుల్ చేసినందుకు ఓ ఉద్యోగికి మరణ శిక్ష పడింది.

CII సమ్మిట్‌లో ‘నాటు నాటు’ పాట
ప్రపంచ దేశాలన్నీ ఇండియాపై చూసేలా చేసింది ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ చిత్రంలో నాటు నాటు పాటుకు ఆస్కార్ అందుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఈ పాటపైనే సర్వత్ర చర్చ. ఆస్కార్ సాధించిన ఆర్ఆర్ఆర్ టీమ్‌కు దేశవ్యాప్తంగా అభినందనులు వెల్లువెత్తుతున్నాయి. ఆ పాట పుట్టిన తెలుగు నేలపై ఆస్కార్ హడావుడి మరింత ఎక్కువగా సందడిగా ఉంది. ‘నాటు నాటు’ ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్‌ను గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ పాట నటీనటులను అభినందించారు. అంతేకాదు సోమవారం జరిగిన CII (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) భాగస్వామ్య సమ్మిట్ సందర్భంగా పాటను ప్లే చేశారు. ఇండస్ట్రీ సమ్మిట్‌లో ‘నాటు నాటు’ పాటు ప్రదర్శించడం విశేషం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరైన CII భాగస్వామ్య సదస్సులో RRR చిత్రం యొక్క ‘నాటు నాటు’ పాట క్లిప్ ప్లే చేశారు. అత్యున్నత ఆస్కార్ దక్కడంపై కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. పెద్ద స్క్రీన్‌పై పాట యొక్క చిన్న క్లిప్‌ను ప్లే చేయమని అభ్యర్థించాడు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్‌ను అభినందించారు.