NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

ఆ మంత్రులు, ఎమ్మెల్యేలపై వైఎస్‌ జగన్ సీరియస్.. డెడ్ లైన్ పెట్టేశారు..!
30 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మళ్లీ సీరియస్ అయ్యారు. జూన్ 30లోపు పనితీరు మార్చుకోవాలని డెడ్ లైన్ విధించారు. లేదంటే ఆ నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జ్ లను నియమించాల్సి వస్తుందంటూ సంబంధిత ఎమ్మెల్యేలకు వార్నింగ్‌ ఇచ్చారు.. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో గడప గడపకు కార్యక్రమంపై సోమవారం రోజు సీఎం వైఎస్‌ జగన్ సమీక్ష చేశారు. ఏ ఎమ్మెల్యే ఎన్నిరోజులు, ఎన్నిగంటలు పాల్గొన్నారనే లెక్కలనూ విశ్లేషించారు. టాప్-1లో కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఉన్నారు. అతి తక్కువగా కార్యక్రమం చేపట్టిన వారి జాబితాలో కొడాలి నాని, మంత్రి బుగ్గన, వసంత కృష్ణా ప్రసాద్ , సామినేని ఉదయ భానులు ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ చేపట్టిన గడప గడపకు కార్యక్రమంపై సీఎం జగన్ ఆసక్తికర విశ్లేషణ చేశారు. ఒక సచివాలయాన్ని కవర్ చేయడానికి దువ్వాడ ఎనిమిది రోజులు తీసుకుంటున్నారన్నారు. ప్రతి గడపను టచ్ చేయమన్నానని.. మరీ అంత స్లోగా చేస్తే ఎలా అంటూ జగన్ చురకలంటించారు. నాలుగు రోజుల్లో సచివాలయంలో పరిధిలో గడప గడపకు కంప్లీట్ చేసేలా చూసుకోవాలని దువ్వాడకు సూచించారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను సీఎం జగన్ పరిచయం చేశారు. వారి గెలుపు కోసం పనిచేయాలని వైసీపీ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేల పనితీరుపై గత సమీక్షలోనూ జగన్ సీరియస్ అయ్యారు. లెక్కలేసి మరీ పనితీరు మార్చుకోవాలని సూచించారు. ఈసారి సమీక్షలోనూ జగన్ 30 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. జూన్ 30 లోపు పనితీరు మార్చుకోవాలని ,లేదంటే కొత్త ఇంచార్జ్ ల్ని పెట్టాల్సి వస్తుందని హెచ్చరించడం ఆసక్తికరంగా మారింది.. కాగా, గతంలోనూ కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్‌ వార్నింగ్‌ ఇచ్చారు.. పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు.. అయినా.. ఇప్పటికీ కొందరిలో ఎంటా మార్పు రావడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

కాలేజీ బస్సులో క్షుద్ర పూజల కలకలం.. అమ్మాయిల కోసమేనా..?
ఓవైపు టెక్నాలజీ వైపు ప్రపంచం పరుగులు తీస్తుంటే.. మరోవైపు మూఢనమ్మకాలు కూడా ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి.. ప్రతీ రోజూ ఏదో ఒక చోట క్షుద్ర పూజలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు ఏకంగా కాలేజీ బస్సులోనే క్షుద్రపూజలు చేయడం కలకలం సృష్టిస్తుంది.. ఈ ఘటనతో ఏలూరు జిల్లా నూజివీడులో విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు.. బస్సులో నిజంగా క్షుద్రపూజలు చేశారా? లేక ఆకతాయిల పనా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏలూరు జిల్లా నూజివీడులో కాలేజీ బస్సులోనే జరిగిన క్షుద్రపూజలకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం గ్రామంలో వికాస్ కాలేజీ బస్సులో అర్ధరాత్రి వేళ క్షుద్ర పూజలు కలకలం రేపాయి.. స్థానిక ఆంజనేయస్వామి గుడి వద్ద పార్కింగ్ చేసి ఉన్న కాలేజీ బస్సులో అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.. బస్సులో ఓ పటం వేసి.. దానిపై నిమ్మకాయలు, అన్నం ముద్దలు పెట్టి క్షుద్ర పూజలు చేశారు.. బస్సు మధ్యలో ముగ్గులు వేసి నిమ్మకాలు ఉంచి పూజలు చేయడమే కాకుండా.. బస్సు లోపల డ్రైవర్‌ వెనుకాల ఉండే బోడుకు నిమ్మకాయల దండ, మరికొన్ని ఆకులు గుచ్చి దండగా వేసి పూజలు చేసినట్టు కనిపిస్తోంది.. బస్సు లోపలి నుంచి టాప్‌ భాగంతో పాటు.. ఇరువైపుల ఉండే అద్దాలకు కూడా హస్తం ముద్రలు కనిపిస్తున్నాయి.. ఈ పూజలు చేసిన ఆనవాళ్లు చూసి భయాందోళనలో విద్యార్థులు ఉండగా.. మరో బస్సులో విద్యార్థులను కాలేజీకి తరలించింది సదరు కాలేజీ యాజమాన్యం. ఓవైపు ప్రేమికుల రోజు జరుగుతుండగా.. ఇవాళే ఈ పూజలకు పూనుకున్నారంటే.. ఎవరైనా అమ్మాయిల కోసం పూజలు చేసి ఉంటారా? లేదా కాలేజీ యాజమాన్యం అంటే గిట్టనివాళ్లు చేసిన పనా? ఆకతాయిలే ఇలా విద్యార్థులను భయపెట్టడానికి చేశారా? అనేది తేలాల్సి ఉంది.

పొత్తులపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. కేసీఆర్ కాంగ్రెస్ తో కలవాల్సిందే..!
పొత్తులపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ తో కలవాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి 2023లో జరిగే ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ వస్తుందని చెప్పారు. ఇవాళ కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోమటిరెడ్డి న్యూఢిల్లీలో కలిసిన ఆయన జాతీయ రహదారులతో పాటు రీజినల్ రింగ్ రోడ్లకు సంబంధించిన అంశంపై కేంద్ర మంత్రికి ఆయన వినతి పత్రం సమర్పించారు. ఈనేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాగా.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్వంతంగా 60 సీట్లు దక్కవన్నారు. తనకున్న రాజకీయ అనుభవంతో ఈ విషయాన్ని చెబుతున్ననని.. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు సెక్యులర్ పార్టీలని, అందుకే ఈ రెండు పార్టీలు కలుస్తాయని ఆయన జోస్యం చెప్పారని అన్నారు. ఇక ఎన్నికలకు ఎంతో సమయం లేదని, ఎన్నికలకు కనీసం ఏడాది ముందే కనీసం 60 అభ్యర్ధులను ప్రకటించాలని తాము రాహుల్ గాంధీని కోరిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. అయితే.. కొత్త- పాత అనే తేడాలేకుండా గెలిచే అభ్యర్ధులకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. దీంతో..ఎన్నికల తర్వాత పొత్తులుంటాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. అయితే.. ఈ ఏడాది మార్చి 1 నుండి పాదయాత్ర.. బైక్ యాత్ర చేస్తానని వెంకట్ రెడ్డి చెప్పారు. ఇక.. అసెంబ్లీ ఎన్నికలకు కనీసం ఏడాది ముందుగానే అభ్యర్ధులను ప్రకటించాలని రాహుల్ గాంధీని కోరినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. అయితే.. గతంలో వరంగల్ పర్యటనకు రాహుల్ గాంధీ వచ్చిన సమయంలో ఈ విషయమై ఆయనతో చర్చించినట్టుగా తెలిపారు.

ప్రేమికుల రోజు రచ్చ షురూ.. ఎల్బీనగర్ లో భజరంగ్ దళ్ హల్‌ చల్‌
ప్రేమికుల రోజు అంటూనే భజరంగ్‌ దళ్‌ రంగంలోకి దిగాల్సిందే. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజూ కాదంటూ.. వాలెంటైన్స్ డే పేరుతో ఈవెంట్లు, ప్రోగ్రామ్స్‌ చేస్తే వాళ్లను అడ్డుకుంటామని భజరంగ్ దళ్ రచ్చ మెదలైంది. ప్రేమికుల రోజును బ్యాండ్ చేయాలని హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో ఫ్లాకాడ్స్ తో భజరంగ్ దళ్ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పుల్వామా దాడిలో మృతి చెందిన సైనికులకు బజరంగ్దళ్ కార్యకర్తలు నివాళులర్పించారు. అయితే.. ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ప్రేమికుల దినోత్సవంను బహిష్కరించాలని హిందూ సంస్థలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. కాగా.. ప్రతి ఏటా ఫిబ్రవరి 14న జరుపుకునే కాకుండా ఆ రోజు వీరజవాన్ల దినోత్సవంగా జరుపుకోవాలని పేర్కొన్న భజరంగ్ దళ్.. ప్రేమికుల రోజు మన సంస్కృతి కాదని.. అదే తేదీన పుల్వామా దాడిలో చనిపోయిన మన వీర జవాన్లను యువతీ యువకులు స్మరించుకోవాలని భజరంగ్ దళ్ వాల్ పోస్టర్‌ను రిలీజ్ కూడా చేసింది.

ట్రక్కును ఢీకొన్న బస్సు.. 20 మంది దుర్మరణం
దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాయుధ ట్రక్కును బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో 20 మంది మరణించగా.. మరో 60 మంది గాయపడినట్లు లింపోపో ప్రావిన్స్ రవాణా విభాగం మంగళవారం వెల్లడించింది. సోమవారం నగదు రవాణా చేసే ట్రక్కు అదుపు తప్పి ఎదురుగా వెళ్తున్న బస్సును ఢీకొనడంతో ప్రమాదంలో ఇరవై మంది మరణించారని డిపార్ట్‌మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మిచిగాన్‌ యూనివర్సిటీలో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి
అగ్రరాజ్యమైన అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. అమెరికాలో ఈస్ట్‌ లాన్సింగ్‌లోని మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో యూనివర్సిటీలోకి దుండగుడు ప్రవేశించి.. క్యాంపస్‌లోని రెండు భవనాల వద్ద కాల్పులకు తెగబడ్డాడు. ఈ నేపథ్యంలో భయాందోళనకు గురైన విద్యార్థులు, సిబ్బంది వెంటనే గదుల్లోకి పారిపోయారు. కాల్పుల తర్వాత ఆ ఆగంతకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడని సిబ్బంది తెలిపారు. దాడి చేసిన వ్యక్తి కాల్పుల అనంతరం వెంటనే బిల్డింగ్‌కు ఉత్తరం వైపున ఉన్న ఎంఎస్‌యూ యూనియన్ భవనం నుంచి బయటకు వెళ్లాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. క్యాంపస్‌లోని రెండు భవనాల లోపల కాల్పులు జరిపినట్లు భావిస్తున్న నిందితుడి గురించిన ఫోటోలు. సమాచారాన్ని పోలీసులు తర్వాత విడుదల చేశారు. మరియు సమాచారాన్ని వారు తర్వాత విడుదల చేశారు. అనుమానితుడు నల్లజాతీయుడని, పొట్టిగా ఉండి ఎరుపు రంగు బూట్లు, జీన్ జాకెట్‌ ధరించాడని. బాల్‌ టోపీని కూడా ధరించిన చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. అమెరికాలోని అతిపెద్ద విద్యాసంస్థల్లో మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ఒకటి. ఈ క్యాంపస్‌ దాదాపు 50 వేల మంది విద్యార్థులు చదవుకుంటున్నారు. ఈ కాల్పుల నేపథ్యంలో క్యాంపస్‌లో 48 గంటల పాటు అన్ని తరగతులు, కార్యకలాపాలను రద్దు చేశారు.

టీమిండియా యంగ్‌ ప్లేయర్ గిల్‌కు ఐసీసీ అవార్డు
టీమిండియా యంగ్ ప్లేయర్ శుభ్‌మన్‌ గిల్‌ అంతర్జాతీయ క్రికెట్ మండలి అవార్డు అందుకున్నాడు. జనవరి నెలకు గానూ ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ (జనవరి 2023)గా ఎంపికయ్యాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న గిల్‌ జనవరిలో పరుగుల వరద పారించాడు. ముఖ్యంగా వన్డే ఫార్మాట్లో అదరగొట్టాడు. శ్రీలంక, న్యూజిలాండ్‌ సిరీస్‌ల్లో కలిపి 567 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌పై 208 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతను ఇంకో రెండు శతకాలు కూడా బాదాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం గిల్‌తో పాటు సిరాజ్, డెవోన్ కాన్వే పోటీ పడ్డారు. గతేడాది అక్టోబర్‌లో విరాట్ కోహ్లీ తర్వాత ఈ అవార్డు అందుకున్న ఇండియన్ ప్లేయర్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఇంగ్లాండ్‌కు చెందిన గ్రేస్‌ స్క్రీవెన్స్‌.. మహిళల విభాగంలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’గా ఎంపికైంది. తనకు ఈ అవార్డు దక్కడంపై గిల్ స్పందించాడు. “ఐసీసీ ప్యానెల్, క్రికెట్ అభిమానులకు నాకు ఓటేసి ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. జనవరి నాకు ప్రత్యేకమైన నెల. ఈ అవార్డు దానిని మరింత స్పెషల్‌గా మార్చేసింది. ఈ సక్సెస్‌కు కారణమైన టీమ్ మేట్స్, కోచ్‌లకు రుణపడి ఉంటాను. వన్డే వరల్డ్ కప్ రానున్న నేపథ్యంలో ఈ అవార్డు నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది” అని గిల్ అన్నాడు.

ప్రేమికుల రోజు.. ‘జియో’ ఆఫర్ల జల్లు..
ప్రేమికుల రోజు సందర్భంగా టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో ఆఫర్ల జల్లు కురిపించింది.. ‘జియో వాలెంటైన్ ఆఫర్’ కింద, వాలెంటైన్స్ డే ప్రీ పెయిడ్‌ ప్లాన్లను లాంచ్‌ చేసింది ఈ టెలికాం దిగ్గజం.. దీని కింద, కంపెనీ వినియోగదారులకు ఉచిత డేటా మరియు మెక్‌డొనాల్డ్ కూపన్‌లతో సహా అనేక డిస్కౌంట్ ఆఫర్‌లను అందిస్తోంది. ఈ ఆఫర్‌ను పొందడానికి, “కూపన్ కోడ్‌ల వివరాల కోసం మై జియో యాప్లో కూపన్‌లు & విన్నింగ్‌లు” ట్యాబ్‌ని సెలెక్ట్‌ చేసుకోవాలి. రూ. 349, రూ.899 రూ. 2999 రీఛార్జ్‌పై జియో ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ ప్రకారం, ఫిబ్రవరి 10న లేదా తర్వాత పైన పేర్కొన్న రీఛార్జ్‌ని చేస్తే అదనపు 12జీబీ 4జీ డేటా కూపన్‌కు అర్హులు అవుతారు.. ఇక, రూ. 2999 ప్లాన్‌తో పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలతో పాటు, కస్టమర్‌లు 75 జీబీ అదనపు డేటా, 23 రోజుల అదనపు వ్యాలిడిటీని కూడా పొందవచ్చు.. జియో యొక్క ఈ ఆఫర్ రూ. 349 మరియు రూ. 899 రెండు రీఛార్జ్ ప్లాన్‌లపై అందుబాటులో ఉంది. జియో యొక్క ఈ ప్లాన్‌లతో, వినియోగదారులు అనేక అదనపు ప్రయోజనాలతో పాటు అపరిమిత స్థానిక మరియు జాతీయ కాలింగ్ మరియు డేటాను పొందుతారు. దీనిలో, రూ.199కి మెక్‌డొనాల్డ్స్ కొనుగోలుపై 12GB ఉచిత డేటా మరియు ఉచిత McAloo Tikkiని పొందుతున్నారు. ఇది మాత్రమే కాకుండా, వినియోగదారులు ఈ రీఛార్జ్‌లతో ఫెర్న్స్ & పెటల్స్ నుండి షాపింగ్ చేయడంపై రూ. 150 తగ్గింపును కూడా పొందుతారు. జియో యొక్క రూ. 349 ప్లాన్ 30 రోజుల చెల్లుబాటును పొందుతుంది. ఇందులో, వినియోగదారులు ప్రతిరోజూ 2.5 GB డేటాను పొందుతారు. అదనంగా, ఇది అపరిమిత వాయిస్ కాల్‌లతో పాటు ప్రతిరోజూ 100 SMSలను అందుకుంటుంది. 90 రోజుల ప్లాన్ యొక్క ప్రయోజనాలు ఏమిటి? అనే విషయానికి వస్తే.. జియో యొక్క రూ. 899 ప్లాన్ గురించి మాట్లాడితే, వినియోగదారులు ఇందులో 90 రోజుల చెల్లుబాటును పొందుతారు. ఇందులో అపరిమిత కాల్స్‌తో పాటు రోజుకు 2.5జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. అదనంగా, ప్రతి రోజు 100 SMSలను యాక్సెస్ చేయవచ్చు. ఈ రెండు ప్లాన్‌లతో, వినియోగదారులు జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్ పొందుతారు. జియో వాలెంటైన్‌ ఆఫర్‌ కింద రూ. 121 విలువైన అదనపు డేటా యాడ్-ఆన్ (12 జీబీ డేటా).. రూ. 1,000 విలువైన ప్రత్యేక తగ్గింపు వోచర్లు.. ఫెర్న్ & పెటల్స్ రూ. 799 కొనుగోలుపై రూ. 150 తగ్గింపు.. మెక్‌డొనాల్డ్స్ – రూ. 199 కొనుగోలుపై రూ. 105 తగ్గింపు (సౌత్ & వెస్ట్ రీజియన్ మాత్రమే). ఇక్సిగో – రూ. 4,500 విమాన బుకింగ్‌పై రూ. 750 తగ్గింపు.. ఇలా ప్రేమికుల రోజు సందర్భంగా అనేక బంపరాఫర్లను తన వినియోగారులను అందుబాటులోకి తీసుకొచ్చింది జియో.

ప్రేమికుల రోజున ఓ సాతియా టీం నుంచి స్పెషల్ సాంగ్…
ప్రేమికుల రోజున అందరూ ప్రేమ పాటలు పాడుతుంటే… లవ్ ఫెయిల్ అయిన వాళ్ల కోసం కూడా ఒక సాంగ్ ని ఇచ్చారు ‘ఓ సాతియా’ చిత్ర యూనిట్. ఆర్యన్ గౌడా, మిస్తీ చక్రవర్తి జంటగా నటిస్తున్న ఈ మూవీని దివ్య భావన దర్శకత్వం వహిస్తున్నారు. చందన కట్ట ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ నుంచి ‘వెళ్లిపోయే’ అనే లిరికల్ సాంగ్ ని మేకర్స్ లాంచ్ చేశారు. ఫెబ్ 14న బ్రేకప్ అయిన వాళ్ల కోసం అన్నట్లు ఒక బ్రేకప్ ఏంథమ్ లా ‘వెళ్లిపోయే’ సాంగ్ బయటకి వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ విన్ను ఇచ్చిన కూల్ ట్యూన్ కి, భాస్కరభట్ల “మొట్టమొదటిసారి కదా ప్రేమ పుట్టడం, పిచ్చి మనసు తట్టుకోదే ఇంత దారుణం” అంటూ క్యాచీ లిరిక్స్ ని రాసాడు. మొదటిసారి వినగానే ఈ పాట హమ్ చేసేలా ఉంది అంటే దానికి కారణం భాస్కరభట్ల రాసిన లిరిక్స్ అనే చెప్పాలి. ఇక ఈ సాంగ్ ని ఫీల్ ని యాడ్ చేసింది రాహుల్ సిప్లిగంజ్ వాయిస్. మాస్ సాంగ్స్ ఎక్కువగా పాడే రాహుల్, వెళ్లిపోయే సాంగ్ కి ప్రాణం పోశాడు. లిరికల్ సాంగ్ లో అక్కడక్కడా చూపించిన విజువల్స్ కూడా బాగున్నాయి. లీడ్ క్యారెక్టర్ డాన్స్ మూవ్స్ సింపుల్ గా ఉన్నా చూడడానికి బాగున్నాయి. బాబా బాస్కర్ మాస్టర్ వెళ్లిపోయే సాంగ్ ని ఎంతవరకూ డాన్స్ కావాలో అంతవరకూ పర్ఫెక్ట్ గా స్టెప్స్ ని కంపోజ్ చేశాడు. మొత్తానికి ఈ వెళ్లిపోయే సాంగ్ ప్రేమలో ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరూ పాడుకునేలా, ఓ సాతియా సినిమాకి మంచి ప్రమోషనల్ కంటెంట్ లా ఉపయోగ పడుతుంది.

ప్రేమలో పడమంటే… మత్తులో పడ్డావా రాజా?
ఫెబ్ 14న ప్రేమికుల రోజు… ఆరోజు తెలుగు హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్స్ లో ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట తన క్రష్ తో కానీ ఇంకా బయట పెట్టని రిలేషన్షిప్ లో ఉన్న పర్సన్ తో కానీ స్పాట్ అవుతాడు. ఆ సమయంలో కెమెరా క్లిక్ మంటుంది మన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కమిటెడ్ అంటూ ఫోటోలు బయటకి వచ్చేస్తాయి. ఇలా మెగా ఫ్యామిలీలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ కూడా ప్రేమలో ఉన్నాడు అంటూ చాలా వార్తలు వినిపించాయి. ఒక్కదంట్లో కూడా నిజం లేదు, కేవలం లారిస్సా బోనెస్సి అంటే మాత్రమే కొంచెం క్రష్ ఉండేది అంటూ సాయి ధరమ్ తేజ్ చాలా సార్లు ఓపెన్ గానే చెప్పాడు. సాయి ధరమ్ తేజ్, లారిస్సా కలిసి ‘తిక్క’ సినిమా చేశారు. యంగ్ హీరోలందరూ ప్రేమ పెళ్లి అంటుంటే తేజ్ ఈరోజుకీ సింగల్ గానే ఉన్నాడు. నిజంగానే సింగల్ గా ఉన్నాడా లేక సీక్రెట్ గా ప్రేమని బయట పెట్టకుండా మైంటైన్ చేస్తున్నాడా? అనే డౌట్ చాలా మందిలో ఉండే ఉంటుంది. వ్యాలెంటైన్స్ డే రోజున సాయి ధరమ్ తేజ్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ చూస్తూ, తేజ్ నిజంగానే సింగల్ కింగ్ అని డిసైడ్ అవ్వాల్సిందే.