రుషికొండ తవ్వకాలపై పవన్ సెటైర్లు..
రుషికొండ తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు.. సోషల్ మీడియా వేదికగా రుషికొండ తవ్వకాలపై స్పందించిన ఆయన.. రిషికొండ తవ్వకాలను కప్పి పుచ్చేందుకు 151 అడుగుల స్టిక్కర్లను అంటిస్తారా..? అని ప్రశ్నించారు.. చెట్లు, కొండలను నరికేయడం, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం వైసీపీ దుష్ట పాలకుల ముఖ్య లక్షణం అంటూ ఆరోపించారు.. రుషికొండను ధ్వంసం చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని ఐదుగురు సభ్యుల నిపుణుల ప్యానెల్ నిర్ధారించిందన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సమాధానం చెబుతుందా..? లేక రుషికొండ గ్రీన్ మ్యాట్‌పై 151 అడుగుల స్టిక్కర్‌ను అంటిస్తారా? అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్.
అంబేద్కర్ ఈ దేశంలో పుట్టడం మనందరి అదృష్టం
బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పాదయాత్ర శిబిరం వద్ద అంబేద్కర్ చిత్రపటానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పూలమాలవేసి నివాళులర్పించారు. మంచిర్యాల జిల్లాలో పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఈ దేశంలో పుట్టడం మనందరి అదృష్టమన్నారు. సామాజిక న్యాయం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారని అన్నారు. అంబేద్కర్ చూపించిన రాజ్యాంగమే ఈ దేశానికి శ్రీరామరక్ష అని తెలిపారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే దేశంలో ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉన్నాయన్నారు. ప్రధాని మోడీ, అమిత్షా లాంటి నియంతృత్వ వాదులు ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతుందని భట్టి అన్నారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి అంబేద్కర్.. దేశం గర్వించదగ్గ మేధావి
దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్.. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి.. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి. వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత అని అభివర్ణించారు.. భేదభావాలు మరిచేలా మానవత్వం పరిఢవిల్లేలా ఆయన చేసిన కృషి మరువలేం.. ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో, సామాజిక న్యాయ సాధికారతలో చారిత్రక అడుగులు ముందుకేశాం.. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అంటూ #AmbedkarJayanti యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక వ్యక్తి అరెస్ట్..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది.. కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్ లో పులివెందులకు చెందిన కీలక వ్యక్తి ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.. ఆ తర్వాత హైదరాబాద్ కు తరలించారు.. వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్‌ను విచారిస్తున్నారు. వివేకా హత్య జరిగిన తర్వాత ఆయన మృతదేహానికి కుట్లు వేసి, కట్లు గట్టిన ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో పనిచేసే జయప్రకాష్ రెడ్డి కుమారుడు యూసీఎల్ ఉద్యోగి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి.. అయితే, ఈ కేసులో నోటీసులు జారీ చేసిన సీబీఐ అధికారులు.. ఆ తర్వాత స్టేట్‌మెంట్ రికార్డు చేవారు.. పులివెందుల నుంచి సీబీఐ అధికారులు ఉదయ్ కుమార్ రెడ్డిని కడపకు తీసుకెళ్లారు.. సుమారు గంటన్నర తర్వాత ఉదయ్ కుమార్ ను అరెస్టు చేసినట్లు ఉదయ్ కుమార్ తరపు లాయర్ జయప్రకాష్ రెడ్డికి తెలియజేశారు. హత్య జరగిన సందర్భంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై సీబీఐ సేకరించిన గూగుల్ టేక్ ఔట్ లో ఉదయ్ కుమార్ వివరాలు కూడా వెల్లడి కావడంతో ఇప్పుడు సీబీఐ అధికారులు ఉదయ్ కుమార్ అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది.. గతంలో సీబీఐ విచారణ పేరుతో తనని వేధిస్తోందని ఉదయ్ కుమార్.. కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ పై కడప కోర్టులో ప్రైవేట్ కేసు కూడా దాఖలు చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన 15 మందితో కూడిన సీబీఐ బృందం రెండు, మూడు రోజులుగా కడపలో ఉంటూ సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏం చేశావు బాబు..? నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది కూడా నేను, జూ.ఎన్టీఆరే..
ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు గుడివాడ కు ఏం చేశారు? అని నిలదీశారు.. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు మద్దతు పలికిన చంద్రబాబు ఎందుకు ఇక్కడ ఫ్లై ఓవర్లు కట్టలేదో చెప్పాలన్నర ఆయన.. గుడివాడ ఎన్టీఆర్ పుట్టిన గడ్డ అని చంద్రబాబు ఇప్పుడు దొంగ ప్రేమ చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. గుడివాడ నియోజక వర్గంలో ఫ్లై ఓవర్లు, రోడ్లు, పేదలకు ఇళ్లను కడుతూ అభివృద్ధి చేస్తున్నాం.. నిమ్మకూరు వెళ్తే చంద్రబాబు ఉండటానికి ఎవరూ ఇల్లు కూడా ఇవ్వలేదు.. అందుకే బస్సులో చంద్రబాబు పడుకున్నాడు అంటూ సెటైర్లు వేశారు.. పెళ్ళైన 42 ఏళ్లకు అత్తగారు ఇంటికి వెళ్ళి పడుకున్న చంద్ర బాబుకు సిగ్గు ఉందా? అంటూ ఫైర్ అయ్యారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు చంద్రబాబు నివాళులర్పించారు.. నిమ్మకూరుకు ఎంతో చేశామని చెప్పడానికి సిగ్గుందా? అని మండిపడ్డారు కొడాలి నాని.. అసలు నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలను కట్టించింది కూడా చంద్రబాబు కాదు.. నేను, జూనియర్ ఎన్టీఆర్ 60 లక్షల రూపాయలు పెట్టి 2003లో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేశాం అన్నారు.. భూమి కొనుగోలు చేసి విగ్రహాలు పెట్టించాం.. ఆ సమయంలో నిమ్మకూరులో రూ.3 లక్షలకు ఎకరా భూమి ఉంది.. ఆ డబ్బులతో భూమి కొనుగోలు చేస్తే చాలా భూమి వచ్చేదన్నారు.. అసలు నిమ్మకూరుపై ప్రేమ ఉన్నది పెద్ద ఎన్టీఆర్, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రమే అన్నారు. నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్ కు తప్ప ఎవరికీ ఆస్తులు లేవన్నారు కొడాలి నాని..
జేసీ ప్రభాకర్ రెడ్డి కంటతడి..!
యువగళం పేరుతో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర 70 రోజులకు చేరుకున్న విషయం విదితమే.. అయితే, లోకేష్ పాదయాత్రపై భావోద్వేగానికి గురయ్యారు టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. మీడియాతో మాట్లాడుతూ ఆయన కంటతడి పెట్టుకున్నారు.. కార్యకర్తలు లేకపోతే నేను లేనన్న ఆయన. చంద్రబాబు చేసిన మంచి పనులతో ప్రజల మనిషి అయ్యారని పేర్కొన్నారు.. ఇక, లోకేష్ జనం కోసం పాదయాత్ర చేస్తున్నాడు.. అసలు లోకేష్ కు ఏం తక్కువ..? ఎంతో విలాసవంతమైన జీవితం వదిలేసి.. ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నాడు.. లోకేష్ కాళ్లకు బొబ్బలు వచ్చాయి.. ఆ బొబ్బలను చూస్తే బాదేసిందన్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి..
చంద్రబాబుకు ఇదే నా సవాల్.. ఒక్క ఎకరం కొన్నా రాజకీయాలు వదిలేస్తా..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు మాజీ మంత్రి కొడాలి నాని.. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు గుడివాడ కు ఏం చేశారు? అని నిలదీశారు.. గుడివాడలో పేదలకు ఇళ్ల కోసం ఒక్క ఎకరం భూమి చంద్రబాబు కొన్నారా? అని ప్రశ్నించారు.. చంద్రబాబు ఒక్క ఎకరం కొన్నా రాజకీయాలు వదిలేస్తాను అంటూ చాలెంజ్ చేశారు.. నిమ్మకూరుకు ఎంతో చేశామని చెప్పడానికి సిగ్గుందా? అని మండిపడ్డారు కొడాలి నాని.. అసలు నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలను కట్టించింది కూడా చంద్రబాబు కాదు.. నేను, జూనియర్ ఎన్టీఆర్ 60 లక్షల రూపాయలు పెట్టి 2003లో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేశాం అన్నారు..అసలు నిమ్మకూరుపై ప్రేమ ఉన్నది పెద్ద ఎన్టీఆర్, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రమే అన్నారు. నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్ కు తప్ప ఎవరికీ ఆస్తులు లేవన్నారు కొడాలి నాని.. మరోవైపు.. చంద్రబాబు ఓ 420 అంటూ ఫైర్ అయ్యారు నాని.. అంబేద్కర్ జయంతి రోజున చంద్రబాబు లాంటి వ్యక్తి గురించి మాట్లాడటం సరికాదన్న ఆయన.. 1999లో చంద్రబాబు సీఎంగా వచ్చి ఇక్కడ పోటీ చేయాలని చెబితే అభ్యర్ధి ఓడి పోయారు.. దేవుడి దయవల్ల 2004, 2009లో నన్ను గెలిపించాలి అని చంద్రబాబు అనలేదు కాబట్టి నేను గెలిచాను అన్నారు.. 2014లో అవినాష్ ను గెలిపించాలని కోరితే ఓడించారన్న ఆయన.. చంద్ర బాబు జిత్తుల మారి నక్క.. చంద్రబాబు గుడివాడకు చేసింది ఏమీలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు..
12 వేల భారత వెబ్‌సైట్లను టార్గెట్ చేసిన ఇండోనేషియా హ్యాకర్లు…
భారత దేశానికి సంబంధించిన 12 వేల వెబ్‌సైట్లను ఇండోనేషియా హ్యకర్లు టార్గెట్ చేసినట్లు కేంద్రం ముందుగానే గుర్తించింది. దీంతో కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను హెచ్చరించింది. వీటిలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు చెందిన పలు వెబ్‌సైట్లు కూడా ఉన్నాయి. కేంద్ర హోంశాఖ ‘‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెంటర్’’ ఈ దాడిని ముందుగానే పసిగట్టింది. ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్రం, రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని సూచించింది. ‘‘డినయల్ ఆఫ్ సర్వీస్’’, ‘‘డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్’’ దాడుల ద్వారా వెబ్‌సైట్లను హ్యకర్లు తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. వేర్వేరు వ్యక్తిగత కంప్యూటర్ల ద్వారా ఒకే సారి పెద్ద ఎత్తున డేటాను సైట్లలోకి జొప్పించి పెద్ద ఎత్తున సైబర్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని వెల్లడించింది. హ్యకర్లు టార్గెట్ చేసిన కొన్ని వెబ్‌సైట్లను గుర్తించి ముందుగానే సమాచారాన్ని రాష్ట్రాలు, యూటీలో పంచుకుంది. అపరిచిత మెయిల్స్, లింకులను ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని అధికారులను హోంశాఖ హెచ్చరించింది. అన్ని సాఫ్ట్‌వేర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించింది. గత ఏడాది మలేషియాకు చెందిన ఓ హ్యకర్ల ముఠా భారత ప్రతిష్టాత్మక వైద్య సంస్థ ‘‘ఎయిమ్స్’’ను లక్ష్యంగా చేసుకుంది. ఆ సమయంలో అనేక రికార్డులను అధికారులు యాక్సెస్ చేయలేకపోయారు. వైద్యసేవలపై తీవ్ర ప్రభావం ఏర్పడింది.
నాకు ఇట్లాంటి మ్యాచ్ లు పెద్దగా నచ్చవు..
ఐపీఎల్ 2023లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యా్చ్ లో గెలిచిన గుజరా్ టైటాన్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. కోత్ కతా నైట్ రైడర్స్ తో ఓటమి తర్వాత పంజాబ్ పై ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్ నిర్థేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించింది. అయితే గుజరాత్ సారథి హార్థిక్ పాండ్యాకు మాత్రం ఈ మ్యాచ్ ఇలా ముగియడం నచ్చేలేదని చెప్పాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత పాండ్యా మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. వాస్తవంగా ఈ మ్యాచ్ ఇంత దూరం వస్తుందని అనుకోలేదు.. దీని నుంచి మేం నేర్చుకోవాల్సింది చాలా ఉంది.. మిడిల్ ఓవర్స్ లో మేం కొన్ని రిస్కీ షాట్స్ ఆడాం.. ఆటలో ఇటువంటివి సహజమే అయినా మేం మా తప్పును సరిదిద్దుకోవాలి.. మొహాలీ వంటి వికెట్ పై బౌలింగ్ చేయడం అంత సులువు కాదు.. కానీ మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు.. ఈ సీజన్ లో గుజరాత్ తరపున తొలి మ్యాచ్ ఆడిన మోహిత్ తన అనుభవన్నంతా ఉపయోగించి బాగా బౌలింగ్ చేశాడు.. వాస్తవానికి ఈ మ్యాచ్ ను మేం ముందే ఫినిష్ చేస్తే బాగుండేది.. కానీ ఆఖరి ఓవర్ వరకు తీసుకొచ్చాం.. నాకు మ్యా్చ్ లు ఇలా చివరి ఓవర్ వరకూ రావడం పెద్దగా నచ్చవు అని హార్థిక్ పాండ్యా చెప్పాడు.
గంటలో 3,206 పుష్-అప్స్ ఏంటీ సామి.. వరల్డ్ రికార్డ్ క్రియేట్
సాధారణంగా జిమ్‌కు వెళ్లే వ్యక్తి లేదా రెగ్యులర్ గా ఎక్సర్‌సైజ్ చేసే వ్యక్తి రోజుకు 100 అంతకన్నా కొద్దిగా ఎక్కువ పుష్-అప్స్ చేస్తాడు. అంతకుమించి చేయడం అంటే దాదాపుగా కష్టమే అనిచెప్పాలి. కానీ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి ఏకంగా 3000 కన్నా ఎక్కువ పుష్-అప్స్ చేశాడు. అది కూడా కేవలం ఒక గంట సమయంలోనే. ఈ ఫీట్ తో అతను ఇంతకుముందు ఉన్న పుష్-అప్స్ రికార్డ్ బద్దలు కొట్టాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. ఆస్త్రేలియా బ్రిస్బేన్ కు చెందిన లూకాస్ హెల్మేకే (33) అనే వ్యక్తి ఒక గంటలో 3,206 పుష్-అప్‌లను చేశాడు. అంటే సగటున నిమిషానికి 53 కంటే ఎక్కువ. గతంలో 3,182 రికార్డును ఏప్రిల్ 2022లో మరో ఆస్ట్రేలియన్ డేనియల్ స్కాలీ నెలకొల్పాడు. ఇప్పుడు ఆ రికార్డ్ ను బద్దలు కొట్టాడు లూకాస్. లూకాస్ ఈ ఫీట్ సాధించడానికి రెండు మూడేళ్ల నుంచి శిక్షణ తీసుకుంటున్నాడు. దీని కోసం అతను 30 సెకన్ల టైమ్ ని విభజించుకుని పుష్-అప్స్ చేయడం ప్రారంభించాడు. ప్రతీ 30 సెకన్ల సెట్ లో 26 పుష్ అప్స్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీన్ని అతడు అధిగమించి ఆ సమయంలో సగటున 26.7 పుష్ అప్స్ సాధించాడు. ఈ ఫీట్ చేసే సమయంలో శరీరం నిటారుగా ఉండాలి. నడుము వంగకూడదు. మోచేయి వద్ద కనీసం 90 డిగ్రీల కోణం పొందే వరకు శరీరాన్ని తప్పనిసరిగా కిందికి తీసుకురావాలి. దీని తర్వాత చేతులు నిటారుగా పైకి లేవాలి. ఇందులో ఏ ఒక్కటి సరిగ్గా లేకున్నా అది కౌంట్ కాదు. ప్రస్తుతం గిన్నిస్ రికార్డ్ సాధించిన లూకాస్ ప్రతీ ఏడాది ఇలాగే ఓ రికార్డ్ నెలకొల్పాలని భావిస్తున్నాడు.
టీజర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి… జాన్ విక్ అడప్షనా?
కమర్షియల్ సినిమాలకి, హీరో ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాలకి, ఫైట్స్ కి, ఎలివేషన్స్ కి… ఇలా ఒక సినిమాకి కావాల్సిన ఎన్నో ఎలిమెంట్స్ కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన సినిమా ‘జాన్ విక్’. కుక్క పిల్ల కోసం జాన్ విక్ చేసిన విధ్వంసం సినీ అభిమానులకి గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ మూవీని ఇచ్చింది. పెన్సిల్, ఫోర్క్, స్వోర్డ్, గన్… వాట్ నాట్, చేతికి ఏది దొరికితే దాన్ని తీసుకోని శత్రువులని చంపడమే పనిగా ‘బాబా యాగా’ ఇప్పటికీ ఆడియన్స్ ని మెప్పిస్తునే ఉంది. ఈ ఫ్రాంచైజ్ నుంచి నాలుగో సినిమా బయటకి వచ్చి రీసెంట్ గా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఒక్కసారి జాన్ విక్ సినిమాలని చూడడం మొదలుపెడితే ఫ్రాంచైజ్ లో వచ్చిన ప్రతి సినిమాని చూసేస్తారు. అంత ఇంపాక్ట్ ఇచ్చే జాన్ విక్ మూవీ రేంజులో బాలీవుడ్ లో ఒక సినిమా వస్తున్నట్లు ఉంది. ఇటివలే లాంచ్ అయిన జియో స్టూడియోస్ నుంచి రానున్న ‘బ్లడీ డాడీ’ సినిమా టీజర్ జాన్ విక్ ని గుర్తు చేసే రేంజులో ఉంది. ఒటీటీలోకి డెబ్యు ఇస్తూ ‘ఫర్జీ’ వెబ్ సీరీస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన షాహిద్ కపూర్ ‘బ్లడీ డాడీ’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
