NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

వర్షాలపై సీఎం సమీక్ష.. వరద తగ్గిన వెంటనే పంటనష్టంపై వివరాలు సేకరించాలి..

భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. జిల్లాలు, శాఖల వారీగా తాజా పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై చంద్రబాబు రివ్యూ చేశారు. డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా రియల్ టైంలో పరిస్థితిపై అధికార యంత్రాంగం స్పందించాలని సీఎం ఆదేశించారు. మీడియాలో, సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్‌లలో వచ్చే విజ్ఞప్తులపై తక్షణ స్పందన ఉండాలన్నారు. వరద తగ్గిన వెంటనే పంటనష్టంపై వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్‌కు 9 లక్షల క్యూసెక్కుల పైచిలుకు వరద వస్తుందని అంచనా వేస్తున్నారు. నిన్నటితో పోల్చుకుంటే జిల్లాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వర్షాల తీవ్రత తగ్గిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇంకా వరదలోనే ఇళ్లు, కాలనీలు ఉన్నాయన్నారు. రహదారులపైనున్న నీటికి బయటకు పంపడమే కాదు.. కాలనీలు, ప్రజల ఇళ్లలో ఉన్న వరద సమస్యను పరిష్కరించాలన్నారు. పలు ప్రాంతాల్లో 27 సెంటీమీటర్లకు పైగా వర్షం పడిందని.. ఇలాంటి చోట్ల పరిస్థితిపై ఫోకస్ పెట్టాలన్నారు. 50 ఏళ్లలో ఎప్పుడూ పడనంతగా వర్షం పడిందని.. ఎప్పుడూ లేని విధంగా నేషనల్ హైవేలు కూడా వరద నీటితో చెరువులను తలపించాయన్నారు. నేషనల్ హైవే అథారిటీకి కూడా లేఖ రాసి సమస్యపై సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షించాలన్నారు. వర్షాలు, వరదల కారణంగా ఆహారం, నీరు కలుషితం అవుతుందని.. గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. నివాస ప్రాంతాల మధ్య నుంచి వరద నీటిని వీలైనంత త్వరగా లేకుండా చేయాలని సూచించారు. వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ చల్లడంతో పాటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న మంత్రులతో చంద్రబాబు టెలీ కాన్పరెన్స్ నిర్వహించారు. బుడమేరు వరద వల్ల పలు ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయని మంత్రి నారాయణ తెలిపారు. ఇరిగేషన్ సహా ఇతర శాఖల అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలని సీఎం చంద్రబాబు సూచించారు. నూజివీడు నియోజకవర్గంలో రికార్డు స్థాయి వర్షాలకు జరిగిన నష్టాన్ని మంత్రి కొలుసు పార్థసారధి వివరించారు. ఇబ్బందుల్లో ఉన్న పలు ప్రాంతాల వారికి బియ్యం, నిత్యావసరాలు సరఫరా చేసినట్లు మంత్రి నాదెండ్ల వివరించారు. వరదలపై వ్యవసాయ శాఖ తరుపున తీసుకుంటున్న చర్యలనుమంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. వరద తగ్గిన తరువాత ఆస్తి, పంటనష్టం వివరాలు సేకరించాలని.. రైతులకు, కుటుంబాలకు వెంటనే సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

 

తెలంగాణకు పొంచి ఉన్న వాయుగుండం ముప్పు..
తెలంగాణకు వాయుగుండం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 24 గంటల్లో వాయుగుండం తెలంగాణ మీదుగా కదలనుంది. తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్స్‌ ప్రకటించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు వణుకుతున్నాయి. వర్షాలు, వరదల ముప్పు పెరుగుతోంది.. దీంతో వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది.. నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

 

రాష్ట్రంలో కురుస్తున్న వానలు.. తెలంగాణలో జిల్లాల పరిస్థితి ఇదీ..
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం తడిసి ముద్దయింది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తు న్నాయి. వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలలోని ప్రజల పరిస్థితి దారుణంగా మారింది. భారీ వర్షాలకు ఏ ఏ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందంటే..
జల దిగ్బంధంలో మణుగూరు..
భద్రాద్రి కొత్తగూడెంలో భారీ వర్షాలకు మణుగూరు జల దిగ్బంధంగా మారింది. అర్ధరాత్రి వరద ఊరును చుట్టుముట్టింది. దీంతో కొట్టుకుపోయిన కార్లు, బైకులు, నిత్వాసర వస్తువులు. అర్ధరాత్రి ఇళ్లలోకి చేరిన వరద నీరు. మణుగూరులోని రోడ్లన్నీ జలమయం.. పొంగిపొర్లుతున్న కోడిపుంజుల వాగు, కట్టు వాగు. భద్రాద్రి జిల్లా.. ఇల్లందు పట్టణంలోని ఇల్లందులపాడు చెరువు. ఇల్లందు సత్యనారాయణపురం మధ్య కల్వర్టు పైనుంచి వెళ్తున్న వరద ఉదృతకి ప్రవాహంలో కొట్టుకుపోయిన సత్యనారాయణ పురానికి చెందిన పాషా. ప్రవాహంలో చెట్టును పట్టుకొని ఉన్న అతన్ని రక్షించిన స్థానికులు.
ఆదిలాబాద్ జిల్లాలో పెనుగంగా ఉదృతి
ఆదిలాబాద్ జిల్లాలో పెనుగంగా ఉదృతి పెరిగింది. జైనథ్ మండలంలో ఉప్పొంగి పెనుగంగా నది ప్రవహిస్తుంది. అనంద్ పూర్ వద్ద బ్రిడ్జి పై నుంచి ప్రవహిస్తున్న ప్రవహిస్తున్న పెనుగంగా. తెలంగాణ మహారాష్ట్ర మధ్య రాకపోకలకు బ్రేక్ పడింది.
విజయవాడ-చత్తీస్‌గఢ్ జాతీయ రహదారి పై వరద
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో కుండపోత వర్షం కురుస్తుంది. విజయవాడ-చత్తీష్ఘట ఘడ్ జాతీయ రహదారి పై వరద పోటెత్తింది. బయ్యన్నగూడెం,తుమ్మలపల్లి, కుప్పెనకుంట్ల గ్రామాల వద్ద జాతీయ రహదారి పై ప్రవహిస్తున్న వరద నీరు. విజయవాడ వైపు నుండి భద్రాచలం వైపు నిలిచిన రాకపోకలు. విజయవాడ నుండి భద్రాచలం వెళ్ళే వాహనాలను ముత్తగూడెం వద్ద మళ్ళించారు అధికారులు.
ఇందల్వాయి వద్ద ఉదృతంగా లింగాపూర్ వాగు ప్రవాహం..
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి వద్ద ఉదృతంగా లింగాపూర్ వాగు ప్రవహిస్తుంది. ఇంధల్వాయి దర్పల్లి మధ్య రోడ్డు మూసివేశారు అధికారులు. రాకపోకలకు అనుమతి నిలిపి వేసిన పోలీసులు. ఇక ఆర్మూర్ నియోజకవర్గంలో ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం. రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా చెరువులు నిండుగా ప్రవహిస్తున్నాయి. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో అత్యవసర సహాయ సిబ్బందిని ఏర్పాటు చేసిన మున్సిపల్ అధికారులు.
దాల్మల్ కుంట చేరువుకు బుంగ..
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం బొమ్మన్ దేవ్ పల్లి గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి దాల్మల్ కుంట చేరువుకు బుంగ ఏర్పడింది. పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరింది.
పెద్దపల్లి జిల్లా కడెం నుంచి భారీగా వరద
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన కడెం నుంచి భారీగా వరద నీటి ప్రవాహం ప్రవహిస్తుంది. ఇన్ ఫ్లో 83 వేల 521 క్యూసెక్కులు కొనసాగుతుంది. ఔట్ ఫ్లో 1 లక్ష 23 వేల క్యూసెక్కులు కాగా.. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలుగా కొనసాగుతుంది. ప్రస్తుత నిల్వ 18.7 టీఎంసీ లు.ప్రాజెక్ట్ కు సంబంధించిన 20 గేట్లు తెరచి 1 లక్ష 23 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. నది పరివాహక గ్రామాల ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారుల హెచ్చరికలు
మహబూబాబాద్ జిల్లాలో తెగిన చెరువు కట్టలు..
మహబూబాబాద్ (మ) అయోధ్య గ్రామంలో చెరువు కట్ట… తెగి గ్రాంలోకి నీరు చేరింది మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో భారీ వర్షం రావిరాల గ్రామంలోని చెరువు నిండి మత్తడి పోయడంతో రాత్రి ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది దింతో ఇంటి స్లాబ్ పైకి ప్లాస్టిక్ పరదాలు కప్పుకున్న బాధితులు, సహాయంకోసం ఎదురుచూస్తోంది వరదలో కొట్టుకపోయిన ఇంటి ముందు పెట్టిన బైకులు ఆటో కార్లు మూగజీవాలు 200 గోర్లు వరదలు కొట్టుకపోవడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది జలదిగ్బంధంలో రావిరాలా,మదనతుర్తి గ్రామ శివారు టేక్య తండా తండాలోని సుమారు 30 ఇండ్లలోకి చేరడంతో ఇంటి స్లాపు పైకి ఎక్కిన తల దాచుకున్నరు బాధితులు. రాత్రి ఒంటి గంట నుండి ఇంటి స్లాబ్ పై బిక్కు బిక్కు మంటూ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
లెవెల్ బ్రిడ్జి పైనుంచి ఉదృతంగా ప్రవహిస్తున్న వరద
ఇక రావిరాల లో లెవెల్ బ్రిడ్జి పైనుంచి ఉదృతంగా ప్రవహిస్తున్న వరదకు మహబూబాబాద్ తొర్రూరుకు నిలిచిపోయిన రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడ, గంగారం మండలాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో పలు గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రాకపోక లు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. మహబూబాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల తో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. ఇంటికన్నె …. కేశముద్రం రైల్వే స్టేషన్లో సమీపంలో రైల్వే ట్రాక్ దెబ్బతిన్నంతో పలు రైలు వివిధ స్టేషన్లో నిలిచిపోయాయి సికింద్రాబాద్ ఖమ్మం రోడ్ లో 30 ట్రైన్లు ఎఫెక్ట్ అయ్యాయి వరంగల్ సమీపంలో నిలిచిపోయినని కాజీపేట స్టేషన్ కి తరలించి డైవర్ట్ చేస్తున్నారు భారీ వర్షాలతో నిలిచిపోయిన రైళ్ల వివరాలతో పాటు రైలు ప్రయాణికుల ఇబ్బంది పడుతున్నారు.
ములుగు పొంగుతున్న జలగలంచ వాగు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం గోవిందరావుపేట మండలాల మధ్య ఉన్న జలగలంచ వాగు పొంగడంతో వాహనరాకపోకలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. అదేవిధంగా నూగూరు వెంకటాపూర్ మండలంతో పాటు తా డ్వాయి మండలంలో ప్రధాన రహదారి పై చెట్లు కూలడంతో రాకపోకలు నిలిచి పోయాయి. భారీ వర్షాల కారణంగా తొలగించడం వీలుకాకపోవడంతో ప్రజ లు ఇబ్బందులు పడ్డారు. ములుగు జిల్లా.గోవిందరావుపేట మండలంలో గుండ్ల వాగు, దయ్యాలవాగు ఉదృతంగా ప్రవ హిస్తుండటంతో వాగుల పరివాహక ప్రాంతాలల్లోనివందలాది ఎకరాల భూములు నీట మునిగాయి. వాగుల ఉదృతితో మేడారం వద్ద జంపన్నవాగు బ్రిడ్జి దాటి ప్రవహిస్తుండటంతో పరిసర ప్రాంతాలప్రజలకు వరద ముంపు ఉం దని అధికారులు ప్రజలను అప్రమత్తంం చేశారు. ములుగు మండలంలోని బొగ్గు లవాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో జగ్గన్నగూడెం, అంకన్నగూడెం గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచి పోయాయి.
భూపాలపల్లి జిల్లాలోని ఉదృతంగా మోరంచ వాగు, చలివాగు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మోరంచ వాగు, చలివాగు ఉదృతంగా ప్రవహిస్తున్నది. వరంగల్ జిల్లా లోని పాకాలవాగు, ఆకేరు, మున్నే రు వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. మరోరెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతా వరణ శాఖ చెప్పడంతో ఇటు ప్రజల్లోను, రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉదృతంగా వాగులు, వంకలు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల్లో వర్ష దంచి కొడుతోంది రెండు రోజులుగా కురుస్తునం వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న వాగు లు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. హనుమకొండ -ఏ టూర్నగారం 163వ జాతీయ రహ దారిపై వాగులు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో వాహానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగ ల్ జిల్లాలోని లోతట్టుప్రాతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎక్క డికక్కడిగా జిల్లా కేంద్రాలల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటుచేసి ఎప్పటికప్పడు వరద సమాచారం, వర్ష సమాచారం తెలుసుకుని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వరంగల్ నగరంలోని ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే నగరంలోని భద్రకాళీ, వడ్డేపల్లి చెరువులు మత్తడి పడుతుండటంతో వరదముంపు పొంచి ఉన్నదని లోతట్టు ప్రాంతాల ప్రజలను హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారదాదేవి, గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అప్రమత్తం చేశారు.

 

ఉప్పొంగుతున్న మూసీ నది.. భయం గుప్పిట్లో ప్రజలు..
హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతుంతి. బంజారా, పికెట్, కూకట్ పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వరద వచ్చి చేరుతుంది. హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. హుస్సేన్ సాగర్ లో 513.43 మీటర్లుగా ఉన్న ప్రస్తుత నీటి మట్టం కాగా.. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లకు చేరింది. తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసిలోకి వదులుతున్న అధికారులు. మూసి పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. రెండురోజులుగా కురుస్తున్న వానలకు హైదరాబాద్‌ వాసుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు జంట జలాశయాల నుంచి విడుదల చేసిన నీటితో మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పరిహాక ప్రాంతాల ప్రజలు… భయంతో అల్లాడుతున్నారు. పురానాపూల్ ముద్ద నీటితో నిండిపోయింది. భారీగా వరద నీరు చేరడంతో పరిసర ప్రాంతాల్లోని కాలనీలు నీట మునిగాయి. పురానాపూల్‌, జియాగూడ ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జియాగూడ ప్రాంతంలో చెరువులకు వెళ్లే రహదారులతో వాహనాల రాకపోకలను నియంత్రించారు. చాదర్‌ఘాట్‌, ముసారాంబాగ్‌ వంతెనలపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ముసారాంబాగ్ వంతెన మూసివేయడంతో అంబర్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూసా నగర్, కమలా నగర్ పరిసరాలు మూసాయి వరద ముంపునకు గురైంది. మూసీ పరివాహక ప్రాంతంలోని చాదర్‌ఘాట్‌, మూసానగర్‌, శంకర్‌నగర్‌ కాలనీల వాసులను అధికారులు అప్రమత్తం చేసి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. నాగోల్ పరిధిలోని అయ్యప్పకాలనీ కూడా వరద నీటిలో చిక్కుకుంది. ఇళ్లలోకి నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం రుద్రవల్లి గ్రామ శివారులోని లోలెవల్ వంతెనపై నుంచి ఎగువన ప్రవహిస్తోంది. దీంతో భూదాన్ పోచంపల్లి మండలంలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద… లోలెవల్ వంతెనపై నుంచి మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.

 

చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. బెజవాడలో రికార్డ్‌ వర్షం
భారీ వర్షాలు విజయవాడ, గుంటూరు నగరాలను అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేని వర్షంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. బెజవాడలో రికార్డ్‌ వర్షపాతం నమోదైంది. 30 ఏళ్ల రికార్డ్ బద్దలైంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకేరోజు 29 సెంటిమీటర్ల వర్షపాతం కురిసింది. రెండు రోజులు విజయవాడలో కుండపోత వర్షం కురవడంతో అనేక కాలనీల్లో నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది. విజయవాడలో కనివినీ ఎరగని రీతిలో కురిసిన వర్షానికి నగర జీవనం అస్తవ్యస్తమైంది. ఎప్పుడూ చూడని రీతిలో బెజవాడలో కుంభవృష్టిలా వర్షం పడడంతో కాలనీలన్ని నీటమునిగాయి. ఏకధాటిగా రోజంతా వర్షం కురవడంతో వరదలు నగరాన్ని ముంచెత్తాయి. నగరం జలదిగ్బంధంలో చిక్కి విలవిల లాడుతోంది. ఎన్టీపీసీలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు కొండచరియలు విరిగిపడడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడలోని విద్యాధరపురం, ఆర్‌ఆర్‌ నగర్‌లో రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది. భారీ వర్షాలకు మొఘల్రాజపురం సున్నపు బట్టీ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలకు వర్షం పలుమార్లు ఆటంకం కలిగించింది. విజయవాడ బస్టాండ్‌ పరిసర ప్రాంతాలు నీటమునిగాయి. రామవరప్పాడు రింగ్‌ రోడ్డు వద్ద భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. బెంజ్ సర్కిల్‌ ఫ్లైఓవర్ కింద భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది.

 

భారీ వర్షాలు.. విద్యుత్‌ శాఖ నష్టంపై మంత్రి సమీక్ష
భారీ వర్షాల వల్ల జరిగిన విద్యుత్ శాఖ నష్టంపై అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష నిర్వహించారు. వీటీపీఎస్‌లోకి భారీగా వర్షపు నీరు చేరటం వల్ల 2500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని మంత్రి తెలిపారు. నీటిని తోడే పనులు నిర్విరామంగా సాగుతున్నాయన్నారు. పోలవరం సైట్ నుంచి హై కెపాసిటీతో నీరు తోడే పంపులు తెప్పిస్తున్నామన్నారు. బొగ్గు మొత్తం తడిచిపోవటం వల్ల విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరించేందుకు మరో 48 నుంచి 72 గంటల సమయం పడుతుందన్నారు. విజయవాడ పరిసరాల్లో విద్యుత్ అంతరాయంపై అనేక ఫిర్యాదులు వచ్చాయని.. ఎప్పుడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో అధిక వర్షం కురవడం వల్ల సబ్ స్టేషన్లు సైతం నీట మునిగాయని మంత్రి వెల్లడించారు. సబ్ స్టేషన్లను పునరుద్దరిస్తూ విద్యుత్ సరఫరా చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి చెప్పారు. విజయవాడ నగరంలోనూ పలు చోట్ల విద్యుత్ కోతలు ఉన్నమాట వాస్తవమేనన్నారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకూడదనే కొన్ని చోట్ల ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశామన్నారు. అధికారులు, సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలోనే ఉంది ఫిర్యాదులు పరిష్కరిస్తున్నారని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులతోనూ మాట్లాడి వారి సూచనలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు వేగవంతం చేశామన్నారు. శాఖాపర సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు.

 

పాకిస్థాన్‌లో కుండపోత వర్షాలు… విరిగిపడిన కొండచరియలు, చిక్కుకున్న పర్యాటకులు
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని కొండ ప్రాంతాల్లో కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పలు ప్రధాన రహదారులు మూసుకుపోయాయి. ఈ కొండచరియలు విరిగిపడటంతో పలువురు పర్యాటకులు చిక్కుకుపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనేక ఇతర ప్రాంతాలలో కూడా గణనీయమైన నష్టం జరిగినట్లు నివేదికలు ఉన్నాయి. అబోటాబాద్‌లో, తాండియాని రోడ్డులో కొండచరియలు విరిగిపడటంతో రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక ఇతరాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉండగా కుమ్రత్, మహేంద్రిలో చిక్కుకుపోయిన పర్యాటకులను విజయవంతంగా రక్షించారు. హిమపాతం కారణంగా ఘిజర్‌లో వాతావరణం చల్లగా మారింది. దీని కారణంగా నివాసితులు వెచ్చని బట్టలు ధరించాల్సి వచ్చింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ఎగువ ప్రాంతాల్లో వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో సమస్యలు పెరిగాయి. గాలి బన్యన్‌లోని రహదారి ఇప్పటికీ నిరోధించబడింది. అబోటాబాద్‌లోని సల్హాద్ ప్రాంతంలోని సిల్క్‌రోడ్ కూడా కొండచరియలు విరిగిపడటంతో ప్రభావితమైంది. నివాసితులు ఖాళీ చేయవలసి వచ్చింది. కుమ్రత్‌లో కొండచరియలు విరిగిపడిన రహదారిని ఇంకా పునరుద్ధరించలేదు. చిక్కుకుపోయిన పర్యాటకులను బద్గోయ్ మార్గం ద్వారా కలాం వద్దకు సురక్షితంగా తరలించినప్పటికీ, కొందరు షెరింగల్ వైపు నడవడానికి ఎంచుకున్నారు. మన్సెహ్రాలో, మహేంద్రి వద్ద వంతెన మరమ్మతులు పూర్తయ్యాయి. రెండు రోజుల తర్వాత కాఘన్ హైవే తిరిగి తెరవబడింది. మహేంద్రిలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది విదేశీ పర్యాటకులను కూడా రక్షించారు. అదనంగా, ఘిజర్ పర్వతాలు ఇప్పుడు మంచుతో కప్పబడి ఉన్నాయి. దీనివల్ల ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఘిజర్ నదిలో పెరుగుతున్న నీటి మట్టం లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. ఇది స్థానిక జనాభాకు మరింత సవాళ్లను సృష్టిస్తుంది.

 

నిబంధనలను అతిక్రమిస్తే.. నేరుగా మొబైల్ నెంబర్‌కు ట్రాఫిక్ చలాన్‌..
ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించడం మామూలే. వాహనాలను ఆపి చలాన్ వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి అంతా హైటెక్‌. ప్రయాణికులు ఎక్కడికక్కడ నిలబడినా.. హెల్మెట్ పెట్టుకోకపోయినా.. రాంగ్ రూట్ లో వెళ్తున్నా.. ట్రాఫిక్ పోలీసులు కెమెరా క్లిక్ మనిపిస్తూ చలాన్ జారీ చేస్తున్నారు. అయితే మన వాహనానికి చలానా పడిందా లేదా అని తెలుసుకోవాలంటే వెబ్‌సైట్‌లోకి వెళ్లి వాహనం నంబర్‌ను నమోదు చేసి వివరాలు పొందుతాం. అయితే దానికి బదులు తెలంగాణ రవాణా శాఖ కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ట్రాఫిక్ చలాన్ పెండింగ్ లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి కొత్త ప్రతిపాదన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే మొబైల్ నంబర్‌కు నేరుగా ట్రాఫిక్ చలాన్‌లు పంపే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అంతే కాకుండా సులువుగా బిల్లుల చెల్లింపునకు వీలుగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ యాప్, యూపీఐ ఆప్షన్‌లను అందించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వాహనదారుల నుంచి పెద్దమొత్తంలో పెండింగ్‌లో ఉన్న చలాన్ల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని భావించిన అధికారులు ఈ ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ వ్యవస్థను త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విధానం నేరుగా రాష్ట్రవ్యాప్తంగా కాకుండా.. కొన్ని నగరాల్లో ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని యోచిస్తున్నారు. చలాన్ వాట్సాప్ లేదా మెసేజ్ రూపంలో పంపబడుతుంది మరియు చలాన్‌ల చెల్లింపు UPI మోడ్‌లో తీసుకురాబడుతుంది.

 

బంగ్లాదేశ్‌లో వరద విధ్వంసం.. 59మంది మృతి.. ఇబ్బందుల్లో 54లక్షల మంది
ఒకవైపు దేశంలో నిరసనలు వెల్లువెత్తుతుండగా, బంగ్లాదేశ్ కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు వరదల కారణంగా దేశంలో పరిస్థితి దారుణంగా ఉంది. వర్షం విపత్తులా కురుస్తోంది. ఆగస్టు 31న బంగ్లాదేశ్‌లోని 11 జిల్లాల్లో 5.4 మిలియన్లకు పైగా ప్రజలను ప్రభావితం చేసిన వరదల్లో ఆరుగురు మహిళలు, 12 మంది పిల్లలతో సహా సుమారు 59 మంది మరణించారని ప్రకటించారు. వరద పరిస్థితిపై అప్‌డేట్ ఇస్తూ.. ఈశాన్య భారతదేశంలోని త్రిపుర సరిహద్దులో ఉన్న కొమిల్లా 14, ఫెని జిల్లాల్లో 28 మరణాలు నమోదయ్యాయని విపత్తు నిర్వహణ సహాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. డెల్టా ప్రాంత బంగ్లాదేశ్, ఎగువ భారత ప్రాంతాలలో రుతుపవనాల వర్షాల కారణంగా ఏర్పడిన వరదలు దాదాపు రెండు వారాల పాటు దేశంలో వినాశనాన్ని సృష్టించాయి. చాలా మంది ప్రజలు, పశువులు, ఆస్తిని నాశనం చేశాయి. రాజకీయ సంక్షోభం మధ్య ఇటీవల ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వానికి పెద్ద పరిపాలన సవాలు ఉంది. బంగ్లాదేశ్‌లో 200 కంటే ఎక్కువ నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. గత వారం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈశాన్య మేఘనా బేసిన్ , నైరుతి ఛటోగ్రామ్ హిల్స్ బేసిన్ అనే రెండు బేసిన్‌లలో నదులకు భారీ వరదలు వచ్చాయి. 11 జిల్లాల్లోని 504 యూనియన్లు, మున్సిపాలిటీల్లోని 54 లక్షల 57 వేల మందికి పైగా వరదలు విపత్తును తెచ్చిపెట్టాయి. దాదాపు ఏడు లక్షల కుటుంబాలు ఇంకా వరదల్లో చిక్కుకున్నాయని, దాదాపు నాలుగు లక్షల మంది 3,928 షెల్టర్ సెంటర్లలో నివసిస్తున్నారని విపత్తు నిర్వహణ, సహాయ మంత్రిత్వ శాఖ అధికారులను ఉటంకిస్తూ బంగ్లాదేశ్ సంగ్‌బాద్ ఆర్గనైజేషన్ తెలిపింది. దీంతో పాటు 36,139 పశువులకు కూడా ఆశ్రయం కల్పించారు. పరిస్థితి మెరుగ్గా ఉందని చెబుతున్నారు. ప్రజలు ఇళ్లకు తిరిగి వస్తున్నారు. తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఉన్న మహ్మద్ యూనస్ బ్యూరోక్రసీ తలరాతలు మారుస్తున్న సమయంలో దేశంలో వరదలు సంభవించాయి. కొత్త ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎన్నికైన 1,800 మందికి పైగా స్థానిక ప్రభుత్వ ప్రతినిధులను కూడా తొలగించింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆగస్టు 5న రాజీనామా చేశారు. దేశంలో కొనసాగుతున్న ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ఆమె భారతదేశానికి వచ్చింది.