ఖజానా ఖాళీ.. అన్ని శాఖల్లో అప్పులే..!
గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేయడమే కాకుండా.. అప్పులు చేసి పెట్టింది.. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అప్పులే కనిపిస్తున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి పొంగూరు నారాయణ.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ ప్రభుత్వ హయాంలో.. ప్రభుత్వ భవనాలను సైతం తాకట్టు పెట్టిందని విమర్శించారు.. అయితే, రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఆదాయ వనరులు పెరగాలి.. పారిశ్రామికంగా అభివృద్ధి జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.. అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.. మున్సిపల్ శాఖలో ప్రజలు కట్టిన పన్నుల డబ్బులన్నిటినీ వాడేశారనా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు మురిగిపోయాయని విమర్శించారు..మరోవైపు.. ఈ రోజు తెల్లవారుజామున నుండే రాష్ట్రంలో 68 లక్షల 64 వేల మందికి పెన్షన్ల పంపిణీ ప్రారంభమైందని వెల్లడించారు మంత్రి నారాయణ.. రూ.3వేల నుండి రూ..4 వేలకు పెంచుతామని ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకున్నారు.. ఇచ్చిన మాటకు అనుగుణంగా.. గత నెలలో ఒకేసారి రూ.7 వేల పెన్షన్ పంపిణీ చేశాం.. ఈ నెల నుంచి ప్రతీ నెలా రూ.4 వేల పెన్షన్ లబ్ధిదారులకు అందుతుందన్నారు.. ఇక, ఈ నెలాఖరుకు 203 అన్నా క్యాంటీన్లను పూర్తిస్థాయిలో పునఃప్రారంభిస్తామని ప్రకటించారు మంత్రి పొంగూరు నారాయణ.
మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనపై సర్కార్ కీలక నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్‌లో మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన సంచలనం సృష్టించింది.. అయితే, ఇది అగ్నిప్రమాదం కాదని.. ఉద్దేశ్యపూర్వకంగానే కీలక దస్త్రాల్ని కాల్చివేశారని పోలీసులు తేల్చారు.. దీనిపై విచారణ సాగుతూ వస్తున్న తరుణంలో.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనను సీఐడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండు, మూడు రోజుల్లో దీనిపై ఉత్తర్వులు జారీ చేయనుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.. మదనపల్లి ఫైల్స్ ఘటనలో రోజు రోజుకూ కొత్త అంశాలు వెలుగులోకి వస్తుండడంతో సీఐడీ అయితేనే మేలని భావిస్తోంది సర్కార్.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉండడంతో సీఐడీకి మదనపల్లి ఫైల్స్ కేసు బదలాయించాలనే నిర్ణయానికి వచ్చింది..
శ్రీశైలం మల్లన్న సేవలో సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.. నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాల పర్యటనలో భాగంగా మొదట శ్రీశైలం చేరుకున్న ఏపీ సీఎంకు.. సున్నిపెంటలోని హెలిప్యాడ్ దగ్గర మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.. ఆ తర్వాత రోడ్డు మార్గాన శ్రీశైలం మల్లన్న ఆలయనాకి చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆయన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి
ఉద్యోగ నియామకాల్లో వర్గీకరణ అమలు చేస్తామన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల అమలులో ముందు ఉంటామని సీఎం తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కు మాదిగ, మాల ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్ ను సస్పెండ్ చేసిందన్నారు. 2023 డిసెంబర్ 23న ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, దామోదర రాజనర్సింహ అడ్వకెట్ జనరల్ ను సుప్రీంకోర్టుకు పంపించారని అన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు లో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందని అన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇప్పుడు అమలులో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్ లో కూడా మాదిగ, మాల ఉప కులాలకు రెజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని తెలిపారు. ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకోస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గాని.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గాని.. ఏ.బి.సి.డి వర్గీకరణ మీద మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు పోరాటాలు చేయడం జరిగిందని తెలిపారు. వారి పోరాటాల ఫలితం ఒకనాడు ఇదే శాసనసభలో మాదిగ.. మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానం ఇస్తే.. నాతోపాటు ఆనాటి శాసనసభ్యులు సంపత్ కుమార్ ని కూడా ఈ సభ నుంచి బహిష్కరించడం జరిగిందని గుర్తుచేశారు. అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకపోకుండా మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది బీఆర్‌ఎస్ అన్నారు. కానీ డిసెంబర్ 3, 2023 నాడు ప్రజా ప్రభుత్వం కోర్టులో వాదన వినిపించిందని తెలిపారు. రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఏడు మంది చర్చిలలో.. ఆరు మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చేయడానికి అనుమతించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫుననే స్పష్టమైన ప్రకటన చేస్తున్న దేశంలోనే అందరికంటే ముందుభాగాన నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ అమలు చేస్తామన్నారు.
ఉద్యోగ నియామకాల్లో వర్గీకరణ అమలు చేస్తాం..
ఉద్యోగ నియామకాల్లో వర్గీకరణ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల అమలులో ముందు ఉంటామని సీఎంతెలిపారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే… విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప కేటగిరీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 6:1 మెజారిటీతో సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. అయితే ఈనేపథ్యంలో.. సుప్రీంకోర్టు తీర్పుతో సీఎం రేవంత్ రెడ్డి ని మాదిగ ఎమ్మెల్యేలు, మంత్రులు దామోదర రాజనర్సింహ, కడియం శ్రీహరి, కవ్వంపల్లి, వేముల వీరేశం,శామ్యూల్ శాలువా కప్పి సన్మానించారు. స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో గాని.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గాని.. ఏ బి సి డి వర్గీకరణ మీద మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు పోరాటాలు చేయడం జరిగిందని తెలిపారు. వారి పోరాటాల ఫలితం ఒకనాడు ఇదే శాసనసభలో మాదిగ.. మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానం ఇస్తే.. నాతోపాటు ఆనాటి శాసనసభ్యులు సంపత్ కుమార్ ని కూడా ఈ సభ నుంచి బహిష్కరించడం జరిగిందని గుర్తుచేశారు. అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకపోకుండా మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది బీఆర్‌ఎస్ అన్నారు. కానీ డిసెంబర్ 3, 2023 నాడు ప్రజా ప్రభుత్వం కోర్టులో వాదన వినిపించిందని తెలిపారు. రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఏడు మంది చర్చిలలో.. ఆరు మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చేయడానికి అనుమతించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫుననే స్పష్టమైన ప్రకటన చేస్తున్న దేశంలోనే అందరికంటే ముందుభాగాన నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ అమలు చేస్తామన్నారు.
ఏళ్ల నిరీక్షణకు తెర.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సంచలన తీర్పు
ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేత్రుత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వర్గీకరణ తప్పనిసరి అని, ఆ అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అనివార్యమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో తుది తీర్పును వెల్లడించింది. ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. దీంతో దేశ వ్యాప్తంగా ఎస్సీ కులస్థులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో మూడు రోజుల పాటు విచారణ సాగిన విషయం తెలిసిందే. వర్గీకరణ సమర్థనీయమని న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది. సుదీర్ఘ వాదనలు అనంతరం ఫిబ్రవరి 8న తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు.
ఎస్సీ ,ఎస్టీ రిజర్వేషన్ల కేసు బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ..
ఎస్సీ , ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ సంబంధించి ఉమ్మడి ఆంధ్రపదేశ్ లో బీజం పడింది. 2000-2004 వరకు అప్పటి చంద్రబాబు సర్కార్ ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ ను అమలు చేసింది. అయితే మాలమహనాడు వర్గీకరణను వ్యతిరేకించింది.. హైకోర్టులో న్యాయపోరాటం చేసింది. హైకోర్టు వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దాంతో 2004 లో అనాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ అనంతరం వర్గీకరణను వ్యతిరేఖించింది. వివక్ష, వెనుక బడిన వాళ్లందరిని ఒకే కేటగిరిలో ఉంచాలని ఆదేశాలిస్తూ.. హైకోర్టును తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ కోసం పోరాటాలు ప్రజా ఉద్యమాలుగానూ, రాజకీయ ఉద్యమాలుగానూ జరుగుతూనే ఉన్నాయి. అయితే పంజాబ్ ప్రభుత్వం తాజాగా వర్గీకరణ చేసేందుకు సిద్ధం అవడంతో అక్కడి హైకోర్టు సుప్రీం కోర్టులోని 2004 కేసుకు రిఫర్ చేసింది. తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలం అనే బీజేపీ ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం క్యాబినేట్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీ కూడా వేసింది. దాంతో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మూడు రోజుల పాటూ సుప్రీం కోర్టులో సుదీర్గ విచారణ జరిపింది. ఫిబ్రవరి 8 న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈమేరకు తీర్పు వెలువడింది. ఏళ్ల కల నెరవేరింది.
ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004లోనే చెప్పా: మంద కృష్ణ మాదిగ
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. 20 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004 నవంబర్ 5న చెప్పానన్నారు. అధర్మమే తాతాక్కలిమైనా.. చివరకు ధర్మమే గెలుస్తుందని ఆనాడే చెప్పా అని మందకృష్ణ మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ…. ‘వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. మా 30 ఏళ్ల అలుపెరగని పోరాటానికి విజయం లభించింది. ఈ పోరాటంలో ఎంతో మంది అసువులు బాశారు. వర్గీకరణ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ఎన్నో కుట్రలు జరిగాయి. సహనం కోల్పోకుండా పట్టుదలతో పోరాటం చేసి విజయం సాధించాం. 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడిలో వర్గీకరణ ఉద్యమాన్ని ప్రారంభించాం. జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు పోరాడాం. న్యాయం కోసం ఎమ్మార్పీఎస్‌కు అండగా నిలబడ్డ వారందరికి ఈ విజయం అంకితం’ అని అన్నారు.
సాదాసీదాగా వచ్చి.. రజత పతకం గెలిచిన 51 ఏళ్ల టర్కీ షూటర్! అదెలాగబ్బా
పారిస్ ఒలింపిక్స్ 2024లో 51 ఏళ్ల టర్కీ షూటర్ యూసఫ్ డికేక్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇందుకు కారణం అతడు అత్యంత సాదాసీదాగా వచ్చి.. షూటింగ్ ఈవెంట్‌లో పాల్గొనడమే. సాధారణంగా షూటింగ్ ఈవెంట్‌లలో క్రీడాకారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మెరుగైన కచ్చితత్వం కోసం ప్రత్యేకమైన సన్‌గ్లాసెస్, నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఇయర్ ప్రొటక్టర్లను వాడుతుంటారు. యూసఫ్ మాత్రం ఇవేవీ పెట్టుకోకుండానే.. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో పాల్గొన్నాడు. టర్కీ షూటర్ యూసఫ్ డికేక్ ఎలాంటి సన్‌గ్లాసెస్, ఇయర్ ప్రొటక్టర్లను పెట్టుకోకుండా సాదాసీదాగా వచ్చి తన పార్టనర్ తర్హాన్‌తో కలిసి బుధవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో పాల్గొన్నాడు. అంతేకాదు మెరుగైన ఆటతో రెండో స్థానంలో నిలిచి.. రజత పతకం సాధించాడు. దీంతో యూసఫ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ వయసులో అలా ఎలా షూట్ చేశాడబ్బా, అతడి ఏకాగ్రతకు సలాం కొట్టాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యూసఫ్ డికేక్ తొలిసారి 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డాడు. యూసఫ్‌కి ఇది ఐదో ఎడిషన్. అయితే ఇదే అతడి మొదటి ఒలింపిక్ పతకం కావడం విశేషం. కెరీర్ ఆఖర్లో ఇలా సాదాసీదాగా ఆడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇందుకుసంబంధించిన ఫొటోస్, వీడియోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇదే విభాగంలో భారత షూటింగ్ ద్వయం మను బాకర్-సరబ్‌జోత్ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే.
ఫైనల్ కి చేరిన భారత షూటర్ స్వప్నిల్.. ధోని నుంచి ప్రేరణ
పారిస్ ఒలింపిక్స్ 2024లో 50 మీటర్ల రైఫిల్ విభాగంలో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే ఫైనల్ చేరి చరిత్ర సృష్టించాడు. 50 మీటర్ల రైఫిల్‌లో ఫైనల్ చేరిన తొలి షూటర్ స్వప్నిల్. ప్రస్తుతం స్వప్నిల్ ఫైనల్లో స్వర్ణంపై గురిపెట్టాడు. ఫైనల్‌కు చేరిన తర్వాత, స్వప్నిల్ మాట్లాడుతూ .. క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోనీ నుంచి ప్రేరణ పొందానని, తాను కూడా ధోని లాగానే కెరీర్ ప్రారంభంలో రైల్వే టిక్కెట్ కలెక్టర్ గా పనిచేసినట్లు తెలిపారు. “షూటింగ్‌లో నేను ఏ వ్యక్తిని అనుసరించను. కానీ ఎంఎస్ ధోని అంటే నాకు చాలా గౌరవం. అతను మైదానంలో ప్రశాంతంగా, ఓపికగా ఉంటాడు. అది నాకు నచ్చుతుంది. నేను కూడా ధోనిలాగే టిక్కెట్ కలెక్టర్‌ని కాబట్టి.. ఆయన కథతో నేను కనెక్ట్ అయ్యాను. ప్రపంచకప్ విజేత ధోని బయోపిక్‌ను చాలాసార్లు చూశాను. అతను ఛాంపియన్ క్రికెటర్‌గా పెద్ద విజయాలు సాధించగలడు.” అని స్వప్నిల్ పేర్కొన్నాడు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు..
ఇటీవల ఫిలిం చామ్బర్ లో జరిగిన ఎన్నికల్లో భారత్ భూషణ్ ప్రత్యర్థి ఠాగూర్ మధుపై 12 ఓట్ల తేడాతో గెలుపొందారు, అలాగే ఉపాధ్యక్షునిగా అశోక్ కుమార్ 10 ఓట్ల తేడాతో వైవియస్ చౌదరిపై గెలుపొందిన సంగతి తెలిసిన విషయమే. కాగా నేడు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనందున భరత్ భూషణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందించి తెలుగు సినీ ఇండస్ట్రీ సమస్యలు మరియు గద్దర్ అవార్డ్స్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్ గారు మాట్లాడుతూ “పలు అభివృద్ధి, రాజకీయ కార్యక్రమాలతో ఎంతో బిజీ షెడ్యూల్ ఉండి కూడా ఫిలిం ఛాంబర్ సభ్యులను కలవడానికి అవకాశం ఇచ్చి ముచ్చటించి, మా సమస్యలు విన్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇండస్ట్రీలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం నుంచి ఎప్పుడు సహాయం అందుతుందని సీఎం చెప్పడం చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు భరత్ భూషణ్ గారికి, ఉపాధ్యక్షులు ఆశజూక్ కుమార్ కు నా అభినందనలు. పలు కారణాల రీత్యా నేను అమెరికా వెళ్తున్నాను. అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీతో మీటింగ్ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం తరపు నుండి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నాము” అని అన్నారు.
కొణిదెల క్లింకార, రామ్ చరణ్ లపై నిహారిక ఆసక్తికర కామెంట్స్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆడపిల్ల పుట్టిన సంగతి తెలిసిన విషయమే. తమ ఇంటి అదృష్టానికి క్లీంకార అని నామకరణం చేశారు మెగా దంపతులు.కానీ ఇప్పటి వరకు క్లీంకార ఫోటో ఒక్కటి కూడా బయటకు రాలేదు. కొన్ని ఫోటోలు వచ్చిన వాటిలో ఎక్కడా కూడా పేస్ రివీల్ చేయలేదు. తమ అభిమాన హీరో ముద్దుల తనయను చూడాలని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ అది ఇప్పట్లో జరిగేలా లేదు. కాగా క్లీంకార అలాగే రామ్ చరణ్ పై నాగబాబు తనయ నిహారిక కొణిదెల ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నిహారిక నిర్మాతగా అందరూ కొత్త వారితో కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా రానుంది. ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక ఇంటర్వూ లో మాట్లాడుతూ ” మా ఫామిలీలో ఇప్పుడు అందరి అటెన్షన్ క్లీంకారపైనే. క్లీంకార ముద్దుగా మాట్లూడుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. మా చరణ్ అన్నని ముప్పుతిప్పలు పెడుతోంది. ఫుడ్ పెట్టడానికి మా అన్న ఎన్నో సాహసాలు చేయాలి, కుక్క పిల్లను చూపించి అటు ఇటు తిప్పుతూ చరణ్ అన్నని పరిగెత్తిస్తుంది. చరణ్ అన్నకి క్లీంకార అంటే ప్రాణం. నేను ప్రత్యక్షంగా చుసిన వాళ్లలో చరణ్ బెస్ట్ నాన్న. ఎటువంటి టెన్సన్స్ పెట్టుకోకుండా తన కూతురిని అల్లారు ముద్దుగా చరణ్ చూసుకుంటాడు. రామ్ చరణ్ నటించిన సినిమా ఆస్కార్ గెలవడం అలాగే పవన్ కళ్యాణ్ బాబాయ్ ఎమ్మెల్యేగా గెలవడం క్లీంకార వచ్చాకే జరిగాయి. మా ఇంటికి, మా అందరికి క్లీంకార లక్కీ డార్లింగ్” అని నిహారిక అన్నారు.