NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

రూ.160కే కిలో కందిపప్పు.. రూ.48కే బియ్యం
కంది పప్పు, బియ్యం ధర పెరిగిపోవడంతో.. సామాన్యులకు సబ్సిడీపై కంది పప్పు, బియ్యం పంపిణీ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం.. ఈ రోజు నంద్యాల జిల్లా బనగానపల్లెలో సబ్సిడీ ధరలతో నిత్యావసర సరుకుల ప్రత్యేక కౌంటర్ ను ప్రారంభించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిలో కంది పప్పు రూ.160లకు, సోనా మసూరి బియ్యం కిలో రూ.48కే ప్రత్యేక కౌంటర్లలో విక్రయిస్తున్నట్టు వెల్లడించారు.. మధ్య తరగతి కుటుంబాల సంక్షేమం కోసమే సబ్సిడీ ధరలతో నిత్యవసర సరుకులు సరఫరా చేస్తున్నామన్న ఆయన.. రైతు బజార్లకు సమాంతరంగా పేద ప్రజల కోసం సబ్సిడీ ధరల కౌంటర్లను తీర్చిదిద్దుతాం అన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాల కారణం గానే పేద ప్రజలను ఆదుకునేందుకు నిత్యవసర సరుకుల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేక సబ్సిడీ కేంద్రాలను ప్రారంభిస్తాం.. త్వరలోనే అన్ని రకాల ధాన్యాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తాం అన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కాగా, సామాన్యులకు తక్కువ ధరకే కంది పప్పు, బియ్యం పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే.

వీడని ఎంపీడీవో మిస్సింగ్ మిస్టరీ.. ఇంతకీ ఏం జరిగినట్టు..?
నరసాపురం ఎంపీడీవో వెంకట రమణారావు మిస్సింగ్‌ కేసులో మిస్టరీ కొనసాగుతూనే ఉంది.. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా? లేదా మరో ప్రాంతానికి వెళ్లిపోయారా? అనే విషయంలో అధికారులు, పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.. ఇక, ఎంపీడీవో వెంకటరమణ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టింది ఎన్డీఆర్ఎఫ్.. 4 బోట్లలో ఏలూరు కాల్వను జల్లెడ పట్టనుంది ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌.. గన్నవరం సమీపంలో ఉన్న కీసరపల్లి నుంచి ఇవాళ గాలింపు చర్యలు మొదలు పెట్టనున్నారు.. మొత్తం 30 మంది సిబ్బందితో ఏలూరు కాల్వలో పూర్తిస్థాయిలో గాలింపు చర్యలకు దిగారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. ఈ కేసును సమగ్రంగా విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేయటంతో.. విచారణ వేగవంతం చేశారు పోలీసులు. మరోవైపు.. MPDO రమణా రావు మిస్సింగ్ వ్యవహారంలో విచారణ చేపట్టారు పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు. ఫెర్రీ వేలం బకాయి 54లక్షల వసూలు విషయంలో ఒత్తిడికి లోనైనట్టు లేఖలో పేర్కొన్న వెంకట రమణారావు.. ఈ నెల 15వ తేదీ రాత్రి నుంచి అదృశ్యం అయ్యారు. వెంకటరమణారావు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఇంకెక్కడైనా ఉన్నారా? అనే విషయంలో స్పష్టత లేదు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం పై విచారణకు ఆదేశించారు. నీతో రంగంలో దిగిన అధికారులు.. 2023- 24 ఫెర్రీ వేలం , చెల్లింపుల వివరాలు సేకరిస్తున్నారు. బకాయి దారుడు నుంచి  54 లక్షల రూపాయలు రికవరీ చేసేందుకు జేఏసీ సభ్యులతో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకోనున్నారు. ఇక, ఏలూరు కాల్వలో ఇప్పటి వరకు ఎంపీడీవో ఆచూకీ లభించలేదు.. బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఏలూరు కాల్వలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేట్టాయి.. అయినా ఫలితం దక్కలేదు.. ఈ రోజు కూడా గాలింపు చర్యలు చేపట్టారు.

బిస్కెట్ల ఆశచూపి.. ఎనిమిదేళ్ల బాలికపై అఘాయిత్యం..! ఆపై హత్య..
గంజాయి మత్తులో ఓ యువకుడు మృగమయ్యాడు. బిస్కెట్లు ఇస్తానని చెప్పి ఎనిమిదేళ్ల బాలికను తీసుకెళ్లి.. అఘాయిత్యం చేసి.. ఆ తర్వాత ఆ చిన్నారిని హతమార్చాడు. ఈ అమానవీయ ఘటన తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో బుధవారం జరిగింది. బీహార్ నుంచి వచ్చిన కొన్ని కుటుంబాలు మండలంలోని ఓ గ్రామ రైస్ మిల్లులో పనిచేసుకుంటూ ఉపాధి పొందుతున్నాయి. అందులో భార్యాభర్తలు కూడా పనిచేస్తున్నారు. ఆ దంపతుల రెండో కుమార్తె (8)ను అదే మిల్లులో పనిచేస్తున్న బీహార్ కు చెందిన దిలీప్(20) బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి ఉదయం తీసుకెళ్లాడు. మధ్యాహ్నం మిల్లు నుంచి వచ్చిన తల్లిదండ్రులకు చిన్నారి కనిపించకపోయే సరికి ఆందోళనకు గురై చుట్టుపక్కల వెతికారు. సాయంత్రం 4 గంటల సమయంలో మిల్లు సమీపంలోని అటవీ ప్రాంతంలో మేకల కాపర్లు బాలిక మృతదేహాన్ని చూసి.. స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐలు జగన్మోహన్ రావు, శ్రీనివాసులురెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాలిక నోటితోపాటు పలు శరీర భాగాల్లో గాయాలు గమనించారు. నిందితుడు అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. దిలీప్ బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీలో గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. బాలికకు బిస్కెట్లు కొనిచ్చేందుకు తీసుకెళ్లానని ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. గంజాయి మత్తులో నిందితుడు బాలికపై అత్యాచారం, హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. మంగళవారం రాత్రి దిలీప్ గంజాయి మత్తులో బాలిక తండ్రితో గొడవ పడ్డాడు. ఆ మరుసటి రోజే ఇలా జరగడంతో కావాలనే చేశాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని తిరుపతి ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు తెలిపారు. బుధవారం రాత్రి నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో బాలిక మృతదేహాన్ని పరిశీలించారు.

మరో మహిళతో భర్త.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని భార్య బడిత పూజ..!
విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హరితను ప్రేమించిన వివేక్.. 2020 డిసెంబర్ 17న పెళ్లి చేసుకున్నాడు.. హరితది చోడవరం దరి ఎల్ సింగవరం కాగా.. వివేక్ శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందినవాడు.. ప్రేమించుకున్న ఇద్దరూ.. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.. అయితే, కొంత కాలం తర్వాత సాకులు వెతకడం ప్రారంభించాడు.. భార్య పొట్టిగా ఉందని విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు.. ఆ క్రమంలో స్పాలో పరిచయమైనా మాధురి అనే యువతితో మళ్లీ ప్రేమలో పడ్డాడు.. వారి పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.. ఇక, ఆ యువతికి స్కూటి, నగలు, విలువైన వస్తువులు ఇలా ఎన్నో కొనిచ్చాడట వివేక్.. భార్య తో గొడవపడి విడాకులకు అప్లై చేశాడు.. కానీ, విడాకులు ఇవ్వకుండానే వేరే యువతీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.. ఇక, తన భర్త వేరే మహిళతో ఉంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య హరిత.. దీంతో.. భర్త అక్రమ సంబంధాన్ని గుట్టు రట్టు చేసింది ఆ ఇల్లాలు.. ప్రియురాలి మోజులో పడి కట్టుకున్న దాన్ని వదిలేసిందుకు సిద్ధమైన.. భర్త రాసాలీలలు బండారం బట్ట బయలు చేసింది భార్య.. ప్రేమించి పెళ్లి చేసుకొని మొహం చాటేసిన భర్త.. సీతమ్మదారలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మరో మహిళతో మకాం వేశాడు.. బంధువులతో కలిసి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకున్నారు.. భర్త అతడి ప్రియురాలుపై.. భార్య, బంధువులు దాడి చేసి నిలదీశారు.. దీంతో.. ప్లాట్ నుండి ప్రియురాలు మధు పారీపోయింది.. ఇక, భర్తను పట్టుకొని విశాఖ నుండి బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు బంధువులు..

లీడ్ బ్యాంకులు లోన్ల విషయంలో ఎక్కడ అశ్రద్ధ చూపొద్దు..
లోన్లు ఇచ్చే విషయంలో ఎక్కడ అశ్రద్ధ చూపొద్దు.. లీడ్ బ్యాంకు పెద్దన్న పాత్ర పోషించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రైతు రుణమాఫీ పై బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. ప్రభుత్వం విడుదల చేసే రైతు రుణమాఫీ నిధులను వాటికే వినియోగించాలి.. ఇతర అప్పులకు ఎట్టి పరిస్థితుల్లో జమ చేయవద్దు.. రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. ఆగస్టు నెల దాటకముందే 31 వేల కోట్లు. రైతు రుణమాఫీ కింద విడుదల చేస్తామన్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు 11 లక్షల పైబడి రైతులకు 6000 కోట్ల పైబడి నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ నెలలోనే రెండోదఫా లక్షన్నర వరకు బకాయి ఉన్న రైతుల రుణాలకు నిధులు విడుదల చేస్తామని అన్నారు. ఆ తర్వాత 2 లక్షల వరకు రుణమాఫీ నిధులను విడుదల చేస్తామన్నారు. రెండు లక్షల పైన రుణం ఉన్న రైతుల తో బ్యాంకర్లు మాట్లాడి మిగిలిన మొత్తాన్ని రికవరీ చేసుకొని.. ప్రభుత్వం మంజూరు చేసే రెండు లక్షలు కలుపుకొని మొత్తంగా ఏ రైతు రుణం బకాయి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ పథకం ద్వారా..31 వేల కోట్లు ఈ రాష్ట్రంలోనూ మాఫీ చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చే ముందు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేతగా నేను రైతు రుణమాఫీ గ్యారెంటీ కార్డు పై సంతకం చేసి ప్రచారంలోకి వెళ్ళామన్నారు. ఇచ్చిన మాట మేరకు కట్టుబడి ఉన్నాం తూచా తప్పకుండా రైతు రుణమాఫీని అమలు చేసి చూపిస్తున్నామని తెలిపారు. 40 లక్షల బ్యాంకు అకౌంట్లో ద్వారా 31 వేల కోట్లు రైతు రుణమాఫీ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందని వెల్లడించారు. భారతదేశ బ్యాంకింగ్ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తం ఒకేసారి రికవరీ కావడం ఓ చరిత్ర అన్నరు.

నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ అదుపులో ముగ్గురు ఎయిమ్స్‌ డాక్టర్లు
నీట్ పేపర్ లీక్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. ఇంతకు ముందు సీబీఐ ఘన విజయం సాధించింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ.. పేపర్ లీక్ గ్యాంగ్‌కు సంబంధించిన సాల్వర్స్ కనెక్షన్‌పై విచారణ చేపట్టింది. మరోవైపు పాట్నా ఎయిమ్స్‌కు చెందిన ముగ్గురు వైద్యులను దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. విచారణ నిమిత్తం ముగ్గురు వైద్యులను సీబీఐ తన వెంట తీసుకెళ్లింది. పాట్నా ఎయిమ్స్‌లోని ఈ ముగ్గురు వైద్యులు 2021 బ్యాచ్‌కు చెందిన వైద్య విద్యార్థులు. ఈ ముగ్గురు వైద్యుల గదిని కూడా సీబీఐ సీజ్ చేసింది. వారి వద్ద ఉన్న ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నీట్ పేపర్ లీక్ నుంచి అభ్యర్థులకు అందజేయడం వరకు మొత్తం నెట్‌వర్క్‌ను సీబీఐ అనుసంధానం చేసింది. కాగితాలు తీసుకెళ్తున్న ట్రక్కులోంచి కరపత్రాలను పంచుతున్న పంకజ్‌ని సీబీఐ పట్టుకుంది. పంకజ్‌కి ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్‌తో సంబంధం ఉంది. ఈ పేపర్ హజారీబాగ్‌లోని ఈ పాఠశాల నుండి సంజీవ్ ముఖియాకు చేరింది. సంజీవ్ ముఖియా నుండి పేపర్ రాకీకి చేరుకున్నాడు. రాకీ సాల్వర్ల ద్వారా పేపర్‌ను పరిష్కరించాడు. దీనికి సంబంధించి పాట్నా ఎయిమ్స్‌కు చెందిన ముగ్గురు వైద్యులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. పేపర్ లీక్ కేసులో ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేశారు. నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో 40కి పైగా పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. అక్రమాలపై దర్యాప్తు చేయాలని, పరీక్షను రద్దు చేయాలని, మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకుందంటే ?
ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ బిల్లుపై కర్ణాటక ప్రభుత్వం 48 గంటల్లో యూ టర్న్ తీసుకుంది. ప్రైవేట్ రంగంలో సి, డి కేటగిరీ ఉద్యోగాల్లో స్థానికులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయాన్ని కాంగ్రెస్ సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేసింది. వాస్తవానికి సోమవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో స్థానికులకు ప్రైవేట్‌ ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపగా, గురువారం అంటే ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ బిల్లును తాత్కాలికంగా నిలిపివేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బుధవారం ఒక ప్రకటన విడుదలైంది. దీనిపై పునరాలోచించి రానున్న రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతకుముందు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రైవేట్ రంగ సంస్థలు, పరిశ్రమలు, సంస్థలలో కన్నడిగులకు రిజర్వేషన్లు అమలు చేయడానికి ఉద్దేశించిన బిల్లు ఇంకా తయారీ దశలోనే ఉందని ఆయన రాశారు. తదుపరి కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.

ఐసీసీ చైర్మన్‌గా జై షా.. బీసీసీఐ అధ్యక్ష పదవికి లైన్ క్లియర్!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా.. అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) ఛైర్మన్‌గా పదవి చేపడతాడా? అని ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. శుక్రవారం (జులై 19) కొలంబోలో జరగనున్న ఐసీసీ వార్షిక సమావేశం (ఏజీఎం)లో ఈ విషయంపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. జులై 19 నుంచి 22 వరకు ఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ఐసీసీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌లో మూడు స్థానాలకు వార్షిక సమావేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అలానే ఐసీసీ కొత్త ఛైర్మన్ గురించి, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌‌కు భారత్ వెళ్తుందా? అనే విషయాలపై చర్చ సాగనుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్‌ బార్క్‌లే ఐసీసీ ఛైర్మన్‌గా ఉన్నారు. 2025 వరకు అయనను కొనసాగించే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ జై షా పోటీ చేస్తే ఏకగ్రీవంగా ఎన్నికవుతాడు. జై షా ఐసీసీ ఛైర్మన్‌ అయితే.. బీసీసీఐ అధ్యక్ష పదవికి లైన్ క్లియర్ అవుతుంది. బీసీసీఐ రూల్స్ ప్రకారం.. ఓ వ్యక్తి 6 ఏళ్ల పాటు మాత్రమే వరుసగా పదవిలో కొనసాగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే చాలా ఏళ్లుగా బీసీసీఐ కార్యదర్శిగా ఉంటున్నారు. కాబట్టి జై షా తప్పక విరామం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఐసీసీ ఛైర్మన్‌గా జై షా బాధ్యతలు అందుకుంటే.. 2028లో బీసీసీఐ అధ్యక్ష పదవి అందుకోవడానికి అతనికి లైన్ క్లియర్ అవుతుంది. ఐసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం కారణంగా జై షాకు పోటీ కూడా ఉండదనే చెప్పాలి.

ఊర్వశీ రౌతేలా ప్రైవేట్ వీడియో లీక్!
బాలీవుడ్‌ హాట్ భామ ‘ఊర్వశీ రౌతేలా’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల కంటే ఎక్కువగా.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతోనే నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్‌తో ప్రేమాయణం అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ఆ మధ్య తన ఐఫోన్ పోయిందంటూ రచ్చ చేసిన ఊర్వశీ.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఊర్వశీ ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఊర్వశీ రౌతేలా బాత్రూమ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయింది. ఊర్వశీ దుస్తులు మార్చుకుంటన్న వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టింస్తోంది. ఈ వీడియోపై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం చేసిన వీడియో ఇది అని కొందరు అంటున్నారు. ఏదైనా సినిమాల్లోని సీన్ కావొచ్చని మరికొందరు పేర్కొంటున్నారు. ఏదేమైనా ప్రైవేట్ వీడియోతో ఊర్వశీ రౌతేలా మరోసారి చర్చనీయాంశం అయింది.

నిరంజన్ రెడ్డికి జాక్ పాట్..రిలీజ్ కు ముందే భారీ లాభాలు
ప్రియదర్శి హీరోగా, అందాల భామ నభ నటేష్ హీరోయిన్ గా నటించిన చిత్రం డార్లింగ్. మ్యాడ్ మ్యారేజ్, మాక్స్ ఎంటర్టైన్మెంట్స్ కథాంశంతో రానుంది ఈ చిత్రం. అశ్విన్ రామ్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బైనర్ ఫై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని హంగులు పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది ఈ చిత్రం. కాగా నిర్మాత నిరంజన్ రెడ్డికి డార్లింగ్ బాగా గిట్టుబాటు అయినట్టు తెలుస్తోంది. రూ. 8కోట్డతో నిర్మించిన ఈ చిత్రం నాన్ థియేట్రికల్ రైట్స్ రూ.కోట్లుకు అమ్ముడయ్యాయి. నైజాం థియేట్రికల్ రైట్స్ మైత్రి మూవీస్ రూ3 కోట్లు, ఆంధ్ర రైట్స్ ఏషియాన్, సురేష్ సంస్థలు రూ. 4 కోట్లకు కొనుగోలు చేసాయి. అన్ని అమ్మకాలు పూర్తి అవగా నిర్మాత నిరంజన్ రెడ్డికి డార్లింగ్ రూ. 6కోట్లు లాభాలు తెచ్చిపెటింది. ఈ మధ్య కాలంలో విడుదలకు ముందే నిర్మాతకు లాభాలు తెచ్చిన చిత్రం డార్లింగ్. నిరంజన్ రెడ్డి పట్టుకున్న ప్రతి సినిమా లాభాలే లాభాలు, ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన హనుమాన్ చిత్రం దాదాపు రూ. 100 కోట్లు లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు డార్లింగ్. మరోవైపు నిర్మాత నిరంజన్ రెడ్డి పూరి, రామ్ ల డబల్ ఇస్మార్ట్ ఆల్ ఇండియా థియేట్రీకల్ రైట్స్ ను రూ. కోట్లకు కొనుగోలు చేశారు. ఈ సినిమా కూడా హిట్ కానుందని నిరంజన్ రెడ్డి ఈ చిత్రం కూడా గిట్టుబాటు అవుతుందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. కాగా డార్లింగ్ చిత్రాన్ని కంటెంట్ పై నమ్మకంతో ఈ రోజు పైడ్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. జులై 19న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది డార్లింగ్.

ప్రభాస్ లైనప్ లో మార్పులు.. క్రేజీ సినిమా వెనక్కు?
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కల్కి 2898తో సూపర్ హిట్ కొట్టాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే 1000 కోట్ల కలెక్షన్లు దాటేసి 1100 కోట్ల కలెక్షన్ దిశగా పరుగులు పెడుతోంది. ఇక ప్రస్తుతానికి ప్రభాస్ యూరోప్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలోనే ఇండియాకి తిరిగి రాబోతున్నాడు. ఇండియా తిరిగి వచ్చిన వెంటనే ఆయన మారుతి సినిమాకి సంబంధించి మిగిలిపోయిన షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమా కాకుండా ప్రభాస్ మరో రెండు సినిమాలు సైన్ చేసాడు. అందులో ఒకటి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా కాగా మరొకటి హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి అనే సినిమా. అయితే మారుతి సినిమా పూర్తి అవ్వగానే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా మొదలు పెట్టాల్సి ఉంది. కానీ ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ అలాగే స్క్రిప్ట్ వర్క్ లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరొకపక్క హను రాఘవపూడి ఫౌజి సినిమా షూటింగ్ అక్టోబర్ మొదటి వారంలో ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి ప్రభాస్ సినిమాల లైనల్ లో కాస్త మార్పులు చేర్పులు చోటు చేసుకోవచ్చు.