Site icon NTV Telugu

Best Smartphones: రూ.15,000లోపు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్లు ఇవే..!

Perfomance Mobiles

Perfomance Mobiles

Best Smartphones:భారతదేశంలో చాలా వరకు బుడ్జెస్ట్ సెగ్మెంట్ లోని ఫోన్స్ నే కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకు తగ్గట్టుగానే.. మొబైల్ తయారీ కంపెనీలు మొబైల్స్ ను తాయారు చేస్తున్నాయి. మరి బుడ్జెస్ట్ ఫోన్స్ కోసం చూసే వారి కోసం రూ.15,000 లోపు దొరికే స్మార్ట్‌ఫోన్లలో అద్భుతమైన ప్రాసెసర్లు, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేలు, 5G సపోర్ట్, మంచి బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లతో లభిస్తున్నాయి. మరి తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ పనితీరును కోరుకునే వారికి టాప్ 5 ఫోన్లు ప్రస్తుతం మార్కెట్‌లో అత్యుత్తమంగా ఉన్నాయి. మరి అవేంటో ఒకసారి చూద్దామా..

POCO M6 Pro 5G:
POCO M6 Pro 5G మొబైల్ లో Snapdragon 4 Gen 2 ప్రాసెసర్, 6.79 అంగుళాల FHD+ 90Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ వంటివి ఉన్నాయి. ఈ మొబైల్ కేవలం రూ.11,999 ధరలో లభిస్తుంది. వీటితోపాటు ఈ మొబైల్ మంచి ఫీచర్స్ ను కలిగి ఉంది.

Read Also:BSNL 1499: ‘దేశానికి తోడుగా’ అంటూ.. కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్..!

Infinix Zero 5G:
2023 లో వచ్చిన Infinix Zero 5Gలో Dimensity 920 ప్రాసెసర్, 120Hz డిస్‌ప్లే, 33W ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.13,999 కాగా, గేమింగ్ కోసం ఇది మంచి ఎంపిక. ఈ మొబైల్ మంచి పెర్ఫామెన్స్ అందిస్తుంది అందంలో ఎటువంటి సమస్య లేదు.

iQOO Z6 Lite 5G:
iQOO Z6 Lite 5Gలో Snapdragon 4 Gen 1 ప్రాసెసర్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా ఉన్నాయి. ఇది మద్దతుగా థర్మల్ కంట్రోల్‌తో స్టూడెంట్లకు, గేమర్లకు బాగా సరిపోతుంది. ఈ మొబైల్ మొబైల్ ఆపరేటింగ్ స్పీడ్ గా చేసేవారికి మ్యాచ్ అవుతుంది.

Read Also: Credit Card: క్రెడిట్ కార్డున్న వ్యక్తి మరణిస్తే.. బకాయి ఎవరు చెల్లించాలి..? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..!

Motorola G73 5G:
Motorola G73 5G మొబైల్ లో Dimensity 930 ప్రాసెసర్, స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవం, 30W ఛార్జింగ్ తో అందుబాటులో ఉంది. ఇది డీల్స్‌లో కేవలం రూ.14,999కి లభిస్తుంది. ఇది కెమెరా ఫీచర్స్, పర్ఫార్మెన్స్ విషయంలో ఎటువంటి అనుమానాలు అవసరం లేదు.

Samsung Galaxy M14 5G:
Samsung Galaxy M14 5G మొబైల్ కేవలం రూ.12,490 ధరకు కొనుగోలు చేయొచ్చు. ఇది Exynos 1330 ప్రాసెసర్, 6000mAh బ్యాటరీ, One UI Core సాఫ్ట్‌వేర్ తో వస్తుంది. బ్యాటరీ బ్యాకప్, బిల్డ్ క్వాలిటీ కోసం ఇది మంచి ఎంపిక.

మొత్తంగా చెప్పాలంటే.. గేమింగ్, ఫాస్ట్ పనితీరు కోసం iQOO Z6 Lite 5G, Infinix Zero 5G 2023 బెస్ట్ చాయిసులు. అలాగే దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు కోరుకునే వారికి Moto G73 5G ఉత్తమ ఎంపిక. పెద్ద బ్యాటరీ, 5G అవసరమైతే Samsung M14 5G లేదా POCO M6 Pro 5G ను పరిశీలించండి.

Exit mobile version