NTV Telugu Site icon

TS Govt: వర్షాల ఎఫెక్ట్.. తెలంగాణలో సెలవులు పొడిగింపు

School

School

తెలంగాణ వ్యాప్తంగా గత ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐదు రోజుల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పనుల మీద బయటకు వెళ్లేవారు నానా అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అయితే వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడం.. చాలా వరకు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉండటంతో రేపు (శనివారం) కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

Read Also: Janhvi Kapoor : టెంప్టింగ్ లుక్స్ తో కవ్విస్తున్న జాన్వీ..

తెలంగాణలో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు రేపు (శ‌నివారం) కూడా అన్ని విద్యా సంస్థలకు సెల‌వు ప్రకటిస్తూ విద్యాశాఖ ప్రిన్సిప‌ల్ సెక్రెటరీ అన్ని జిల్లాల డీఈవోల‌కు ఆదేశాలను జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజ్ ల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ విషయాన్ని మెసేజ్ రూపంలో ముందుగానే చెప్పాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.

Read Also: Flood Rising in Godavari: పెరుగుతోన్న వరద ఉధృతి.. గోదావరి పరివాహక ప్రాంతాలకు వార్నింగ్‌