NTV Telugu Site icon

Breaking News : రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు

Telangana School

Telangana School

తెలంగాణ‌లో రేపు స్కూళ్లు, కాలేజీల‌కు సెల‌వు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. రేపు తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలతో పాటు ఉద్యోగులకు కూడా సెలవులను ప్రకటించింది తెలంగాణ సర్కార్‌. ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. రేపు షబ్-ఎ-మెరాజ్ పండుగను పురస్కరించుకొని సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఇది ముస్లింలు జరుపుకునే పండుగ. ఈ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

Breaking News: చరిత్ర సృష్టించిన ఉత్తరాఖండ్.. యూసీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం..

అయితే.. షబ్-ఎ-మెరాజ్ ముస్లింలు పవిత్రమైన రోజుగా భావించి… ఆ రోజు మసీదులను దీపాలతో అందంగా అలంకరిస్తారు. రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు. ఈ పండగ రోజు మసీదుల్లో ఇస్రా, మేరాజ్‌ల కథను చెబుతుంటారు మత పెద్దలు. ముస్లింలు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే ఈ పండగ రోజును ప్రభుత్వం సెలవుగా ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆ మత పెద్దలు. ఇక ఫిబ్రవరి 8న సాధారణ సెలవు దినంగా ప్రకటన విడుద‌ల కావడంతో ఆ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూత పడనున్నాయి. ఇకపోతే ఫిబ్రవరి 8వ తేదీ తర్వాత ఈ నెలలో సాధారణ సెలవులు లేవు. వచ్చే నెల మార్చి నెలలోనే సాధారణ సెలవులు ఉండనున్నాయి.

Bonda Umamaheswara Rao: నేను కబ్జా, రౌడీయిజం చేసుంటే చూపించు.. ఇదే నా సవాల్‌..!