Site icon NTV Telugu

McDonald’s: మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌లో కనిపించని టొమాటో.. ఆర్డర్లను తీసుకోవడానికి నిరాకరించిన కస్టమర్ కేర్..!

Mc Donalds

Mc Donalds

దేశంలో రుతుపవనాల ప్రారంభంతో కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా టమోటాల ధరలు చాలా పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో టమాటా ధర కిలో రూ.150 దాటింది. దీని ప్రభావం సామాన్యులపైనే కాదు రెస్టారెంట్లపైనా పడుతోంది. దీంతో మెక్‌డొనాల్డ్స్ కీలక ప్రకటన చేసింది. బర్గర్ లో టమోటాలు పెట్టడం లేదని.. దీనివల్ల రుచిలో మార్పు ఉంటుందని తెలిపింది. తాము అందించే ప్రొడక్ట్స్ లో టొమాటోలాకు సంబంధించి ఆహార పదార్థాలు ఉండవని మెక్ డొనాల్డ్ పేర్కొంది.

Urvashi Rautela: మొత్తం చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఊర్వశి..

ఈ పరిస్థితి ఎప్పటికీ ఉండదని.. టమాట ధరలు ఎక్కువగా ఉండటం వలన భారతదేశంలోని కొన్ని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లలో టొమాటో మెను ఉండదని తెలిపింది. వాతావరణంలో మార్పుల కారణంగా మార్కెట్‌లో నాణ్యమైన టమోటాలు దొరకడం లేదని.. అందుకే టమోటాలు వాడటం మానేసినట్లు కంపెనీ చెబుతుంది. ఓ కస్టమర్ మెక్‌డొనాల్డ్స్ కి ఫోన్ చేసి టొమాటో బర్గర్‌ని ఆర్డర్ చేయగా.. బర్గర్లలో టమాటాలు వాడడం లేదని మెక్ డొనాల్డ్ తెలిపింది. ప్రస్తుతం టమోటో లేని బర్గర్లు మాత్రమే ఆర్డర్లు డెలివరీ అవుతున్నాయని పేర్కొంది.

Falaknuma Express: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. పలు రైళ్ల దారి మళ్లీంపు..!

గత కొంత కాలం క్రితం టమాటా పంటకు అయ్యే ఖర్చు కూడా రైతులకు దక్కలేదు. అప్పుడు చాలా మంది రైతులు తమ పంటలను పాడు చేసుకున్నారు. మే నెలలో మహారాష్ట్రలోని నాసిక్‌లో టమాటా ధర కిలో రూ.1కి పడిపోయిన పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు దాని ధర అనేక రెట్లు పెరిగింది. ఈ ఏడాది దేశంలో రుతుపవనాలు ఆలస్యమవడంతో.. అకస్మాత్తుగా రుతుపవనాలు ఊపందుకున్నాయి. దీంతో ఆ ప్రభావం పంటలపై పడి చాలా చోట్ల నాశనమయ్యాయి. దీంతో భారీ వర్షాల కారణంగా టమోటాల సరఫరా కూడా గణనీయంగా తగ్గింది. ఈ కారణాల వల్ల టమాటా ధర ఆకాశాన్నంటుతోంది.

Exit mobile version