NTV Telugu Site icon

IPL 2024: ప్రతి జట్టు ఆటగాళ్లకు ఐపీఎల్ 2024 ఏంతో కీలకం!

Ipl 2024

Ipl 2024

Tom Moody React on USA Pitches: టీ20 ప్రపంచకప్‌ 2024 ఉన్న నేపథ్యంలో ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 2024 ప్రదర్శనలకు ఎంతో ప్రాధాన్యం ఉండబోతుందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్‌ మూడీ అంటున్నారు. ఐపీఎల్ 2024లో పరుగులు చేయడం, వికెట్లు తీయడం టీ20 ప్రపంచకప్‌ సెలక్షన్‌లో పరిగణనలోకి రానున్నాయన్నారు. టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న అమెరికాలో ఆడడం చాలా మంది ఆటగాళ్లకు కొత్త అనుభవం కానుందని పేర్కొన్నారు. ఐపీఎల్ 2024 మర్చి 23న ఆరంభం కానుండగా.. జూన్ 1న టీ20 ప్రపంచకప్‌ మొదలవుతుంది.

ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 టీమ్ డెసర్ట్ వైపర్స్ నిర్వహించిన ఇంటరాక్షన్‌లో టామ్‌ మూడీ మాట్లాడుతూ… ‘మార్చి-మే నెలల్లో ఐపీఎల్‌, ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 జరగబోతున్నాయి. ఈ టోర్నీలలో సత్తాచాటడం ఆటగాళ్లకు చాలా కీలకం. పరుగులు చేయడం, వికెట్లు తీయడం, స్థిరంగా రాణించడం టీ20 ప్రపంచకప్‌ సెలక్షన్‌లో పరిగణనలోకి రానున్నాయి. పొట్టి ప్రపంచకప్‌కు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలంటే.. ఈ లీగ్‌లలో సత్తా చాటడం చాలా ముఖ్యం. గతంలో కంటే ఈసారి ఐపీఎల్‌లో బాగా ఆడాలని ప్రతి ప్లేయర్ అనుకుంటాడు’ అని అన్నాడు.

Also Read: National Book Fair: హైదరాబాద్‌లో నేటి నుంచి 36వ జాతీయ పుస్తక ప్రదర్శన!

‘టీ20 ప్రపంచకప్‌ 2024కు ఆతిథ్యం ఇవ్వనున్న కరేబియన్‌లో చాలా మంది క్రికెటర్లు ఆడారు. అయితే అమెరికాలో ఆడాల్సి రావడం చాలామంది క్రికెటర్లకు నూతన అనుభవమే. కానీ ప్రపంచ స్థాయి ఆటగాళ్లు భిన్నమైన పిచ్‌లపై ఆడుతారు. వారు అమెరికాలో వాతావరణాన్ని కూడా త్వరగా అలవాటు చేసుకుంటారు’ అని టామ్‌ మూడీ చెప్పారు. మేజర్ లీగ్ క్రికెట్‌లో ఆడుతున్న సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, లాకీ ఫెర్గూసన్, ఆడమ్ జంపా వంటి కొంతమంది ఆటగాళ్లకు అమెరికా పిచ్‌లు అలవాటే. అయితే టీమిండియా ఆటగాళ్లకు మాత్రం పూర్తిగా భిన్నమైన అనుభవం కానుంది.