Tollywood: స్టార్ హీరోలు తడబడితే యంగ్ హీరోలు నిలబెట్టారు.!

Tollywood

Tollywood

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ఇయర్ అక్కినేని అఖిల్ నుంచి శర్వానంద్ వరకు తమదైన రీతిలో సత్తా చాటారు. స్టార్ హీరోలు సక్సెస్‌లు లేక వెనకడుగు వేసిన క్రమంలో, యంగ్ హీరోలు తమ టాలెంట్‌ను చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ భారీ బడ్జెట్ సినిమాలతో వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. దాంతో ఈ ఇయర్ యంగ్ హీరోలు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఇండస్ట్రీని సక్సెస్ ట్రాక్‌లో నిలిపారు. చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్’, రవితేజ ‘ఇరుముడి’ సినిమాలు భారీ విజయాలను సాధించినప్పటికీ, ఈ ఇయర్ భారీ విజయాన్ని సాధించిన యంగ్ హీరోలెవరో ఒకసారి మనం తెలుసుకుందాం…

నవీన్ పోలిశెట్టి
‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమాతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటుడు నవీన్ పోలిశెట్టి. డీసెంట్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించిన ఆయన, ఆ తర్వాత చేసిన సినిమాలతోనూ విజయాలను అందుకున్నాడు. ఈ సంవత్సరం సంక్రాంతికి ‘అనగనగ ఒక రాజు’ సినిమాతో నవ్వులు పూయించాడు. అలాగే తన కెరీర్‌లో మొదటిసారి ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు.

శర్వానంద్
‘నారి నారి నడుమ మురారి’ సినిమాతో సంక్రాంతి హిట్ అందుకున్న శర్వా, ఆ తర్వాత ‘బైకర్’ మూవీతో డిఫరెంట్ అటెంప్ట్ చేశాడు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకోవడమే కాకుండా, ఆయనకంటూ ఒక ఇమేజ్‌ను క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ సంవత్సరం రెండు విజయాలను సాధించి టాప్ హీరోగా మారిపోయిన శర్వానంద్, ఈ నెల 27వ తేదీన రాబోతున్న ‘భోగి’ సినిమాతో మాస్ హిట్‌ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

అఖిల్ అక్కినేని
‘లెనిన్’ సినిమాతో తన కెరీర్‌లో మొదటి సక్సెస్‌ను అందుకున్న అఖిల్, ఇండస్ట్రీలో సక్సెస్‌లు కరువైనప్పుడు తాను ఒక సేవియర్‌లా వచ్చి సూపర్ హిట్‌ను అందించాడు. ఇండస్ట్రీకి వచ్చిన 10 సంవత్సరాల తర్వాత సాధించిన మొదటి భారీ హిట్ అవ్వడంతో, అక్కినేని అభిమానులు సైతం ఈ విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం అఖిల్ రాబోయే సినిమాల విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా వ్యవహరిస్తున్నాడు.