Site icon NTV Telugu

NTRNeel : ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాలో యంగ్ హీరో.. ఎవరంటే?

Ntrneel

Ntrneel

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘డ్రాగన్’. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుండే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇటీవల జోర్డాన్ లో షూటింగ్ ముగించుకున్న డ్రాగన్ టీమ్ హైదాబారాబాద్ చేరుకుంది.  అయితే ఈ సినిమాలో సర్ప్రైజ్ ప్లాన్ చేసాడట ప్రశాంత్ నీల్. ఓ యంగ్ హీరో గెస్ట్ రోల్ లో క‌నిపించే ఛాన్స్‌ ఉందట. ఆ యంగ్ హీరో అఖిల్ అక్కినేని అనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో ఒక కీలకమైన గెస్ట్ రోల్‌లో అఖిల్ మెరవబోతున్నట్లు తెలుస్తోంది.

 Also Read : Puri Jagannath : బాలాయ్య – పూరి ఫిక్స్..ఈ సారి దబిడి దిబిడే?

 కొంతకాలంగా దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు అఖిల్ అక్కినేని చాలా క్లోజ్ అయ్యారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడటంతో, ‘డ్రాగన్’ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పాత్ర కోసం అఖిల్ అయితే బాగుంటుందని ప్రశాంత్ నీల్ భావించారట. ఈ పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, కథలో చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని ఇన్ సైడ్ టాక్. అఖిల్ కు కూడా ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం తోనే  ప్రశాంత్ నీల్ అడగగానే ఈ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు భోగట్టా. ఎన్టీఆర్ మాస్ పవర్, ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్‌ ఇప్పుడు అఖిల్ కూడా అదనపు ఆకర్షణ కావడంతోజ్  ఈ సినిమాపై క్రేజ్ రెట్టింపు అయ్యింది. ఎన్టీఆర్  ఈ సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అఖిల్ అక్కినేని ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం అటు నందమూరి అభిమానులకు, ఇటు అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు. అయితే అఖిల్ రోల్ కు సంబంధించి అధికారకంగా ఎటువంటి ప్రకటన రాలేదు. 

Exit mobile version