Tollywood Upcoming Movies: శర్వానంద్ నుంచి నిఖిల్ వరకు.. ఏప్రిల్‌లో యువ హీరోల మూవీ జాతర!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Upcoming Movies: ఎప్పుడైనా సరే సమ్మర్ సీజన్ అంటే సాధారణంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాల హడావుడి కనిపిస్తుంది. కానీ ఈసారి పరిస్థితి కొంచెం భిన్నంగా కనపడుతోంది. పెద్ద స్టార్ హీరోల సినిమాలు ఈ ఏడాది సమ్మర్ లో పెద్దగా లేకపోవడంతో, ఆ అవకాశాన్ని యంగ్ హీరోలు క్యాష్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ప్రతి వారం కొత్త సినిమాలతో యువ హీరోలు ప్రేక్షకులను అలరించేందుకు రంగంలోకి దిగుతున్నారు.
WhatsAppలో కీలక అప్‌డేట్.. AI ఎంపిక మరింత సులభం..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఏప్రిల్ తొలి వారంలోనే ఇద్దరు యంగ్ హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘నార నారి నడుము మురారి’ సినిమాతో ఫార్మ్ లోకి వచ్చిన శర్వానంద్, ఇప్పుడు ‘బైకర్’ అనే కొత్త సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమాలో ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యి కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. మరోవైపు నిర్మాతగా మంచి విజయాలు సాధిస్తున్న నిహారిక కొనిదల నిర్మాణంలో, సంగీత్ శోబన్ హీరోగా వస్తున్న ‘రాకాస’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక ఏప్రిల్ రెండో వారంలో కూడా రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. లాంగ్ గ్యాప్ తర్వాత అడివి శేషు ‘డెకాయిట్’ సినిమాతో వస్తుండగా.. నిఖిల్ ‘స్వయంభు’ సినిమాతో బరిలోకి దిగుతున్నారు. కొత్త జానర్లలో రూపొందుతున్న ఈ రెండు సినిమాలపై ఇప్పటికే మంచి బజ్ ఉంది. ‘డెకాయిట్’ సినిమాలో అడివి శేషు గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుండగా.. ‘స్వయంభు’ కోసం నిఖిల్ తొలిసారిగా పీరియాడిక్ లుక్ లో కనిపించబోతున్నారు. ఈ రెండు సినిమాలు ఒకే తేదీకి విడుదల అవుతున్నాయి కూడా సుమీ..
AA22 Update: టైటిల్, ఫస్ట్ లుక్ మాత్రమే కాదు.. ఏప్రిల్ 8న అంతకుమించి!
ఇక ఏప్రిల్ చివరి వారంలో మోస్ట్ అవైటెడ్ సినిమా ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతోంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రూరల్ డ్రామాపై ప్రేక్షకులతో పాటు సినీ ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తంగా మొత్తానికి ఈ సమ్మర్ లో స్టార్ హీరోల సినిమాలు తక్కువగా ఉన్నప్పటికీ, వరుసగా యంగ్ హీరోల సినిమాలు విడుదల అవుతుండటం ఇండస్ట్రీకి కాస్త బలం కానుంది. చుడాలిమరి ఈసారి సమ్మర్ బాక్సాఫీస్ కింగ్ ఎవరో..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..