NTV Telugu Site icon

Nani Controversy: పాన్ ఇండియా స్టార్ వ్యాఖ్యలు.. నానిపై మండిడుతున్న బడా హీరోల ఫ్యాన్స్

Nani

Nani

ఎంత పెద్ద హీరోలైనా ఆచీతూచీ మాట్లాడకపోతే వివాదాలపాలు కావడం పక్కా. ఇప్పుడు అలాంటి వివాదంలోనే నాచురల్ స్టార్ నాని చిక్కుకున్నారు. ఆయన మీద టాలీవుడ్ బడా హీరోల ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు విషయం ఏంటంటే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘కింగ్ ఆఫ్ కోతా’ పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ నెల 24న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమానికి న్యాచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో నాని పాన్ ఇండియా సినిమా గురించి మాట్లాడుతూ పాన్ ఇండియా అనే మాట నాకు పెద్దగా నచ్చదు. కానీ నాకు తెలిసిన యాక్టర్స్ లో పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది దుల్కర్‌ మాత్రమే.హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం దర్శకులు దుల్కర్ కోసం కథ రాసుకుంటారు. పాన్ ఇండియా యాక్టర్ అనే మాటకు ఇది నిజమైన నిర్వచనమని భావిస్తున్నా అనిని నాని అన్నారు. ఇప్పుడు ఈ మాటలే నానిని చిక్కుల్లో పడేశాయి.

Also Read: K.Bhagyaraj 3.6.9 Movie: గంటన్నరలోపే సినిమా పూర్తి… విడుదలయ్యేది ఎప్పుడంటే?

నానిపై ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. మొదట పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నీకు స్టార్స్ లా కనిపించడం లేదా? వీళ్లేమయినా గల్లీ హీరోలా అంటూ మండిపడుతున్నారు.

నాని పాన్ ఇండియా స్టార్ లా ఎప్పటికీ మారలేడు కాబట్టే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఇలాంటి యాటిట్యూడ్ ఉండే ఎదగడం కష్టమంటూ, తగ్గించుకోవాలంటూ ఇంకొందరు హితవు పలుకుతున్నారు. మొత్తానికి వివాదంలో చిక్కుకున్న నాని ఎలా బయటపడతాడో వీటిపై ఎలా స్పందిస్తాడో చూడాలి మరి