Movie Shootings: సంక్రాంతి పండుగ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో షూటింగ్స్ పెద్దగా జరగలేదు. పండుగ విరామంతో చాలామంది హీరోలు, టెక్నీషియన్లు బ్రేక్ తీసుకోగా.. ఇప్పుడు మళ్లీ మెల్లగా ఆ బ్రేక్‌కు బ్రేక్ ఇస్తూ షూటింగ్ మూడ్ లోకి వచ్చేస్తున్నారు. ఈసారి స్టూడియోలు, అవుట్‌డోర్ లొకేషన్లు అన్నీ బిజీగా మారుతున్నాయి. మరి ప్రస్తుతం ఏ హీరో ఏ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు..? ఏ సినిమా ఎక్కడ షూట్ అవుతోందో.. ఒక లుక్కేద్దాం..
Allu Arjun: సంక్రాంతి “బాస్”-బస్టర్: ‘మన శంకర వరప్రసాద్ గారు’కు అల్లు అర్జున్ రివ్యూ!
ఈ వారం హలో నేటివ్ స్టూడియోలో షూటింగ్ సందడి ఎక్కువగా కనిపిస్తోంది. నాని – శ్రీకాంత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది పారడైస్’ సినిమా షూటింగ్ అక్కడే జరుగుతోంది. అదే స్టూడియోలో ఎంఎస్ రాజు ప్రొడక్షన్‌లో తెరకెక్కుతున్న సుడిగాలి సుధీర్ సినిమా హైలెస్స, రాజహంస స్టూడియో నిర్మిస్తున్న జేడీ చక్రవర్తి చిత్రం, ఇంకా శర్వానంద్, భోగి దాసరి కళ్యాణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అధీర’ సినిమా షూటింగ్స్ కూడా అక్కడే కొనసాగుతున్నాయి.
ఇక అవుట్‌డోర్ లొకేషన్ల సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ నటిస్తున్న AA22 సినిమ షూటింగ్ గత 50 రోజులకు పైగా ముంబైలోనే కొనసాగుతోంది. ఇక రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ ప్రస్తుతం అజీజ్ నగర్ లో సాగుతోంది. ఇక టాలీవుడ్ జక్కన రాజమౌళి దర్శకతంలో మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్ గండిపేటలో నాన్ స్టాప్ గా కొనసాగుతుంది. అలాగే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఇక సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ బేగంపేట్ చిరాగ్ పోర్టులో జరుగుతుండగా, విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రౌడీ జనార్ధన’ సినిమా షూటింగ్ గండిపేటలో సాగుతుంది.
IND vs NZ T20 Records: మూడేళ్ల తర్వాత భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్.. టీ20 రికార్డులు ఇవే!
ఇక అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘లెనిన్’ సినిమా షూటింగ్‌కు మాత్రం సీసీఎల్ కారణంగా తాత్కాలిక బ్రేక్ ఇచ్చాడు. మరోవైపు సంక్రాంతికి రిలీజ్ అయిన హీరోలంతా ప్రస్తుతం ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. మొత్తంగా సంక్రాంతి విరామం తర్వాత టాలీవుడ్ మళ్లీ ఫుల్ స్పీడ్‌లోకి వచ్చేసింది.
