Site icon NTV Telugu

Thiruveer Marriage: ప్రేయసిని పెళ్లాడిన టాలీవుడ్‌ యువ హీరో.. ఫొటోస్ వైరల్!

Thiruveer Marriage

Thiruveer Marriage

Masooda Fame Thiruveer married Kalpana Rao: టాలీవుడ్‌ యువ హీరో తిరువీర్‌ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రేయసి కల్పనా రావును ఆయన వివాహమాడారు. ఇరు కుటుంబాలు, కొద్దిమంది బంధువుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఆదివారం (ఏప్రిల్‌ 21) తిరుమల శ్రీవారి ఆలయంలో తిరువీర్‌, కల్పనా వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ‘కొత్త జీవితం ప్రారంభం’ అంటూ తన పెళ్లి ఫోటోలను తిరువీర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అభిమానులు, సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తిరువీర్‌ స్వస్థలం రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లి. కెరీర్ ఆరంభంలో 150కి పైగా నాటకాల్లో నటించారు. ఆపై రేడియో జాకీగా పని చేశారు. ‘ఆర్జే తిరూ’ అంటూ శ్రోతలను పలకరించిన తిరువీర్‌.. ‘బొమ్మలరామారం’ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. ఘాజీ, ఏమంత్రం వేశావే, మల్లేశం, టక్ జగదీశ్ సినిమాలలో చిన్న పాత్రలు చేశారు. జార్జ్‌ రెడ్డిలో నెగెటివ్‌ రోల్‌, పలాస 1978లో సపోర్టింగ్‌ క్యారెక్టర్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక మసూద చిత్రంతో భారీ క్రేజ్‌ను సంపాదించారు. మసూద కమర్షియల్‍గానూ మంచి హిట్ కావడంతో హీరోగా నిలదొక్కుకున్నారు.

Also Read: Virat Kohli-Noball: మనమేం చేయలేం.. కోహ్లీ ఔట్‌పై స్పందించిన డుప్లెసిస్!

గతేడాది ‘పరేషాన్’ చిత్రంతోనూ తిరువీర్ మెప్పించారు. తెలంగాణ బ్యాక్‍డ్రాప్‍లో వచ్చిన ఈ మూవీలో ఆయన యాక్టింగ్ అందరిని ఆకట్టుకుంది. ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్‍లోనూ కీలకపాత్ర చేశారు. తిరువీర్ నటించిన మోక్షపట్నం, పారాహుషార్ చిత్రాలు రిలీజ్ కావాల్సి ఉంది. ఇక ఇటీవల హీరోగా సోషియో ఫాంటసీ చిత్రాన్ని ప్రకటించారు.

Exit mobile version