NTV Telugu Site icon

Nikhil Siddhartha: తండ్రైన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. ఫోటో వైరల్‌!

Hero Nikhil Father

Hero Nikhil Father

Nikhil Siddhartha, Pallavi blessed with a Baby Boy: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ తండ్రయ్యాడు. నిఖిల్ సతీమణి పల్లవి బుధవారం ఉదయం పండండి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని నిఖిల్‌ సోషల్‌ మీడియాలో తెలిపాడు. నిఖిల్ తన కుమారుడిని ఎత్తుకుని.. ముద్దాడుతున్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అయింది. అభిమానులు, సినీ సెలెబ్రిటీలు హీరో నిఖిల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

2020లో డాక్టర్ పల్లవిని నిఖిల్ సిద్దార్థ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2020 కరోనా సమయంలో వీరి పెళ్లి జరిగింది. కరోనా నిబంధనలను పాటిస్తూ.. కొద్దిమంది సమక్షంలో నిఖిల్, పల్లవి పెళ్లి చేసుకున్నారు. ఈరోజు వారు తల్లిదండ్రులు అయ్యారు. ‘హ్యాపీ డేస్‌’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్.. కార్తికేయ, స్వామిరారా సినిమాలతో మంచి హిట్స్‌ అందుకున్నాడు. ఇక కార్తికేయ 2 చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు.

Also Read: Ranchi Test: భారత్‌, ఇంగ్లండ్ నాలుగో టెస్ట్‌.. ఖలిస్థానీ ఉగ్రవాది బెదిరింపులు!

గతేడాది ‘కార్తికేయ 2’ సినిమా ఇచ్చిన జోష్‌తో మ‌రో పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’లో నిఖిల్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండ‌గా.. మలయాళ భామ సంయుక్తా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ సినిమాలో నిఖిల్​ ఓ యోధుడి​ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది.