Ranchi Test: భారత్, ఇంగ్లండ్ నాలుగో టెస్ట్.. ఖలిస్థానీ ఉగ్రవాది బెదిరింపులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIR against Khalistani terrorist Gurpatwant Singh Pannu: భారత్, ఇంగ్లండ్ మధ్య రాంచీలో ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ టెస్ట్ కోసం ఇరు జట్లు ఇప్పటికే రాంచీ చేరుకొని ప్రాక్టీస్ మొదలెట్టాయి. అయితే ఈ టెస్ట్ మ్యాచ్‌కు ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ నుంచి బెదిరింపులు వచ్చాయి. నాలుగో టెస్టు మ్యాచ్‌ను అడ్డుకోవాలని ఆయన సీపీఐ దళాన్ని కోరారు. ఈ మేరకు పన్నూ తన సోషల్ మీడియాలో ఓ వీడియోలో అప్‌లోడ్ చేశాడు.
ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపుల నేపథ్యంలో ఝార్ఖండ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. మ్యాచ్ జరగనున్న జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో మరింత భద్రతను కల్పించారు. నిషేధిత సీపీఐ మావోయిస్టులు మ్యాచ్‌కు అడ్డంకులు సృష్టించాలని చెప్పిన పన్నూపై దుర్వా పోలీస్ స్టేషన్‌లో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టినట్లు డీఎస్పీ పీకే మిశ్రా తెలిపారు. ఇటీవల కాలంలో పన్నూ పలుమార్లు భారత్‌ను బెదిరించాడు. గతంలో ప్రపంచకప్ ఫైనల్, ఎయిర్ ఇండియా విమానాలను, అమెరికా-కెనడా దేశాల్లోని భారతీయులను లక్ష్యంగా చేసుకొంటామని బెదిరింపులకు పాల్పడ్డాడు.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
Also Read: Yuvraj Singh: లోక్‌సభ ఎన్నికలు.. బీజేపీ టికెట్‌పై యువరాజ్ సింగ్ పోటీ?
సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) వేర్పాటువాద సంస్థ వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్ సింగ్ పన్ను కూడా ఒకడు. 2007లో ఎస్ఎఫ్‌జేను స్థాపించగా.. 2019లో భారత్ నిషేధించింది. అప్పటినుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దృష్టిలో పన్ను ఉన్నాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద భారత ప్రభుత్వం 2020లో పన్నును ఉగ్రవాదిగా ప్రకటించింది. 2021 ఫిబ్రవరి 3న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు అతడిపై నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇటీవల పన్ను భూమి, ఇంటిని ఎన్ఐఏ స్వాధీనం చేసుకొంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!