Site icon NTV Telugu

Tollywood Diwali Clash: దీపావళి ధమాకా.. మూడు రోజుల్లో నలుగురు యంగ్ హీరోల భవితవ్యం.. టాలీవుడ్‌లో గట్టి పోటీ!

Tollywood

Tollywood

Tollywood Diwali Clash: టాలీవుడ్ లో పెద్ద సినిమాలు ప్రస్తుతం ఏవీ లేకపోవడంతో.. ఈసారి దీపావళి సందడిని యంగ్ హీరోలు ముందే తీసుకొస్తున్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో ఏకంగా నలుగురు యువ కథానాయకులు తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద బరిలో దిగుతుండటంతో ఈ పండుగ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. దీపావళి సెలబ్రేషన్స్‌ను టాలీవుడ్ గురువారం నుంచే మొదలుపెట్టింది. ఈ సీజన్‌లో అందరికంటే ముందుగా బరిలో దిగుతున్నది ‘మిత్ర మండలి’ టీమ్. ప్రియదర్శి హీరోగా, కొత్త దర్శకుడు విజయేందర్ రూపొందించిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే సినిమాకు రూ.4 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ తోడవుతే భారీ లాభాలు రావడం ఖాయం.

Sai Dharam Tej: ‘సంబరాల ఏటిగట్టు’తో మెగా హీరో లైన్ లో పడినట్లేనా.?

ఇకపోతే నేడు (శుక్రవారం) ఇద్దరు యంగ్ హీరోలు ఒకే రోజు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ సినిమాతో, ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమాతో ఒకేసారి బరిలో దిగుతున్నారు. ఈ రెండు సినిమాల్లోనూ టాలీవుడ్ ప్రేక్షకులు ‘తెలుసు కదా’ మీద కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు కనపడుతోంది. దీపావళి బరిలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో అత్యధిక బిజినెస్ చేసిన సినిమా కూడా ‘తెలుసు కదా’ నే. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ.17 కోట్ల మార్కును దాటింది. మరోవైపు, ‘లవ్ టుడే’, ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇక ఈ పోటీలో టాలీవుడ్ మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా శనివారం ‘K – ర్యాంప్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దీనితో మొత్తం మీద, మూడు రోజుల్లో నాలుగు సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. మరి ఈ సినిమాల్లో ఏది హిట్ సౌండ్ చేస్తుందో, ఏ హీరో ఈ దీపావళి విజేతగా నిలుస్తారో చూడాలి మరి.

Kiran Abbavaram: నన్ను నమ్మండి.. ‘కె-ర్యాంప్‌’పై కిరణ్‌ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు!

Exit mobile version