Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actors To Directors: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ మొదలైంది. హిట్స్ కొట్టేందుకు దర్శకుల కోసం ఎదురుచూడకుండా, హీరోలే నేరుగా మెగాఫోన్ పట్టుకుని రంగంలోకి దిగుతున్నారు. తమ బాడీ లాంగ్వేజ్‌కు, నటనకు సరిగ్గా సరిపోయే బలమైన జానర్లను ఎంచుకుంటూ సొంతంగా కథలు సిద్ధం చేసుకుని డైరెక్టర్ల కుర్చీలో కూర్చుంటున్నారు. తమ బలాన్ని నమ్ముకుని సరికొత్త ప్రయోగాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ హీరోలు, వారి ప్రాజెక్టులేంటో చూద్దామా..
రామ్ పోతినేని
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సైతం తన రూట్ మార్చి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. హాలీవుడ్ క్లాసిక్ స్టైల్ అయిన ‘నియో నాయిర్’ (Neo-noir) జానర్లో సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. 1940ల నాటి క్రైమ్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ డార్క్ అండ్ ఇంటెన్స్ సినిమాకు రామ్ స్వయంగా కథ రాసుకుని డైరెక్షన్ చేస్తున్నారు. రొటీన్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా సాగే ఈ సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
Also Read
- Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
‘రియాలిటీ’తో కిరణ్ అబ్బవరం
చెన్నై లవ్ స్టోరీతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన కిరణ్ అబ్బవరం, ఈసారి దర్శకుడిగా మారి ‘రియాలిటీ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోసారి మిడిల్ క్లాస్ ఎమోషన్స్‌ను నమ్ముకున్న కిరణ్, ఇందులో ‘ఆనంద్’ అనే మధ్యతరగతి యువకుడి పాత్రలో కనిపించనున్నారు. కుటుంబ బాధ్యతలు, భావోద్వేగాల నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ డ్రామాతో తొలిసారి దర్శకుడిగా తన ప్రతిభను చాటుకోనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
మార్షల్ ఆర్ట్స్ కథతో సుధీర్ బాబు
తన ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సుధీర్ బాబు సైతం త్వరలోనే డైరెక్టర్ చైర్ ఎక్కబోతున్నట్లు సమాచారం. తన బాడీ లాంగ్వేజ్‌కు నప్పేలా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే కథను ఆయన ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కథల కోసం, దర్శకుల కోసం వేచి చూడకుండా, తమ బలాన్ని నమ్ముకుని సొంత కథలతో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి టాలీవుడ్ హీరోలు చేస్తున్న ఈ ప్రయత్నాలు సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో కార్తికేయ ‘కం బ్యాక్’
దాదాపు మూడేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్న హీరో కార్తికేయ కూడా దర్శకుడి అవతారమెత్తారు. బాక్సింగ్ నేపథ్యంలో ‘కం బ్యాక్’ అనే పవర్ఫుల్ స్పోర్ట్స్ డ్రామాను ఆయన రూపొందిస్తున్నారు. తన ఫిజిక్, ఎనర్జీకి సరిగ్గా సరిపోయే ఈ స్పోర్ట్స్ జానర్‌తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు కార్తికేయ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు.
తాజావార్తలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!