ప్రముఖ టాలీవుడ్ విలన్ విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ మృతి చెందారు. సోమవారం ఉదయం చెన్నైలో ఓ ప్రవేట్ హాస్పిటల్‌లో గుండెపోటుతో మరణించారు. వారం క్రితం హైదరాబాద్‌లో ఒక సినిమా షూటింగ్‌లో గాయపడ్డ విజయ రంగ రాజు.. ట్రీట్‌మెంట్ కోసం చెన్నై వెళ్లి అక్కడే కన్నుమూశారు. విజయ రంగరాజుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. టాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Dwaraka Tirumala Rao: పోలీసులు సంక్షేమం కోసమే పెట్రోల్ బంకులు ఏర్పాటు: ఏపీ డీజీపీ
విజయ రంగరాజుకు బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సీతా కళ్యాణం’ మొదటి సినిమా. 1994లో వచ్చిన ‘భైరవ ద్వీపం’ చిత్రంతో ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. అనంతరం ఎక్కువగా విలన్, సహాయ పాత్రలు పోషించి.. టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు. ‘యజ్ఞం’ సినిమాతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. గోపీచంద్ హీరోగా నటించిన యజ్ఞం చిత్రంలో విజయ రంగరాజు విలన్ పాత్రలో అదరగొట్టారు. తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో కూడా ఆయన నటించారు. వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్‌లో కూడా రంగరాజుకు పట్టు ఉంది.