Site icon NTV Telugu

UP: వీధిలో ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు.. తలపై నుంచి దూసుకెళ్లిన వ్యాన్ (వీడియో)

Up

Up

UP: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో హృదయ విదారక సంఘటన జరిగింది. స్కూల్ వ్యాన్ ఢీకొని రెండున్నరేళ్ల చిన్నారి విషాదకరంగా మరణించింది. బుధానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమర్‌పూర్ గ్రామంలో ఈ హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

READ MORE: Star Hero : హిట్ కోసం ఆపసోపాలు పడుతున్న స్టార్ హీరో.. రంగంలోకి సీనియర్ దర్శకులు

పోలీసుల కథనం ప్రకారం.. ఎప్పటిలాగే పిల్లలను తీసుకెళ్లడానికి గ్రీన్ పబ్లిక్ స్కూల్ వ్యాన్ గ్రామానికి వచ్చింది. వీధిలో ఆడుకుంటున్న రెండున్నరేళ్ల కేశవ్ అకస్మాత్తుగా వ్యాన్ ముందు పరిగెత్తాడు. డ్రైవర్ బాలుడు గమనించలేదు. ఫలితంగా, స్కూల్ వ్యాన్ ముందు చక్రం అమాయక బాలుడిపైకి దూసుకెళ్లింది. దీంతో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన బాలుడి తండ్రి శుభమ్ హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ కేశవ్ మరణించాడు. ఈ సంఘటన తర్వాత.. పోలీసులు అక్కడికి చేరుకుని, స్కూల్ వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అరెస్టు చేశారు. పోస్ట్‌మార్టం తర్వాత సాయంత్రం ఆలస్యంగా బాలుడి మృతదేహం ఇంటికి చేరుకుంది. విగత జీవిగా పడి ఉన్న బాలుడిని చూసి తల్లిదండ్రుల కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఓ బుధానా గజేంద్ర పాల్ సింగ్ తెలిపారు.

READ MORE: Pakistan: పాకిస్తాన్ నేవీ హెచ్చరిక.. సర్‌క్రీక్‌ సమీపంలో దాయాది యుద్ధ విన్యాసాలు..

Exit mobile version