Site icon NTV Telugu

MLC Kavitha : కవిత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Mlc Kavitha

Mlc Kavitha

ఢిల్లీ లిక్కర్‌స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఈడీ నోటీసులను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈనెల 24న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. ఈ క్రమంలోనే నేడు కవిత పిటషన్‌పై సుప్రీంకోర్టు విచారించనుంది. అయితే.. ఈ కేసులో ఈడీ తనకు నోటీసులు జారీ చేయడాన్ని కవిత ఈ నెల 23న దాఖలు చేసిన పిటిషన్‌లో సవాలు చేశారు. అంతేకాకుండా.. ఈడీ తనపై తదుపరి బలవంతపు చర్యలు తీసుకోకుండా జారీ చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు కవిత.

Also Read : Lord Shiva Sahasranama Stotram: చైత్ర సోమవారం నాడు ఈ స్తోత్రాలు వింటే మనోభీష్టాలు నెరవేరుతాయి..

వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ తనకు పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్‌ 50 ప్రకారం జారీచేసిన నోటీసులు సీఆర్‌పీసీ సెక్షన్‌ 160కి విరుద్ధంగా ఉన్నాయని, వాంగ్మూలం నమోదు చేసేప్పుడు న్యాయవాది సమక్షంలో వీడియో చిత్రీకరణకు ఉత్తర్వులు జారీ చేయాలని కవిత ఆ పిటిషన్‌లో కోరారు. ఈడీ నోటీసులను రద్దు చేయాలని, మహిళగా తనను ఇంట్లోనే విచారించాలని కవిత పిటిషన్‌లో కోరారు. అయితే.. జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ధర్మాసనం ముందుకు కవిత పిటిషన్‌ రానుంది. విచారణ జరిగిన వెంటనే ధర్మాసనం ఉత్తర్వులను జారీచేస్తుందా? లేక వాయిదా వేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : Rajasekhar: పాతికేళ్ళ ‘శివయ్య’

Exit mobile version