నేడు హైదరాబాద్ నగరంలో జరిగే శ్రీ రామ నవమి శోభాయాత్ర సందర్భంగా గోషామహల్, సుల్తాన్ బజార్ ట్రాఫిక్ ఠాణా పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఇవాళ (బుధవారం) సీతారాంబాగ్ ఆలయం దగ్గర శోభయాత్ర ప్రారంభమై.. సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయమశాల వరకు కొనసాగుతుంది అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ సీపీ తెలిపారు. కాగా, శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా నగరంలో పటిష్ట బందోబస్తును ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు చెప్పారు. దీంతో పాటు యాత్ర జరిగే ప్రధాన మార్గాల్లో ఉండే ప్రార్థన మందిరాలు బయటకు కనిపించకుండా పరదాలతో క్లోజ్ చేశారు. శోభయాత్ర సమయంలో మతపరమైన ఇబ్బందులు ఏర్పడకుండా పండుగల సందర్భంగా ఇలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
Read Also: Arvind Kejriwal : జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ ఎల్జీ నీటి సమస్యపై బహిరంగ లేఖ
ఇక, ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు గోషామహల్ లోని ఆకాష్ పురి హనుమాన్ దేవాలయం నుంచి శోభాయాత్ర కొనసాగుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. శ్రీరామ నవమి శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నాం.. ఈ యాత్రకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు డాక్టర్ భగవంత్‌రావు పిలుపునిచ్చారు. ప్రజలు ప్రశాంతంగా పండగను జరుపుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు పిలుపునిచ్చారు.
