NTV Telugu Site icon

Today Stock Market Roundup 03-02-23: మణప్పురంపై ‘ఈడీ’ దెబ్బ

Today Stock Market Roundup 03 02 23

Today Stock Market Roundup 03 02 23

Today Stock Market Roundup 03-02-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ బుధవారం నష్టాలతో ముగిసింది. గ్లోబల్ మార్కెట్‌లోని ప్రతికూల పరిస్థితులు ఇండియన్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ద్రవ్య విధానానికి సంబంధించి ఈ రోజు రాత్రి ఒక నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత ప్రదర్శించారు. ఫలితంగా.. సూచీలు నేల చూపులు చూశాయి.

Salary Hike: సార్.. శాలరీ పెంచండి. లేకపోతే..

సెన్సెక్స్ 161 పాయింట్లు కోల్పోయి 61 వేల 193 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయి 18 వేల 89 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 10 కంపెనీలు మాత్రమే లాభాలు ఆర్జించగా మిగతా 20 కంపెనీలు నష్టాల బాటలో నడిచాయి.

సెన్సెక్స్‌లో హిందుస్థాన్ యూనీలీవర్ కంపెనీ షేరు ధర ఒకటిన్నర శాతం పెరగ్గా.. ఎయిర్‌టెల్, టెక్ మహింద్రా ఒకటిన్నర శాతం చొప్పున డౌన్ అయ్యాయి. రంగాల వారీగా పరిశీలిస్తే.. ఏవియేషన్ సెక్టార్‌లోని ప్రధాన సంస్థలైన ఇండిగో మరియు స్పైస్‌జెట్ స్టాక్స్ వ్యాల్యూ వరుసగా ఆరు మరియు ఐదు శాతం చొప్పున పెరిగాయి.

వ్యక్తిగత స్టాక్స్‌ విషయానికొస్తే.. మణప్పురం ఫైనాన్స్ షేర్ల విలువ 14 శాతం పడిపోయింది. కేరళలోని ఈ కంపెనీ బ్రాంచ్‌ల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వెలువడటం స్టాక్‌ల పనితీరుపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపింది. ఆర్బీఐ అనుమతి లేకుండా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ.. మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.

10 గ్రాముల బంగారం ధర 95 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 60 వేల 723 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు 155 రూపాయలు పెరిగింది. గరిష్టంగా 75 వేల 200 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర 168 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 5 వేల 737 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 6 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే 81 రూపాయల 81 పైసల వద్ద స్థిరపడింది.