Site icon NTV Telugu

LSG vs SRH: ప్లేఆఫ్స్ కోసం పోరు.. గెలిస్తేనే నిలుస్తారు

Lsg

Lsg

ఐపీఎల్ లీగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది. ప్లేఆఫ్స్ కోసం పోరాటం తారాస్థాయికి చేరుకుంది. ఈ రేసులో లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఉంది. రిషబ్ పంత్ కెప్టెన్సీలోని ఈ జట్టు సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. హైదరాబాద్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. లక్నోలోని ఎకానా స్టేడియంలో రెండు జట్లు తలపడనున్నాయి. లక్నో ప్లేఆఫ్ రేసులో కొనసాగాలని భావిస్తోంది. ఈ జట్టు ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు, ఆరు ఓటములతో 10 పాయింట్లతో ఉంది. లక్నో ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాల్సిందే.

Also Read:Manchu Manoj : శివయ్యా అంటే శివుడు రాడు.. అన్నకు మనోజ్ కౌంటర్..

విజయం కోసం పంత్ వ్యూహాలు రచిస్తున్నాడు. విధ్వంసకర హిట్టర్ డేవిడ్ మిల్లర్‌ ఈ సీజన్ అంతా నిరాశపరిచాడు. అతని స్థానంలో హిమ్మత్ సింగ్ కు అవకాశం లభించవచ్చు. జట్టు బ్యాటింగ్ నికోలస్ పూరన్ తో పాటు ఓపెనర్లు మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్ లపై ఆధారపడి ఉంది. రిషబ్ పంత్ ఫామ్ జట్టుకు ఆందోళన కలిగించే విషయం, కానీ ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్ మంచి ఆటతీరు కనబరుస్తున్నారు. గాయం కారణంగా మయాంక్ యాదవ్ మరోసారి జట్టులో కనిపించడు. అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ రాఠీ కూడా ఆడటం ఖాయం. బడోనీ, సమద్, బిష్ణోయ్‌లను ఇంపాక్ట్ ప్లేయర్‌లుగా ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది.

Also Read:Haryana: ఆపరేషన్ సిందూర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు.. ప్రొఫెసర్ అరెస్ట్

హైదరాబాద్ తన ప్లేయింగ్-11లో మార్పులు చేసే అవకాశం లేదు. విదేశీ ఆటగాళ్లందరూ అందుబాటులో ఉన్నారు. పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ చెలరేగి ఆడితే లక్నోకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అందరి కళ్ళు ఇషాన్ కిషన్ ఫామ్‌పై ఉన్నాయి. అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్ బ్యా్ట్ తో రాణిస్తారని భావిస్తున్నారు. బౌలింగ్ విషయానికొస్తే, విరామం తర్వాత మహమ్మద్ షమీకి అవకాశం లభించే అవకాశం లేదు. కమిన్స్‌తో పాటు జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ బౌలింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Also Read:CISF: స్పోర్ట్స్ బాగా ఆడతారా? హెడ్ కానిస్టేబుల్ జాబ్ కొట్టే ఛాన్స్.. 403 ఉద్యోగాలు రెడీ.. రూ. 81 వేల జీతం

రెండు జట్లలో ఆడే అవకాశం -11

లక్నో సూపర్‌జెయింట్స్: రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), ఐడెన్ మార్క్‌రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, ఆకాశ్‌దీప్ సింగ్, దిగ్వేష్ రాఠీ, రవి బిష్ణోయ్

సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, సచిన్ బేబీ, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్.

Exit mobile version