Jammu Kashmir: నేడే రెండో విడత అసెంబ్లీ పోలింగ్..
- నేడే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ రెండో విడత అసెంబ్లీ పోలింగ్..
- 6 జిల్లాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ .
- రెండో దశ ఎన్నికల్లో 239 మంది అభ్యర్థుల పోటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu-Kashmir Elections 2024 2nd Phase Voting: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ రెండో విడత పోలింగ్ ఈరోజు జరగనుంది. ఈ దశలో 6 జిల్లాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. వీటిలో 3 జిల్లాలు జమ్మూ డివిజన్లో, మరో 3 జిల్లాలు లోయలో ఉన్నాయి. ఈ దశలో ప్రముఖ అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, JKPCC అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా, బీజేపీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ రవీంద్ర రైనా పోటీలలో ఉన్నారు. రెండో దశ ఎన్నికల్లో 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 25 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. ఓటర్ల సౌకర్యార్థం ఎన్నికల సంఘం 3,502 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఇందులో 1,056 పట్టణ ప్రాంతాల్లో, 2,446 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.
ఐకపోతే తొలి దశలో 61.38 శాతం ఓటింగ్ నమోదైంది. అక్టోబర్ 1న మూడో దశ, 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈసారి శ్రీనగర్ జిల్లాలో 93 మంది, బుద్గామ్ జిల్లాలో 46 మంది, రాజౌరి జిల్లాలో 34 మంది, పూంచ్ జిల్లాలో 25 మంది, గందర్బల్ జిల్లాలో 21 మంది, రియాసి జిల్లాలో 20 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో రెండో దశలో చేర్చిన అనేక ప్రాంతాలు సున్నితమైనవి. ఈ దశలో ఉన్న కాశ్మీర్ లోని చాలా స్థానాల్లో వేర్పాటువాదుల ప్రభావం కనిపించింది. వీటిలో ఖన్యార్, జడిబాల్, లాల్ చౌక్, ఈద్గా, హజ్రత్బాల్ మొదలైనవి ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా దళాలను మోహరించారు.
Also Read
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
అసెంబ్లీ ఎన్నికల్లో భద్రతపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈవీఎంల భద్రతపై ప్రత్యేక సూచనలు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పారదర్శకంగా ఉండేలా అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సౌకర్యాలు ఉంటాయని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
-
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
-
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్‌లో నయా ట్రెండ్
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!