NTV Telugu Site icon

Jagannath Ratha Yatra : నేడు బెజవాడలో జగన్నాథ రథ యాత్ర

Jagannath Yatra

Jagannath Yatra

విజయవాడలో నేడు ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్లు ఇస్కాన్ మందిర అధ్యక్షులు చక్రధారి దాస్ వెల్లడించారు. ఈ రథయాత్రకి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే.. ఈ రథయాత్ర ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు బందర్ రోడ్డులోని డి అడ్రస్ మాల్ నుంచి ప్రారంభమై.. సుమారు 8 కిలోమీటర్ల మేరకు సాగనుందని ఆయన తెలిపారు. మూడు రోజుల పాటు ఈ రథయాత్ర మేళా జరుగుతుందని, దేశం నలుములలో ఉన్న కళాకారులందరూ ఈ రథయాత్రలో పాల్గొని వారి కళలను ప్రదర్శిస్తారని ఆయన వెల్లడించారు. కాలేజీ విద్యార్థులు వెయ్యి మంది వరకు ఈ రథయాత్రలో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఊరేగింపు సమయంలో, వేద గ్రంధాల పంపిణీ, యాత్రలో పాల్గొన్న వారందరికీ ఉచితంగా ‘ప్రసాదం’ అందించబడుతుంది. ఊరేగింపులో ‘కీర్తనలు’, నృత్యం ‘దర్శనం’ మరియు ఉపన్యాసం కూడా ఉన్నాయి. రథయాత్రలో నగర ప్రజలు పాల్గొనేందుకు వీలుగా రథయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Also Read : Film Nagar Crime: ఫిల్మ్ నగర్‌లో విషాదం.. నాగేళ్ల కుమారున్ని ఉరివేసిన తల్లి.. ఆతరువాత!

దక్షిణ భారతదేశంలోనే రథయాత్ర ఎంతో విశిష్ట కలిగిందని అన్నారు. అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉండాలనేదే ఈ రథయాత్ర ముఖ్య ఉద్దేశ్యమని.. అందుకే ఈ యాత్రను చేపడుతున్నట్లు తెలిపారు. రష్యా, అమెరికా, ఉక్రెయిన్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు రథయాత్రకు తరలివస్తున్నారని తెలిపారు. ప్రతిరోజు 50 వేల మంది భక్తులకు అన్నదాన సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. సకల సదుపాయాలు కల్పిస్తూ పార్కింగ్ సౌకర్యంతో ఈ రథయాత్రని ఘనంగా మూడు రోజులు పాటు నిర్వహిస్తామన్నాని అన్నారు. మూడు రోజులపాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తామని చక్రధారి దాస్ వెల్లడించారు.

Also Read : Cheteshwar Pujara BCCI: వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్.. చెతేశ్వర్‌ పుజారాను అందుకే ఎంపిక చేయలేదు: బీసీసీఐ