NTV Telugu Site icon

Elections 2024: నామినేషన్ల ఉప సంహరణకు నేడే డెడ్‌లైన్‌.. బరిలో నిలిచేది ఎవరో తేలిపోనుంది..

Nominations

Nominations

Elections 2024: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికలతో పాటు.. తెలంగాణలో లోక్‌సభ స్థానాలకు ఒకేసారి పోలింగ్‌ నిర్వహించనున్నంది ఎన్నికల కమిషన్‌.. కేంద్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ, పరిశీలన పూర్తి కాగా.. ఈ రోజు ఇవాళ నామినేషన్ల ఉప సంహరణకు చివరి రోజు కావడంతో.. ఇంకా ఎవరెవరు నామినేషన్లు ఉపసంహరించుకుంటారు.. కొన్నిస్థానాల్లో రెబల్స్‌ నామినేషన్స్‌ వేయడంతో.. వారి ఉపసంహరించుకుంటారా? లేదా కొనసాగుతారా? బరిలో నిలిచే స్వతంత్రులు ఎంతమంది.. వెనక్కి తగ్గేవారు ఎవరు? ఇవాళ్టితో తేలిపోనుంది.

Read Also: NTR : భార్యతో ముంబైలో ఎన్టీఆర్.. వీడియో వైరల్..

అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు 6001 నామినేషన్ల దాఖలు కాగా.. అందులో 4,189 నామినేషన్ల ఆమోదం పొందాయి.. 1,637 నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించింది ఎన్నికల కమిషన్‌.. మరోవైపు ఇప్పటి వరకు తొమ్మిది నామినేషన్ల ఉప సంహరించుకున్నారు. మరోవైపు.. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు 1103 నామినేషన్ల దాఖలు కాగా.. 771 నామినేషన్ల ఆమోదం తెలిపారు అధికారులు.. 291 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.. అయితే, భారీగా ఇండిపెండెంట్ అభ్యర్థులు, డమ్మి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.. రెండు నుంచి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు ప్రధాన పార్టీల అభ్యర్థులు.. ఇక, ఇవాళ ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది పోటీ చేస్తారనే అంశంపై ఇవాళ రాత్రికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read Also: Raashi Khanna : గార్జియస్ లుక్ లో రాశి ఖన్నా లేటెస్ట్ పిక్స్..

మరోవైపు తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు 625 నామినేషన్లు దాఖలు చేశారు.. అందులో 268 నామినేషన్లను తిరస్కరించింది ఎన్నికల కమిషన్‌.. మిగతా వారు బరిలో ఉన్నారు.. కానీ, నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళే చివరి తేదీ కావడంతో.. ఎవరెవరు? నామినేషన్లను ఉపసంహరించుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది.. ఇక, అత్యధికంగా మెదక్ స్థానానికి 53 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి 13 మంది పోటీ పడుతున్నారు. అయితే, అసలు బరిలోకి దిగేది ఎవరు? అనేదానిపై ఈ రోజు క్లారిటీ రానుంది.