తెలంగాణలో ఇప్పటికే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ముగిశాయి. ఈరోజు మరోసారి గ్రూప్-1కు సంబంధించిన పలు పిటిషన్లపై విచారణ జరగనుంది. Go-29 అంశంతో పాటు ఇతర పిటిషన్ల పై నేడు హై కోర్టులో కీలక విచారించనున్నారు. నేటి హై కోర్టు విచారణపై అభ్యర్థుల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది.
READ MORE: Roger Federer: నీ కారణంగానే ఆటను మరింత ఆస్వాదించా.. ఫెదరర్ భావోద్వేగ లేఖ!
కాగా.. జీవో 29 ను రద్దుతో పాటు పలు డిమాండ్లు నెరవేర్చాలని మెయిన్స్ పరీక్షలకు ముందు గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు పరీక్షను రద్దు చేయలేమని చేతులెత్తేసింది. అయితే.. ఈ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. అభ్యర్థుల తరపున కపిల్ సిబాల్ వాదనలు విన్న సుప్రీం చివరకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఇంత వరకు వచ్చి ఇప్పుడు వాయిదా వేయడం మంచిది కాదని తెలిపింది. ఇందులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఇలా చేయడం వలన అభ్యర్థుల ఇంత వరకు ప్రిపేర్ అయిన సిలబస్ అంతా వ్యర్థం అవుతుందని తెలిపారు. ఇది కరెక్ట్ పద్దతి కాదని తెలిపింది. గ్రూప్ 1 పరీక్ష యదావిధిగా కొనసాగించాలని తెలిపింది. అభ్యర్థుల లేవనెత్తిన అభ్యంతరాలను హైకోర్టు పరిశీలించాలని తెలిపింది. ఈ మేరకు నేడు హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది.
READ MORE:Sharukh Khan : బాత్ రూంలో కూర్చుని ఏడ్చేవాడిని.. బాలీవుడ్ బాద్ షా గుండెల్లో ఎంత బాధ ఉందో!