NTV Telugu Site icon

Viral Video: దేవుడా.. యూట్యూబర్‌కు కూడా ఇంతమంది అభిమానులా! స్టార్‌లు చూస్తే అంతే సంగతులు

Ishowspeed

Ishowspeed

Fans Fight for US YouTuber IShowSpeed: సాధారణంగా సినిమా స్టార్‌లకు, స్పోర్ట్స్ సెలబ్రిటీలకు భారీగా అభిమానులు ఉంటారు. సెలబ్రిటీలు బయట ఎక్కడ కనిపించినా.. వారిని చూసేందుకు లేదా కలిసేందుకు ఎగబడుతుంటారు. అయితే ఓ యూట్యూబర్‌కు సెలబ్రిటీలకు మించిన ఫాన్స్ ఉన్నారు. మాల్ నుంచి అతడు బయటకు రాగానే ఫాన్స్ ఎగబడ్డారు. ఫాన్స్ తోపులాట కారణంగా అల్లాడ తొక్కిసలాట జరిగింది. చాలా మంది గాయాలపాలయ్యారు కూడా. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆ యూట్యూబర్ మరెవరో కాదు.. అమెరికా చెందిన ఐషో స్పీడ్. ఇతడి అసలు పేరు ‘డారెన్ వాట్కిన్స్ జూనియర్’. యూట్యూబ్‌లో ఐషో స్పీడ్ ఛానెల్‌కు 2.5 కోట్ల మందికి పైగా సబ్‌‌స్క్రైబర్లు ఉన్నారు. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ షార్ట్ వీడియోలను కూడా చేస్తుంటాడు. ఎంతో ఆసక్తికర వీడియోలను అతడు పోస్ట్ చేయడమే ఇంతమంది సబ్‌‌స్క్రైబర్లు ఉన్నారు. డారెన్ వాట్కిన్స్ పోస్ట్ చేసే వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. కొన్ని వీడియోస్ వివాదాస్పదంగా కూడా ఉంటాయి. ఐషో స్పీడ్ ఒక్క వీడియో పోస్ట్ చేస్తే.. కోట్లలో లైక్స్, వ్యూస్ వస్తుంటాయి. అదే రీతిలో సంపాదన కూడా ఉంటుంది.

Also Read: Virat Kohli-London: రాత్రికి రాత్రే లండన్‌కు వెళ్లిపోయిన కోహ్లీ.. కారణం ఏంటంటే?

తాజాగా ఐషో స్పీడ్‌ లైవ్ స్ట్రీమింగ్ కోసం నార్వే వెళ్లాడు. లైవ్ స్ట్రీమింగ్ అనంతరం.. ఓ షాపులోకి వెళ్లాడు. విషయం తెలుసుకున్న నార్వే ఫాన్స్.. అతడిని చూసేందుకు క్యూ కట్టారు. ఐషో స్పీడ్‌తో ఫొటోలు దిగేందుకు, వీడియోలు తీసుకునేందుకు చాలామంది ప్రయత్నించారు. నిమిషాల వ్యవధిలోనే అక్కడ జనం భారీ స్థాయిలో గుమిగూడారు. దీంతో అతడు బయటకు కష్టమైంది. స్థానిక పోలీసుల సహాయంతో బయటకు వచ్చినా.. అతడిని అభిమానులు వదలలేదు. అతికష్టం మీద ఐషో స్పీడ్‌ను బయట వెళ్లి కారు ఎక్కాడు. ఆ సమయంలో అభిమానుల మధ్య తోపులాట జరిగింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. లైక్స్, కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘దేవుడా.. యూట్యూబర్‌కు కూడా ఇంతమంది అభిమానులా’, ‘ఈ జనాలను స్టార్‌లు చూస్తే కుళ్లుకుంటారు’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments