Site icon NTV Telugu

Chain Snatching: దారుణం.. చైన్‌ కోసం మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన దొంగలు! (వీడియో)

Madurai Chain Snatching

Madurai Chain Snatching

దేశవ్యాప్తంగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న లేదా ఆగిఉన్న మహిళల నుంచి బంగారు గొలుసును అందరూ చూస్తుండగానే ఎత్తుకెళుతున్నారు. దుండగులు చైన్ స్నాచింగ్ చేసే క్రమంలో మహిళలను రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా జరగగా.. తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని మధురైలో చైన్ స్నాచర్లు ఓ మహిళను రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెళ్లారు.

వివరాల ప్రకారం… మంజుల, ద్వారక్‌నాథ్ దంపతులు మధురైలోని పంథాడిలో నివాసం ఉంటారు. దీపావళి పండగ నేపథ్యంలో ఆదివారం మట్టుతావనికి షాపింగ్ కోసం వెళ్లారు. షాపింగ్ ముగించుకుని రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చారు. అప్పటికే మంజుల మెడలో బంగారాన్ని చూసిన ఇద్దరు దొంగలు.. ఆమెను వెంబడించారు. ఇంటిముందు ద్వారక్‌నాథ్‌ బైక్ ఆపగా.. మంజుల దిగేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో వెనకాల ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దొంగల్లో ఒకడు.. మంజుల మెడలోని చైన్ లాగాడు. దాంతో ద్వారక్‌నాథ్ కిందపడిపోయాడు.

Also Read: WhatsApp New Feature: వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్.. ఇక ఆ సమస్యకు చెక్‌!

కిందపడిపోయిన మంజుల మెడలోని చైన్ తెగలేదు. అయినా దొంగలు ఆమెను వదల్లేదు. ద్విచక్ర వాహనంపై ఉన్న దొంగలు.. మంజులను అలాగే కొంత దూరం వరకు రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. దీంతో గొలుసు తెగిపోయి రెండు భాగాలైంది. ఒక భాగం బాధితురాలి వద్దే ఉండిపోయింది. కిందపడిన ద్వారక్‌నాథ్ లేచేసరికి చైన్ స్నాచర్లు అక్కడి నుంచి పరారయ్యారు. చైన్ స్నాచింగ్‌కి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై మంజుల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Exit mobile version