Site icon NTV Telugu

Gold Rates: బంగారం ధరలకు రెక్కలు.. రూ. 2700 పెరిగిన తులం గోల్డ్ ధర

Gold

Gold

బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఇటీవల ఒక్కరోతే తులం గోల్డ్ ధర రూ. 3000 పెరిగి షాకిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పసిడి ధరలు లక్ష రూపాయల మార్కుకు చేరుకున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే మరోసారి భారీగా పుత్తడి ధరలు పెరిగాయి. నేడు తులం గోల్డ్ పై రూ. 2,730 పెరిగింది. వెండి ధరలు మాత్రం స్పల్పంగా తగ్గాయి. నేడు కిలో వెండిపై రూ. 100 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,846, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,025 వద్ద ట్రేడ్ అవుతోంది.

Also Read:CRDA: నేడు సీఆర్డీఏ కీలక భేటీ.. మరో రూ.15,757 కోట్ల పనులకు గ్రీన్‌ సిగ్నల్‌..!

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 2500 పెరగడంతో రూ. 90,250 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 2,730 పెరగడంతో రూ. 98,460 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,400గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,610 వద్ద ట్రేడ్ అవుతోంది.

Also Read:TGSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం బహిరంగ లేఖ.. సమ్మె ఆలోచనను విరమించాలంటూ విజ్ఞప్తి

నేడు సిల్వర్ ధరలు తగ్గాయి. ఇవాళ కిలో వెండిపై రూ. 100 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,07,900 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 96,900 వద్ద అమ్ముడవుతోంది.

Exit mobile version